parlamment the elections
-
South Africa Elections 2024: దక్షిణాఫ్రికాలో వచ్చేది సంకీర్ణమే!
జోహన్నెస్‌బర్గ్: వర్ణవివక్షపై పోరు తర్వాత నెల్సన్ మండేలా నేతృత్వంలో దక్షిణాఫ్రికాలో అధికారం చేపట్టి 30 ఏళ్లపాటు పాలించిన ది ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్సీ) పార్టీ తొలిసారిగా తక్కువ ఓట్లతో సరిపెట్టుకుంది. ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలైన ఓట్లలో ఇప్పటిదాకా 99.80 శాతం ఓట్లు లెక్కించారు. శనివారం అనధికారికంగా వెల్లడైన గణాంకాల ప్రకారం ఏఎన్‌సీకి 40 శాతానికిపైగా మాత్రమే ఓట్లు పడ్డాయి. తీవ్ర పేదరికం, అసమానతలకు నెలవైన దేశంలో గొప్ప మార్పు మొదలైందని విపక్షాలు ఆనందం వ్యక్తంచేశాయి. మిగతా పారీ్టలకు ఇంతకంటే తక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఏఎన్సీ ఇప్పటికీ అతిపెద్ద పారీ్టగా ఉన్నప్పటికీ మెజారిటీ మార్కు(50 శాతానికి మించి ఓట్లు) దాటని కారణంగా మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే ఇతర పారీ్టలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన పరిస్థితి తలెత్తింది. విపక్ష డెమొక్రటిక్ అలయన్స్(డీఏ)కు 21.72 శాతం, మాజీ దేశాధ్యక్షుడు జాకబ్ జూమా నేతృత్వంలోని అమ్కోంటో వీ సిజ్వే(ఎంకే) పారీ్టకి 14 శాతం ఓట్లు పడ్డాయి. -
పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ ముందస్తు కార్యాచరణ!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: 'పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఇటీవల రాష్ట్రంలో విజయం సాధించిన పార్టీ.. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని 17 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా మంత్రులు, ముఖ్య నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించింది. ఈ నేపథ్యాన అన్ని స్థానాలకు పార్టీ ఇన్చార్జిలను నియమించింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల బాధ్యతను రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించింది. అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను సికింద్రాబాద్, హైదరాబాద్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. సీఎం రేవంత్‌రెడ్డి తర్వాత జిల్లాకు చెందిన భట్టి, పొంగులేటికి రెండేసి పార్లమెంట్ స్థానాల బాధ్యతలు కట్టబెట్టడం విశేషం.' రాజకీయంగా సీనియర్ నాయకులు, మంత్రులైన భట్టి, తుమ్మలకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చి రాజధానిలోని పార్లమెంట్ స్థానాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. సామాజిక సమీకరణలు, గతంలో పనిచేసిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని భట్టిని సికింద్రాబాద్, హైదరాబాద్, తమ్మలను మల్కాజ్గిరి ఇన్చార్జిగా నియమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భట్టి హైదరాబాద్‌లో ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన నేపథ్యాన జోష్‌లో ఉన్న పార్టీ శ్రేణులు అదే ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికలకు సై అంటున్నాయి. పొంగులేటికి కీలకంగా.. ఖమ్మం పార్లమెంట్ స్థానం ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో విస్తరించి ఉండగా, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో ఇక్కడి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో ఈ రెండు స్థానాల ఇన్చార్జిగా మంత్రి పొంగులేటి కొనసాగుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా మహబాబాబాద్, వనపర్తి, నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆయన ప్రచారానికి వెళ్లిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే తమ లక్ష్యమని చెప్పగా.. భద్రాచలం మినహా ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్, పొత్తులో భాగంగా కొత్తగూడెంలో సీపీఐ విజయం సాధించాయి. ఈ మేరకు భట్టి, తుమ్మలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించిన పొంగులేటిని అధిష్టానం ప్రత్యేకంగా గుర్తించినట్లు రెండు పార్లమెంట్ స్థానాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో స్పష్టమవుతోంది. ఈ రెండింటి పరిధిలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, భద్రాచలంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుతో కొత్తగూడెం స్థానాన్ని సీపీఐ దక్కించుకోగా.. మిగిలిన 12 స్థానాల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. దీంతో రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో పొంగులేటికి ఉన్న పరిచయాలు, పార్టీ కేడర్, కుటుంబ బంధుత్వం లోక్‌సభ ఎన్నికల్లోనూ అభ్యర్థుల విజయానికి కలిసొస్తుందన్న భావనతో ఆయనకు ఈ బాధ్యతలు ఇచ్చినట్లు పార్టీ నేతల ద్వారా తెలిసింది. కాగా, ఖమ్మం లోక్‌సభ స్థానం పరిధిలో ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మహబాబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇవి కూడా చదవండి: ‘పార్లమెంట్’పై కాంగ్రెస్ 0గురి! ఆ స్థానాలకు పోటాపోటీగా.. -
Times Now Survey On 2024 Elections: మళ్లీ ఎన్డీయేనే..
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే జాతీయ స్థాయిలో అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ప్రఖ్యాత ‘టైమ్స్ నౌ’సర్వే తేలి్చచెప్పింది. మొత్తం 543 స్థానాలకు గాను ఎన్డీయేకు 296 నుంచి 326, విపక్ష ఇండియా కూటమికి 160 నుంచి 190 స్థానాలు లభిస్తాయని వెల్లడించింది. ఎన్డీయేలోని ప్రధానపక్షమైన బీజేపీ సొంతంగానే 288 నుంచి 314 సీట్లు గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. ఇక విపక్ష ఇండియా కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ 62 నుంచి 80 స్థానాలకే పరిమితం అవుతుందని పేర్కొంది. ఓట్ల శాతంపరంగా చూస్తే ఎన్డీయేకు 42.60శాతం, ఇండియాకు 40.20 శాతం ఓట్లు లభిస్తాయని సర్వే వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేస్తుందని తేలి్చంది. రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలకు గాను దాదాపు మొత్తం స్థానాలు కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. వైఎస్సార్సీపీకి 24 నుంచి 25 సీట్లు లభిస్తాయని తేలి్చచెప్పింది. అంతేకాకుండా ఆ పార్టీ ఓట్ల శాతం కూడా పెరుగనున్నట్లు గుర్తించింది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ 49.8 శాతం ఓట్లతో 22 స్థానాల్లో నెగ్గింది. ఈసారి 51.3 శాతం ఓట్లతో మొత్తం స్థానాలను తన ఖాతాలు వేసుకుంటుందని టైమ్స్ నౌ సర్వే తేల్చడం విశేషం. అంటే కిందటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఆ పార్టీ ఓట్ల శాతం 1.50 శాతం పెరుగనున్నట్లు తేటతెల్లమవుతోంది. వైఎస్సార్సీపీ పట్ల నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణకు ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో అధికార భారత రాష్ట్ర సమితికి(బీఆర్ఎస్) 9 నుంచి 11 లోక్‌సభ స్థానాలు లభిస్తాయని సర్వే తెలియజేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 2 నుంచి 3, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 3 నుంచి 4 స్థానాలు దక్కుతాయని పేర్కొంది. ఇతరులు ఒక సీటు గెలుచుకోనున్నట్లు అంచనావేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికెన్ని సీట్లు కూటమి/పార్టీ సీట్లు వైఎస్సార్సీపీ 24–25 ఎన్డీయే 0–1 ఇండియా 0 ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల శాతం కూటమి/పార్టీ ఓట్ల శాతం వైఎస్సార్సీపీ 51.3 ఎన్డీయే 1.13 ఇండియా – తెలంగాణలో ఎవరికెన్ని సీట్లు కూటమి/పార్టీ సీట్లు బీఆర్ఎస్ 9–11 ఎన్డీయే 2–3 ఇండియా 3–4 ఇతరులు 1 తెలంగాణలో ఓట్ల శాతం కూటమి/పార్టీ ఓట్ల శాతం బీఆర్ఎస్ 38.40 ఎన్డీయే 24.30 ఇండియా 29.90 ఇతరులు 7.40 జాతీయ స్థాయిలో ఏ కూటమికి ఎన్ని సీట్లు (మొత్తం సీట్లు 543) కూటమి సీట్లు ఎన్డీయే 296–326 (ఓట్ల శాతం 42.60) ఇండియా 160–190 (ఓట్ల శాతం 40.20) పార్టీ సీట్లు బీజేపీ 288–314 కాంగ్రెస్ 62–80 వైఎస్సార్సీపీ 24–25 డీఎంకే 20–24 టీఎంసీ 22–24 బీజేడీ 12–14 బీఆర్ఎస్ 9–11 ఆమ్ ఆద్మీ పార్టీ 5–7 ఇతరులు 70–80 ఏ కూటమికి ఎన్ని సీట్లు కూటమి సీట్లు ఓట్ల శాతం ఎన్డీయే 296–326 42.60 ఇండియా 160–190 40.20 మొత్తం సీట్లు 543 – ఏ పారీ్టకి ఎన్ని సీట్లు పార్టీ సీట్లు బీజేపీ 288–314 కాంగ్రెస్ 62–80 వైఎస్సార్సీపీ 24–25 డీఎంకే 20–24 టీఎంసీ 22–24 బీజేడీ 12–14 బీఆర్ఎస్ 9–11 ఆప్ 5–7 ఇతరులు 70–80 -
Independence Day 2023: వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ప్రధాని
Updates ఎర్రకోటలో కన్నుల పండువగా పంద్రాగస్టు వేడుకలు మరో వెయ్యేళ్లు భారత్ వెలుగుతూనే ఉంటుంది: ప్రధాని మోదీ ►2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యం ►2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ►దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గాయి ►దేశంలో తీవ్రవాదం, నక్సలిజం తగ్గాయి ►భారత్ ఇప్పుడు సురక్షితంగా ఉంది ►ప్రపంచానికి మిత్రుడిగా భారత్ మారింది ►140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం ►దేశాభివృద్ధే కాదు.. ప్రపంచాభివృద్ధిని కూడా భారత్ కోరుకుంటోంది ►మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్ల శిక్షణ ►దేశ ప్రజలందరికీ ఇంటర్నెట్ను అందుబాలోకి తీసుకువచ్చాం ►వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంటుంది ►ఆర్థిక వ్యవస్థలో అమెరికా, చైనా తర్వాత భారత్ ఉంటుంది ►భారత్ అభివృద్ధిపై నాకు పూర్తి విశ్వాసం ఉంది ►జన ఔషధితో ప్రజలందరీ చౌకగా మందులు ►జన ఔషధి కేంద్రాల సంఖయ 10 వేల నుంచి 25 వేలకు పెంచాం ►జన్‌ధన్ ఖాతాలో పేదల బతుకుల్లో వెలుగులు నింపాం ►మారుమూల గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించాం ►భిన్నత్వంలో ఏకత్వమే భారత్ బలం ►ప్రతి నిర్ణయంలో దేశానికి మొదటి ప్రాధాన్యత ►దేశంలో సుస్థిరమైన, శక్తివంతమైన ప్రభుత్వం ఉంది. ►గత పదేళ్లలో ఎన్నో కీలక సంస్కరణలు తీసుకుచవచ్చాం ►అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళ్తోంది. ►వ్యవసాయ రంగంలోనూ దేశం చాలా అభివృద్ధి చెందింది. ►ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ అభివృద్ధి చెందుతోంది. ►రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాసిస్తుంది. ►క్రీడా రంగంలో యువత సత్తా చాటుతోంది. ►స్టార్టప్స్ రంగంలో టాప్-3లో భారత్ ఉంది. ►జీ-20 నిర్వహించే అరుదైన అవకాశం భారత్‌కు లభించింది. ►కరోనా మనకు ఎన్నో పాఠాలను నేర్పింది. ►కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా మారింది ►కరోనా సమయంలో ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లాం ►ప్రపంచాన్ని మార్చడంలో భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోంది. ►ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తున్నాం ►దేశ ఆర్థిక వ్యవవస్త బాగుంటే దేశం బాగుంటుంది. ►రూ, 4 లక్షల కోట్లతో పేదలకు ఇళ్లు నిర్మించాం. ►140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం ►పేద, మధ్య తరగతి వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ►పీఎం స్వనిధి పథకం ద్వారా 50 వేల కోట్లు ఖర్చు చేశాం ►సైన్యంలో వన్ ర్యాంక్-వన్ పెన్షన్ అమలు చేశాం ►అవినీతి రాక్షసి దేశాన్ని వెనక్కి తీసుకెళ్లింది ►ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ►సుస్థిర ప్రభుత్వంతో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ►దేశంలో సుస్థిర ప్రభుత్వం ఉంది, దేశాన్ని ముందుకు నడిపిస్తోంది. ►డెమోగ్రఫీ, డెమోక్రసీ, బయోడైవర్సిటీ ఈ మూడు భారత్‌కు ఎంతో ముఖ్యం ►గత పదేళ్లలో భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది. ►నారీ శక్తి, యువశక్తి భారత్‌కు బలం ►భారత్‌లో యువశక్తి ఎంతో అద్భుతంగా ఉంది. ►టెక్నాలజీ విషయంలో భారత్ ఎంతో మెరుగుపడింది. ►డిజిటల్ ఇండియా దిశగా భారత్ దూసుకెళ్తోంది. ►గత పదేళ్లుగా భారత్ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోంది. ►శాటిలైట్ రంగంలో మనమే ముందున్నాం. ►రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్తిఉంది. ►30 ఏళ్ల లోపు యువత భారత్‌కు ఆశాకిరణం. ►వ్యవసాయ రంగంలోనూ దేశం చాలా అభివృద్ధి చెందింది. ►దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ ►ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. ►దేశం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారు. ►అమరవీరుల త్యాగఫలమే స్వాతంత్ర్యం ►ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. ►గత పదేళ్లలో భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది. ►దేశం మణిపూర్ ప్రజలకు అండగా ఉంది: ప్రధాని మోదీ ►మణిపూర్‌లో శాంతిస్థాపనకు కృషి చేస్తున్నాం. ►మణిపూర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ► ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ ► గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని మోదీ ►పూలవర్షం కురిపించిన హెలికాప్టర్లు ► ఎర్రకోటపై వరుసగా పదోసారి నరేంద్రమోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎర్రకోటపై పదోసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. ►ఈ స్వాతంత్ర్య దినోత్సవంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు ముగియనున్నాయి. ►ఆ తర్వాత జాతినుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. సామాన్యులే అతిథులు ►దేశం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన 1,800 మంది ప్రత్యేక అతిథులు. ప్రత్యేక అతిథులుగా 400 మంది సర్పంచులు ►10 వేల మంది పోలీసులతో నాలుగు అంచెల భద్రత.. భద్రత కోసం 1000 సెక్యూరిటీ కెమెరాలు ►దేశ వ్యాప్తంగా ఘనంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవం ►ఢిల్లీలో కన్నుల పండువగా పంద్రాగస్టు వేడుకలు ►కాసేపట్లో ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్న ప్రధాని ►రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ప్రధాని మోదీ ►వరుసగా పదోసారి ప్రధాని నరేంద్ర మోదీ నేడు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయనున్నారు. ►2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదే ఆయన చివరి ప్రసంగం కానుంది. ►ఈ వార్షిక ప్రసంగంలో ప్రధాని మోదీ తన ప్రభుత్వ ప్రగతి రిపోర్టు, కీలక కార్యక్రమాలను ప్రకటించడంతోపాటు రానున్న సంవత్సరాల్లో దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలనుకుంటున్నారో కూడా వివరిస్తారు. ►2014 మొదలుకొని వివిధ రంగాల్లో దేశం సాధించిన ప్రగతిని వివరించడంతోపాటు భవిష్యత్ కార్యాచరణను ప్రధాని ప్రకటించనున్నారు. రాజకీయ పరమైన అంశాలను కూడా ఆయన స్పృశిస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. -
ఎన్నికల ఏడాది 2023.. త్రిపుర నుంచి తెలంగాణ దాకా...
కోటి ఆశలతో కొత్త ఆకాంక్షలతో సరికొత్త ఏడాదిలోకి అడుగు పెట్టాం. ఈ ఏడాది ఎలా ఉంటుంది ? గతేడాదితో పోలిస్తే ఏం మార్పులొస్తాయి? సామాన్యుల దగ్గర్నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరి మదిలో ఇవే ఆలోచనలు సుళ్లు తిరుగుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని కొల్లగొట్టాలంటే మోదీ చరిష్మా, రాహుల్ గాంధీ పాదయాత్ర, కేజ్రివాల్ క్రేజ్ కీలకంగా మారాయి... ఇది ఎన్నికల ఏడాది. ఈ ఏడాది మొత్తం తొమ్మిది రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు ఫైనల్ అనుకుంటే ఇవి సెమీఫైనల్స్‌గా భావించవచ్చు. 2022లో ఏడు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే బీజేపీ అత్యంత కీలకమైన యూపీ, గుజరాత్‌తో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో తిరుగులేని విజయం సాధించి ఆధిక్యం ప్రదర్శించింది. కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్‌తో సరిపెట్టుకుంటే, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ పంజాబ్‌లో ఘన విజయం సాధించడంతో పాటు గోవా (2 స్థానాలు), గుజరాత్ (5 సీట్లు)లో ఖాతా ప్రారంభించి జాతీయ స్థాయిలో ఒక కొత్త శక్తిగా ఎదిగింది. దీంతో రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ ఆధిక్యం ప్రదర్శిస్తుంది ? వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి రాజకీయాలు ఎలా మారుతాయన్న చర్చ వేడెక్కిస్తోంది. త్రిపుర నుంచి తెలంగాణ వరకు మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు 116 లోక్‌సభ స్థానాల పరిధిలో జరుగుతూ ఉండడంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ సారి త్రిపుర, మేఘాలయాలో తృణమూల్ కాంగ్రెస్ పోటీకి దిగుతూ ఉండడంతో మమతా బెనర్జీ కూడా జాతీయ స్థాయిలో చక్రం తిప్పడానికి సిద్ధమవుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా దేశంలో నెలకొన్న ఆర్థిక అసమానతలు, పెరిగిపోతున్న ధరలు, సైద్ధాంతికపరమైన విభేదాలు, మత పరమైన విభజనలు,, సామాజిక అస్థిరతలు, రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఎన్నికల్ని ఎలాంటి మలుపు తిప్పుతాయో చెప్పలేని పరిస్థితులున్నాయి. బీజేపీ వ్యూహాలు ఇలా..! కేంద్రంలో అధికార బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకున్న వ్యక్తిగత చరిష్మానే నమ్ముకుంది. వివిధ రాష్ట్రాల్లో స్థానిక అంశాలే కీలకంగా మారినప్పటికీ కమలనాథులు మరోసారి మోదీ మ్యాజిక్‌నే పరీక్షకు నిలబెడుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే కేంద్రం ప్రతీ నిర్ణయం తీసుకోనుంది. అన్నింటికి మించి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్రబడ్జెట్ ఈ ఎలక్షన్ ఏడాదిలో సలక్షణంగా ఉండే అవకాశాలే ఉన్నాయి. విదేశీ వ్యవహారాలను సమర్థంగా నడిపిస్తున్న మోదీ సర్కార్ వచ్చే సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగే జీ–20 సదస్సు ద్వారా భారత్ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టామన్న నినాదంతో వచ్చే ఎన్నికల్ని ఎదుర్కోవచ్చంటున్నారు. సదస్సుకు ముందే జమ్ము కశ్మీర్లో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని మోదీ, అమిత్ షా ద్వయం భావిస్తోంది. డిసెంబర్ నాటికి అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేస్తే మతపరంగా ఓట్లను ఏకీకృతం చేసే వ్యూహం ఫలించి ఢిల్లీ పీఠం మరోసారి తమకే దక్కుతుందన్న ఆత్మవిశ్వాసం అధికార పార్టీలో కనిపిస్తోంది. కాంగ్రెస్‌కి పూర్వ వైభవం వస్తుందా ? కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు కల్పించే రెండు ఘటనలు 2022లో జరిగాయి. గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి మల్లిఖార్జున్ ఖర్గేకి పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించడం ద్వారా ఒక కొత్త చరిత్ర నెలకొల్పితే, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మరో చరిత్రగా మారుతోంది. రాహుల్ పాదయాత్రకి వస్తున్న ప్రజాదరణని చూస్తుంటే తనపైనున్న పప్పు ముద్రను తొలగించుకొని రాహుల్ సరికొత్త రాజకీయ నాయకుడిగా ఎదిగే రోజు ఎంతో దూరం లేదనే అనిపిస్తోంది. పార్లమెంటు వేదికగా బీజేపీని ఇరుకున పెట్టేలా మాటల తూటాలు విసురుతూ, వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అంతర్గత పోరుల్ని చక్కదిద్దుతూ మల్లికార్జున ఖర్గే తన కొత్త బాధ్యతల్ని సమర్థంగా నిర్వహిస్తూ ఉండడం కాంగ్రెస్‌కి కలిసొచ్చే అంశం. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాటిని నిలబెట్టుకుంటూనే, తమకు అనుకూలంగా ఉన్న కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో విజయం సాధిస్తే లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రధాని మోదీని ఎదుర్కొనే నాయకుడిగా రాహుల్ అవతరిస్తారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ప్రతిపక్షాల ఐక్యత సాధ్యమా? ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి 2022 తీపి జ్ఞాపకాలనే అందించి వెళ్లింది. జాతీయ పార్టీగా కొత్త హోదా రావడంతో ప్రధాని మోదీ చరిష్మాకు దీటుగా నిలబడే వ్యక్తిగా కేజ్రీవాల్ నిలబడతారని ఆ పార్టీలో కొత్త ఆశలు చిగురించాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2025లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతాయని ప్రకటించడం ద్వారా తాను పూర్తిగా రేసు నుంచి తప్పుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మరిన్ని రాష్ట్రాలకు తమ పార్టీలని విస్తరించి జాతీయ స్థాయిలో పట్టు బిగించాలని చూస్తున్నారు. ప్రాంతీయ పార్టీల నాయకులందరూ ఢిల్లీ పీఠంపైనే గురి పెట్టడంతో అధికార బీజేపీని ఎదుర్కోవడానికి వీరంతా కలసికట్టుగా ఉండే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో కాంగ్రెస్‌ని కలుపుకుంటూ పోతూ విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తేనే ప్రధాని మోదీని ఎదుర్కొని నిలబడగలరు. ప్రతిపక్షాలు చేతులు కలిపి బీజేపీకి సవాల్ విసురుతారో లేదో ఈ ఏడాదిలోనే తేలిపోనుంది. 2023 కేలండర్ ► ఫిబ్రవరి–మార్చి: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు ► మే: కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు ► జూలై– ఆగస్టు: 10 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ నుంచి అత్యధిక సీట్లు ► నవంబర్–డిసెంబర్: హిందీ బెల్ట్ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంతో పాటుగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు – సాక్షి, నేషనల్ డెస్క్ -
గన్మెన్లు అప్రమత్తంగా ఉండాలి..
రఘునాధపాలెం, న్యూస్‌లైన్: గన్మెన్లు విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని, ఎప్పుడు అప్రమత ్తంగా ఉండాలని ఏఆర్ ఆర్ఐ శంకర్ పేర్కొన్నారు. రఘునాధపాలెం మండ లం మంచుకొండలోని పోలీస్ ఫైరింగ్ రేంజ్ లో శనివారం గన్మెన్లకు ఇచ్చిన శిక్షణలో ఆయన మాట్లాడారు. గన్మెన్లుగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఫిస్టల్, కార్బన్ వెపన్లతో ఫైరింగ్ సాధన చేయించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అసెంబ్లీ, పార్లంమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారులకు, రాజకీయ నాయకులకు ఉండే గన్మెన్లు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటనలు చేసే ముందు స్థానిక పోలీస్స్టేషన్లకు సమాచారం అందించాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఎస్సైలు నాగేశ్వరరావు, నర్సయ్య, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.