మెజారిటీ మార్కు దాటలేకపోయిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ
జోహన్నెస్‌బర్గ్: వర్ణవివక్షపై పోరు తర్వాత నెల్సన్ మండేలా నేతృత్వంలో దక్షిణాఫ్రికాలో అధికారం చేపట్టి 30 ఏళ్లపాటు పాలించిన ది ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్‌సీ) పార్టీ తొలిసారిగా తక్కువ ఓట్లతో సరిపెట్టుకుంది. ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలైన ఓట్లలో ఇప్పటిదాకా 99.80 శాతం ఓట్లు లెక్కించారు. శనివారం అనధికారికంగా వెల్లడైన గణాంకాల ప్రకారం ఏఎన్‌సీకి 40 శాతానికిపైగా మాత్రమే ఓట్లు పడ్డాయి.
తీవ్ర పేదరికం, అసమానతలకు నెలవైన దేశంలో గొప్ప మార్పు మొదలైందని విపక్షాలు ఆనందం వ్యక్తంచేశాయి. మిగతా పారీ్టలకు ఇంతకంటే తక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఏఎన్‌సీ ఇప్పటికీ అతిపెద్ద పారీ్టగా ఉన్నప్పటికీ మెజారిటీ మార్కు(50 శాతానికి మించి ఓట్లు) దాటని కారణంగా మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే ఇతర పారీ్టలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన పరిస్థితి తలెత్తింది. విపక్ష డెమొక్రటిక్ అలయన్స్(డీఏ)కు 21.72 శాతం, మాజీ దేశాధ్యక్షుడు జాకబ్ జూమా నేతృత్వంలోని అమ్‌కోంటో వీ సిజ్వే(ఎంకే) పారీ్టకి 14 శాతం ఓట్లు పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment