Democratic Alliance
-
South Africa Elections 2024: దక్షిణాఫ్రికాలో వచ్చేది సంకీర్ణమే!
జోహన్నెస్‌బర్గ్: వర్ణవివక్షపై పోరు తర్వాత నెల్సన్ మండేలా నేతృత్వంలో దక్షిణాఫ్రికాలో అధికారం చేపట్టి 30 ఏళ్లపాటు పాలించిన ది ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్సీ) పార్టీ తొలిసారిగా తక్కువ ఓట్లతో సరిపెట్టుకుంది. ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలైన ఓట్లలో ఇప్పటిదాకా 99.80 శాతం ఓట్లు లెక్కించారు. శనివారం అనధికారికంగా వెల్లడైన గణాంకాల ప్రకారం ఏఎన్‌సీకి 40 శాతానికిపైగా మాత్రమే ఓట్లు పడ్డాయి. తీవ్ర పేదరికం, అసమానతలకు నెలవైన దేశంలో గొప్ప మార్పు మొదలైందని విపక్షాలు ఆనందం వ్యక్తంచేశాయి. మిగతా పారీ్టలకు ఇంతకంటే తక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఏఎన్సీ ఇప్పటికీ అతిపెద్ద పారీ్టగా ఉన్నప్పటికీ మెజారిటీ మార్కు(50 శాతానికి మించి ఓట్లు) దాటని కారణంగా మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే ఇతర పారీ్టలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన పరిస్థితి తలెత్తింది. విపక్ష డెమొక్రటిక్ అలయన్స్(డీఏ)కు 21.72 శాతం, మాజీ దేశాధ్యక్షుడు జాకబ్ జూమా నేతృత్వంలోని అమ్కోంటో వీ సిజ్వే(ఎంకే) పారీ్టకి 14 శాతం ఓట్లు పడ్డాయి. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో జో బిడెన్
న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ పార్టీ తరపున జో బిడెన్ అభ్యర్థిత్వం అధికారికంగా ఖరారయ్యింది. అధ్యక్ష పోటీకి అవసరమైన 1993 మంది ప్రతినిధులు మద్దతు బిడెన్‌కు లభించింది. అలాగే, అదే పార్టీకి చెందిన బెర్ని శాండర్స్ సైతం ఏప్రిల్‌లో పోటీ నుంచి తప్పుకోవడంతో బిడెన్‌కు మార్గం సుగమం అయ్యింది. దీంతో డెమొక్రట్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌తో మాజీ ఉపాధ్యక్షుడు బిడెన్ నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తలపడనున్నారు.(నిరుద్యోగరేటుకు ఫ్లాయిడ్‌కు ముడి.. ట్రంప్‌పై ఆగ్రహం) 77 ఏళ్ల బిడెన్ 36 ఏళ్ల నుంచి సెనేటర్‌గా కొనసాగుతున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి మూడోసారి ప్రయత్నించి విజయం సాధించారు. గతంలో రెండుసార్లు పోటీపడినా డెమొక్రాట్ల మద్దతు పొందలేకపోయారు. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జో బిడెన్ 2009 నుంచి 2017 వరకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. త్వరలో జో బిడెన్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రతినిధులు తనకు మద్దతు ఇవ్వడంపై జో బిడెన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ‘అధ్యక్ష పదవి కోసం జరిగే యుద్ధంలో విజయం సాధించడానికి దేశవ్యాప్తంగా ఉన్న అమెరికన్ల ఓట్లను సంపాదించడానికి ఇక రోజూ ప్రయత్నిస్తా. ఇప్పుడు మనకు గౌరవం తెచ్చే ఉద్యోగాలు కావాలి.ప్రతి అమెరికన్‌కు సమన్యాయం జరగాలి. కరోనా నేపథ్యంలో కుంచించుకుపోయిన ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.. వారి అవసరాలు తీర్చి, సహాయపడే ఒక అధ్యక్షుడు కావాలి’ అని పేర్కొన్నారు. దేశం గతంలో ఎన్నడూ చూడని నిరుద్యోగాన్ని చవి చూస్తోందని,1960 తర్వాత అంతటి స్థాయిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ట్రంప్‌పై పరోక్షంగా విమర్శించారు. (కరోనాతో దావూద్ ఇబ్రహీం మృతి..!) -
రెండోస్సారి!
* పదేళ్లలో మరో ఒంటరిపోరు * డీఎండీకే నిర్ణయంపై అన్ని పార్టీల్లో విస్మయం * ప్రజాస్వామ్య కూటమిపై చర్చ చెన్నై, సాక్షి ప్రతినిధి : పార్టీ ఆవిర్భావంలో ఒకసారి ఒంటరిపోరుకు దిగిన డీఎండీకే సరిగ్గా పదేళ్ల తరువాత మరోసారి ఒంటరిగా ఎన్నికల సమరాన్ని ఎదుర్కోనుంది. తొలి సమరంలో కేవలం ఒక్కసీటు మాత్రమే దక్కగా రెండో సమరం ఫలితాలకు మరో నెలన్నర రోజులు ఆగాల్సి వచ్చింది. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలో డీఎంకే, అన్నాడీఎంకేల తరువాత తృతీయస్థానాన్ని దక్కించుకున్న డీఎండీకే సైతం కోలీవుడ్ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చిందే. డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై, ప్రస్తుత అధ్యక్షుడు కరుణానిధి, అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీ రామచంద్రన్, ప్రస్తుతం పార్టీ అధినేత్రి జయలలిత సినిమారంగానికి చెందినవారని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఆ రెండు పార్టీల అధినేతలు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అదే వరుసలో తాను సైతం సీఎం కావాలని ఆశించిన విజయకాంత్ 2005లో రాజకీయాల్లోకి దిగారు. తమిళనాడులో ద్రవిడ పార్టీలకే ప్రజల్లో ఆదరణ ఉండటంతో విజయకాంత్ అధ్యక్షుడుగా దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం (డీఎండీకే) పేరుతో 2005లో పార్టీ ఆవిర్భవించింది. ఆ మరుసటి ఏడాదే అంటే 2006లో అసెంబ్లీ ఎన్నికలు రాగా మొత్తం 234 స్థానాల్లో తమ అభ్యుర్థులను నిలబెట్టి ఒంటరిగా పోటీకి దిగారు. విరుదాచలం నియోజవర్గం నుంచి విజయకాంత్ పోటీచేశారు. అన్ని నియోజకవర్గాల్లో డీఎండీకే అభ్యర్థులు పరాజయం పాలుకాగా విజయకాంత్ ఒక్కరే గెలిచారు. అయితే అనేక నియోజకవర్గాల్లో గణనీయమైన సంఖ్యలో ఓట్లను సాధించడం ద్వారా రాజకీయాల్లో కలకలం రేపారు. డీఎంకే, అన్నాడీఎంకే వంటి సీనియర్ పార్టీలను ఒంటికాలిపై ఢీకొని ఆ ఏడాది 8 శాతం ఓట్లను సాధించడం ఒక రికార్డుగా నిలిచింది. ఆ (2006) ఏడాది జరిగిన ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వచ్చినా పూర్తిస్థాయి మెజారిటీ లేకుండా పోయింది. అలాగే 2009 పార్లమెంటు ఎన్నికల్లో డీఎండీకే ఒంటరిగానే పోటీచేసి మొత్తం 39 స్థానాల్లోనూ ఓడిపోయింది. అయితే అన్ని నియోజకవర్గాల్లో కనీస ఓట్లను సాధించడం ద్వారా ఓటు బ్యాంకును చాటిచెప్పింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్న డీఎం డీకే 41 స్థానాల్లో పోటీచే సి 29 స్థానాల్లో గెలుపొందింది. విజయకాంత్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ను దక్కించుకున్నారు. అన్నాడీఎంకేతో ఆయన చెలిమి ఎక్కవకాలం కొనసాగలేదు. ఈ పరిస్థితుల్లో 2006 తరువాత ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. పార్టీ ఆవిర్భావం తరువాత రెండుసార్లు ఒంటరిపోరుకు దిగినట్లయింది. సతీమణి సలహాతోనే ఒంటరిపోరు ఏదో ఒక బలమైన పార్టీతో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాలని విజయకాంత్ భావించగా, ఆయన సతీమణి ప్రేమలత మొత్తం వ్యూహాన్నే మార్చివేసినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని ఈ ఏడాది ఆ పార్టీకి బద్దశత్రువైన డీఎంకేతో జతకడితే ప్రజల్లోనూ, ఇతర పార్టీల్లోనూ చులకనై పోతామని ఆమె నూరిపోసినట్లు సమాచారం. ప్రేమలత మాటలను విశ్వసించిన విజయకాంత్ ‘పెళ్లాం చెబితే వినాలి’ అనే రీతిలో రాజకీయాలు నడిపిస్తున్నారని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కేవలం విజయకాంత్ భార్యగాకాక చురుకైన నేతగా ప్రేమలత పేరొందడంతో ఆమె నిర్ణయాలకు విలువ పెరుగుతోంది. అందుకే గురువారం జరిగిన సభలో వ్యూహాత్మకంగా అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలపై ప్రేమలత దుమ్మెత్తిపోశారు. అయితే ఇన్నాళ్లు ఏదోఒక బలమైన పార్టీతో జతకట్టి కొన్ని సీట్లు దక్కించుకోగలమని నమ్మకంతో ఉన్న పార్టీనేతలు ఒంటరిపోరుతో నిరాశపడినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు పార్టీ వైఖరి స్పష్టం కావడంతో శుక్రవారం అభ్యర్థుల ఎంపికను ప్రారంభించారు. ప్రజాసంక్షేమ కూటమి కెప్టెన్‌తో కలిసేనా రాష్ట్రంలో 8 నుంచి 10 శాతం మాత్రమే ఓటు బ్యాంకు కలిగి ఉన్న డీఎండీకే ఒంటరి పోరుకు దిగడం అన్ని పార్టీలను ఆశ్చర్యపరిచింది. కెప్టెన్ తమ కూటమిలోకి వస్తాడనే చర్చలు మారిపోయి ప్రస్తుతం కెప్టెన్ ఒక కొత్తకూటమిని ఏర్పాటు చేసుకుంటాడనే ప్రచారం సాగుతోంది. ప్రజా సంక్షేమ కూటమి విజయకాంత్‌తో చేతులు కలిపి అతడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజా సంక్షేమ కూటమిలోని ఎండీఎంకే, వీసీకే, వామపక్షాలతో డీఎండీకే కూడా చేరితే బలమైన కూటమిగా ఏర్పడగలదని ఆశిస్తున్నారు. తద్వారా కూటమి బలం 15 శాతం నుంచి 18 శాతానికి పెరుగుతుందని అంచనావేస్తున్నారు. ఓటుబ్యాం కు లెక్కలు చెప్పి ఎలాగైనా కెప్టెన్‌ను తమతో కలుపుకోవాలని ప్రజాస్వామ్య కూటమి తహతహలాడుతోంది. -
ఇకపై ప్రతి మంగళవారం..
మంత్రి మండలి సమావేశాలపై సీఎం ఫడ్నవీస్ సాక్షి, ముంబై: రాష్ట్ర మంత్రి మండలి సమావేశాలు ఇకపై ప్రతి మంగళవారం జరపాలని నిర్ణయించారు. ఇప్పటివరకు ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి బుధవారం మంత్రిమండలి సమావేశాలు జరిగేవి. అయితే ఇకపై సమావేశాలను మంగళవారం నిర్వహించాలని శనివారం సీఎం ఫడ్నవీస్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితులపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్షించారు. అనంతరం ఆయన డీజీపీతో సమావేశమయ్యారు. ఇటీవల అహ్మద్‌నగర్ జిల్లాలో జరిగిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దళితుల హత్యపై డీజీపీని అడిగి తెలుసుకున్నారు. వెంటనే విచారణ జరిపించి నివేదికను అందజేయాలని ఆదేశించారు.కాగా, రాష్ట్ర మంత్రి పంకజా ముండే ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సీఎంవో కార్యాలయంలో సమూల మార్పులు ఇదిలా ఉండగా, సమర్థవంతమైన పాలన అందించేందుకు వీలుగా సీఎంవో కార్యాలయంలో పలు మార్పులు చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయ మార్గంలో సీఎంవో కార్యాలయ పనితీరును మార్చనున్నారు. మంత్రులకు సహాయకులుగా సమర్థులైన అధికారులను నియమించనున్నట్లు సీఎం ఫడ్నవీస్ తెలిపారు. మంత్రుల వద్ద పనులు పెండింగ్‌లో పడిపోకుండా ఈ అధికారులు తగిన సూచనలు, సలహాలు ఇస్తారని చెప్పారు. అలాగే స్థానిక సంస్థల పన్ను(ఎల్బీటీ) రద్దు, టోల్ ట్యాక్స్‌లపై ప్రశ్నించగా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తున్నామన్నారు. -
అభ్యర్థులకు అగ్నిపరీక్ష!
సాక్షి, ముంబై: ప్రజాస్వామ్య కూటమిలోని కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య... మహాకూటమిలోని శివసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న అభ్యర్థులకు వరుసగా వస్తున్న సెలవులు అగ్నిపరీక్షగా మారాయి. నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ శనివారం ఆఖరు రోజు కావడంతో అభ్యర్థుల్లో మరింత గుబులు మొదలైంది. ఆ తరువాత ఉపసంహరణ, ఎన్నికల గుర్తులు జారీ చేయడం లాంటివి ఉంటాయి. అప్పటికే ఒకటో తేదీ వస్తుంది. ఎన్నిలకు 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. అంటే ప్రచారానికి కేవలం 13 రోజులు మాత్రమే మిగులుతుంది. మరోవైపు సీట్ల సర్దుబాటు విషయం త్వరగా తేలితే ప్రచారం చేద్దామనుకుంటున్న ఆశావహులకు వరుసగా వస్తున్న సెలవులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రేపో, ఎల్లుండో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశముందని భావిస్తున్న నేపథ్యంలో వచ్చేవారం నుంచి ప్రచార జోరు పెంచాలని పార్టీలు భావించాయి. అయితే వచ్చేవారంలో గాంధీ జయంతి(గురువారం), దసరా (శుక్రవారం), శని, ఆదివారాలు సెలవులతో వరుసగా నాలుగు రోజులు జనం అందుబాటులో లేని పరిస్థితి ఎదురవుతోంది. ఈ నాలుగు రోజులపాటు జనమేకాదు పార్టీ కార్యకర్తలు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని చెబుతున్నారు. సాధారణంగానే వారాంతాల్లో విహార యాత్రలకు వెళ్తుంటారు. పైగా ఇప్పుడు వరుసగా నాలుగురోజులు కలిసి వస్తుండడంతో పిల్లలకు తీరిక సమయం దొరకడంతో పిక్నిక్ల కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా ఓటర్లు అందుబాటులో ఉండకపోవడం ఒకవైపు, కార్యకర్తలు అందుబాటులో ఉండకపోవడం మరోవైపు బరిలో నిలిచే అభ్యర్థులను కంగారు పడేలా చేస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండగా ఉన్న సమయం ప్రచారానికి సరిపోదని భావిస్తున్న పరిస్థితిలో ఇలా వరుస సెలవులు రావడం అభ్యర్థులకు అగ్నిపరీక్షగా చెబుతున్నారు. దీనికి తోడు ఇరు కూటముల్లోని పార్టీలు ఒంటరిగా పోటీచేస్తాయా...? లేక ఉమ్మడిడి పోటీచేస్తాయా..? అనేది తేలడం లేదు. ఏ నియోజకవర్గం ఏ పార్టీ అభ్యర్థికి దక్కుతుందో తెలియడంలేదు. ఎవరిని? ఎక్కడ బరిలోకి దింపుతారనే విషయమై కూడా స్పష్టత రావడం లేదు. దీంతో కొత్తగా బరిలో దిగే అభ్యర్థులు ఆయోమయంలో పడిపోయారు. ఇంత తక్కువ సమయంలో సాధ్యమైనంత వేగంగా ప్రచారం చేయాలి. ఒక్కో అభ్యర్థి సుమారు రెండున్న లక్షల నుంచి మూడు లక్షల ఓటర్ల చెంతకు వెళ్లాలి. దీంతో ప్రచారం, సభలు ఎలా నిర్వహించాలో తెలియక ఆందోళనలో పడిపోయారు. దీనికి తోడు వచ్చే వారంలో వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో అత్యధిక శాతం కార్యకర్తలు ఇతర ప్రాంతాలకు తరలిపోతారు. దీంతో అభ్యర్థుల వెంట తగినంత మందిమార్బలం ఉండరు. ఓటర్లను ఆకర్శించేందుకు వెంట భారీ జనం ఉండాలి. ఎంత జోరు ప్రచారం, నినాదాలు చేస్తే విజయానికి అంత దగ్గరవుతారు. కాని అభ్యర్థులకు అందుకు తగినంత సమయం లేదు. మరోపక్క సెలవుల కారణంగా ప్రచారానికి తగినంత జనం దొరకరు. దీంతో అభ్యర్థుల వెంట తిరిగే జనం ఎక్కువ కూలీ డిమాండ్ చేసే అవకాశం ఉందంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కార్యకర్తల కొరత లేకుండా ఇప్పటి నుంచి జాగ్రత్త పడుతున్నారు. కొందరైతే ముందుగానే బుకింగ్ చేసుకుని సిద్ధంగా ఉన్నారు. -
కొత్తోళ్లకు క ష్టకాలమే..!
సాక్షి, ముంబై: సీట్ల సర్దుబాటుపై అటు అధికార ప్రజాస్వామ్య కూటమిలోనూ, ఇటు ప్రతిపక్ష మహా కూటమిలో స్పష్టత లేకపోవడంతో ఎన్నికల బరిలోదిగే అన్ని పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కొత్తగా బరిలో దిగే అభ్యర్థుల్లో ఈ గుబులు మరింత ఎక్కువైంది. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంత నిర్భయంగా ఉన్నప్పటికీ కొత్తగా పోటీచేసే వివిధ పార్టీ ల వందలాది అభ్యర్థులకు సవాలుగా మారింది. ఇంత తక్కువ సమయంలో ఎన్నికల ప్రచారం ఎలా చేయాలి...? ఎలా గెలవడమని ఆందోళనలో పడిపోయారు. శనివారం నుంచి ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఈ నెల 27తో ముగుస్తుంది. ఆ తర్వాత నామినేషన్ల ఉపసంహరణకు రెండు, మూడు రోజు ల గడువు ఉంటుంది. అంటే ఒకటో తేదీ సాయంత్రం వరకు ఎంతమంది అభ్యర్థులు, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఒక స్పష్టత వస్తుంది. ఆ తర్వాత ప్రచార కార్యక్రమాలు ప్రారంభించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికలకు 48 గంటల ముందే ప్రచా రం నిలిపివేయాలి. అంటే కేవలం 13 రోజులు మాత్రమే ప్రచారాలకు, సభలకు సమయం దొరుకుతుంది. ఇంత తక్కువ సమయంలో నియోజకవర్గంలోని సుమారు రెండున్నర నుంచి మూడు లక్షల జనం మధ్యకు ఎలా వెళ్లాలి.. ఎలా ప్రచారం చేయా లో తెలియక కొత్తగా ఎన్నికల బరిలో దిగుతున్నవారు అయోమయానికి గురవుతున్నారు. ఎంత ప్రచారం చేస్తే విజయానికి అంత దగ్గరవుతార నేది జగమెరిగిన సత్యం. ఇదిలా ఉండగా, కూటముల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారంపై ఏమాత్రం ఆధారపడకుండా కొంద రు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. ఈసారి కూడా తమకు అభ్యర్థిత్వం దొరకడం ఖాయమనే ధీమాతో ఉన్నా రు. కాని కొత్తగా బరిలో దిగే అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీ టెకెటు దొరుకుతుందా..? లేదా...? తెలియని పరిస్థితి ఉంది. ఒకవేళ టికెటు ఇవ్వకుంటే ప్రత్యామ్నాయ మార్గం వెతు క్కోవడానికి తగిన సమయం కావాలి. ఇండిపెండెంట్‌గా పోటీచేయాలంటే తగిన మందిమార్బలాన్ని, ప్రచార సామాగ్రిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. లేదా చివరి క్షణంలో అభ్యర్థిగా ప్రకటిస్తే అప్పుడు పరిస్థితి ఏంటని కొత్త అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. -
మా సీట్లు మాకు కావాలే..
సాక్షి, ముంబై: వచ్చే శాసన సభ ఎన్నికల్లో కాషాయ కూటమి తమ పార్టీకి 20 స్థానాలు కేటాయించాల్సిందేనని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే స్పష్టం చేశారు. బాంద్రాలోని రంగశారద సభాగృహంలో జరిగిన పార్టీ కార్యకర్తల సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కూటమి చిహ్నంపై తమ అభ్యర్థులు పోటీ చేయబోరని, తమ పార్టీ గుర్తుపైనే పోటీచేస్తారని కుండబద్దలు కొట్టారు. ఇంతకుముందు తమ పార్టీకి 40 స్థానాలు కావాలని అడిగినా ప్రస్తుత వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేవలం 20 స్థానాలు కావాలని అడుగుతున్నామని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ అభ్యర్థులకు ఆర్పీఐ ఓట్లు గంపగుత్తగా పడ్డాయని ఆయన చెప్పారు. అయితే ఆమేరకు ఆర్పీఐ అభ్యర్థులకు కూటమి పార్టీల ఓట్లు రావడంలేదని రాందాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ శాసన సభ ఎన్నికల్లో పరిస్థితుల మారాలంటే ఆ ఓట్లన్నీ ఆర్పీఐ అభ్యర్థులకు పోలయ్యే విధంగా ప్రయత్నాలు చేయాలని ఇరు పార్టీల నాయకులకు ఆఠవలే సూచించారు. ఒక కులానికి రిజర్వేషన్ అమలుచేసే ముందు మరో కులానికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు. కొద్ది రోజులుగా ధన్గర్ సమాజ ప్రజలు రిజర్వేషన్ కోసం తీవ్ర పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికి సమాన న్యాయం జరిగే తీరులో తుది నిర్ణయం తీసుకోవాలని రాందాస్ విజ్ఞప్తి చేశారు. అది మా లిస్ట్ కాదు.. బీడ్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం తమ పార్టీ ఇంకా అభ్యర్థుల జాబితాను ఖరారు చేయలేదని ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే స్పష్టం చేశారు. ఇటీవల ఆర్పీఐ అభ్యర్థుల జాబితా అంటూ మీడియాలో వచ్చిన కథనాలను బుధవారం ఆయన ఖండించారు. ఎవరో కూటమిని తప్పుదోవ పట్టించేందుకు ఇలా అసత్యాలను ప్రచారంచేస్తున్నారని ఆరోపించారు. తాము అభ్యర్థుల జాబితా ఖరారైన తర్వాత మీడియా ద్వారానే బహిరంగంగా ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు కథనాల వల్ల కార్యకర్తల్లో అయోమయం నెలకొందన్నారు. పుకార్లను నమ్మవద్దని ఆయన ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు. బీజేపీ,శివసేన కూటమికి తాము 57 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జాబితాను అందజేశామని, వాటిలో 20 సీట్లను తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని రాందాస్ ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ ప్రవర్తించినట్లు ఇప్పుడు కాషాయ కూటమి ప్రవర్తిస్తుందని అనుకోవడంలేదని, ఆర్పీఐ అండ లేకుండా దళితుల ఓట్లను సాధించడం కూటమి వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీలో ఇప్పటికే నటి రాఖీ సావంత్ చేరగా, ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ త్వరలో చేరనున్నట్లు వివరించారు. కాగా, బీడ్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాందాస్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. -
గెలుపుపై గుబులు
సాక్షి ముంబై: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మంత్రుల్లో ఆందోళన ప్రారంభమయింది. అధికారంలో ఉన్న ప్రజాసామ్య కూటమికి ఫలితాలు అనుకూలంగా ఉండకపోవచ్చన్న భయం కాంగ్రెస్‌లో నెలకొందని తెలిసింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం తొలిసారిగా జరిగిన మంత్రి మండలి సమావేశాలతో ఈ విషయం బహిర్గత మయిందని చెప్పవచ్చు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తిచేసేందుకు ప్రయత్నించడంతోపాటు దీర్ఘకాలంగా జాప్యమవుతున్న అనేక ప్రాజెక్టులు, పథకాలపై వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని మంత్రిమండలి సమావేశంలో పలువురు కేబినెట్ సభ్యులు సూచించినట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికల అనంతరం రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికార పక్షం మంత్రి మండలిలో చర్చలు జరిపినట్టు సమాచారం. ఇలా రాబోయే ఫలితాలు తమకు అనుకూలంగా ఉండకపోవచ్చన్న భయం కేబినెట్ సమావేశంలో కన్పించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయమైనా తొందరగా తీసుకోవాలని దాదాపు అందరు మంత్రులూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను కోరారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా అనేక అంశాలపై ప్రతిపక్షాలు, ప్రజలకు సమాధానం చెప్పడానికి ఇబ్బందిపడాల్సి వచ్చిందని మరికొందరు మంత్రులు వాపోయారు. అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితి రాకుండా చూసేందుకు కూటమి ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. పెండింగ్‌లో ఉన్న పనులతోపాటు నిర్ణయాలూ త్వరగా తీసుకోవాలని మంత్రులందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి విషయాలపై మంత్రిమండలి సమావేశంలో చర్చోపచర్చలు నడిచినట్టు తెలుస్తోంది. ప్రాజెక్టుల అమలు, ఫైళ్ల ఆమోదంపై తొందరగా నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను కోరారు. మంత్రులు ఆర్.ఆర్.పాటిల్, ఛగన్ భుజ్‌బల్, జయంత్ పాటిల్, నసీంఖాన్, అనిల్ దేశ్‌ముఖ్ తదితరులు ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని సూచించినట్టు తెలిసింది. మరోవైపు ఓబీసీ విద్యార్థుల సమస్యను కూడా పరిష్కరించాలని, లేదంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం కన్పించే అవకాశాలున్నాయని పృథ్వీరాజ్ చవాన్ కొందరు హెచ్చరించారు. దీంతో ఇప్పటి నుంచే అసెంబ్లీ ఎన్నికలకు అందరూ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. -
ఎన్నికల మేనిఫెస్టో విడుదల
ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: ఠాణే లోక్‌సభ నియోజకవర్గం ప్రజాస్వామ్య కూటమి అభ్యర్థి డాక్టర్ సంజీవ్ నాయిక్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. నగర అభివృద్ధితోపాటు ప్రజల జీవన స్థితిగతుల మార్పు తదితర అంశాలను అందులో పొందుపరిచారు. ఈ సందర్భంగా ఎన్సీపీ నాయకుడు జితేంత్ర మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంజీవ్ తన హయాంలో అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారన్నారు. ఠాణేలో మోనో, మెట్రో సేవల ఆమోదం వెనుక ఆయన కృషి ఎంతో ఉందన్నారు. ఘోడ్‌బందర్ మార్గం పరిసరాల్లో రహదార్లతోపాటు నీటి వసతి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.350 కోట్ల నిధులు మంజూరు చేయించారన్నారు. నగరం అభివృద్ధి చెందాలంటే సంజీవ్‌ను మరోసారి ఎంపీగా ఎన్నుకోవాలని ఆయన ప్రజలను కోరారు. సంజీవ్ గెలుపు కోసం పార్టీలోని ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ఠాణేలోని డంపింగ్ గ్రౌండ్ సమస్యను పరిష్కరిస్తానంటూ సంజీవ్ తన మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు తెలి పారు. అనంతరం ఠాణే జిల్లా దళిత నాయకుడు సునీల్ ఖాంబే సంజీవ్ నాయిక్కు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నియోజకవర్గ పరిధిలోని ఠాణే, మీరా-భయిందర్, నవీముంబై పట్టణాలను సంజీవ్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. మీరా-భయిందర్ పట్టణానికి సూర్య జలాశయం నుంచి 200 ఎంఎల్డీల నీటిని అదనంగా సమకూర్చేందుకు కృషి చేస్తాననే విషయాన్ని సంజీవ్ తన మేనిఫెస్టోలో పొందుపరిచారన్నారు. ఈ కార్యక్రమంలో విధాన పరిషత్ ఉపసభాపతి వసంత్ డావ్కరే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుభాష్ కానడే, నిరంజన్ డావ్కరే, ఎన్సీపీ ప్రదేశ్ కార్యాధ్యక్షుడు జితేంద్ర అవాడ్ తదితరులు పాల్గొన్నారు. -
చివరి పోరు.. అమీతుమీ
ముంబై: చివరి విడత లోక్‌సభ ఎన్నికల కోసం రాజకీయపార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ప్రజాస్వామ్య కూటమి, మహాకూటములు ఈ సందర్భంగా ఎటువంటి అవకాశాన్నీ వదులుకోవడంలేదు. తమ అభ్యర్థులకు మద్దతుగా ఏర్పాటుచేస్తున్న ర్యాలీల్లో భారీగా జనాలు పాల్గొనేలా చూసుకుంటున్నారు. దీనికోసం కోట్లాది రూపాయల సొమ్మును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుపెట్టేందుకు సైతం ఆయా పార్టీలు వెనుకాడటంలేదు. విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు ముందడుగు వేస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 20వ తేదీన జరగనున్న కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ బహిరంగ సభ నిమిత్తం కేవలం గ్రౌండ్ కోసం ముంబై ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ (ఎంఆర్సీసీ) ఎమ్మెమ్మార్డీయేకు రూ.30 లక్షలు ఖర్చుపెట్టినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఎంఆర్సీసీ చీఫ్ జనార్ధన్ చందూర్కర్ మాట్లాడుతూ.. ‘ఇది చాలా భారీ ర్యాలీ కాబట్టి దాని కోసం భారీగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరముంది.. ఈ సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఇతర సీనియర్ నాయకులు హాజరుకానున్నారు.. అందువల్ల ఆ మాత్రం ఖర్చు తప్పదు..’ అని తెలిపారు. అలాగే ఈ ర్యాలీలో ప్రజాస్వామ్య కూటమి భాగస్వాములైన ఎన్సీపీ,ప్రొఫెసర్ జోగేంద్ర కవాడే నాయకత్వంలోని ప్రజా రిపబ్లికన్ పార్టీల ప్రతినిధులు కూడా పాలుపంచుకుంటున్నారని చందూర్కర్ తెలిపారు. ఈ భారీ ర్యాలీ కోసం నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే 5 వేలమందిని తరలించాలని పార్టీ శాఖ ఆదేశించిందన్నారు. ప్రస్తుతం ఇక్కడ పార్టీకి సుమారు 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారని, వారందరికీ పార్టీ టార్గెట్ నిర్ణయించిందని, సుమారు నాలుగు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా కాషాయ కూటమి కూడా ఖర్చు విషయంలో ఏమాత్రం తగ్గడంలేదనే తెలుస్తోంది. ప్రజాస్వామ్య కూటమి ర్యాలీకి దీటుగా ఈ నెల 21వ తేదీన కాషాయ కూటమి సైతం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించనుంది. దీనికి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తదితరులు హాజరుకానున్నారు. కాగా ఈ ర్యాలీ కోసం రూ.34 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది. కాగా, నగరంలో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉంది. 2009 ఎన్నికల్లో నగరంలోని 6 లోక్‌సభ స్థానాల్లో ఐదింటిని ఈ పార్టీ గెలుచుకుంది. మిగిలిన ఒక్క స్థానాన్ని ఎన్సీపీ ఎగరేసుకుపోయింది. 19 స్థానాల్లోనూ ఉద్దండుల ప్రచారం.. రాష్ట్రంలోని 19 లోక్‌సభ స్థానాల్లో చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకురాలు అంజలి దమానియా తమ పార్టీ ఉత్తర ముంబై అభ్యర్థి సతీష్ జైన్ కోసం తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. వచ్చే మూడు రోజులపాటు ఆమెతోపాటు పలువురు ఆప్ నాయకులు ముంబైలోని అన్ని నియోజకవర్గాలతోపాటు, కొంకణ్, ఉత్తర మహారాష్ర్ట ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో ముమ్మర ప్రచారాన్ని చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని ఆ పార్టీ ప్రతినిధులు శుక్రవారం తెలిపారు. కాంగ్రెస్ ప్రతినిధి సచిన్ సావంత్ మాట్లాడుతూ.. మొదటి దఫా ఎన్నికల్లో పార్టీ చీఫ్ సోనియాగాంధీ విదర్భలో ప్రచారం చేశారు. ఈ దఫా కాంగ్రెస్‌కు పట్టుగొమ్మలైన నందూర్బర్, ధులేల్లో జరిగే ర్యాలీల్లో ప్రచారం చేయనున్నారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా మొదటిసారి ముంబైలో జరుగనున్న పార్టీ ర్యాలీలో పాల్గొననున్నారు. కాషాయ కూటమి భాగస్వామి అయిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం సాయంత్రం కల్యాణ్(ఠాణే)లో భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా, చివరి విడతలో 338 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 43,343 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌కు ఏర్పాటుచేశారు. -
డీఎఫ్‌కు గడ్డుకాలమే!
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ప్రజాస్వామ్య కూటమి (డీఎఫ్) కూటమి ప్రతిష్ట రోజురోజుకు మసకబారుతోంది...ఇప్పటికే ఆదర్శ్ కుంభకోణం, జలవనరుల కుంభకోణం...తాజాగా పాల కుంభకోణం...ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా అందులో అధికార పార్టీల నేతల పేర్లు తెరమీదకు వస్తుండటంతో కాంగ్రెస్, ఎన్సీపీల ప్రతిష్ట దిగజారుతోంది. ఆయా కుంభకోణాలతో ప్రజల దృష్టిలో పలుచన అవుతున్న డీఎఫ్ కూటమికి ముందుంది మరింత గడ్డు కాలమేనని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు. ఇప్పటికే పదిహేనేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాషాయ కూటమి (శివసేన, బీజేపీ) అందివచ్చిన ప్రతి అంశాన్ని విడవడం లేదు. అధికార పార్టీ నేతలపై అవినీతి విషయంలో రాజీలేని పోరు చేస్తోంది. దీనికితోడు ఇటీవల బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ముంబైలో నిర్వహించిన సభ విజయవంతమవడంతో ఆ పార్టీ నేతలు మంచి ఊపుతో ముందుకెళుతున్నారు. ఆదర్శ్ కుంభకోణంలో మాజీ సీఎం అశోక్ చవాన్‌ను విచారించేందుకు సీబీఐకి అనుమతివ్వని గవర్నర్ కె.శంకర్ నారాయణన్ తీరును కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడుతున్నారు. ముంబైకి కరువైన భద్రత, రోజురోజుకు ఆకాశన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, బస్సు చార్జీలు, కరెంట్ చార్జీలు ఇలా ప్రతి అంశాన్ని రాబోయే ఎన్నికల్లో అస్త్రాలుగా వినియోగించేందుకు అన్ని విధాలా సిద్ధమవుతున్నారు. అయితే అవినీతి ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు ఎన్నికల్లో ఏ వ్యూహన్ని అమలుచేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీకి తిప్పలే... అవినీతి కుంభకోణాలు అధికార పార్టీ నేతలకు తలనొప్పిగా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రులు దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతోపాటు అశోక్ చవాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జల వనరుల కుంభకోణంలో ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తాజాగా పాల కుంభకోణంలో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే, రాష్ట్ర మంత్రి నారాయణ రాణేలపై కేసు నమోదవడం వారికి రాజకీయంగా ఇబ్బంది కలిగించే పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎంకు ఆదర్శ్ బురద... అయితే ఇటీవలే ఆదర్శ్ కేసులో అశోక్ చవాన్‌పై దర్యాప్తు చేసేందుకు సీబీఐ అనుమతి కోరగా, దాన్ని రాష్ట్ర గవర్నర్ కె.శంకర్ నారాయణన్ తిరస్కరించారు. దీంతో అశోక్ చవాన్‌కు క్లీన్ఝట్డఏ లభించినట్టేనని అందరూ భావించారు. ఈ విషయమై అనేక పత్రికల్లో కూడా అశోక్ చవాన్‌కు మంచిరోజులు వచ్చాయన్న వార్తలు వచ్చాయి. అయితే ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో దర్యాప్తు నివేదికను ఎట్టకేలకు శీతాకాల సమావేశాల్లో సర్కార్ ప్రవేశపెట్టింది. ప్రజాహితం కోసం ఈ నివేదికను తిరస్కరిస్తున్నామని సీఎం పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆదర్శ్ వివాదంలో ఇరుక్కుపోయిన తమ నాయకులను రక్షించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అయితే ఇప్పటివరకు ఎంతో క్లీన్ ఇమేజ్ ఉన్న సీఎం పృథ్వీరాజ్‌కు ఆదర్శ్ బురద అంటుకుంటోందని కొందరు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. నివేదికను, చర్చలను తోసిపుచ్చడంతోపాటు ప్రజల శ్రేయస్సు కోసమే ఇలా చేశానని పృథ్వీరాజ్ చెప్పడంపై ప్రజల్లో ఆయనకున్న గౌరవాన్ని పలుచన చేస్తుందని అంటున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఈ అంశం తీవ్ర ప్రభావం చూపే అవకాశాలను కాదనలేకపోతున్నారు. గవర్నర్ పునఃపరిశీలించాలి: వినోద్ తావ్డే ఆదర్శ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ను విచారించేందుకు సీబీఐకి అనుమతి ఇవ్వాలని విధాన మండలి ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ సీనియర్ నాయకుడు వినోద్ తావ్డే కోరారు. ఈ విషయమై గవర్నర్ కె. శంకర్ నారాయణ్‌కు ఓ లేఖ రాశారు. అశోక్ చవాన్‌కు వ్యతిరేకంగా విచారణ చేపట్టవద్దని తీసుకున్న నిర్ణయంపై మళ్లీ పరిశీలించాలని ఆ లేఖలో కోరారు. సీబీఐకి ఆయనను దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.