సాక్షి, ముంబై: సీట్ల సర్దుబాటుపై అటు అధికార ప్రజాస్వామ్య కూటమిలోనూ, ఇటు ప్రతిపక్ష మహా కూటమిలో స్పష్టత లేకపోవడంతో ఎన్నికల బరిలోదిగే అన్ని పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కొత్తగా బరిలో దిగే అభ్యర్థుల్లో ఈ గుబులు మరింత ఎక్కువైంది. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంత నిర్భయంగా ఉన్నప్పటికీ కొత్తగా పోటీచేసే వివిధ పార్టీ ల వందలాది అభ్యర్థులకు సవాలుగా మారింది.
ఇంత తక్కువ సమయంలో ఎన్నికల ప్రచారం ఎలా చేయాలి...? ఎలా గెలవడమని ఆందోళనలో పడిపోయారు. శనివారం నుంచి ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఈ నెల 27తో ముగుస్తుంది. ఆ తర్వాత నామినేషన్ల ఉపసంహరణకు రెండు, మూడు రోజు ల గడువు ఉంటుంది. అంటే ఒకటో తేదీ సాయంత్రం వరకు ఎంతమంది అభ్యర్థులు, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఒక స్పష్టత వస్తుంది.
ఆ తర్వాత ప్రచార కార్యక్రమాలు ప్రారంభించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికలకు 48 గంటల ముందే ప్రచా రం నిలిపివేయాలి. అంటే కేవలం 13 రోజులు మాత్రమే ప్రచారాలకు, సభలకు సమయం దొరుకుతుంది. ఇంత తక్కువ సమయంలో నియోజకవర్గంలోని సుమారు రెండున్నర నుంచి మూడు లక్షల జనం మధ్యకు ఎలా వెళ్లాలి.. ఎలా ప్రచారం చేయా లో తెలియక కొత్తగా ఎన్నికల బరిలో దిగుతున్నవారు అయోమయానికి గురవుతున్నారు. ఎంత ప్రచారం చేస్తే విజయానికి అంత దగ్గరవుతార నేది జగమెరిగిన సత్యం.
ఇదిలా ఉండగా, కూటముల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారంపై ఏమాత్రం ఆధారపడకుండా కొంద రు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. ఈసారి కూడా తమకు అభ్యర్థిత్వం దొరకడం ఖాయమనే ధీమాతో ఉన్నా రు. కాని కొత్తగా బరిలో దిగే అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీ టెకెటు దొరుకుతుందా..? లేదా...? తెలియని పరిస్థితి ఉంది. ఒకవేళ టికెటు ఇవ్వకుంటే ప్రత్యామ్నాయ మార్గం వెతు క్కోవడానికి తగిన సమయం కావాలి. ఇండిపెండెంట్‌గా పోటీచేయాలంటే తగిన మందిమార్బలాన్ని, ప్రచార సామాగ్రిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. లేదా చివరి క్షణంలో అభ్యర్థిగా ప్రకటిస్తే అప్పుడు పరిస్థితి ఏంటని కొత్త అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
కొత్తోళ్లకు క ష్టకాలమే..!
Published Sun, Sep 21 2014 11:06 PM | Last Updated on Sat, Sep 15 2018 8:28 PM
Advertisement