Times Now Survey: Narendra Modi Is Poised to Secure a Third Term as Prime Minister - Sakshi
Sakshi News home page

Times Now Survey On 2024 Elections: మళ్లీ ఎన్డీయేనే..

Published Thu, Aug 17 2023 2:26 AM | Last Updated on Sat, Aug 19 2023 4:08 PM

Times Now survey: Narendra Modi is poised to secure a third term as Prime Minister - Sakshi

న్యూఢిల్లీ:  దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే జాతీయ స్థాయిలో అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ప్రఖ్యాత ‘టైమ్స్‌ నౌ’సర్వే తేలి్చచెప్పింది. మొత్తం 543 స్థానాలకు గాను ఎన్డీయేకు 296 నుంచి 326, విపక్ష ఇండియా కూటమికి 160 నుంచి 190 స్థానాలు లభిస్తాయని వెల్లడించింది. ఎన్డీయేలోని ప్రధానపక్షమైన బీజేపీ సొంతంగానే 288 నుంచి 314 సీట్లు గెలుచుకుంటుందని స్పష్టం చేసింది.

ఇక విపక్ష ఇండియా కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్‌ 62 నుంచి 80 స్థానాలకే పరిమితం అవుతుందని పేర్కొంది. ఓట్ల శాతంపరంగా చూస్తే ఎన్డీయేకు 42.60శాతం, ఇండియాకు 40.20 శాతం ఓట్లు లభిస్తాయని సర్వే వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేస్తుందని తేలి్చంది. రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలకు గాను దాదాపు మొత్తం స్థానాలు కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. వైఎస్సార్‌సీపీకి 24 నుంచి 25 సీట్లు లభిస్తాయని తేలి్చచెప్పింది.

అంతేకాకుండా ఆ పార్టీ ఓట్ల శాతం కూడా పెరుగనున్నట్లు గుర్తించింది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ 49.8 శాతం ఓట్లతో 22 స్థానాల్లో నెగ్గింది. ఈసారి 51.3 శాతం ఓట్లతో మొత్తం స్థానాలను తన ఖాతాలు వేసుకుంటుందని టైమ్స్‌ నౌ సర్వే తేల్చడం విశేషం. అంటే కిందటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఆ పార్టీ ఓట్ల శాతం 1.50 శాతం పెరుగనున్నట్లు తేటతెల్లమవుతోంది. వైఎస్సార్‌సీపీ పట్ల నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణకు ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

మరోవైపు తెలంగాణలో అధికార భారత రాష్ట్ర సమితికి(బీఆర్‌ఎస్‌) 9 నుంచి 11 లోక్‌సభ స్థానాలు లభిస్తాయని సర్వే తెలియజేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 2 నుంచి 3, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమికి 3 నుంచి 4 స్థానాలు దక్కుతాయని పేర్కొంది. ఇతరులు ఒక సీటు గెలుచుకోనున్నట్లు అంచనావేసింది.  
 
ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికెన్ని సీట్లు  
కూటమి/పార్టీ సీట్లు  
వైఎస్సార్‌సీపీ  24–25
ఎన్డీయే  0–1
ఇండియా  0
 
ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల శాతం  
కూటమి/పార్టీ ఓట్ల శాతం  
వైఎస్సార్‌సీపీ 51.3
ఎన్డీయే 1.13
ఇండియా –  

 
తెలంగాణలో ఎవరికెన్ని సీట్లు  
కూటమి/పార్టీ సీట్లు 
బీఆర్‌ఎస్‌ 9–11
ఎన్డీయే 2–3
ఇండియా 3–4
ఇతరులు 1  

 
తెలంగాణలో ఓట్ల శాతం  
కూటమి/పార్టీ ఓట్ల శాతం  
బీఆర్‌ఎస్‌ 38.40
ఎన్డీయే 24.30
ఇండియా 29.90
ఇతరులు 7.40   

 జాతీయ స్థాయిలో ఏ కూటమికి ఎన్ని సీట్లు (మొత్తం సీట్లు 543)  
కూటమి    సీట్లు  
ఎన్డీయే    296–326 (ఓట్ల శాతం 42.60)
ఇండియా    160–190 (ఓట్ల శాతం 40.20)  

పార్టీ     సీట్లు  
బీజేపీ     288–314
కాంగ్రెస్‌    62–80  
వైఎస్సార్‌సీపీ    24–25
డీఎంకే     20–24  
టీఎంసీ     22–24
బీజేడీ     12–14
బీఆర్‌ఎస్‌     9–11
ఆమ్‌ ఆద్మీ పార్టీ     5–7  
ఇతరులు     70–80  

ఏ కూటమికి ఎన్ని సీట్లు
 కూటమి    సీట్లు    ఓట్ల శాతం
ఎన్డీయే    296–326    42.60
ఇండియా    160–190    40.20
మొత్తం సీట్లు     543    –

ఏ పారీ్టకి ఎన్ని సీట్లు
పార్టీ     సీట్లు  
బీజేపీ    288–314
కాంగ్రెస్‌    62–80  
వైఎస్సార్‌సీపీ    24–25
డీఎంకే    20–24  
టీఎంసీ    22–24
బీజేడీ    12–14
బీఆర్‌ఎస్‌    9–11
ఆప్‌    5–7  
ఇతరులు    70–80 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement