national level
-
ఏపీ స్ఫూర్తితో జాతీయ స్థాయిలో కిసాన్ స్టూడియో, కాల్ సెంటర్
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సమీకృత రైతు సమాచార కేంద్రం (ఐసీసీ కాల్ సెంటర్)’ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఏపీ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి లో కిసాన్ అవుట్‌బౌండ్ కాల్ సెంటర్‌తో పాటు కిసాన్ స్టూడియోలను అందుబాటులోకి తెచ్చింది. వీటిని కేంద్ర మంత్రి అర్జున్ ముండా బుధవారం జాతికి అంకితం చేశారు. ఇప్పటికే తెలంగాణ ఓ కాల్ సెంటర్ ఏర్పాటుచేయగా, రాజస్థాన్‌లోనూ ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గన్నవరం ఐసీసీ కాల్ సెంటర్, ఆర్బీకే చానల్‌ను జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పరిశీలించారు. వారిచ్చిన సూచనలతోనే కేంద్రం జాతీయ స్థాయిలో కాల్ సెంటర్, స్టూడియోలను కేంద్రం తీసు కొచ్చిందని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇదీ కేంద్ర కాల్ సెంటర్ ఈ కేంద్రం ద్వారా నిపుణులైన సిబ్బంది రైతుల సందేహాలను నివృత్తి చేస్తారు. సీనియర్ అధికారులు, మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు ఇందులో ఉంటారు. వ్యవసాయ, అనుబంధ రంగాల సమగ్ర సమాచారాన్ని క్రోడీకరిస్తూ రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఈ కాల్ సెంటర్‌ను తీర్చిదిద్దారు. ప్రధాన పంటలు సాగయ్యే ప్రాంతాల రైతులకు ఈ కాల్ సెంటర్ మార్గదర్శకంగా నిలుస్తుంది. రైతుల కు ఫోన్ చేసి పంటల స్థితిగతులు, అక్కడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారు. వాటి తీవ్రతను బట్టి అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఆ ప్రాంతాలకు పంపిస్తారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై రైతుల సూచనలు తీసుకుని అమలు చేస్తారు. కార్పొరేట్ స్థాయిలో గన్నవరం ఐసీసీ కాల్ సెంటర్ ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల్లో భాగంగా నాలుగేళ్ల క్రితం ఐసీసీ కాల్ సెంటర్, ఆర్బీకే ఛానల్‌ను ఏర్పాటు చేశారు. కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, 67 మంది సిబ్బందితో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ రైతులకు సాగులో, క్షేత్ర స్థాయిలో వారు ఎదుర్కొనే అన్ని సమస్యల పరిష్కారానికి చక్కని వేదికగా నిలిచింది. సమస్య తీవ్రతను బట్టి 24 గంటల్లో బృందాలను గ్రామాలకు పంపి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ రైతుల మన్నననలు చూరగొంది. ఛానల్ ద్వారా సీజన్లో పంటలవారీగా అభ్యుదయ రైతులు, శాస్త్రవేత్తలతో సలహాలు, సూచనలతో కూడిన వీడియోలతో పాటు ప్రత్యక్ష ప్రసారాలతో రైతులకు దగ్గరైంది. ఐసీసీ ద్వారా 8.26 లక్షల కాల్స్, 12,541 వాట్సప్ సందేహాలను నివృత్తి చేశారు. అలాగే ఆర్బీకే ఛానల్ ను 2.81 లక్షల మంది సబ్‌స్క్రైబ్ చేసుకోగా, 57.12 లక్షల మంది వీక్షించారు. వ్యవసాయ అను బంధ రంగాలకు చెందిన 1,698 వీడియోలను అప్లోడ్ చేసుకొన్నారు. ఐసీసీ సేవలను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖతో పాటు ఎన్నో రాష్ట్రాలు వాటి ప్రతినిధులను పంపి అధ్యయనం చేశాయి. బ్రిటిష్ హై కమిషనర్ గారేట్ వైన్ ఓనర్, యూఎన్వోకు చెందిన ఎఫ్ఏవో కంట్రీ హెడ్ చి చోరి, ఇథియోపియా దేశ వ్యవసాయ శాఖ మంత్రి మెలెస్ మెకోనెన్ ఐమెర్ వంటి ప్రముఖులు ఈ కేంద్రం పనితీరును ప్రశంసించారు. మన విధానాలు కేంద్రం అనుసరిస్తోంది సీఎం జగన్ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు విధానాలను కేంద్రం అనుసరిస్తోంది. పలు రాష్ట్రాలు కూడా వాటిని ప్రవేశపెడుతున్నాయి. గన్నవరంలోని ఐసీసీ కాల్ సెంటర్ నాలుగేళ్లుగా రైతుల సేవలో తనదైన ముద్ర వేసుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఏపీ స్ఫూర్తితో కేంద్రం కేసీసీను తీసుకురావడం నిజంగా గొప్ప విషయం. ఐసీసీ కాల్ సెంటర్‌ను మరింత పటిష్ట పరిచి సేవలను మరింత విస్తృతం చేస్తాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఓవరాల్ చాంపియన్ తెలంగాణ పోలీస్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు జాతీయస్థాయిలో సత్తా చాటారు. లక్నోలో నిర్వహించిన ఆల్ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో వివిధ పోటీల్లో కలిపి మొత్తం ఐదు బంగారు పతకాలు, ఏడు వెండి పతకాలు తెలంగాణ పోలీస్‌శాఖకు దక్కాయి. ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించి, ప్రతిష్టాత్మకమైన చార్మినార్ ట్రోఫీ దక్కించుకున్నారు.12 ఏళ్ల తర్వాత తెలంగాణ పోలీసులు ఈ ఘనత సాధించారు. శెభాష్ తెలంగాణ పోలీస్: ప్రతిభను చాటిన తెలంగాణ పోలీసులను అభినందిస్తూ ట్విట్టర్(ఎక్స్) వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ‘పతకాలు సాధించిన విజేతలు, డీజీపీ రవిగుప్తా, మొత్తం తెలంగాణ పోలీస్ విభాగానికి శుభాకాంక్షలు ’అని సీఎం అభినందించారు. బంగారు పతకాలు సాధించిన వారిలో జి.రామకృష్ణారెడ్డి, డి.విజయ్‌కుమార్, వి.కిరణ్‌కుమార్, పి.అనంతరెడ్డి, ఎం.దేవేందర్ప్రసాద్, వెండి పతకాలు సాధించినవారిలో పి.పవన్, ఎన్.వెంకటరమణ, ఎం.హరిప్రసాద్, కె.శ్రీనివాస్, షేక్‌ఖాదర్ షరీఫ్, సీహెచ్.సంతోష్, కె.సతీష్‌లు ఉన్నారని డీజీపీ రవిగుప్తా తెలిపారు. ఆయా విభాగాల వారీగా చూస్తే.. ► కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల సేకరణ విభాగంలో ఒక బంగారు, ఒక వెండి పతకం ► పోలీస్ ఫొటోగ్రఫీ విభాగంలో ఒక బంగారు, ఒక వెండి పతకం ► డాగ్ స్క్వాడ్ పోటీల్లో ఒక బంగారు, ఒక వెండి పతకం ► యాంటీ స్టాబేజ్ చెక్‌లో రెండు బంగారు, మూడు వెండి పతకాలు ► పోలీస్ వీడియోగ్రఫీలో ఒక వెండి పతకం దక్కాయి. ►జాతీయస్థాయిలో రెండోస్థానంలో నిలిచిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు ఒక వెండి, మూడు కాంస్య పతకాలు, మూడోస్థానంలో నిలిచిన ఐటీబీపీ సిబ్బందికి ఒక బంగారు, నాలుగు కాంస్య పతకాలు దక్కాయి. -
Indonesia election 2024: ఒకే రోజు... ఐదు ఎన్నికలు
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన ఇండోనేసియాలో పార్లమెంట్, స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దేశ జనాభా 27 కోట్లు కాగా, 20 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 17 ఏళ్లు నిండినవారంతా ఓటు వేయడానికి అర్హులే. ఈ నెల 14వ తేదీన జరిగే ఎన్నికల్లో విజయం కోసం ప్రధానంగా మూడు పారీ్టలు హోరీహోరీగా తలపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితోపాటు నేషనల్, ప్రావిన్షియల్, రీజినల్, రిజెన్సీ, సిటీ స్థాయిల్లో ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. మొత్తం ఐదు బ్యాలెట్ పేపర్లపై ఓటు వేయాల్సి ఉంటుంది. జాతీయ, స్థానిక ఎన్నికలు ఒకే రోజు జరగడం ఇండోనేసియా ప్రత్యేకత. అయితే, ఈ ఎన్నికల్లో ఓటు వేయడం తప్పనిసరి కాదు. అయినా ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. 2019లో జరిగిన ఎన్నికల్లో 81 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. దేశంలో 575 పార్లమెంట్ స్థానాలు ఉండగా, 18 జాతీయ పారీ్టలు ఎన్నికల బరిలో నిలిచాయి. వివిధ స్థాయిలో మొత్తం 20,616 పదవులకు 2,58,602 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధ్యక్షుడి పదవీ కాలం ఐదేళ్లు. అమెరికా అధ్యక్షుడి తరహాలో రెండుసార్లు మాత్రమే పదవిలో కొనసాగడానికి అర్హత ఉంటుంది. ప్రస్తుత అధ్యక్షుడు జొకో విడొడో(జొకోవి) వరుసగా రెండుసార్లు గెలిచారు. పదేళ్లపాటు పదవిలో కొనసాగారు. ఆయన రెండు టర్మ్‌లు పూర్తయ్యాయి. కాబట్టి పది సంవత్సరాల తర్వాత ఈసారి మార్పు తప్పనిసరి కాబోతోంది. మొత్తం జనాభాలో 90 శాతం మంది ముస్లింలే ఉన్న ఇండోనేíÙయాలో పోలీసులకు, సైనికులకు ఎన్నికల్లో ఓటు వేసే హక్కు లేదు. 40 కొత్త నగరాలు నిర్మిస్తాం అనీస్ బాస్వెదాన్ జకార్తా మాజీ గవర్నర్, విద్యావేత్తగా పేరుగాంచిన అనీస్ బాస్వెదాన్(54) స్వతంత్ర, ప్రతిపక్ష అభ్యరి్థగా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఆయన అమెరికాలో విద్యాభ్యాసం చేశారు. స్వదేశంలో తొలుత విద్యారంగంలోకి, తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విద్యాశాఖ మంత్రిగానూ వ్యవహరించారు. ఇక అనీస్ సహచరుడిగా ఉపాధ్యక్ష పదవికి నేషనల్ అవేకెనింగ్ పార్టీ నేత, పీపుల్స్ రిప్రిజెంటేటివ్ కౌన్సిల్ డిప్యూటీ స్పీకర్ ముహైమిన్ ఇస్కాందర్(57) బరిలో ఉన్నారు. వీరికి మరో రెండు పార్టీలు మద్దతిస్తున్నాయి. ఎన్నికల్లో తమను గెలిపిస్తే దేశవ్యాప్తంగా 40 కొత్త నగరాలు నిర్మిస్తామని అనీస్ బాస్వెదాన్, ఇస్కాందర్ హామీ ఇస్తున్నారు. యువత కోసం కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని చెబుతున్నారు. సుబియాంటోకు విజయావకాశాలు! ఇండోనేసియా ఎన్నికల్లో అధ్యక్ష పదవిపై ప్రధానంగా ముగ్గురు నేతలు కన్నేశారు. ఇండోనేషియా జాతీయవాద పార్టీ అయిన గెరిండ్రా పార్టీ నుంచి మాజీ సైనికాధికారి ప్ర»ొవో సుబియాంటో(72) పోటీలో ఉన్నారు. ఇదే పార్టీ నుంచి ఉపాధ్యక్ష పదవికి జొకో విడొడో తనయుడైన 36 ఏళ్ల గిబ్రాన్ రాకాబుమింగ్ రాకా బరిలో నిలిచారు. 2014, 2019 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి సుబియాంటో పోటీపడ్డారు. రెండుసార్లు ఓటమి పాలయ్యారు. మూడోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. జొకోవి ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేసిన సుబియాంటోపై పలు తీవ్ర అభియోగాలు ఉన్నాయి. 1990వ దశకంలో సైనికాధికారిగా పని చేస్తున్న సమయంలో 20 మందికిపైగా ప్రజాస్వామ్య ఉద్యమ కార్యకర్తలను కిడ్నాప్ చేయించినట్లు ప్రచారం జరిగింది. వారిలో 10 మందికిపైగా ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. సుబియాంటో ఈస్ట్ తిమోర్, పపువా న్యూ గినియా దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. 1998లో సైన్యం నుంచి తప్పుకున్నారు. 2020 వరకు తమ దేశంలో ప్రవేశించకుండా ఆయనపై అమెరికా నిషేధం విధించింది. గిబ్రాన్ రాకాబుమింగ్ కూడా వివాదాస్పదుడే. ప్రస్తుతం సురకర్తా సిటీ మేయర్‌గా పనిచేస్తున్నాడు. తమను గెలిపిస్తే దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని, ప్రజల జీవనాన్ని మెరుగుపరుస్తామని సుబియాంటో, గిబ్రాన్ హామీ ఇస్తున్నారు. గెరిండ్రా పారీ్టకి ఇతర చిన్నాచితక పారీ్టలు మద్దతిస్తున్నాయి. ఇప్పుడు అంచనాలను బట్టి చూస్తే ప్ర»ొవో సుబియాంటో తదుపరి అధ్యక్షుడయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అధ్యక్ష బరిలో విద్యావేత్త ప్రనొవో మెగావతి సుకర్నోపుత్రి సారథ్యంలోని ఇండోనేషియన్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ స్ట్రగుల్ నుంచి అధ్యక్ష పదవికి గాంజార్ ప్రనొవో(55), ఉపాధ్యక్ష పదవికి మహ్ఫుద్ ఎండీ(66) పోటీలో ఉన్నారు. ప్రనొవో గతంలో సెంట్రల్ జావా గవర్నర్‌గా సేవలందించారు. మహ్ఫుద్ ఎండీకి గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ స్ట్రగుల్‌తో మరో మూడు పార్టీలు జట్టుకట్టాయి. ఇద్దరు అభ్యర్థులపై ఎలాంటి అరోపణలు, వివాదాలు లేకపోవడం కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారు. సామాన్య ప్రజల సమస్యలు తమకు తెలుసని, అధికారం అప్పగిస్తే వారి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తామని ప్రనొబో, మహ్ఫుద్ విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రజలకు సామాజిక సాయం పంపిణీ చేస్తామని, ఉద్యోగుల వేతనాలు పెంచుతామని అంటున్నారు. కీలక ప్రచారాంశాలు? ► ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉన్నట్లుగానే ఇండోనేíÙయాలోనూ ఎన్నో సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. ఆర్థిక వృద్ధి 2022లో 5.3 శాతం కాగా, 2023లో అది 5.05 శాతానికి పడిపోయింది. ► దేశంలో ప్రజల జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. కుటుంబాలను పోషించుకోవడం కష్టతరంగా మారింది. ► నిరుద్యోగ సమస్య వేధిస్తోంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువైపోయాయి. ఉద్యోగులు, కారి్మకులకు వేతనాలు తగ్గిపోయాయి. మొత్తం ఓటర్లలో సగానికి పైగా ఓటర్లు 40 ఏళ్లలోపు యువతే ఉన్నారు. వారే నిర్ణయాత్మక శక్తిగా తీర్పు ఇవ్వబోతున్నారు. ► దేశంలో మానవ హక్కుల హననం, ప్రజాస్వామ్య వ్యవస్థ పతనమవుతుండడంపై యువత పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయన్న నమ్మకం తమకు లేదని చెబుతున్నారు. అక్రమాలకు తావు లేకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో ఏపీకి రెండోస్థానం
సాక్షి, అమరావతి: గ్రామీణ, పట్టణ ప్రజానీకానికి వైద్యసేవలను మరింత చేరువ చేయడం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తోంది. తాజాగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలోనూ దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లోనూ ప్రజలకు వైద్యసేవలు అందిస్తుండటం విశేషం. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఏడాది జూలై నాటికి 1,60,480 హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు పనిచేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 21,891, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 11,855 కేంద్రాలు పని చేస్తున్నాయని వివరించింది. ఏపీ తర్వాత వరుసగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశి్చమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో అత్యధిక హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు ఉన్నట్లు పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రజానీకానికి మరింత దగ్గరగా వైద్య సేవలందించడమే లక్ష్యంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సెంటర్లలో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలందించడంతోపాటు నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల స్క్రీనింగ్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేసి మందులు కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది. ఏపీలో ఇలా... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను అనుసంధానం చేసింది. వీటికి విలేజ్ హెల్త్ క్లినిక్స్, అర్బన్ హెల్త్ క్లినిక్స్గా పేరు పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో 2,500 జనాభాకు ఒకటి చొప్పున విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తోంది. విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌తోపాటు ఏఎన్ఎం, ఆశ వర్కర్లను అందుబాటులో ఉంచింది. ఈ క్లినిక్స్‌లో 14 రకాల పరీక్షలు చేయడంతోపాటు 105 రకాల మందులు అందించేలా ఏర్పాట్లు చేసింది. -
Mann ki Baat: పటేల్ జయంతి నాడు... మేరా యువ భారత్
న్యూఢిల్లీ: జాతి నిర్మాణ కార్యకలాపాల్లో యువత మరింత చురుగ్గా పాల్గొనేందుకు వీలుగా మేరా యువ భారత్ పేరుతో జాతీయ స్థాయి వేదికను అందుబాటులోకి తేనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సర్దార్ వల్లభ్ బాయి పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న దీన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆ సందర్భంగా మేరా యువ భారత్ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభిస్తామని చెప్పారు. MYBharat.Gov.in సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని యువతకు సూచించారు. దీన్ని యువ శక్తిని జాతి నిర్మాణానికి, ప్రగతికి వినియోగపరిచేందుకు తలపెట్టిన అద్భుత కార్యక్రమంగా మోదీ అభివర్ణించారు. ఆదివారం ఆయన మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతినుద్దేశించి మాట్లాడారు. అక్టోబర్ 31 దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కూడానని గుర్తు చేసుకున్నారు. ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. నవంబర్ 15న ఆదివాసీ నేత బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయనకు కూడా మోదీ నివాళులర్పించారు. విదేశీ పాలనను ఒప్పుకోని ధీర నాయకునిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారన్నారు. తిల్కా మహరాజ్, సిద్ధూ, కాన్హు, తాంతియా భీల్ వంటి వీర గిరిజన నాయకులు దేశ చరిత్రలో అడుగడుగునా కనిపిస్తారన్నారు. గిరిజన సమాజానికి దేశం ఎంతగానో రుణపడిందన్నారు. స్థానికతకు మరింతగా పెద్ద పీట వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గాంధీ జయంతి రోజున ఖాదీ వస్తువుల అమ్మకం రికార్డులు సృష్టించిందని గుర్తు చేశారు. ఢిల్లీలో అమృత్ వాటిక రెండున్నరేళ్లుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అక్టోబర్ 31న ఘనంగా ముగియనుందని మోదీ చెప్పారు. ‘‘దీనికి గుర్తుగా ఢిల్లీలో అమృత్ వాటిక నిర్మించనున్నాం. ఇందుకోసం అమృత్ కలశ్ యాత్రల పేరుతో దేశవ్యాప్తంగా మట్టిని సేకరించి పంపుతుండటం హర్షణీయం’’అన్నారు. వ్యర్థాల నుంచి సంపద అన్నది మన నూతన నినాదమని మోదీ అన్నారు. గుజరాత్ల అంబా జీ మందిర్‌లో వ్యర్థౠల నుంచి రూపొందించిన పలు కళాకృతులు అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయన్నారు. దీన్ని దేశవాసులంతా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. బెర్లిన్‌లో తాజాగా ముగిసిన ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్‌లో భారత్ 75 స్వర్ణాలతో పాటు ఏకంగా 200 పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. గిరిజన వీరుల ప్రస్తావన ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌లో గిరిజన వీరుల గురించి ప్రస్తావించారు. గిరిజన యుద్ధ వీరుల చరిత్రను ప్రశంసించారు. తెలంగాణలోని నిర్మల్, ఉట్నూరు, చెన్నూరు, అసిఫాబాద్ ప్రాంతాలను పరిపాలించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేంగా పోరాడి ఉరికొయ్యకు ప్రాణాలరి్పంచిన రాంజీ గోండు, ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్ప్రాంతానికి చెందిన వీర్ గుండాధుర్, మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రథమ స్వాతంత్య్ర సమర యోధుడు భీమా నాయక్‌ల వీర చరిత్రను కొనియాడారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన తిల్కా మాంఝీ, సమానత్వం కోసం పోరాడిన సిద్ధో–కన్హూ, స్వాతంత్య్ర యోధుడు తాంతియా భీల్‌లు ఈ గడ్డపై పుట్టినందుకు గరి్వస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గిరిజన ప్రజల్లో అల్లూరి సీతారామరాజు నింపిన స్ఫూర్తిని దేశం ఇప్పటికీ గుర్తుంచుకుందని పేర్కొన్నారు. గిరిజన సమాజానికి స్ఫూర్తినిచి్చన రాణి దుర్గావతి 500వ జయంతిని దేశం జరుపుకొంటోందని, గిరిజన సమాజానికి స్ఫూర్తినిచ్చిన వారి గురించి యువత తెలుసుకొని వారి నుంచి స్ఫూర్తి పొందాలని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
రాష్ట్ర వృద్ధుల్లో 31.6 శాతం మందికి ఆరోగ్య బీమా
సాక్షి, హైదరాబాద్: వృద్ధుల ఆరోగ్య బీమా పథకాల కవరేజీ తెలంగాణలో 31.6 శాతంగా ఉంది. ఈ విషయంలో మన రాష్ట్రం దేశంలో 11వ స్థానంలో ఉంది. జాతీయ సగటు 18.2 శాతం కంటే తెలంగాణ మెరుగ్గా ఉండటం గమనార్హం. మిజోరంలో దేశంలోనే అత్యధికంగా 66.5 శాతం మంది వృద్ధులకు ఆరోగ్య బీమా కవరేజీ ఉండగా అతితక్కువగా జమ్మూకశ్మీర్‌లో 0.2 శాతం మందికే ఉంది. ఈ మేరకు ఇండియా ఏజింగ్ రిపోర్ట్–2023 నివేదిక వెల్లడించింది. దీన్ని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ రూపొందించగా కేంద్ర సామాజిక, సాధికారత శాఖ తాజాగా విడుదల చేసింది. మిజోరం, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మేఘాలయా, అస్సాం, గోవా, రాజస్తాన్ ఆరోగ్య బీమా పథకాలకు ఎక్కువ కవరేజీని కలిగి ఉన్న రాష్ట్రాలు. ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో 68.4 శాతం వృద్ధులకు ఆరోగ్య బీమా సౌకర్యాలు అందడంలేదు. దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్ని రకాల ఆరోగ్య బీమాలు, ప్రైవేటు ఆరోగ్య బీమాలను కలిపి సర్వే చేశారు. దేశంలో 55 శాతం వృద్ధుల్లో ఆరోగ్య బీమాలపై అవగాహన లేదు. తెలంగాణలో రెండు అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక జబ్బులున్నవారు 30.7 శాతం మంది ఉన్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు... దేశ జనాభాలో 60 ఏళ్లు పైబడిన వారు 10 శాతం ఉండగా 2036 నాటికి వారి సంఖ్య 14.9 శాతానికి పెరుగుతుందని అంచనా. తెలంగాణలో 2021లో 11 శాతం వృద్ధులు ఉండగా 2036 నాటికి వారి సంఖ్య 17.1 శాతానికి పెరుగుతుంది. 60 ఏళ్లకు పైబడినవారిలో జీవన ఆయుర్ధా యం 2015–19 మధ్య రాష్ట్ర మహిళల్లో 18.3 శాతం, పురుషుల్లో 17.3 శాతం. 75 ఏళ్ల తర్వాత తెలంగాణలో సగటున అదనంగా 8.7 ఏళ్లు జీవిస్తున్నారు. తెలంగాణలో 60 ఏళ్లు పైబడినవారిలో పనిచేయలేని స్థితిలో ఉన్నవారు 14.6 శాతం మంది. ఇండియాలో 23.8 శాతం ఉన్నారు. 60 ఏళ్లు పైబడినవారిలో పేదరికంలో ఉన్నవారు తెలంగాణలో 15.8 శాతం, ఇండియా 21.7 శాతం ఉన్నారు. 60 ఏళ్లు పైబడినవారిలో ఎలాంటి ఆదాయం లేనివారు తెలంగాణలో 11 శాతం ఉన్నారు. ఇండియా 18.7 శాతం ఉన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లోనే వృద్ధులు ఎక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. అలాగే ఎక్కువ కాలం బతుకుతున్నారు. వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉండటం, అక్షరాస్యత ఎక్కువగా ఉండటం వల్ల ఇది సాధ్యమైంది. – డాక్టర్ కిరణ్ మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కనీ్వనర్, తెలంగాణ -
భూముల రీ సర్వేకు జాతీయస్థాయి ప్రశంస
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న భూ సమ స్యలన్నింటినీ పరిష్కరించే లక్ష్యంతో చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియకు జాతీయస్థాయిలో ప్ర శంసలు లభిస్తున్నాయని మంత్రులు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో వందేళ్ల తర్వాత జరుగుతున్న భూముల రీ సర్వేను అత్యంత శాస్త్రీయంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం జగనన్న భూహక్కు–భూరక్ష పథకంపై మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు మాట్లాడుతూ ఇటీవలే కేంద్ర కార్యదర్శి, అడిషనల్, జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులతోపాటు 5 రాష్ట్రాల నుంచి సర్వే విభాగానికి సంబంధించిన కమిషనర్లు రాష్ట్రంలో పర్యటించి, భూముల రీ సర్వే విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. మొదటి, రెండు దశల్లో మొత్తం 4 వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి, భూ హక్కు పత్రాలను పంపిణీ చేసినట్లు అధికారులు మంత్రుల కమిటీకి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,072 గ్రామాల్లో డ్రోన్ ఫ్లైయింగ్ ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. 9 వేల గ్రామాలకు డ్రోన్ ఇమేజ్‌లను పంపించినట్లు చెప్పారు. మూడో దశకు సంబంధించి ఇప్పటికే 360 గ్రామాల్లో సర్వే పూర్తయ్యిందన్నారు. అర్బన్ ప్రాంతాల్లోనూ సర్వే ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు. నాలుగు మున్సిపల్ ఏరియాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి, హక్కు పత్రాలను అందించాలనే లక్ష్యం మేరకు పనిచేయాలని మంత్రులు ఆదేశించారు. మూడో దశ సర్వేను వచ్చే ఏడాది జనవరి నెలాఖరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా అన్ని విభాగాల అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం, భూపరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, మైనింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖ కమిషనర్ సిద్దార్థ్ జైన్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సూర్యకుమారి పాల్గొన్నారు. -
వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ఉత్తమ పథకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద ప్రజలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా అత్యాధునిక కార్పొరేట్ వైద్యాన్ని అందించడమే కాకుండా, శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి ఆర్థిక తోడ్పాటునందించడానికి ప్రవేశ పెట్టిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంటోంది. డా. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ఉత్తమ పథకమని, దాని అమలు సాహసోపేతమైన చర్య అని ఏకంగా నేషనల్ హెల్త్ అథారిటీనే అభివర్ణించింది. ఈ పథకం శస్త్ర చికిత్స చేయించుకుని, విశ్రాంతి తీసుకునే సమయంలో పేదల జీవనోపాధికి పెద్ద భరోసా ఇస్తోందని తెలిపింది. ప్రజారోగ్య రంగంలో ఉత్తమ పద్ధతులు, ఆవిష్కరణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోందని నేషనల్ హెల్త్ అథారిటీ కితాబునిచ్చింది. వివిధ రాష్ట్రాల్లో ఆరోగ్య బీమాలో అనుసరిస్తున్న విధానాలను అథ్యయనం చేసిన అథారిటీ.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకంపై ప్రశంసలు కురిపించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం పేద కుటుంబాల్లోని వారు శస్త్ర చికిత్సలు చేయించుకున్న అనంతరం విశ్రాంతి సమయంలో గృహ ఖర్చులకు రక్షణ కవచంగా నిలుస్తోందని పేర్కొంది. ఇది చాలా పెద్ద కార్యక్రమమైనప్పటికీ, వైఎస్ జగన్ ప్రభుత్వం విజయవంతంగా కొనసాగిస్తోందని తెలిపింది. ‘శస్త్ర చికిత్స చేయించుకునే రోగులకు కోలుకోవడానికి కొన్ని రోజులు విశ్రాంతి అవసరం. ఆ సమయంలో రోగి జీవనోపాధిని కోల్పోయి, ఆర్థికంగా నష్టపోతారు. విశ్రాంతి సమయంలో రోజువారి వేతనాలు రాకపోవడంతో ఆ కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంటుంది. కుటుంబాల నిర్వహణ కష్టమవుతుంది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా వారి గృహ ఖర్చులకు రక్షణ కల్పింస్తోంది’ అని అథారిటీ తెలిపింది. శస్త్ర చికిత్స చేయించుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లోనే ఆ పేద కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా భత్యం జమ అవుతోందని పేర్కొంది. విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున గరిష్టంగా రూ. 5,000 వరకు పేద కుటుంబాల ఖాతాల్లో జమ చేస్తున్నారని, మరే ఇతర రాష్ల్రాల్లో ఇలాంటి పథకం లేదని అథారిటీ తెలిపింది. యూనివర్సల్ హెల్త్ కవరేజీలో ఏపీ ముందడుగు యూనివర్సల్ హెల్త్ కవరేజీని సాధించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేసిందని అథారిటీ తెలిపింది. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న పేద కుటుంబాలను రేషన్ కార్డుతో సంబంధం లేకుండా నవశకం కార్యక్రమం కింద గుర్తించి ఆ కుటుంబాలకు డా.వైఎస్సార్ ఆరోగ్య శ్రీ స్మార్ట్ హెల్త్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపింది. క్యూఆర్ కోడ్, యూనిక్ ఐడీ నెంబర్లతో కూడిన ఈ స్మార్ట్ హెల్త్ కార్డులతో లబ్ధిదారుల వైద్య రికార్డుల నిర్వహణ మెరుగుపడిందని పేర్కొంది. అంతే కాకుండా రోగి వివరాల గోప్యతకు, భద్రతకు ఈ కార్డులు రక్షణ కల్పింస్తున్నాయని చెప్పింది. కుటుంబ యజమాని, సభ్యులందరి వివరాలను, గ్రామ, వార్డు సచివాలయాల వివరాలను కూడా కార్డుల్లో పొందుపరిచారని పేర్కొంది. ఆరోగ్య శ్రీ స్మార్ట్ హెల్త్ కార్డులు చాలా నాణ్యతతో ఉన్నాయని, పదేళ్లకుపైగా మన్నిక ఉంటుందని తెలిపింది. -
అదరగొట్టిన కడప బాలికలు
కడప: మైదుకూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్–17 బాలుర, బాలికల వాలీబాల్ పోటీల్లో కడప, విజయనగరం జట్లు అదరగొట్టాయి. మైదుకూరు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన ఈ పోటీలు సోమవారం ఫైనల్ మ్యాచ్‌లతో ఘనంగా ముగిశాయి. స్థానిక మేథా డిఫెన్స్ అకాడమి మైదానంలో ఒకటో కోర్టులో సోమవారం బాలుర విభాగంలో విజయనగరం – పశ్చిమగోదావరి జిల్లాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా విజయనగరం విజేతగా నిలిచింది. రెండో కోర్టులో బాలికల విభాగంలో కడప– గుంటూరు జిల్లాల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కడప జట్టు ఘన విజయం సాధించింది. బాలుర విభాగంలో సెమీ ఫైనల్లో విజయనగరం జట్టు చేతిలో ఓడిపోయిన శ్రీకాకుళం, బాలికల విభాగంలో సెమీ ఫైనల్లో గుంటూరు జట్టుతో ఓడిపోయిన ప్రకాశం మూడో స్థానంలో సరిపెట్టుకున్నాయి. క్రీడా స్ఫూర్తితో పోటీలు జరగడం హర్షణీయం రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు మైదుకూరులో క్రీడా స్ఫూర్తితో జరగడం హర్షణీయమని ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తనయుడు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి తెలిపారు. వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు సమావేశంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలు మైదుకూరులో నిర్వహించడం నియోజకవర్గానికి ప్రతిష్టగా నిలిచిందన్నారు. టోర్నమెంట్ ప్రారంభ వేడుకల్లో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆయన తనయుడు నాగిరెడ్డి సోమవారం పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు నగదు బహుమతులను అందజేశారు. బాలికల, బాలుర విభాగంలో విజేతలుగా నిలిచిన కడప, విజయనగరం జట్లకు రూ.20 వేల చొప్పున, రెండో స్థానంలో నిలిచిన పశి్చమగోదావరి, గుంటూరు జట్లకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతులను ఆయా జట్ల కెపె్టన్, కోచ్ మేనేజర్లకు అందజేశారు. మూడో స్థానంలో నిలిచిన శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల జట్లకు రూ.5 వేల నగదును అందించారు. మైదుకూరు మున్సిపల్ వై.రంగస్వామి మాట్లాడుతూ పోటీల్లో గెలుపోటములు సహజమేనని అన్నారు. మైదుకూరులో వాలీబాల్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ చూపి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాలని సూచించారు. శెట్టిపల్లె నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్‌తోపాటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల కార్యనిర్వాహక కార్యదర్శులు అరుణకుమారి, వసంత, మేధా డిఫెన్స్ అకాడమి చైర్మన్ సి.నరసింహులు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర నాయకులు విజేతలుగా నిలిచిన జట్లలోని క్రీడాకారులకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ బహూకరించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాల సంఘం నాయకులు సాజిద్, రమేష్ యాదవ్, నిత్య ప్రభాకర్, ప్రవీణ్ కుమార్, కిరణ్, శ్రీకాంత్, రమేష్ బాబు, గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జట్లకు ఎంపిక శ్రీనగర్‌లో వచ్చే నెలలో జరిగే జాతీయ స్థాయి అండర్–17 బాలుర, బాలికల వాలీబాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్లను ఎంపిక చేశారు. అండర్–17 బాలుర, బాలికల వాలీబాల్ టోర్నమెంట్ ముగిసిన అనంతరం రాష్ట్ర బాలుర, బాలికల జట్లను ఎంపిక చేశారు. బాలికల జట్టు : జి.ప్రవల్లిక (విశాఖపట్నం), ఎం.విజయలక్ష్మి (విజయనగరం), వి.కుసుమప్రియ, పావని (కడప), సోని, ఎం.సుమశ్రీ(గుంటూరు), పి.జశి్వత(అనంతపురం), ఇ.షణ్ముఖ ప్రియ (చిత్తూరు), కె.ప్రీతి (తూర్పుగోదావరి), ఎస్.పూజిత (ప్రకాశం), సీహెచ్ శ్రీపద్మజ(కృష్ణ), స్టాండ్ బైగా డి.కీర్తన (గుంటూరు), ఎస్.మానస (అనంతపురం), ఎం.వెంకటలక్ష్మి (నెల్లూరు), ఎస్.ఉన్నత సత్యశ్రీ(కృష్ణ), డి.సమైక్య (ప్రకాశం). బాలుర జట్టు : ఎ.ప్రేమ్ కుమార్, ఎస్.తోషన్ రాము (శ్రీకాకుళం), టి.రాహుల్, ఎన్.మౌర్య (విశాఖపట్నం), బి.రంజిత్ (విజయనగరం), వి.రాజు (పశ్చిమ గోదావరి), టి.సు«దీర్ (అనంతపురం), కె.డేవిడ్ రాజు (గుంటూరు), పి.కిరణ్‌బాబు (ప్రకాశం), ఎన్.అజయ్‌కుమార్ (కడప), స్టాండ్‌బైగా ఎస్.భరత్ (కృష్ణ), వై.రోహిత్(కడప), ఎం.ఆర్యన్ (నెల్లూరు), బి.కార్తీక్(అనంతపురం), వై.రాంబాబు (తూర్పుగోదావరి), కె.రాము (పశ్చిమ గోదావరి). -
‘చెంచు’ చిచ్చరపిడుగు
పది లక్షల మందిలో ప్రథముడు ఊహ తెలియకముందే అమ్మ ప్రేమకు దూరమయ్యాడు.. నాలుగేళ్లకే మంటలంటుకొని కాళ్లు, చేతులు, శరీరం కాలిపోయింది.. 60 శాతం గాయాలతో ఆస్పత్రికి తీసుకెళితే..బతకడమే కష్టమని డాక్టర్లు అన్నారు.. ఆరేళ్ల ప్రాయంలోనే 3 మేజర్ సర్జరీలు జరిగాయి. ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌లోకి రాలేదు... ఈ పరిచయమంతా ఓ నల్లమల కుర్రాడి గురించి... లోకం పోకడనే తెలియని.. ఇప్పటికీ నాగరికతకు దూరంగా ఉండే చెంచుల నుంచి ఓ చిచ్చర పిడుగు జాతీయస్థాయిలో ప్రతిభ చాటాడు. పదిలక్షల మంది విద్యార్థులు పోటీ పడగా, అందరికంటే ముందువరుసలో నిలిచాడు.. అతడే ’మిలియనీర్ ’దినేశ్. సాక్షి, ప్రత్యేకప్రతినిధి/నాగర్‌కర్నూల్ : వ్యక్తిగత పరిశుభ్రతపై దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలో నల్లమలకు చెందిన విద్యార్థి ప్రతిభ చాటాడు. అపోలో హాస్పిటల్, డెటాల్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన టోటల్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రతపై పరీక్ష జరగ్గా, ఇందులో నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూర్ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న దినేష్ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచాడు. దినేష్ బతకడమే కష్టమన్నారు... నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూరుకు చెందిన దినేష్ తండ్రి కరమ్‌చంద్ కొన్నాళ్లు కాంట్రాక్ట్ టీచర్‌గా పనిచేశాడు. ఈయన భార్య మహేశ్వరి దినేష్‌కు ఊహ తెలియకముందే కన్నుమూసింది. తల్లి ప్రేమకు దూరమై పెరిగిన దినేష్ నాలుగేళ్ల వయసులో ఇంట్లో స్టవ్ దగ్గర ఆడుకుంటుండగా ప్రమాదం జరిగింది. ముఖం, కాళ్లు, చేతులు 60 శాతం కాలిపోయాయి. చికిత్స చేసే ముందే డాక్టర్లు దినేష్ బతకడమే కష్టమన్నారు. ఐదేళ్లకు ఒక ఆపరేషన్, ఆరేళ్ల వయసులో దినేష్‌కు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయి. తర్వాత కొంతవరకు శరీరం సాధారణ స్థితికి వచ్చింది. ఇప్పటికీ ముఖం, చేతులు మామూలు స్థితికి చేరుకోలేదు. కాళ్లు పూర్తి స్థాయిలో పనిచేయడానికి మరో శస్త్రచికిత్స చేయాలని డాక్డర్లు చెప్పారు. ఐదో తరగతి నుంచి ‘ట్రైబల్ వేల్ఫేర్’లోకి మన్ననూర్ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో దినేష్ ఐదోతరగతిలో చేరాడు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. క్లాస్‌లో తనే టాపర్. ఆంగ్లంపై ఉన్న మక్కువ, పట్టు గుర్తించిన టీచర్లు ఉదయ్‌కుమార్, ఆంజనేయులు దినేష్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అతడి పరిజ్ఞానాన్ని పెంచుతున్నారు. ఫలితంగా ట్రైబల్ సొసైటీ సారథ్యంలో జరిగిన పలు డిబేట్లు, ఇగ్నైట్ ఫెస్ల్లో అనేక బహుమతులు పొందాడు. 2500 పాఠశాలలు...పదిలక్షల మంది విద్యార్థులు డెటాల్ సంస్థ అపోలో ఫౌండేషన్‌తో కలిసి బాలబాలికల్లో స్వీయ, పరిసరాల పరిశుభ్రతతో పాటు కాలుష్య నియంత్రణపై అవగాహనకు ప్రతి ఏటా హైజిన్ ఒలింపియాడ్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 4–15 తేదీల మధ్య దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరిగింది. ఒకటి నుంచి పదోతరగతి వరకు ప్రతి రెండు తరగతులను ఒక కేటగిరిగా చేసి మొత్తంగా ఐదు కేటగరిలో పరీక్ష నిర్వహిస్తారు. 9–10 తరగతుల కేటగిరిలో దేశ వ్యాప్తంగా 2500 పాఠశాలల నుంచి పది లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. 50 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష జరిగింది. దినేష్ పూర్తి మార్కులతో పాటు చేతిరాత, పరీక్ష రాసిన విధానం ఆధారంగా అదనపు మార్కులతో కలిపి 51 మార్కులు సాధించాడు. దీంతో జాతీయస్థాయిలో దినేష్‌కు ప్రథమస్థానం వచ్చినట్లు డెటాల్ సంస్థ ప్రకటించింది. అక్టోబర్ 2న ముంబైలో జరిగే కార్యక్రమంలో దినేష్ రూ. లక్ష నగదుతోపాటు పురస్కారం అందుకోనున్నాడు. శుక్రవారం కలెక్టరేట్లో విద్యార్థి దినేష్‌ను నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఉదయ్‌కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మన్ననూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి, ఉపాధ్యాయులు ఆంజనేయులు, చంద్రశేఖర్, గణేష్, విద్యార్థి తండ్రి కరంచంద్ పాల్గొన్నారు. నిక్ వుజిసిక్ నాకు స్ఫూర్తి తన అంగవైకల్యాన్ని అధిగమించి ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్‌గా మారిన నిక్ వుజిసిక్ నాలో స్ఫూర్తి నింపారు. అవకాశాలు అనేవి అందరికీ సమానమే. వాటిని అందిపుచ్చుకోవడమే మనవంతు అని నేర్చుకున్నా. అదే స్ఫూర్తితో ముందుకు వెళుతున్నా. చదువుతోపాటు క్రికెట్ నా హాబీ. బెస్ట్ కీపర్‌గా నా మార్కు చూపిస్తున్నా. సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించాలని అనుకుంటున్నా. – దినేష్ -
దేశంలోనే నంబర్–1 బ్యాంక్ ఆప్కాబ్
సాక్షి, అమరావతి: సహకార బ్యాంకుల్లో ఏపీ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) సత్తా చాటుకుంది. సహకార రంగంలో దేశంలోనే నంబర్–1 బ్యాంకుగా ఎంపికైంది. 2020–21, 2021–22 సంవత్సరాలకు జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి అవార్డులు దక్కించుకుంది. కాగా.. 2020–21 సంవత్సరానికి కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (కేడీసీసీబీ), 2021–22 సంవత్సరానికి వైఎస్సార్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (వైడీసీసీబీ) మొదటి స్థానంలో నిలిచి అవార్డులు పొందాయి. ఏటా జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన రాష్ట్ర అపెక్స్ బ్యాంకులతో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య (నాఫ్స్కాబ్) అవార్డులను ప్రదానం చేస్తోంది. 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాలలో అత్యుత్తమ పురోగతి సాధించిన బ్యాంకులకు అవార్డులు ప్రకటించింది. ఆప్కాబ్ 2020–21లో రూ.30,587.62 కోట్లు, 2021–22లో రూ.36,732.43 కోట్ల టర్నోవర్‌తో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. రెండేళ్లపాటు వరుసగా రూ.238.70 కోట్లు, రూ.246.81 కోట్ల లాభాలను ఆప్కాబ్ ఆర్జించింది. -
ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రం నుంచి ఇద్దరు
తాంసి/దండేపల్లి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో ప్రదా నం చేసే ఉత్తమ ఉపాధ్యాయ పుర స్కారానికి ఈసారి రాష్ట్రం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 50 మందిని ఎంపిక చేయగా తెలంగాణ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపిక కాగా, ఆ ఇద్దరూ ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాకు చెందినవారే. ఆది లాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం బెదోడ్కర్ సంతోష్‌కుమార్, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం నుగూరి అర్చన.. సెప్టెంబర్ 5వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోనున్నారు. పాఠశాల పేరు మీద యూట్యూబ్ చానల్లో పాఠాలు 20 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సంతోష్‌కుమార్ కరోనా ఉధృతి సమయంలో పాఠశాల విద్యార్థులు చదువుకు దూరం కాకుండా గూగుల్ యాప్ ద్వారా ఆన్లైన్లో పాఠా లను బోధించారు. పాఠశాల పేరు మీద ప్రత్యేక యూ ట్యూబ్ చానల్లో సైతం నిత్యం రోజు వారీ పాఠాలను అప్ లోడ్ చేయడం వంటివి చేపట్టారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా 100 వరకు ఉన్న విద్యార్థులను ప్రస్తుతం 220 వరకు చేర్చారు. సొంత డబ్బులతో స్కూల్‌ను తీర్చిదిద్ది.. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నుగూరి అర్చన తీర్చిదిద్దారు. దాతలు, స్వచ్చంద సంస్థల సహకారంతోపాటు ఆమె సొంత ఖర్చులతో నాణ్యమైన విద్యాభోధన చేస్తూ, రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల అంటేనే అందరు మెచ్చుకునేలా తీర్చిదిద్దారు. అర్చన సేవలకు ఇప్పటికే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో గుర్తింపు పొందగా, ఈసారి ఏకంగా జాతీయ పురస్కారం దక్కింది. -
జాతీయస్థాయిలో సత్తాచాటిన సాక్షి ఫొటోగ్రాఫర్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/ నాగాయలంక/తిరుపతి కల్చరల్: అంత ర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్ అసోసి యేషన్ (ఏపీపీజేఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి ఫొటో కాంపిటీషన్ ఫలితాలను జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు విడుదల చేశారు. గురువారం విజయవాడలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏపీపీజేఏ అధ్యక్షుడు సీహెచ్‌వీఎస్ విజయ భాస్కర రావు, ప్రధాన కార్యదర్శి వి.రూబెన్ బెసాలి యల్‌తో కలిసి కలెక్టర్ ఫలితాలను విడుదల చేశారు. పోటీల్లో జనరల్ కేటగిరీలో ఎండీ నవాజ్ (సాక్షి, వైజాగ్) ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. ఫొటో జర్నలిజం కేటగిరీలో సాక్షి ఫొటోగ్రాఫర్లు పి.లీలా మోహన్‌రావు (వైజాగ్), వి. శ్రీనివాసులు (కర్నూలు), కందుల చక్రపాణి (విజయవాడ), పి.మను విశాల్ (విజయవాడ), కె.శివకుమార్ (యాదాద్రి), కె.జయ శంకర్ (శ్రీకాకుళం), కేతారి మోహన్‌కృష్ణ (తిరుపతి), ఎస్.లక్ష్మీ పవన్ (విజయవాడ) కన్సొలేషన్ బహుమ తులు గెలుచుకున్నారు. జనరల్ కేటగిరీలో సాక్షి ఫొటోగ్రాఫర్ ఎస్ లక్ష్మీపవన్ (విజయ వాడ) కన్సొలేషన్ బహుమతి గెలుచుకు న్నాడు. ఈ సందర్భంగా ఏపీపీజేఏ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన పత్రికా ఫొటోగ్రాఫర్ల నుంచి 700 ఎంట్రీలు వచ్చాయన్నారు. విజేతలకు ఈనెల 19న విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వ హించే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. జాతీయ ఫొటో పోటీల్లో కృష్ణప్రసాద్‌కు మెరిట్ అవార్డు వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా నిర్వ హించిన నేషనల్ ఫొటో కాంటె స్ట్–2023లో కృష్ణాజిల్లా నాగాయ లంకకు చెందిన ఫొటోగ్రాఫర్ సింహాద్రి కృష్ణప్రసాద్ పంపిన ఛాయా చిత్రానికి సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డు దక్కింది. ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా (పీఏఐ), ఇండియా ఇంటర్నే షనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్ (ఐఐపీసీ) ఆధ్వర్యంలో జాతీయస్థా యిలో నిర్వహించిన ఫొటో పోటీల్లో స్పెషల్ థీమ్ మ్యాని ఫెస్టేషన్స్ ఆఫ్ నేచర్‌లో అండర్ స్టాండింగ్ ది క్లౌడ్స్ విభాగంలో ఆయన పంపిన ‘క్లౌడ్స్ అంబరిల్లా టూ గాడ్’ ఛాయచిత్రం ప్రథమ సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డు దక్కించుకుంది. -
Times Now Survey On 2024 Elections: మళ్లీ ఎన్డీయేనే..
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే జాతీయ స్థాయిలో అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ప్రఖ్యాత ‘టైమ్స్ నౌ’సర్వే తేలి్చచెప్పింది. మొత్తం 543 స్థానాలకు గాను ఎన్డీయేకు 296 నుంచి 326, విపక్ష ఇండియా కూటమికి 160 నుంచి 190 స్థానాలు లభిస్తాయని వెల్లడించింది. ఎన్డీయేలోని ప్రధానపక్షమైన బీజేపీ సొంతంగానే 288 నుంచి 314 సీట్లు గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. ఇక విపక్ష ఇండియా కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ 62 నుంచి 80 స్థానాలకే పరిమితం అవుతుందని పేర్కొంది. ఓట్ల శాతంపరంగా చూస్తే ఎన్డీయేకు 42.60శాతం, ఇండియాకు 40.20 శాతం ఓట్లు లభిస్తాయని సర్వే వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేస్తుందని తేలి్చంది. రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలకు గాను దాదాపు మొత్తం స్థానాలు కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. వైఎస్సార్సీపీకి 24 నుంచి 25 సీట్లు లభిస్తాయని తేలి్చచెప్పింది. అంతేకాకుండా ఆ పార్టీ ఓట్ల శాతం కూడా పెరుగనున్నట్లు గుర్తించింది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ 49.8 శాతం ఓట్లతో 22 స్థానాల్లో నెగ్గింది. ఈసారి 51.3 శాతం ఓట్లతో మొత్తం స్థానాలను తన ఖాతాలు వేసుకుంటుందని టైమ్స్ నౌ సర్వే తేల్చడం విశేషం. అంటే కిందటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఆ పార్టీ ఓట్ల శాతం 1.50 శాతం పెరుగనున్నట్లు తేటతెల్లమవుతోంది. వైఎస్సార్సీపీ పట్ల నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణకు ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో అధికార భారత రాష్ట్ర సమితికి(బీఆర్ఎస్) 9 నుంచి 11 లోక్‌సభ స్థానాలు లభిస్తాయని సర్వే తెలియజేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 2 నుంచి 3, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 3 నుంచి 4 స్థానాలు దక్కుతాయని పేర్కొంది. ఇతరులు ఒక సీటు గెలుచుకోనున్నట్లు అంచనావేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికెన్ని సీట్లు కూటమి/పార్టీ సీట్లు వైఎస్సార్సీపీ 24–25 ఎన్డీయే 0–1 ఇండియా 0 ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల శాతం కూటమి/పార్టీ ఓట్ల శాతం వైఎస్సార్సీపీ 51.3 ఎన్డీయే 1.13 ఇండియా – తెలంగాణలో ఎవరికెన్ని సీట్లు కూటమి/పార్టీ సీట్లు బీఆర్ఎస్ 9–11 ఎన్డీయే 2–3 ఇండియా 3–4 ఇతరులు 1 తెలంగాణలో ఓట్ల శాతం కూటమి/పార్టీ ఓట్ల శాతం బీఆర్ఎస్ 38.40 ఎన్డీయే 24.30 ఇండియా 29.90 ఇతరులు 7.40 జాతీయ స్థాయిలో ఏ కూటమికి ఎన్ని సీట్లు (మొత్తం సీట్లు 543) కూటమి సీట్లు ఎన్డీయే 296–326 (ఓట్ల శాతం 42.60) ఇండియా 160–190 (ఓట్ల శాతం 40.20) పార్టీ సీట్లు బీజేపీ 288–314 కాంగ్రెస్ 62–80 వైఎస్సార్సీపీ 24–25 డీఎంకే 20–24 టీఎంసీ 22–24 బీజేడీ 12–14 బీఆర్ఎస్ 9–11 ఆమ్ ఆద్మీ పార్టీ 5–7 ఇతరులు 70–80 ఏ కూటమికి ఎన్ని సీట్లు కూటమి సీట్లు ఓట్ల శాతం ఎన్డీయే 296–326 42.60 ఇండియా 160–190 40.20 మొత్తం సీట్లు 543 – ఏ పారీ్టకి ఎన్ని సీట్లు పార్టీ సీట్లు బీజేపీ 288–314 కాంగ్రెస్ 62–80 వైఎస్సార్సీపీ 24–25 డీఎంకే 20–24 టీఎంసీ 22–24 బీజేడీ 12–14 బీఆర్ఎస్ 9–11 ఆప్ 5–7 ఇతరులు 70–80 -
తెలుగు వర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలి
నాంపల్లి (హైదరాబాద్): దేశంలో సంస్కృత, హిందీ, పాశ్చాత్య భాషలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పడినట్లుగా తెలుగు భాషకు కూడా జాతీయ స్థాయిలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పడితే తప్ప తెలుగు భాషా, సంస్కృతిని విస్తృత స్థాయిలో భవిష్యత్ తరాలకు అందించలేమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. శనివారం తెలుగు వర్సిటీ ఎన్టీఆర్ కళా మందిరంలో ఏర్పాటు చేసిన మండలి వెంకటకృష్ణారావు సంస్కృతీ పురస్కార ప్రదానోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగు వర్సిటీ ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. నగర శివార్లలోని బాచుపల్లిలో వందెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కాబోతున్న తెలుగు విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తెలుగు భాషపై మక్కువ కలిగిన, భాషకు ఎనలేని కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు మాట్లాడుతూ... రాష్ట్ర తర తెలుగు సంస్థలకు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాషా సంస్కృతి ఔన్నత్యాన్ని పెంచే సాహిత్యాన్ని అందజేయడమే కాకుండా ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకుని తెలుగు భాష, బోధన, పరివ్యాప్తికి కృషి చేస్తున్నదని అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ... శాస్త్రీయ విజ్ఞానం మాతృ భాషలో విద్యార్థులకు అందుబాటులో ఉంచితే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఆత్మియ అతిథిగా హాజరైన మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ... ఉభయ తెలుగు రాష్ట్రాలలోని తెలుగు వారికన్నా ప్రవాసాంధ్రులకే తెలుగు భాషపై మక్కువ ఎక్కువని అన్నారు. జర్మనీ మాజీ ఎంపీ డాక్టర్ జి.రవీంద్ర కార్యక్రమంలో పాల్గొని తెలుగులో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. అంతర్జాతీయంగా తెలుగు భాషా సంస్కృతి, ఆధ్యాత్మిక వికాసానికి చిరస్మరణీయమైన సేవలందిస్తున్న లండన్‌లోని యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్తా) సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సత్య ప్రసాద్ కిల్లీకి మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మండలి వెంకటకృష్ణారావు తెలుగు కేంద్రం సంచాలకులు ఆచార్య వై.రెడ్డి శ్యామల సమన్వయకర్తగా వ్యవహరించగా, సంస్థ కో ఆర్డినేటర్ డాక్టర్ విజయ్‌పాల్ పాత్లోత్ వందన సమర్పణ చేశారు. -
నీతి ఆయోగ్ టాప్ లిస్ట్‌లో వైఎస్సార్ జిల్లా
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్ జిల్లాకు నీతి ఆయోగ్ ప్రశంసలు దక్కాయి. ప్రతీ ఏటా విడుదల చేసే ర్యాంకింగ్స్‌లో.. ఆకాంక్షాత్మక జిల్లాల AspirationalDistricts మెరుగైన ఫలితాలు సాధించిన జాబితా టాప్-5లో మూడో స్థానంలో నిలిచింది వైఎస్సార్. తద్వారా అభినందనలు అందుకుంటోంది. అభివృద్ధి చెందుతున్న జిల్లాలు, అభివృద్ధి చెందుతున్న దేశానికి పట్టుకొమ్మలంటూ నీతి ఆయోగ్ మొదటి నుంచి ప్రకటించుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఈ జాబితాలో వైఎస్సార్ జిల్లా మూడో స్థానం నిలవడం విశేషం. Prospering Districts, Prospering Country! 🇮🇳 Here are the top 5⃣ most improved #AspirationalDistricts as per #NITIAayog's Delta Ranking for May 2023. Congratulations to our #ChampionsOfChange!👏 pic.twitter.com/QZJLzR44P6 — NITI Aayog (@NITIAayog) July 17, 2023 ఇక.. నీతి ఆయోగ్ ఏటా ప్రకటించే ఎగుమతుల సన్నద్ధత సూచీ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మరోసారి తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ సోమవారం విడుదల చేసిన 2022కు సంబంధించిన ర్యాంకుల్లో 59.27 పాయింట్లతో ఏపీ ఎనిమిదో స్థానంలో నిలిచింది. గతేడాది తొమ్మిదో స్థానంలో ఉన్న మన రాష్ట్రం మరోస్థానం ఎగబాకింది. ఇదీ చదవండి: ఎగుమతుల్లో ఎగసిన ఏపీ -
సైబర్ సెక్యూరిటీకి సమిష్టి కృషి అవసరం
న్యూఢిల్లీ: సైబర్ దాడుల ముప్పులను దీటుగా ఎదుర్కొనేందుకు సైబర్‌సెక్యూరిటీ విషయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. జీ20 సభ్య దేశాలన్నీ కలిసికట్టుగా.. సవాళ్లను అధ్యయనం చేసి, పరిష్కార సాధనాలను కనుగొనడంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. యూపీఐ, ఓఎన్డీసీ, కోవిన్ వంటి భారీ స్థాయి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఊతంతో టెక్నాలజీ ప్రయోజనాలను సామాన్యులకు కూడా భారత్ అందజేయగలుగుతోందని ఆయన పేర్కొన్నారు. ‘సైబర్‌సెక్యూరిటీ అనేది అందరికీ ఉమ్మడి సవాలే. అది చాలా సంక్లిష్టమైనది దానికి సరిహద్దులేమీ లేవు. టెక్నాలజీ నిత్యం రూపాంతరం చెందుతోంది. ఇవాళ ఒక సమస్యకు పరిష్కారం కనుగొంటే.. రేపు మరో కొత్త సమస్య పుట్టుకొస్తోంది. కృత్రిమ మేథ (ఏఐ)తో సంక్లిష్టత మరిన్ని రెట్లు పెరుగుతుంది‘ అని మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో అందరి ప్రయోజనాల కోసం కొత్త పరిష్కార సాధనాలను రూపొందించడం, పరస్పరం పంచుకోవడం అవసరమని ఆయన చెప్పారు. తాము అభివృద్ధి చేసిన కొన్ని సైబర్‌సెక్యూరిటీ సాధనాలను, వాటిపై ఆసక్తి గల దేశాలతో పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని వైష్ణవ్ తెలిపారు. -
జాతీయస్థాయిలో ఏపీ ప్రభుత్వ విద్యా వ్యవస్థకు అగ్రస్థానం
ఢిల్లీ: జాతీయ స్థాయిలో ఏపీ ప్రభుత్వ విద్యా వ్యవస్థకు అగ్రస్థానం దక్కింది. 2021-22 రాష్ట్రాల విద్యా వ్యవస్థ పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్‌ను కేంద్రం విడుదల చేయగా, అందులో ఏపీకి ప్రథమ స్థానం లభించింది. 73 అంశాలకు 1000 పాయింట్ల ఆధారంగా కేంద్రం గ్రేడింగ్ ఇవ్వగా, 902 పాయింట్లతో ఏపీ అగ్రస్థానం దక్కించుకుంది. లెర్నింగ్ అవుట్‌కమ్‌లు (LO), యాక్సెస్ (A), ఇన్ఫ్రాస్ట్రక్చర్ & ఫెసిలిటీస్ (IF), ఈక్విటీ (E), గవర్నెన్స్ ప్రాసెస్ (GP) & టీచర్స్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (TE&T) అనే ఆరు అంశాల ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చారు. చదవండి: నెట్టింట అభిమానం: జగనన్న పాలనలో.. మహానేత కలగన్న గ్రామస్వరాజ్యం -
లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం!
న్యూఢిల్లీ: రాహుల్‌గాంధీపై అనర్హత వేటు పై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ అంశంపై బహుముఖ దాడితో అధికార బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా ముందుగా ‘ఏకపక్షంగా వ్యవహరించి రాహుల్‌పై వేటు వేశా’రంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని యోచిస్తోంది. కాంగ్రెస్ ఎంపీలంతా మంగళవారం ఉదయమే సమావేశమై దీనిపై మల్లగుల్లాలు పడ్డారు. కోర్టు శిక్ష విధించిన గంటల వ్యవధిలోనే ఆగమేఘాలపై రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన వైనాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా హైలైట్ చేయొచ్చన్న భావన వ్యక్తమైంది. అనంతరం దీనిపై విపక్షాలతో కూడా విస్తృతంగా చర్చోపచర్చలు జరిపినట్టు సమాచారం. అన్నీ కుదిరితే వచ్చే సోమవారం అవిశ్వాసం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే కొన్ని విపక్షాలు ఇందుకు అభ్యంతరం చెబుతున్నట్టు సమాచారం. ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటున్న విపక్షాల ఐక్యత యత్నాలకు ఇది గండి కొట్టే ప్రమాదముందన్నది వాటి వాదనగా తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం 50 మంది ఎంపీల మద్దతు సంతకాలు అవసరం. పైగా పార్లమెంటు ఉభయ సభలూ రెండు వారాలుగా ఒక్క రోజు కూడా సజావుగా నడవని నేపథ్యంలో తీర్మానం సాధ్యాసాధ్యాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పెట్టినా వీగిపోయే అవకాశాలే ఉన్నప్పటికీ ముందుకెళ్లాలనే యోచనలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం. త్యాగాలకు సిద్ధమవ్వాలి విపక్షాలకు రాహుల్ పిలుపు రాహుల్‌పై వేటును నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్‌తో సహా 17 ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌కు తాజాగా సంఘీభావం ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంటులో కన్పించిన విపక్షాల ఈ ఐక్యతను మరింత ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగా ఏప్రిల్ తొలి వారంలో విపక్ష అగ్రనేతలతో కీలక సమావేశం జరపాలని నిర్ణయించింది. సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన విపక్షాల భేటీలోనే ఈ మేరకు ప్రతిపాదన వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘విపక్షాల అగ్ర నేతలు, అధ్యక్షులంతా భేటీ అయ్యేలా కాంగ్రెస్ చొరవ తీసుకోవాలని ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్‌తో పాటు డీఎంకే, జేడీ(యూ), సీపీఎం నేతలు ప్రతిపాదించారు. 2024 సాధారణ ఎన్నికలకు అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని నిర్ణయించుకోవాల్సిన అవసరం చాలా ఉందని వారు పదేపదే చెప్పారు’’ అని కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు వివరించారు. విపక్షాలన్నీ త్యాగాలకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. ‘‘విపక్షాల ఐక్యత కోసం ఎంతటి త్యాగాలకైనా కాంగ్రెస్ సిద్ధం. నేనూ సిద్ధం’’ అని ఆయన కుండబద్దలు కొట్టారని సమాచారం. ఆ భేటీకి దూరంగా ఉన్న శివసేన (ఉద్ధవ్ వర్గం) కూడా తమతో కలిసి నడుస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వివరించారు అదానీ ఉదంతం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తృణమూల్ సహా విపక్షాలను కాంగ్రెస్‌కు దగ్గర చేయడం తెలిసిందే. ‘అదానీ’పై మోదీకి లేఖలు! రాహుల్‌పై వేటును నిరసిస్తూ, అదానీ అంశంపై జేపీసీ విచారణకు డిమాండ్ చేస్తూ నెల రోజుల పాటు బ్లాక్ స్థాయి నుంచి హస్తిన దాకా దేశవ్యాప్త ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మార్చి 24న పార్టీ స్టీరింగ్ కమిటీ, పీసీసీ చీఫ్‌లు, అనుబంధ విభాగాల చీఫ్‌లతో జరిగిన భేటీలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వెల్లడించారు. వివరాలు... ► ఢిల్లీలోని ఎర్రకోట నుంచి మొదలు పెట్టి దేశంలోని 35 ప్రధాన నగరాల్లో మంగళ, బుధవారాల్లో ‘లోక్తంత్ర్ బచావో శాంతి మార్చ్’ ► ఏప్రిల్ రెండో వారంలో ‘జై భారత్ మహా సత్యాగ్రహం’. ఇందులో భాగంగా బ్లాక్/మండల కాంగ్రెస్ విభాగాలు సభలు, సమావేశాలు నిర్వహించి రాహుల్‌పై వేటు, అదానీతో ప్రధాని మోదీ బంధంపై ప్రజలకు వివరిస్తాయి. రాహుల్ సందేశాన్ని పార్టీ సోషల్ మీడియా విభాగాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాయి. ► ఏప్రిల్ 15 నుంచి 20 దాకా జై భారత్ మహా సత్యాగ్రహంలో భాగంగా విపక్షాలతో కలిసి జిల్లాల్లో కలెక్టరేట్ల ఘెరావ్. రాష్ట్ర స్థాయిలోనూ భారీ కార్యక్రమం. ఒక్క రోజు ఉపవాస దీక్షలు. అనంతరం ఢిల్లీలో జాతీయ స్థాయిలో భారీ సత్యాగ్రహం. ► మార్చి 31న జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నేతల మీడియా సమావేశాలు. ► యూత్ కాంగ్రెస్, ఎన్ఎన్యూఐ తదితరాల ఆధ్వర్యంలో పోస్టుకార్డుల ఉద్యమం. అదానీ అవినీతి, రాహుల్‌పై వేటు తదితరాలపై ప్రశ్నిస్తూ ప్రధాని మోదీకి లేఖలు. ► మహిళా కాంగ్రెస్ నిరసన ర్యాలీ. -
దుబ్బాక లినెన్ చీరకు జాతీయస్థాయి గుర్తింపు
దుబ్బాకటౌన్: సిద్దిపేట జిల్లా దుబ్బాక నేతన్న ప్రతిభకు గుర్తింపు లభించింది. దుబ్బాక చేనేత కార్మికులు మగ్గంపై నేసిన లినెన్ కాటన్ చీర జాతీయస్థాయిలో మెరిసింది. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ దేశంలోని వారసత్వ సంపదలను కాపాడాలనే ఉద్దేశంతో కేంద్ర టెక్స్టైల్స్ శాఖ విరాసత్ పేరిట ఢిల్లీలో నేటి నుంచి ఈ నెల 17 వరకు చేనేత చీరల ప్రదర్శన చేపట్టింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేనేత కార్మికులు నేసిన 75 రకాల చీరలను ఈ ప్రదర్శనకు ఎంపిక చేయగా, ఇందులో దుబ్బాక చీరకు స్థానం దక్కింది. చేనేత సహకార సంఘం మాజీ చైర్మన్, చేనేత రంగంలో అద్భుతాలు సృష్టించేందుకు కృషిచేస్తున్న బోడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ ప్రొడ్యూసర్ కంపెనీలో కార్మికులు ఈ లినెన్ కాటన్ చీరను నేయడం విశేషం. దేశంలోనే గుర్తింపు పొందిన దుబ్బాక చేనేత పరిశ్రమపై క్రమేణా నిర్లక్ష్యం అలుముకుంటోంది. ఈ క్రమంలో విరాసత్ చీరల ప్రదర్శనకు ఎంపిక కావడంతో మళ్లీ దేశవ్యాప్తంగా దుబ్బాకకు గుర్తింపు లభించింది. జాతీయస్థాయిలో దుబ్బాక చేనేతలకు గుర్తింపు దక్కడం పట్ల ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘విరాసత్ ప్రదర్శనకు దుబ్బాక లినెన్ కాటన్ చీర ఎంపిక కావడం చాలసంతోషంగా ఉంది. టై అండ్ డై విధానంతో ఇక్కత్ చీరలను తయారు చేయడం ఎక్కడ సాధ్యపడలేదని, కేవలం దుబ్బాకలోనే తయారు కావడం ఆనందంగా ఉంది’అని బోడ శ్రీనివాస్ అన్నారు. -
ఐపీఎల్ మళ్లీ పాత ఫార్మాట్లో...
వచ్చే ఏడాది ఐపీఎల్ పూర్తి స్థాయిలో పాత ఫార్మాట్లో నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు. కరోనాకు ముందు ఉన్న విధంగా ప్రతీ జట్టు తమ సొంత మైదానంలో ఒక మ్యాచ్, ప్రత్యర్థి మైదానంలో మరో మ్యాచ్ ఆడుతుందని ఆయన వెల్లడించారు. ఇప్పుడు ఐపీఎల్లో 10 జట్లు ఉండగా, ప్రతీ టీమ్ మిగిలిన 9 టీమ్‌లను రెండేసి సార్లు ఎదుర్కొంటుంది. 2022లో ఐపీఎల్ పూర్తిగా భారత్‌లోనే జరిగినా... కొన్ని వేదికలకే లీగ్‌ను పరిమితం చేశారు. వచ్చే సీజన్‌నుంచి అంతా సాధారణంగా మారిపోతుందని గంగూలీ స్పష్టం చేశారు. మరో వైపు 2023 సీజన్‌తో పూర్తి స్థాయిలో మహిళల ఐపీఎల్ కూడా నిర్వహిస్తామని గంగూలీ చెప్పారు. దీంతో పాటు టీనేజ్ అమ్మాయిల ప్రతిభను గుర్తించేందుకు తొలిసారి జాతీయ స్థాయిలో బాలికల అండర్–15 టోర్నీ కూడా జరపనున్నట్లు సౌరవ్ గంగూలీ వివరించారు. -
జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఆలేరు
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పోలీస్ స్టేషన్ 2021 సంవత్సరానికి జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపికైంది. దేశవ్యాప్తంగా కేంద్ర హోం శాఖ ఎంపిక చేసిన 10 పోలీస్ స్టేషన్లలో ఆలేరు నిలిచింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కేంద్ర హోం కార్యదర్శి సంతకాలతో కూడిన ప్రశంసా పత్రాన్ని గురువారం ఆలేరు పోలీసులకు పంపించారు. గ్రామీణ ప్రాంత పోలీస్‌స్టేషన్ కేటగిరీలో ఆలేరు పీఎస్ ఈ అవార్డుకు ఎంపికైంది. పోలీస్ స్టేషన్ పనితీరు, మహిళల రక్షణకు, నేరాల అదుపునకు తీసుకుంటున్న చర్యలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఎస్ఐ ఇద్రీస్ అలీతోపాటు సిబ్బందిని అభినందించింది. జాతీయ స్థాయిలో అవార్డు రావడంపై రాచకొండ పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సాయి సందీప్ పరుగు తీస్తే పతకమే!
సబ్బవరం (పెందుర్తి ): మండలంలోని సబ్బవరానికి చెందిన యువ క్రీడాకారుడు సాయి సందీప్ అథ్లెటిక్స్‌లో విశేషంగా రాణిస్తున్నాడు. జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నాడు. చిన్ననాటి నుంచి క్రీడలపై మక్కువ ఎక్కువ. ఈ నేపథ్యంలో అథ్లెటిక్స్‌లో రాణించాలని కలలుగన్నాడు. వాటిని నిజం చేసుకుంటూ ముందుకు పరుగులు తీస్తున్నాడు. సరైన వసతులు, శిక్షణ అందించే కోచ్‌లు లేకపోయినా ఏకలవ్యుడి మాదిరిగా పరుగులో మేటిగా నిలుస్తున్నాడు సాయి సందీప్. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఇంటర్ స్పోర్ట్స్ గేమ్స్‌లో 400 మీటర్ల రిలేలో స్వర్ణం, 400 మీటర్ల పరుగు పందెం వ్యక్తిగత విభాగంలోనూ వెండి పతకాలను సాధించి జాతీయ స్థాయి పోటీలకు సాయి సందీప్ ఎంపికయ్యాడు. ఈ పోటీలను ఈ నెల 10,11,12వ తేదీలలో ఏయూ బోర్డు ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం 57 అనుబంధ కళాశాలలకు చెందిన 300 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. ఏయూలో నిర్వహించిన పోటీలో వెండి పతకం అందుకున్న సాయి సందీప్ కుటుంబ నేపథ్యం.. వాండ్రాసి సాయి సంందీప్ తల్లి సంపత వెంకటలక్ష్మి సచివాలయ ఆరోగ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండగా, తండ్రి శ్రీనివాసరావు మార్కెటింగ్ విభాగంలో చిరుద్యోగిగా పనిచేస్తున్నారు. తమ్ముడు రోహిత్ విశాఖలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు 4వ తరగతి నుంచి... 4వ తరగతి నుంచి కడప జిల్లాలో డాక్టర్ వైఎస్సార్ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్లో చేరాడు. ఈ స్కూల్లో ప్రవేశానికి నిర్వహించిన జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభతో తన స్పోర్ట్స్ కెరియర్‌కు గట్టి పునాది వేసుకున్నాడు. పరుగు పందెం, దాంతో పాటు హర్డిల్స్‌లో ప్రత్యేక శ్రద్ధ చూపడంతో అక్కడున్నవారు ఆ దిశగా సాయి సందీప్‌ను ప్రోత్సహించారు. ► 4వ తరగతి నుంచి పదో తరగతి వరకూ స్పోర్ట్స్ స్కూల్లో చదివి మొత్తం రెండు జాతీయ స్థాయిలో వెండి, రజిత పతకాలతో పాటు 18 రాష్ట్రస్థాయి బంగారు పతకాలను సాధించాడు. ► ప్రస్తుతం విశాఖలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. నాటి టీడీపీ నగదు ప్రోత్సాహం ఇంకా అందలేదు ప్రభుత్వం, స్పాన్సర్స్ నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తే మరింత రాణించి అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా నాలో ఉందని సాయి సందీప్ చెబుతున్నాడు. ప్రభుత్వంలో గుంటూరు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించానని , అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తమ క్రీడా పురస్కారం అందజేశారన్నారు. దీంతో ప్రోత్సాహకంగా ప్రశంసాపత్రం, మెడల్‌తో పాటు ట్యాబ్, రూ.30 నగదు ప్రకటించారన్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం ప్రకటించిన నగదు ప్రోత్సాహక బహుమతి లభించలేదని సందీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రోత్సహిస్తే సత్తా చూపుతా సబ్బవరంలో తగిన క్రీడా సౌకర్యాలు, వసతులు లేవు. 400 మీటర్ల సింథటిక్ ట్రాక్, అనుభవం ఉన్న కోచ్ దగ్గర శిక్షణ పొందినట్లయితే మరిన్ని పతకాలు సాధించి, దేశం తరఫున ప్రాతినిథ్యం వహించి మరిన్ని పతకాలు సాధిస్తా. కోవిడ్ నేపథ్యంలో జాతీయ స్థాయి క్రీడలకు అంతరాయం ఏర్పడిందని, వచ్చే ఏడాది నిర్వహించనున్న పోటీలో పాల్గొని బంగారు పతకం సాధిస్తానని సందీప్ చెబుతున్నాడు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండటంతో డైట్, పౌష్టి కాహరం తీసుకోవడం, స్పోర్ట్స్ కిట్ తదితర వాటి కోసం ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుతున్నాడు. సాధించిన వివిధ పతకాలతో సాయి సందీప్ కోర్టులో పరుగు తీస్తూ... పరుగు పందెంలో సాయి సందీప్ -
ఐఏఎస్‌లకు జలసిరి పాఠాలు
సిరిసిల్ల: దేశ భవిష్యత్‌కు బాటలు వేస్తూ.. పాలనా విభాగానికి ప్రాణం పోసే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (ఐఏఎస్)కు ఎంపికైన అధికారులకు శిక్షణనిచ్చే ముస్సోరీలోని లాల్ బహదూర్‌శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు సిరిసిల్ల ‘జలసంరక్షణ’పాఠ్యాంశమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ఆరేళ్లుగా చేపట్టిన నీటి నిర్వహణ పద్ధతి ఇప్పుడు దేశానికి ఆదర్శంగా మారింది. జిల్లా లో భూగర్భ జలాలు గణనీయంగా వృద్ధి చెందడమే ఇందుకు కారణం. కరువు కోరల్లో చిక్కిన ఈ జిల్లాలో ఇప్పుడు భూగర్భ జలాల మట్టం ఆరు మీటర్లకు పెరగడం విశేషం. కరువు నుంచి జలసిరుల వైపు.. రాజన్న సిరిసిల్ల జిల్లా మెట్ట ప్రాంతం. సముద్ర మట్టానికి సుమారు 1,250 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఒకప్పుడు ఎండిపోయిన వాగులు, చెరువులు.. చుక్క నీరివ్వని బోర్లు.. బీళ్లుగా మారిన పంట భూములు.. వెరసి ముంబై, దుబాయ్‌లకు వలసలు. ఇదీ రాజన్న సిరిసిల్ల జిల్లా దుస్థితి. కానీ ఇప్పుడు జలసిరులు పొంగుతున్నాయి. మధ్యమానేరు జలాశయానికి గోదావరి జలాలు చేరా యి. ఎల్లంపల్లి ద్వారా వచ్చిన నీటితో సాగునీటి వనరుల్లో నీరు చేరింది. గతేడాది సమృద్ధిగా వర్షాలు పడటంతో భూగర్భ జలాలు బాగా అభివృద్ధి చెందాయి. జిల్లాలో 6 మీట ర్ల లోతుల్లోనే నీటి ఊటలు ఉండటం విశేషం. యువ ఐఏఎస్‌ల శిక్షణకు ఎంపిక.. ఐఏఎస్‌కు ఎంపికైన అధికారులకు వివిధ అంశాలపై ముస్సోరీలో శిక్షణ ఇస్తారు. జాతీయ, అంతర్జాతీయ, స్థానిక అంశాలపై ఆదర్శ విధానాలు, పాలనాపరమైన సంస్కరణలపై ఇందులో చర్చిస్తారు. ఈసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన జల నిర్వహణ ఎంపికైంది. ఇక్కడ గత ఆరేళ్లుగా చేపడుతున్న నీటి నిర్వహణ పనులు సత్ఫలితాలు ఇచ్చాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో ముస్సోరీ అకాడమీ సిరిసిల్ల జిల్లాలో చేసిన పనులను డాక్యుమెంట్ రూపంలో అందించాలని ఇక్కడి అధికారులను కోరింది. కలెక్టర్‌తో మాట్లాడిన అధికారులు.. కలెక్టర్ కృష్ణభాస్కర్‌తో అకాడమీ అధికారులు ఫోన్లో మాట్లాడారు. జిల్లాలో చేపట్టిన వాటర్ మేనేజ్మెంట్ పనుల వివరాల ను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మధ్యమానేరు జలాశయం, పునరావాస అంశాలపై సమగ్రంగా తెలుసుకున్నారు. జిల్లాలో పర్యటిం చేందుకు పలువురు శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారులు ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు. ఆనందంగా ఉంది జాతీయస్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. తెలంగాణ జల విధానాన్ని సీఎం కేసీఆర్ సమర్థవంతంగా అమలు చేశారు. బీళ్లకు గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తీసుకురావడం విశేషం. జిల్లాకు సాగునీటి ఫలాలు అందాయి. దీంతో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. శిక్షణ ఐఏఎస్‌లకు సిరిసిల్ల జల సంరక్షణ పాఠ్యాంశం కావడం సంతోషంగా ఉంది. –కె.తారక రామారావు, రాష్ట్రమంత్రి -
పౌరుడే ‘పుర’పాలకుడు
సాక్షి, హైదరాబాద్: పురపాలనలో పౌరుడే పాలకుడని, నూతన పుర చట్టం స్ఫూర్తి ఇదేనని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. పౌర సేవలు పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా వేగంగా అందించడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని రూపొందించామని తెలిపారు. వ్యక్తి కేంద్రీకృతంగా ఉన్న పాత చట్టం స్థానంలో వ్యవస్థ కేంద్రీకృతంగా నూతన చట్టం తీసుకొచ్చామన్నా రు. కొత్త మున్సిపల్ చట్టంపై మున్సిపల్ కమిషనర్ల రెండ్రోజుల సదస్సు ముగింపు సమావేశానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజలతో మమే కమై రాజకీయ జీవితాన్ని సాగిస్తున్న సీఎం కేసీఆర్ ప్రజలకు అవసరమైన పలు సంస్కరణలను ఈ చట్టం ద్వారా అందుబాటులోకి తెచ్చారని, 75 గజాల్లోపు ఇంటి నిర్మాణానికి అనుమతులు అవసరం లేకుండా చేయడం, భవన నిర్మాణాల కోసం సెల్ఫ్ సరి్టఫికేషన్ వంటి నూతన నిబంధనలు ఈ స్ఫూర్తిలోంచి వచి్చనవేనని తెలిపారు. జాతీయ స్థాయి గుర్తింపు పొందేలా.. సిద్దిపేట, సిరిసిల్ల, వరంగల్, సూర్యాపేట, పీర్జాదిగూడ మున్సిపాలిటీలు ఇప్పటికే వివిధ అంశాల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా పనిచేస్తున్నాయని, వాటిని పరిశీలించాలని మంత్రి కేటీఆర్ కమిషనర్లకు సూచించారు. దీంతో పాటు జాతీయస్థాయిలో పురపాలనలో వినూత్నమైన, అదర్శవంతమైన పద్ధతులను అనుసరిస్తున్న పట్టణాలను అధ్యయనం చేసేందుకు పంపుతామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం జోడించడం ముఖ్యం గా సామాజిక మాధ్యమాలను వినియోగించడం ద్వారా పురపాలనను సాగించవచ్చన్నారు. ఈ సమావేశంలో వివిధ అంశాల్లో ఉత్తమ సేవలు అందించిన కమిషనర్లకు మంత్రి కేటీఆర్ పురస్కారాలను అందించారు. కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్, డైరెక్టర్ టీకే శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అక్కడే ఉండిపో!
మన అమ్మాయో, అబ్బాయో ఆటల పోటీల్లో స్కూల్ ఫస్ట్ వస్తే ఏం చేస్తాం? భుజం తట్టి ప్రోత్సహిస్తాం. అదే.. మండల స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో కప్పు గెలుచుకుంటే..? మళ్లీ ఇదేం ప్రశ్న? అప్పుడు కూడా మెచ్చుకుంటాం. మరింతగా ఎంకరేజ్ చేస్తాం. ఇంకొంచెం ముందుకు వెళ్లి జాతీయ స్థాయిలో పేరు తెస్తే?అప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మన వెన్ను తట్టి అండగా నిలుస్తుంది. అవార్డులూ రివార్డులూ ప్రకటిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో అయితే..ఇక చెప్పేదేముంది? ప్రభుత్వమే పరమానందపడిపోయి ఇళ్ల స్థలాలూ, కార్లూ, ఉద్యోగాలూ ఇచ్చేస్తుంది. ఇది మన దేశంలో. మన దేశంలో అనేముంది? దాదాపుగా ఏ దేశమైనా ఇంతే. కానీ ఇరాన్లో మాత్రం అంతర్జాతీయ బాక్సింగ్‌లో కప్పు గెలుచుకున్న అమ్మాయిని మెచ్చి మెడలో హారం వేయలేదు కానీ, ఆగ్రహించి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇదేం చిత్రం అంటారా? చిత్రం కాదు... వాస్తవం.మీరు కనుక ఇరానియన్ అయితే, ముందు మీరు స్త్రీనా, పురుషుడా అని చూస్తారు. తర్వాత మీరు ధరించిన దుస్తులేమిటో తేరిపార చూస్తారు. చూసి... తేడా వస్తే గనక అరెస్ట్ చేసేస్తారు. అక్కడేవో నిబంధనలు, నియమాలు ఉన్నాయి మరి. పాపం.. ఈ ఇరానియన్ బాక్సర్ సదరా ఖదేమ్ ఫ్రాన్స్‌తో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో అన్నే చౌవీన్ అనే తన ప్రత్యర్థిపై గెలిచింది. అందుకు ప్రతిఫలంగా ఆమెకు దక్కింది స్వదేశం జారీచేసిన అరెస్ట్ వారెంట్. ఇరాన్ ప్రభుత్వం ఆమెకు ఈ వారెంట్‌ను ఎందుకు ఇచ్చిందో తెలుసా? మ్యాచ్ జరిగే సమయంలో ఆమె తన ముఖానికి మేలిముసుగు వేసుకోలేదు మరి! అయితే? అది ఆ దేశ నియమాల ప్రకారం చాలా ఘోరమైన తప్పిదమట. దాంతో ఆమె బాక్సింగ్‌లో ఏ దేశ ప్రత్యర్థినైతే మట్టి కరిపించి విజయ బావుటా ఎగుర వేసిందో, ఆ దేశంలోనే శరణార్థిగా జీవించవలసిన పరిస్థితి... కాదు దుస్థితి ఏర్పడింది.ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దవలసిన ఇరాన్ జాతీయ బాక్సింగ్ సమాఖ్య ఆ పని చేయకపోగా సదాఫ్ను గెటౌట్ అంది. ఆమెను తమ దేశానికి తిరిగి రప్పించేది లేదని పంచ్ స్టేట్మెంట్లు విసిరి మరీ చెబుతోంది. అంతేకాదు.. ‘‘ఫెడరేషన్ దృష్టిలో అదంతా ఆమె వ్యక్తిగత విషయం. జనంలోకి వచ్చేటప్పుడు వళ్లు దగ్గర పెట్టుకోనక్కరలేదా?’’ అంటూ గుడ్లురుముతున్నాడు సమాఖ్య అధ్యక్షుడు హుసేన్ సూరి. – డి.వి.ఆర్. -
కుదురులేని వాడు క్యూబ్‌లో ఒదిగాడు
అమెరికాలో జాతీయ స్థాయిరూబిక్ క్యూబ్ పోటీల్లో విజేతగా నిలిచినపాలడుగు హర్ష హైదరాబాద్ వచ్చి,తన లాంటి పిల్లలకు రూబిక్ క్యూబ్ గేమ్మీద ఆసక్తి పెంచేందుకు ఓ ప్రత్యేకఈవెంట్ ఏర్పాటు చేశాడు. అతడి హైపర్యాక్టివ్నెస్కి తండ్రి కనిపెట్టిన రూబిక్ గేమ్ పరిష్కారమే... అమెరికాలో ఏ తెలుగు కుర్రాడికీ దక్కని ఘనతను హర్షకు సాధ్యం చేసింది! ఒకప్పుడు పిల్లలు చురుకుగా ఉండడం లేదనేదే ఎక్కువగా పెద్దవాళ్ల ఫిర్యాదుగా ఉండేది. అయితే ఇప్పుడు ‘మా వాడు హైపర్ యాక్టివ్ అండీ. ఏం చేయాలో తెలియడం లేదు’’ అనే పేరెంట్స్ కోకొల్లలు. కారణాలేవైనా గాని.. దీనికి రూబిక్ క్యూబ్ గేమ్‌ను ఒక మంచి పరిష్కారం అని కనుగొన్నారు అమెరికాలో ఉంటున్న పాలడుగు శ్రీకాంత్. ఈ గేమ్‌లో రాణిస్తున్న తమ కుమారుడు హర్ష ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఇటీవల ఆయన క్యూబ్ గేమ్ మీద రోజు మొత్తం కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సందర్భంగా హర్షతో ముచ్చటించినప్పుడు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. హైపర్ టూ... సూపర్ ‘‘మాది ఆంధ్రప్రదేశ్. (తండ్రి కాకినాడ, తల్లి విశాఖపట్టణం) చిన్నప్పుడు తన పదేళ్ల వయసులో నాన్న క్యూబ్ గేమ్ ట్రై చేశారట. కొంత కాలం దాని మీద ఇష్టంతో ఆడి తర్వాత వదిలేశారు. చిన్నప్పటి నుంచీ నేను హైపర్యాక్టివ్గా ఉండేవాడిని. దేనిపై సరిగా ఫోకస్ ఉండేది కాదు. నాలో ఫోకస్ పెంచడానికి ఏ గేమ్ సరిగా ఉపయోగపడుతుందా అని నాన్న ఆలోచించి, చిన్నప్పుడే నాకు క్యూబ్ కొనిచ్చారు. మొదట్లో నేను అంత ఆసక్తి చూపలేదు. కొన్ని రోజులు ఆడి వదిలేశా. అయితే అనుకోకుండా నా ఫ్రెండ్ కూడా ఇదే ఆట మొదలుపెట్టగానే ఇద్దరం పోటా పోటీగా ఆడడం, అలా అలా కాంపిటీషన్స్‌కి కూడా వెళ్లడం, గెలవడం మొదలైంది. రెండేళ్ల క్రితం ఆగస్ట్ 27న మిషిగన్ క్యూబింగ్ క్లబ్ నిర్వహించిన పోటీలో గెలిచాను, ఇప్పుడు అమెరికాలో ఫస్ట్ ర్యాంక్, వరల్డ్ వైడ్‌గా 6వ ర్యాంక్ సాధించాను. చదువు మెరుగయింది ఒక క్యూబ్స్ సాల్వ్ చేయాలంటే వందల అల్గోరిథెమ్స్ అవసరం. దీని వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్, ఫింగర్స్ మూవ్మెంట్స్ వల్ల నర్వ్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఈ గేమ్‌ని నిరంతరం ప్రాక్టీస్ చేస్తుండడం వల్ల నా చురుకుదనం క్రమబద్ధం అయింది. ఏకాగ్రత పెరిగింది. కళ్లు, మైండ్, చేతులు అన్నింటి సమన్వయం వచ్చింది. ఫైనల్‌గా దీని వల్ల స్టడీస్‌లో కూడా బాగా బెటర్ అయ్యా. సాధారణ ఆటగాడి నుంచి ఛాంపియన్ కావాలంటే.. విపరీతమైన ఏకాగ్రత కావాలి. మీకు తెలుసా? ఇందులో ప్రావీణ్యం సంపాదించిన ఆటగాళ్లు ఆటలోకి దిగి ఒక్కసారి క్యూబ్‌ని చూశాక దాన్ని అచ్చం అలాగే మైండ్‌లో ప్రింట్ చేసుకుంటారు. ఆ తర్వాత చేతుల్లో ఉన్న క్యూబ్ కనిపించదు. మైండ్ గేమ్ మాత్రమే ఉంటుంది. చేతుల్లో క్యూబ్ కనిపిస్తే ఆడలేం. దీనిని బ్లైండ్ కిడ్స్ ఇంకా బాగా ఆడగలగడానికి కారణం వాళ్లకి ఫోకస్ మరింత బాగా ఉండడమే. పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలనేది నా లక్ష్యం. పిల్లలకు ఆసక్తి కల్పించాలి అమెరికాలో దేశవ్యాప్తంగా ఈ గేమ్‌కు సంబంధించి నెలకు 50 వరకూ జాతీయ, అంతర్జాతీయ పోటీలు జరుగుతుంటాయి. మనకు చాలా తక్కువ. తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం మరింత తక్కువ. ఇది విద్యార్ధి దశలోని పిల్లలకు బాగా ఉపయుక్తమైంది. అందుకే దీన్ని వీలున్నంతగా ప్రమోట్ చేయాలని ఈవెంట్స్ నిర్వహిస్తున్నాం. ఈ శిక్షణ, పోటీల ఈవెంట్స్ ద్వారా వచ్చిన విరాళాలు, ఫీజులు రూపంలో సేకరించిన నిధులు పూర్తిగా కేన్సర్ వ్యాధి బాధిత చిన్నారుల కోసం కృషి చేసే ల్యుకేమియా అండ్ లింఫోమా సొసైటీకి అందిస్తున్నాం’’ అని తెలిపారు హర్ష. – ఎస్.సత్యబాబు -
టేబుల్ టెన్నిస్‌లో గ్రామీణ కుసుమం
క్రీడల్లో రాణించాలంటే చాలా కష్టపడాలి. జిల్లా స్థాయి జట్టుకు ఎంపిక కావాలంటేనే ఎంతో శ్రమ అవసరం. అలాంటిది నగరానికి చెందిన బీ. నాగశ్రావణి జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఇప్పటివరకు ఏకంగా 15 సార్లు ఎంపికై తన సత్తాను చాటుకుంది. 8 ఏళ్ల వయస్సులో క్రీడల్లో పాల్గొనింది. ఆట ఏదైనా క్రమపద్ధతి ద్వారా దూసుకుపోవాలనుకుంది. ప్రస్తుతం బుక్కరాయసముద్రంలోని రోటరీపురంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం ఈఈఈ విభాగంలో చదువుతుంది. క్యాడెట్ విభాగం నుంచి ప్రారంభమై ప్రస్తుతం సీనియర్ మహిళా విభాగంలో జాతీయ స్థాయికి ఎంపికైంది. తన 11 ఏళ్ల క్రీడాచరిత్రలో ఎందరో క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యేలా చేసింది. అక్కకు తనే స్ఫూర్తి సాధారణంగా క్రీడల్లో తన కంటే పెద్దవారు తన క్రీడకు స్ఫూర్తిగా ఉంటారు. కానీ నాగశ్రావణì మాత్రం తన అక్క ఉమాదేవికి తనే ఆదర్శం. టేబుల్ టెన్నిస్‌లో రాణిస్తున్న చెల్లిని చూసి, తాను కూడా ఆట నేర్చుకుంది ఉమాదేవి. అంతేకాదు, యూనివర్శిటీ పరిధిలో జాతీయస్థాయిలో స్వర్ణపతకాన్ని సాధించింది. వీటితోపాటు ఇంటర్మీడియట్లో స్కూల్ గేమ్స్ అండర్–19 విభాగంలో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. దీంతోపాటుగా తన చుట్టుపక్కల ఉన్న చిన్నారులకు తనే ఆదర్శంగా నిలుస్తుంది. తన ఆటను చూసి ఎందరో చిన్నారులు టేబుల్ టెన్నిస్‌ను నేర్చుకుంటున్నారు. కుటుంబ నేపథ్యం తండ్రి శ్రీనివాసులు ఓ హోటల్ యజమాని. తల్లి సావిత్రి సాధారణ గృహిణి. అక్క ఉమాదేవి. యూనివర్శిటీ స్థాయిలో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంది. పెద్దనాన్న వారితో కలిసి నగరంలోని పాతూరులో ఉన్న బోయవీధిలో నివసిస్తున్నారు. పెద్దనాన్న కుమారుడి ప్రోత్సాహంతో టేబుల్‌టెన్నిస్‌లో తన కెరీర్‌ను మొదలెట్టింది. పతకాల పంట రాష్ట్రస్థాయిలో ఇప్పటివరకు 50 టైటిల్స్ సాధించి రాష్ట్రస్థాయి జూనియర్, యూత్ విభాగంలో రాష్ట్రఛాంపియన్‌గా కొనసాగుతోంది. రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పాయింట్ల పట్టికలోను జూనియర్ విభాగంలో 405, యూత్‌లో 420, సీనియర్ మహిళా విభాగంలో 315 పాయింట్లతో ముందుంది. తన ఆటతీరును చూస్తే ప్రత్యర్థికి చమటలు పట్టిస్తుంది. ప్రధానంగా ర్యాలీస్, కౌంటర్స్, సర్వీస్ చేయడంలో దిట్ట. ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తుంది. టీమ్ ఈవెంట్లోను రెండు కాంస్య పతకాలు సాధించింది. జాతీయస్థాయిలో ప్రతిభ రెండవ తరగతిలో టేబుల్‌టెన్నిస్ క్రీడలో ప్రవేశించి 6వ తరగతిలో కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో కాంస్యపతకం సాధించి ఘనత సాధించింది శ్రావణి. దీంతోపాటు రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లోను కాంస్యపతకం సాధించింది. రాష్ట్రస్థాయిలో టేబుల్‌టెన్నిస్ క్రీడా పోటీల్లో సాధించిన ఘనతతో తను 10వ తరగతి వరకు మొదటి మూడు ర్యాంకులలో కొనసాగింది. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా... ఆంధ్ర నుంచి అంతర్జాతీయస్థాయి క్రీడాకారిణిగా ఎదగాలనేదే ప్రధాన లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతోంది నాగశ్రావణి. పాఠశాల స్థాయిలో ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యత అందించేది. ప్రస్తుతం దీనికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి. ఆర్థికంగా ఆదుకునే వారే లేరు. అయినా, కోచ్ రాజశేఖర్‌రెడ్డి ప్రోత్సాహంతోనే ఈ స్థాయి క్రీడలో రాణించగలుగుతున్నాననీ, క్రీడల్లో రాణించాలంటే ఆర్థికతోడ్పాటు కూడా ఉండాలనీ, కానీ తనకు అలాంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది నాగ శ్రావణి. క్రీడ ద్వారా ఉద్యోగాన్ని సాధించాలి ‘‘నాకు రాష్ట్ర వ్యాప్తంగా పేరు సాధించి పెట్టిన క్రీడ ద్వారానే ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో కష్టపడుతున్నాను. ఇంజినీరింగ్‌ను పూర్తిచేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నాను. ఆంధ్రనుంచి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు సాధించాలి’’ అంటున్న ఈ గ్రామీణ క్రీడా కుసుమం నాగ శ్రావణి ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం. – మైనుద్దీన్, సాక్షి, అనంతపురం ఫొటోలు: వీరేష్ -
కాంగ్రెస్ విముక్త తెలంగాణ: ఎంపీ బూర
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో కాంగ్రెస్ విముక్త్ భారత్ అవుతుందో లేదో తెలియదుగానీ తెలంగాణ పూర్తిగా కాంగ్రెస్ విముక్తం కాబోతుందని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ జోస్యం చెప్పా రు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలను ఆపాలని కోర్టులకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఈవీఎం లపైన కోర్టులను ఆశ్రయిస్తున్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ప్రవేశ పెట్టిన తర్వాత ప్రపంచానికి మరింత ఆదర్శంగా మారాం. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన చోట ఈవీఎం లను తప్పుబట్టని కాంగ్రెస్ నేతలు ఓడి పోయిన చోట మాత్రం తప్పు పడుతు న్నారు. టీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కు ఓట్లలో 15% తేడా ఉన్నా కాంగ్రెస్ నేతలు మాట్లాడటం అర్థరహితం. ఆ పార్టీ నేతల ఆరోపణలు ప్రజాస్వామ్య మను గడకే ప్రమాదం. కాంగ్రెస్ ప్రభుత్వమే దేశంలో ఈవీఎంలను ప్రవేశ పెట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా అని అన్ని సర్వేలు సూచిస్తున్నాయి. ఫెడ రల్ ఫ్రంట్ గురించి అపహాస్యం చేసిన వాళ్లు ఇప్పుడు తమ వైఖరిని సమీక్షిం చుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్‌కు మద్దతు పెరుగుతుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీల కపాత్ర పోషించనున్నారు. రాష్ట్రంలో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, టీడీపీలు ఏపీలో వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఏపీలో టీడీపీ నేతలు టీఆర్ఎస్ను బూచీగా చూపుతూ ఆరోపణలు చేయడం ఆపితే మంచిది’ అని అన్నారు. -
తుపాకీ లైసెన్సుదారుల డేటాబేస్
న్యూఢిల్లీ: దేశంలో తుపాకీ లైసెన్స్‌లు కలిగిన వారందరికీ ఓ విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించి వారి పేర్లతో జాతీయ స్థాయిలో డేటాబేస్‌ను రూపొందించనున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. వచ్చే ఏప్రిల్ కల్లా ఈ డేటాబేస్ అందుబాటులోకి వస్తుందంది. ఏప్రిల్ నుంచి అధికారులు కొత్తగా లైసెన్సులు జారీచేసేటప్పుడు లేదా పాత లైసెన్సును పునరుద్ధరించేటప్పుడు ఆయుధం యజమాని వివరాలను ఈ డేటాబేస్‌లో నమోదు చేయాల్సిందేనని వెల్లడించింది. -
చదరంగంలో అంతర్జాతీయ ప్రతిభ
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): సెలవుల్లో నాన్నతో ఆడిన చెస్ అతనిలో ఆసక్తిని పెంచింది. అక్క జషితారెడ్డి యోగా క్రీడాకారిణిగా అంతర్జాతీయ స్థాయిలో రాణించడం స్ఫూర్తి నిచ్చింది. చెస్ క్రీడలో ఆనతికాలంలోనే వాకాటి పృథ్వీకుమార్రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో రాణించడం అందరినీ అబ్బురపరిచింది. నెల్లూరు నగరంలోని కొండాయపాళెం ప్రాంతంలోని వనంతోపుకి చెందిన వెంకటశేషారెడ్డి, శిరీష దంపతులిద్దరికి మొదటి నుంచే క్రీడలపట్ల అభిమానం. చదువుతో పాటు పిల్లలు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించేవారు. పృథ్వీకుమార్ ఐదో తరగతి చదువుతున్నప్పటి నుంచే చెస్ పట్ల మక్కువ పెంచుకున్నాడు. మొట్ట మొదటి సారిగా 2009లో జిల్లా స్థాయి అండర్–10 చెస్ పోటీల్లో ప్రథమస్థానం సాధించాడు. అప్పటి నుంచే జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పాల్గొన్న ప్రతి మ్యాచ్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచేవాడు. జాతీయస్థాయి పోటీల్లో రాణించి రెండు సార్లు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం తన ప్రతిభకు నిదర్శనం. అంతర్జాతీయ చదరంగంలో రాణించాలంటే ఎంతో వ్యయ, ప్రయాసాలతో కూడిన విషయం. పోటీలో పాల్గొనేందుకు అంతర్జాతీయ శిక్షణకు అయ్యే ఖర్చు సామాన్య కుటుంబం భరించడం అసాధ్యం. దాతలు ముందుకు వచ్చి తనకు సాయం చేస్తే అంతర్జాతీయస్థాయిలో రాణించి దేశానికి మరెన్నో పతకాలు సాధిస్తానని పృథ్వీకుమార్ కోరుతున్నాడు. పృథ్వీ విజయాల్లో కొన్ని ♦ 2012లో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్–14లో మూడోస్థానం ♦ 2014లో రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్ –17లో మొదటి స్థానం ♦ 2014లో జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్‌లో అండర్–17లో మూడోస్థానం ♦ 2015లో అండర్–17లో స్టేట్ ఛాంపియన్ షిప్లో మూడోస్థానం ♦ 2016లో యూఎస్ఎ మిలియనీర్ చెస్ టోర్నమెంట్లో భారతదేశానికి బంగారు పతకాన్ని సాధించాడు. ♦ ఇటీవల నేపాల్‌లో జరిగిన అంతర్జాతీయ చెస్ సీడెడ్ పోటీల్లో పాల్గొన్నారు. ఇలా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తున్న పృథ్వీకి జిల్లా కలెక్టర్ 2013లో, 2016లో ప్రశంసా పత్రాలు అందచేశారు. ప్రోత్సాహం ఉంటేఅంతర్జాతీయ స్థాయిలో రాణించగలడు పృథ్వీలో ఎంతో ప్రతిభ ఉంది. అంతర్జాతీయ స్థాయిలోరాణించాలంటే ఎక్కువ పోటీల్లో పాల్గొనాల్సి ఉంది. యూరప్, ఇంగ్లాండ్, అమెరికా వంటి దేశాల పోటీల్లో పాల్గొంటేనే అంతర్జాతీయ వేదికపై నిలదొక్కుకోగలడు. అందుకు శిక్షణ, ఎంట్రీ ఫీజులు, ప్రయాణ ఖర్చులు అధిక వ్యయంతో కూడినవి.– సుమన్, చెస్ అసోసియేషన్రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గ్రాండ్ మాస్టర్ అవుతా గ్రాండ్ మాస్టర్ అవడమే లక్ష్యం. చిన్నప్పటి నుంచే చెస్ అంటే ప్రాణం. కోచ్ సుమన్, రియాజ్‌లు శిక్షణ ఇచ్చి నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం చెన్నై ఎస్ఆర్ఎం కళాశాలలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నా. వాకాటి.పృథ్వీకుమార్,అంతర్జాతీయ చెస్ క్రీడాకారుడు -
జాతీయ క్యారియర్‌గా ట్రూజెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా రెండున్నరేళ్ల కిందట ప్రాంతీయ విమానయాన సంస్థగా సేవలు ఆరంభించిన ట్రూ జెట్.. జాతీయ స్థాయి సంస్థగా ఆవిర్భవిస్తోంది. టర్బో మేఘా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ సంస్థ... తాజాగా మరో 20 రూట్లలో విమాన సేవలు ఆరంభించేందుకు అనుమతులు సాధించినట్లు ప్రకటించింది. ప్రాంతీయంగా కనెక్టివిటీకి ఉద్దేశించిన ఉడాన్ పథకం రెండో దశ కింద ఈ 20 రూట్లలో తాము లైసెన్సులు పొందినట్లు టర్బో మేఘా ఎయిర్వేస్ హెడ్ (కమర్షియల్ విభాగం) సెంథిల్ రాజా తెలియజేశారు. కొత్త రూట్లలో అహ్మదాబాద్ – పోర్బందర్, జైసల్మేర్, నాసిక్, జల్గామ్, గౌహతి– కుచిహార్, బర్నపూర్, తేజు, తేజపూర్ తదితరాలున్నాయి. ‘‘ఇప్పటిదాకా ట్రూజెట్ ద్వారా 10 లక్షల మంది ప్రయాణించారు. తాజా రూట్లతో పశ్చిమ, తూర్పు తీరంతో పాటు ఈశాన్య భారత్‌లో కూడా సేవలు విస్తరించినట్లు అవుతుంది. ఈ నెల 25న చెన్నై–సేలం రూట్లో విమాన సేవలు ప్రారంభిస్తున్నాం. ప్రమోషనల్ ఆఫర్‌గా టికెట్‌ను రూ.599కే ఆఫర్ చేస్తున్నాం’’ అని రాజా వివరించారు. ఇంజినీరింగ్, కన్స్ట్రక్షన్ దిగ్గజం ‘మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్)లో టర్బోమేఘా ఎయిర్వేస్ భాగంగా ఉంది. మరో ఏడు విమానాల కొనుగోలు.. ట్రూజెట్‌కు ప్రస్తుతం 5 విమానాలున్నాయి. వీటితో 13 ప్రాంతాలకు రోజుకు 32 సర్వీసులు నడుపుతోంది. త్వరలోనే మరో ఏడు విమానాలను సమకూర్చుకోనున్నట్లు రాజా చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, ఔరంగాబాద్ రూట్లతో పాటు ఉడాన్ స్కీమ్ కింద కడప, ఔరంగాబాద్, మైసూరు ప్రాంతాలకు సర్వీసులు నడుపుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా రోజూ సుమారు 2 వేల మందిని వివిధ ప్రాంతాలకు చేరుస్తున్నట్లు తెలియజేశారు. సీఎఫ్ఎంతో స్పైస్‌జెట్ భారీ డీల్ గురుగ్రామ్: విమానయాన సేవల సంస్థ స్పైస్‌జెట్ తాజాగా జెట్ ఇంజిన్ల తయారీ సంస్థ సీఎఫ్ఎం ఇంటర్నేషనల్‌తో 12.5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. లీప్ 1బీ ఇంజిన్ల కొనుగోలు, సర్వీసులకు ఈ డీల్ ఉపయోగపడనుంది. ప్రస్తుతం తమ విమానాల్లో ఉపయోగిస్తున్న సీఎఫ్ఎం56 కన్నా లీప్–1బీ ఇంజిన్లు సమర్థమంతంగా ఉండగలవని స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం 38 పైచిలుకు ’సీఎఫ్ఎం56–7బి’ ఇంజిన్ల ఆధారిత బోయింగ్ ’737’ రకం విమానాలు స్పైస్‌జెట్ ఉపయోగిస్తోంది. -
కడప గడపలో..బ్యాడ్మింటన్ సంబరం !
కడప స్పోర్ట్స్ : జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు కడప నగరం మరోసారి వేదిక కానుంది. గతేడాది బ్యాడ్మింటన్ అసోసియేషన్, 62వ ఎస్జీఎఫ్ బ్యాడ్మింటన్ జాతీయస్థాయి పోటీలను అద్భుతంగా నిర్వహించడంతో మరోసారి జాతీయస్థాయి పోటీలను నిర్వహించే అవకాశం జిల్లాకు దక్కింది. దీంతో ఈ నెల 19 నుంచి 23 వరకు కడప నగరంలోని వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ సందడి ప్రారంభం కానుంది. 63వ జాతీయస్థాయి ఎస్జీఎఫ్ అండర్–17 విభాగంలో బాలబాలికలకు పోటీలు నిర్వహించనున్నారు. 40 జట్లు.. 400 మంది క్రీడాకారులు ఈ జాతీయస్థాయి పోటీలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 40 జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. ఒక్కో జట్టు నుంచి బాలురు 5 మంది, బాలికలు 5 మంది చొప్పున మొత్తం మీద 400 మంది క్రీడాకారులు, మరో 100 మంది అఫిషియల్స్ ఈ టోర్నీకి విచ్చేయనున్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఏపీ నుంచి కూడా 5 మంది బాలురు, 5 మంది బాలికలు ఎంపికకాగా వీరిలో కడప నుంచి బాలుర విభాగంలో అబ్దుల్ రెహమాన్, బాలికల విభాగంలో కె. వెన్నెల ఏపీ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ టోర్నమెంట్లో టీం చాంపియన్‌షిప్‌తో పాటు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే బాలబాలి కల జట్లను ఎంపిక చేయనున్నారు. ఖేలోఇండియాకు అవకాశం.. కాగా ఈ ఏడాది జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు మరో అరుదైన అవకాశం లభించనుంది. జాతీయస్థాయి బ్యా డ్మింటన్ పోటీల్లో సత్తాచాటే క్రీడాకారులకు ఖేలోఇండియా జాతీయస్థాయి పోటీలకు నేరుగా వెళ్లే అవకాశం కల్పించారు. గతంలో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన తర్వాతే ఖేలోఇండియా జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉండేది. అయితే ఈ సారి నుంచి ఎస్జీఎఫ్ జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటే క్రీడాకారులను ^ నేరుగా జాతీయస్థాయి పోటీలకు పంపే అరుదైన అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. -
‘మందుల’ కష్టం
– మెడికల్ షాపుల బంద్ విజయవంతం – ఇబ్బందులు పడిన సామాన్య ప్రజలు అనంతపురం మెడికల్ : ఆన్లైన్లో ఔషధ విక్రయాలకు వ్యతిరేకంగా చేపట్టిన మెడికల్ దుకాణాల బంద్ సామాన్యులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల తమ బతుకులు బజారున పడతాయని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. ఒక్క రోజు షాపులు తెరుచుకోకపోవడంతో ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు అక్కడక్కడ దుకాణాలు తెరచి ఉంచడంతో ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని అనంతపురం, హిందూపురం, తాడిపత్రి, కదిరి డివిజన్ల పరిధిలో సుమారు 1600 మెడికల్ షాపులున్నాయి. వీటిపైనే ఆధారపడి వందలాది మంది జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్లో ఔషధ విక్రయాలు చేయాలని భావిస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్, సీమాంధ్ర డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్త బంద్‌లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడ్డాయి. అనంతపురంలో పెద్ద సంఖ్యలో ఔషధ విక్రయాలు జరిగే సప్తగిరి సర్కిల్, టవర్‌క్లాక్, శ్రీకంఠం సర్కిల్, పాతూరుతో పాటు మిగిలిన ప్రాంతాల్లోని మెడికల్ షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం, గుంతకల్లు, కదిరి, కళ్యాణదుర్గం, రాయదుర్గం తదితర పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. ఆస్పత్రులకు అనుసంధానంగా ఉన్న మెడికల్ షాపులు తెరచుకోవడంతో కాస్త ఊరట కలిగించింది. ఆన్లైన్లో మందుల అమ్మకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రంగారెడ్డి తెలిపారు. తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సర్వజనాస్పత్రి సమీపంలో జనరిక్ మందుల అమ్మకాలు జరిపే అన్న సంజీవని దుకాణం కూడా మూతపడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -
నేటి నుంచి జాతీయ స్థాయి నాటిక పోటీలు
–మూడురోజుల పాటు ప్రదర్శనలు కర్నూలు(హాస్పిటల్): టీజీవీ కళాక్షేత్రం(లలితకళాసమితి) స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 14, 15, 16వ తేదీల్లో జాతీయ స్థాయి నాటిక పోటీలను నిర్వహించనున్నట్లు సంస్థ చైర్మన్ టీజీ భరత్, అధ్యక్షుడు పత్తి ఓబులయ్య చెప్పారు. శనివారం స్థానిక మౌర్య ఇన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జాతీయ స్థాయి నాటిక పోటీలు నిర్వహించడం 11వ సారన్నారు. నేటితరం, భావితరాలు మన సంస్కృతి, సంప్రదాయాలు మరిచిపోకుండా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. 14న సాయంత్రం 6గంటలకు ప్రారంభ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, 16వ తేదీన ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ హాజరవుతారని వెల్లడించారు. నాటక ప్రదర్శనల వివరాలు –14వ తేది రాత్రి 7.30 గంటలకు శ్రీ జయ ఆర్ట్స్, హైదరాబాద్ వారి ‘సందడే సందడి’ –14వ తేది రాత్రి 8.30 గంటలకు శ్రీ అంజన రాథోడ్ థియేటర్స్ వారి ‘సప్తపది’ –15వ తేది సాయంత్రం 6.30 గంటలకు శ్రీ ఉషోదయ కళానికేతన్, కాట్రపాడు వారి ‘గోవు మాలక్ష్మి’ –15 రాత్రి 8 గంటలకు శ్రీ శాలివాహన కళామందిర్, చెన్నూరు, నెల్లూరు వారి ‘మనిషి కాటు’ –15 రాత్రి 9 గంటలకు నెల్లూరు వారి ‘మాతృవందనం’ –16వ తేది ఉదయం 10.30 గంటలకు శ్రీ సాయి ఆర్ట్స్, కొలకలూరి వారి ‘చాలు ఇక చాలు’ –16వ తేది మధ్యాహ్నం 11.45 గంటలకు శ్రీమూర్తి కల్చలర్ అసోసియేషన్ వారి ‘అంతిమతీర్పు’ –16వ తేది మధ్యాహ్నం 12.45 గంటలకు సిరిమువ్వ కల్చరల్స్, హైదరాబాద్ వారి ‘కల్లం దిబ్బ’ -
జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలి
– ఒలంపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్ కర్నూలు (టౌన్): చండీఘడ్‌లో ఈనెల 28 నుంచి వచ్చేనెల 2 వ తేదీ వరకు నిర్వహిస్తున్న 7వ జాతీయ స్థాయి ఫెడరేషన్ సెపెక్‌తక్రా చాంపియన్ షిప్లో పాల్గొని విజయంతో తిరిగి రావాలని జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షులు విజయ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఔట్‌డోర్ స్టేడియంలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్న జట్లకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీల్లో రాణించి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై కర్నూలు జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలన్నారు. అనంతరం సెపెక్‌తక్రా సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు జట్టును ప్రకటించారు. ఎంపికయిన వారిలో బి. రమేష్‌బాబు (కర్నూలు కెప్టెన్ ) సి. అశోక్‌కుమార్ (కర్నూలు ) పి. నాగ శ్రీకాంత్ రెడ్డి (కడప) ఎస్.కె.మాలిక్ బాషా (కర్నూలు )ఎస్. అశోక్‌బాబు (ఒంగోలు) శివకుమార్ (మేనేజర్)లు ఉన్నారు. -
ఖేలో ఇండియాలో సాగర్ సత్తా
విజయవాడ స్పోర్ట్స్ : గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతున్న ఖేలో ఇండియా జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర అథ్లెట్ ఎం.సాగర్ ఫాస్టెస్ట్ (100 మీటర్ల పరుగు) రన్నింగ్‌లో రజత పతకం సాధించాడు. అండర్–14 విభాగంలో ఫాస్టెస్ రన్నర్‌గా జార్ఖండ్ అథ్లెట్ నిలువగా, కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లుదేవకుంటకు చెందిన ఎం.సాగర్ (11.82 సెకన్లు) ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్రానికి రజత పతకం సాధించాడు. ఈ సందర్భంగా సాగర్‌ను సాయ్ రీజనల్ డైరెక్టర్ (గుజరాత్) రూప్కుమార్నాయుడు, శాప్ వీసీ అండ్ ఎండీ ఎస్.బంగారురాజు, ఓఎస్డీ పి.రామకృష్ణ అభినందించారు. -
సున్ని ఇస్తెమాకు సర్వం సిద్ధం
కర్నూలు(ఓల్డ్‌సిటీ): అహ్లె సున్నతుల్ జమాత్, మర్కజీ మిలాద్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలులో జాతీయ స్థాయి ఒక్కరోజు సున్ని ఇస్తెమా నిర్వహించనున్నారు. ఇస్తెమా ఫజర్ నమాజ్(తెల్లవారు జామున 6.00)కు మొదలై ఇషా నమాజ్ (రాత్రి 8.30) వరకు ఉంటుంది. రాష్ట్ర, అంతర్రాష్ట్ర ఉల్మాలు (ఆధ్యాత్మిక , దర్గాల పీఠాధిపతులు వక్తలుగా పాల్గొంటున్నారు. స్థానిక ఉస్మానియా కళాశాల మైదానంలో సుమారు 60 వేల మంది కూర్చునేందుకు వీలుగా షామియానా, కుర్చీలు తదితర ఏర్పాట్లు చేశారు. మనరాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ముస్లింలకు ఆకట్టుకునేలా ఐదు ప్రవేశ ద్వారాలు, వచ్చిన వారికి టిఫిన్లు, భోజనాలు వడ్డించేందుకు వీలుగా ప్రత్యేక వంట శాల విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇస్తెమాకు ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు అహ్లెసున్నతుల్ జమాత్ జిల్లా కార్యదర్శి సయ్యద్‌షా షఫిపాషా ఖాద్రి తెలిపారు. అజ్మీర్ దర్గా సజ్జాదే నషీన్ సయ్యద్ ఫజ్లుల్ మతీన్, గుల్బర్గా దర్గా సజ్జాదే నషీన్ సయ్యద్ ఖుస్రూ హుసేని ప్రసంగిస్తారన్నారు. ఐదు పూటలా నమాజులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఏర్పాట్లలో అహ్లె సున్నతుల్ జమాత్ సంయుక్త కార్యదర్శి సయ్యద్ ముర్తుజా ఖాద్రి కూడా ఉన్నారు. -
నేటి నుంచి బీజేపీ జాతీయ స్థాయి సమావేశాలు
-
ఉత్సాహభరితంగా నాటిక ప్రదర్శనలు
కర్నూలు(కల్చరల్): కర్నూలులో తొలిసారిగా నిర్వహించిన తెలుగు నాటిక పోటీలు ఉత్సాహ భరితంగా సాగినట్లు లలిత కళాసమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య తెలిపారు. స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో శనివారం ఉదయం 10 గంటలకు తానా జాతీయ స్థాయి నాటిక పోటీల మూడో రోజు ప్రదర్శనలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పోటీలకు విశేష స్పందన లభించిందన్నారు. కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి నాటిక సమాజాలు తరలివచ్చాయన్నారు. ఉల్లాసం నింపిన నాటికలు శనివారం ఉదయం స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ఉదయం 10 గంటలకు సాయి ఆర్ట్స్ కొలకలూరు కళాకారులు ప్రదర్శించిన ఒక్క మాటే చాలు నాటిక ప్రేక్షకుల్లో ఉల్లాసం నింపింది. మాటలతో బంధాలను పంచుకోవాలే కానీ తెంచుకోకూడదు అనే సందేశాన్నిచ్చిన ఈ నాటికను భవానీ ప్రసాద్ రచించగా గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు. అనంతరం నంద్యాల కళారాధన సంస్థ కళాకారులు ప్రదర్శించిన సైకత శిల్పం నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. భార్యాభర్తల బంధాలు ఆర్థిక, వ్యాపార సంబంధాలుగా మారితే అది కుటుంబాలకు ఎంత ప్రమాదకరమో ఈ నాటిక కళ్లకు కట్టింది. మురళీకృష్ణ నిలయం నిజామాబాద్ కళాకారులు ప్రదర్శించిన పొద్దు పొడిచింది నాటిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆద్యంతం తెలంగాణ మాండలికంలో సాగిన ఈ నాటిక అలనాటి నిజాం పాలనలో పటేళ్ల దౌర్జన్యాలను తూర్పారపట్టింది. దొర పెత్తనాలు, దౌర్జన్యాలకు దొరసానే తిరగబడి పేదల పక్షాన నిలబడి, పేదలకు మంచి రోజులు వచ్చే 'పొద్దు పొడిచింది' అనే సందేశంతో అంతమైన ఈ నాటకం ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపింది. కార్యక్రమంలో లలిత కళాసమితి కార్యదర్శి మహమ్మద్ మియా, సహాయ కార్యదర్శి ఇనాయతుల్లా, కోశాధికారి బాలవెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు యాగంటీశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఏపీ జట్టు
వెంకటేశ్వరపురం(నంద్యాల రూరల్): ఈనెల 22 నుంచి 24 వరకు ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో జరిగే 62వ జాతీయ స్థాయి స్కూల్‌గేమ్స్ అండర్–17 బాలబాలికల రగ్బీ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర క్రీడాకారులను ఎంపిక చేసినట్లు రగ్బీ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు తెలిపారు. మంగళవారం నంద్యాల సమీపంలోని వెంకటేశ్వరపురం వద్ద ఉన్న ఎస్డీఆర్ వరల్డ్ స్కూల్లో రాష్ట్ర జట్టు క్రీడాకారులతో స్కూల్ చైర్మన్ కొండారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల జట్టు కర్నూలు శ్రీలక్ష్మిప్రియ, గురురుషిక, చిట్టెమ్మ, శ్రీవల్లి, భారతి, అనూష, శివాణి, నెల్లూరుకు చెందిన శిల్పా, సాయివిహారిక, చిత్తూరుకు చెందిన జాహ్నవి, కడపకు చెందిన భవ్య నందిని, బాలుర విభాగంలో కర్నూలుకు చెందిన దివాకర్, సురేంద్ర, సందీప్, నెల్లూరుకు చెందిన షబ్బీర్, నవీన్, అబ్దుల్లా, శ్రీకాంత్, గుంటూరుకు చెందిన సాయిరంజిత్, గురుకృష్ణ, చిత్తూరుకు చెందిన శంకర్, మోహన్, కడపకు చెందిన ప్రవీణ్‌కుమార్‌లు ఎంపికయ్యారని వివరించారు. -
22 నుంచి జాతీయస్థాయి సాంఘిక నాటిక పోటీలు
కర్నూలు(టౌన్): తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఉత్తర అమెరికా (తానా) ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి 24 వరకు స్థానిక సి.క్యాంపులోని టి.జి.వి. కళాక్షేత్రంలో జాతీయ స్థాయి సాంఘిక నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాక్షేత్రం చైర్మన్ టి.జి. భరత్ వెల్లడించారు. సోమవారం స్థానిక మౌర్య ఇన్‌లోని పరిణయ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. 22 వ తేదీ సాయంత్రం 6 గంటలకు జ్యోతి ప్రజ్వలన, 7 గంటలకు సభా కార్యక్రమం ఉంటుందన్నారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యులు టి.జి. వెంకటేష్, రాయలసీమ ఐజీ శ్రీధర్, జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శివకోటిబాబురావు, జాయింట్ కలెక్టర్ హరికిరణ్‌తోపాటు తాను కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో 9 టీమ్‌లు పోటీల్లో పాల్గొంటాయన్నారు. ప్రతిరోజు మూడు టీమ్‌లు మూడు రోజుల పాటు నాటికలను ప్రదర్శిస్తారన్నారు. 24న ముగింపు రోజు ఉత్తమ నాటిక ప్రదర్శన, బహుమతి ప్రదానం, హైదరాబాదు వారిచే సంగీత విభావరి ఉంటుందని తెలిపారు. ముగింపు కార్యక్రమంలో సిని నటుడు, యువ హీరో నిఖిల్, మిమిక్రీ కళాకారుడు రమేష్, అమెరికా నుంచి తానా అధ్యక్షులు చౌదరి జంపాల, సతీష్ వేమన, సంయుక్త కార్యదర్శి రవి పోట్లూరి, గోగినేని శ్రీనివాసు హాజరవుతున్నట్లు తెలిపారు. సమావేశంలో కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, తానా కో-ఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్ పాల్గొన్నారు. -
హాకీ కోచ్‌గా వెంకటేశ్వర్లు
దేవనకొండ: ఆంధ్రప్రదేశ్ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ స్థాయి హాకీ పోటీలకు తెర్నెకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వెంకటశ్వర్లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం సునీలమ్మ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు హర్యానాలోని సోనిపట్ ప్రాంతంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. గతంలో ఈయన దాదాపు ఐదుసార్లు జాతీయస్థాయి పోటీలకు కోచ్‌గా వ్యవహరించారన్నారు. గ్రామ సర్పంచు రాజన్న, ఉపసర్పంచు సత్యరాజు, ఎంఈఓ యోగానందం, ఎంపీడీఓ ఉమామహేశ్వరమ్మ, ఎంపీపీ రామచంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన నృత్యోత్సవం
నంద్యాల: నంది నృత్యోత్సవంలో భాగంగా చిన్నారులు రెండోరోజు శాస్త్రీయ నృత్యాలతో అలరించారు. జాతీయ స్థాయిలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. స్థానిక మున్సిపల్ టౌన్హాల్లో సాయి నృత్య అకాడమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నంది నృత్యోత్సవం రెండో రోజైన ఆదివారం ప్రదర్శనలు అదరగొట్టాయి. కవితాకర్(కోల్‌కత), మాలవిక(చెన్నై) భరతనాట్యం, తరుణి(భద్రం), దీపారెడ్డి(అనంతపురం), కూచిపూడి, సౌందర్య(శ్రీకాకుళం), లక్ష్మిప్రసూన శిష్యబృందం (హైదరాబాద్), ముసుమారి ఆర్ట్స్ అకాడమి(హైదరాబాద్) విద్యార్థులు తరంగ నృత్యం, మాలవిక(చెన్నై), రాజరాజేశ్వరి అష్టకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. వందమంది కళాకారులకు ప్రశంసా పత్రాలు, పతకాలు, శాలువాలు, నంది విగ్రహంతో పాటు బిరుదుతో సాయి నాట్యాకాడమి అధ్యక్షుడు సురేష్ సన్మానించారు. కార్యక్రమంలో మునుకూట్ల సాంబశివ, రాదిక, అనిల్‌కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ టోర్నీకి జిల్లా జట్లు
ముమ్మిడివరం : బాస్కెట్‌బాల్ నేషనల్ టోర్నమెంట్‌కు బా లురు, బాలికలను ఎంపిక చేసినట్లు ఏపీ రాష్ట్ర బాస్కెట్ బా ల్ అసోసియేషన్ అధ్యక్షుడు చెంకల రామనాయుడు, ఇన్చార్జి కార్యదర్శి చక్రవర్తి, జాతీయ క్రీడా కారుడు నడిం పల్లి అప్పలరాజు తెలిపారు. ఈ జట్లు కర్నాటక రాష్ట్రం హాసన్‌లో ఈనెల 19 నుంచి జరి గే జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున ఆడతాయన్నా రు. ఆ పోటీల్లో ప్రతిభ కనపరిచినవారు దేశం తరఫున ఆడతారన్నారు. శిక్షణ పొందిన క్రీడాకారులకు ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు స్పోర్ట్స్ కిట్లు అందజేశారు. జట్లకు ఎంపికయిన విద్యార్థులు గురువారం హాసన్ బయలుదేరారు. బాలికల జట్టు : ఎస్కే చాందిని(గుంటూరు), ఎం.ఈశ్తర్ రాణి(గుంటూరు), సీఎస్ఎస్ సుస్మిత, ఎ.జాస్మిన్ (తూర్పుగోదావరి), ఆర్.శ్వేత, వి.సాత్విక (కృష్ణా), బి.ప్రమీల(అనంతపురం), డి.నెహ్రామృత(విశాఖ), కె.హిమబిందు(కర్నూలు), సి.శ్వేతామాధురి(పశ్చిమగోదావరి), జి.అఖిల(చిత్తూరు), పి.ఉమామహేశ్వరి(గుంటూరు), ఎన్.పద్మావతి(అనంతపురం). బాలుర జట్టు : వి.నాగదుర్గా ప్రసాద్, ఎ.సాయిపవన్ కుమార్, ఎస్వీవీ సాయి కృష్ణ, ఎన్.రవితేజ, ఎం.మణికం ఠ, కె.అవినాష్, (తూర్పుగోదావరి), వి.సాయిగణేష్, ఎస్.సచిన్ (విశాఖ), వై.సాయికృష్, పి.భాస్కర్ (గుంటూరు), ఎ.సాయికుమార్(అనంతపురం), ఎం.విశాల్(చిత్తూరు), కె.కె.రెడ్డి(పశ్చిమగోదావరి), జె.ఆకాష్(కృష్ణా). ఫుట్‌బాల్ టోర్నీలో జిల్లాకు రెండోస్థానం భానుగుడి(కాకినాడ) : చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఈ నెల 10నుంచి 15వరకు నిర్వహించిన జసిద్దిన్ మెమోరియల్ సౌత్ ఇండియా ఫుట్‌బాల్ ఇన్విటేషన్ టోర్నమెం ట్లో జిల్లాజట్టు రెండోస్థానం సాధించినట్లు క్రీడాభివృద్ధి అధికారి పి.మురళీధర్ గురువారం ఓ ప్రకటనలో తెలి పారు. జట్టు తలపడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలుపొం ది ఫైనల్‌కు చేరిందని, ఫైనల్లో స్పోట్స అథారిటీ ఆఫ్ ఇండియా కర్నూల్ జట్టుతో పోటీపడి పెనాల్టీ షూటౌట్ లో 03–04 స్కోరుతో రెండవ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. క్రీడాకారులను, శిక్షకులను అభినందించారు. -
నేటి నుంచి ఆల్ ఇండియా బాడ్మింటన్ పోటీలు
కర్నూలు (టౌన్) : స్థానిక ఇండర్‌స్టేడియంలో గురువారం నుంచి ఆల్ ఇండియా సబ్ జూనియర్ బాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు భారత బాడ్మింటన్ సంఘం పర్యవేక్షకులు ఫణిరావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక ఇండోర్ స్టేడియంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 రాష్ట్రాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారని, వీరందరికి క్వాలిఫైయింగ్ పోటీలు నిర్వహించి మెయిన్ పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు బాలికలు 293 మ్యాచ్‌లో పాల్గొని 175 మంది అర్హత సాధించారని, ర్యాంకింగ్ ప్రకారం 16 మంది మెయిన్ పోటీల్లో పాల్గొంటారన్నారు. అలాగే బాలుర విభాగంలో 514 మ్యాచ్‌ల్లో 330 మంది అర్హత సాధించారన్నారు. బాలుర విభాగంలో 16 మంది చోప్పున్న మెయిన్ మ్యాచ్‌లో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో అల్ ఇండియా బాడ్మింటన్ సబ్ జూనియర్ బాడ్మింటన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాసభట్, కోశాధికారి డాక్టర్ రవి కళాథర్ రెడ్డి పాల్గొన్నారు. -
హోరాహోరీగా బ్యాడ్మింటన్ పోటీలు
- రెండోరోజు కొనసాగిన క్వాలీఫైయింగ్ మ్యాచ్‌లు - తిలకించేందుకు తరలివచ్చిన క్రీడాభిమానులు కర్నూలు (టౌన్): కర్నూలు నగరంలో ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ సబ్‌జూనియర్ టోర్నమెంట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈనెల 10నుంచి జరిగే ఇన్నింగ్స్ పోటీల్లో అర్హత కోసం రెండురోజు మంగళవారం క్వాలీఫైయింగ్ మ్యాచ్‌లు నిర్వహించారు. స్థానిక ఔట్‌డోర్ స్టేడియంతో పాటు జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఔట్‌డోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీలకు వివిధ రాష్ట్రాలకు చెందిన 800 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా జాతీయస్థాయి పోటీలు కర్నూలులో నిర్వహిస్తుండటంతో క్రీడాభిమానుల్లో ఆసక్తి పెరిగింది. దీంతో రెండు రోజులుగా ఔట్‌డోర్ స్టేడియానికి అభిమానులు భారీగా తరలివస్తున్నారు. క్రీడా వస్తువులు కొనుగోలు చేస్తున్న క్రీడాకారులు ఈనెల 13 వ తేదీ వరకు జరిగే ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ సబ్‌జూనియర్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు నగరంలోని స్పోర్‌్ట్స దుకాణాలకు క్యూ కడుతున్నారు. షటిల్ బ్యాడ్మింటన్, ప్రాక్టీస్ చేసుకునేందుకు షటిల్ కాక్, షూస్ కొనుగోళ్లతో మంగళవారం బిజిగా కనిపించారు. ఏర్పాట్లు బాగున్నాయి: రూపల్ పట్లే ( ఉత్తర్ ఖండ్ ) ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ సబ్‌జూనియర్స్ టోర్నమెంట్‌కు చేసిన ఏర్పాట్లు బాగున్నాయి. రెండవ రోజు క్వాలీఫైయింగ్ పోటీల్లో పాల్గొన్నా. ఎలాగైనా టోర్నమెంట్లో సత్తా చాటాలని ఇక్కడికి వచ్చాను. మొట్టమొదటిసారి పాల్గొంటున్నా: హర్షిత (చత్తీస్ఘడ్) జాతీయ స్థాయి పోటీల్లో మొట్టమొదటిసారిగా పాల్గొంటున్నా. క్వాలీఫైయింగ్ మ్యాచ్‌లోను గట్టిపోటీ ఉంది. అయినా, రాణిస్తానన్న నమ్మకం ఉంది. -
దేశవ్యాప్తంగా ఇంటర్‌కు ఒకే తరహా పరీక్ష!
► కేంద్రానికి అధికారుల కమిటీ సిఫారసు ► 2 దీర్ఘ, 4 స్వల్పకాలిక, 8 లఘు సమాధాన విధానంలో ప్రశ్నపత్రం ► అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సిందే! ► వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసే యోచన సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ స్థాయిలో ఒకే తరహా సిలబస్, ఒకే నమూనా ప్రశ్నపత్రాన్ని అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ చర్యలు చేపట్టింది. ప్రతి సబ్జెక్టులో 2 దీర్ఘ (లాంగ్) ప్రశ్నలు, 4 స్వల్ప సమాధాన (షార్ట్) ప్రశ్నలు, 8 లఘు (వెరీ షార్ట్) సమాధాన ప్రశ్నలు ఉండేలా ప్రశ్నపత్రాన్ని రూపొందించనుంది. ప్రతి సబ్జెక్టులో 70 శాతం మార్కులు రాతపరీక్షలకు, 30 శాతం మార్కులు ప్రాక్టికల్స్‌కు కేటాయించనుంది. మొత్తంగా ఇంటర్ స్థాయిలో దేశవ్యాప్తంగా ఒకే తరహా విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చే దిశగా చర్యలు వేగవంతమయ్యాయి. వీలైతే వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ సంస్కరణలను అమల్లోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది. వేర్వేరు సిలబస్‌లు, విధానాలతో సమస్యలు ప్రస్తుతం ఇంటర్మీడియెట్ స్థాయిలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సిలబస్, ఒక్కో తరహా పరీక్షల విధానం ఉన్నాయి. వేర్వేరు తరహా ప్రశ్నపత్రాలు, మార్కుల విధానం ఉన్నాయి. దీనివల్ల జాతీయ స్థాయి పోటీ పరీక్షలు, ప్రవేశాల విధానంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్లో దేశవ్యాప్తంగా ఒకే రకమైన విద్యా విధానాన్ని అమల్లోకి తేవాలని కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయించింది. ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు గతేడాది రెండు ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. సిలబస్‌లో మార్పులపై తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ చైర్మన్‌గా ఒక కమిటీని, ప్రశ్నపత్రాల నమూనాపై మేఘాలయ విద్యా కమిషనర్ అండ్ సెక్రటరీ ఈపీ కర్భీహ్ చైర్మన్‌గా మరో కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సిలబస్ కమిటీ గతంలోనే తమ నివేదికను అందజేయగా.. ప్రశ్నపత్రం నమూనాపై ఏర్పాటు కమిటీ ఇటీవలే తమ నివేదికను సమర్పించింది. ఆప్షన్ విధానం ఉండొద్దు! ఇంటర్లో అన్ని సబ్జెక్టుల పరీక్షల నిర్వహణ, ప్రశ్నలు ఉండాల్సిన తీరును కర్భీహ్ ఆధ్వర్యంలోని కమిటీ తమ నివేదికలో సూచించింది. అన్ని సబ్జెక్టుల్లోనూ 2:4:8 నిష్పత్తి విధానంలో ప్రశ్నలు ఉండాలని పేర్కొంది. అంటే దీర్ఘమైన జవాబులు రాసే ప్రశ్నలు 2, స్వల్ప సమాధాన ప్రశ్నలు 4, లఘు సమాధాన ప్రశ్నలు 8 ఉండాలని స్పష్టం చేసింది. అయితే పరీక్షించే విధానం పూర్తిగా డిస్రి్కప్టివ్ (వివరణాత్మక) విధానంలో ఉండాలని.. విద్యార్థులు ప్రతి ప్రశ్నకు జవాబు రాసేలా ఉండాలని, ఆప్షన్ విధానం ఉండొద్దని ప్రతిపాదించింది. ప్రతి సబ్జెక్టులోనూ ప్రాక్టికల్ విధానం ఉండాలని.. రాతపరీక్షకు 70 శాతం మార్కులు, ప్రాక్టికల్స్‌కు 30 శాతం మార్కులు ఉండాలని సూచించింది. ప్రశ్నపత్రాన్ని క్షుణ్నంగా చదువుకునేందుకు 15 నిమిషాలు అదనంగా సమయం ఇవ్వాలని పేర్కొంది. సులభ ప్రశ్నలు 35 శాతం, సాధారణ ప్రశ్నలు 40 శాతం, కఠిన ప్రశ్నలు 25 శాతం ఉండేలా చూడాలని తెలిపింది. గణితం, సైన్స్ పరీక్షలకు 3 గంటల సమయం ఇవ్వాలని ప్రతిపాదించింది. ఓపెన్ బుక్ పరీక్షా విధానం అమల్లోకి తెస్తే ఎలా ఉంటుందన్న మానవ వనరుల శాఖ సూచనను కమిటీ తిరస్కరించింది. కాగా.. ఇప్పటికే నివేదిక సమర్పించిన సిలబస్ కమిటీ.. అన్ని రాష్ట్రాల్లోని ఇంటర్ విద్యలో, సీబీఎస్ఈ విద్యా సంస్థల్లోని 10+2 విధానంలోనూ కామన్ కోర్ సిలబస్ ఉండాలని సూచించిన విషయం తెలిసిందే. మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టుల్లో మాత్రం 100 శాతం కామన్ కోర్ సిలబస్ ఉండాలని.. ఇతర గ్రూపులు, సబ్జెక్టుల్లో 70 శాతం కామన్ సిలబస్ ఉండాలని ప్రతిపాదించింది. -
కరికాళ చోళుడు
ఉత్తమ కళాఖండంగా ఎంపిక నంద్యాల: స్థానిక చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ రూపొందించిన కరికాళ చోళుడు చిత్రం ఉత్తమ కళా చిత్రంగా ఎంపికైంది. నెల్లూరులోని అమీర్ ఫైన్ ఆర్ట్ అకాడమీ జాతీయ స్థాయిలో నిర్వహించిన చిత్రకళ పోటీల్లో ఆయన చోళుడు చిత్రాన్ని కాంస్య విగ్రహ శైలిలో సజీవంగా చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని కాన్వాస్‌పై నాలుగు అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పులో తైల వర్ణంలో నెలరోజులు శ్రమించి తీర్చిదిద్దారు. ఈ చిత్రం ఉత్తమ కళాఖండంగా ఎంపిక కావడంపై ప్రముఖ చిత్రకారుడు చందా రామయ్య, రాంప్రసాద్ అభినందించారు. నవంబర్ 20న నెల్లూరు టౌన్హాల్లో అవార్డును అందజేస్తారని కోటేష్ తెలిపారు. -
జాతీయస్థాయి హాకీ పోటీలకు అజయ్
రేటూరు(కాకుమాను): హాకీ అండర్14 జాతీయ స్థాయి పోటీలకు రేటూరు విద్యార్థి కె.అజయ్ ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు వీరచంద్ర బుధవారం తెలిపారు. ఇటీవల కర్నూలులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో అండర్ 14 విభాగం నుంచి పాఠశాలకు చెందిన కె.అజయ్ అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. వచ్చే నెల హర్యానాలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో అతను పాల్గొంటారని చెప్పారు. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజారత్నం, ఉపాధ్యాయులు, విద్యార్థులు అజయ్‌ను అభినందించారు. -
‘శ్రీప్రకాష్’లో జాతీయ టేబుల్ టెన్నిస్ పోటీలు
ప్రారంభించిన ఎంపీ తోట నరసింహం పెద్దాపురం : శారీరక, మానసికోల్లాసానికి క్రీడలు దోహదపడతాయని కాకినాడ ఎంపీ తోట నరసింహం అన్నారు. పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో మూడురోజుల పాటు నిర్వహించే జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ క్లస్టర్–7 పోటీలను గురువారం సాయంత్రం జ్యోతిప్రజల్వన చేసి ఆయన ప్రారంభించారు. పాఠశాల డైరెక్టర్ సీహెచ్.విజయ్‌ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ సభలో ఎంపీ తోట మాట్లాడుతూ నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడుతున్న నేటి విద్యా విధానంలో శ్రీప్రకాష్ పాఠశాల జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి. భాస్కరరామ్లు మాట్లాడుతూ నేటి విద్యా విధానంలో క్రీడల ప్రాముఖ్యతను చాటుతూ క్రీడలకు ఉన్నతస్థానాన్ని కల్పించిన ఘనత శ్రీ ప్రకాష్ యాజమాన్యానికే దక్కుతుందన్నారు. పాఠశాల డైరెక్టర్ సీహెచ్.విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ నైపుణ్యాన్ని కనబరిచి గెలుపునకు ముందడుగు వేయాలన్నారు. అనంతరం ఎంపీ నరసింహం, చైర్మన్ సూరిబాబురాజు టేబుల్ టెన్నిస్ ఆడి అండర్–14, అండర్–17, అండర్–19 బాలుర, బాలికల క్రీడా పోటీలను ప్రారంభించారు. టీటీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పీవీఎన్ సూర్యారావ్, యూఐసీ కోచ్ అచ్యుత్‌కుమార్, ఓవరాల్ టెక్నికల్ ఇన్చార్జి పి.వేణుగోపాల్, పాఠశాల డీన్ రాజేశ్వరి, లైజాన్ ఆఫీసర్ ఎం.సతీష్, ఆయా రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. -
ముగిసిన జాతీయ స్థాయి క్రీడా పోటీలు
భువనగిరి టౌన్: ఈ నెల 3వ తేదీ నుంచి భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన అండర్–19 జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్, షూటింగ్ బాల్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో 18 రాష్ట్రాలకు చెందిన 44 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్స్ అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు ఓటమితో నిరాశ చెందకుండా మరింత మెరుగ్గా రాణిస్తే గెలుపు సొంతం అవుతుందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న వారిని ఆదర్శంగా తీసుకొని దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య మాట్లాడుతూ భువనగిరిలో జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించడం గర్వకారణమన్నారు. భువనగిరి ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతాయన్నారు. అనంతరం విజేతలకు కప్, మెడల్స్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐఓ ఎన్. ప్రకాశ్‌బాబు, టీఎన్జీఓ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జడల అమరేందర్, భువనగిరి ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాల్, పీఈటీ జిల్లా కార్యదర్శి టి. విజయసాగర్, ఎస్జీఎఫ్ జిల్లా అర్గనైజింగ్ కార్యదర్శి జి. దయాకర్‌రెడ్డి, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జి. సోమనర్సయ్య, డివిజన్ అధ్యక్షుడు కె.గోపాల్ పాల్గొన్నారు. విజేతలు వీరే – జాతీయ స్థాయి బాల్‌బాడ్మింటన్ బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ మెుదటి స్థానంలో నిలువగా, కర్నాటక ద్వితీయ, తమిళనాడు తృతీయ స్థానాల్లో నిలిచాయి. – బాల్‌బాడ్మింటన్ బాలికల విభాగంలో తమిళనాడు ప్రథమ స్థానం సాధించగా, కేరళ ద్వితీయ, కర్నాటక తృతీయ బహుమతులు సాధించాయి. – షూటింగ్ బాల్ బాలుర విభాగంలో మహారాష్ట్ర మెుదటి, పంజాబ్ ద్వితీయ, ఢిల్లీ తృతీయ బహుమతులు సాధించాయి. – షూటింగ్ బాల్ బాలికల విభాగంలో మహారాష్ట్ర మెుదటి, ఢిల్లీ ద్వితీయ, తెలంగాణ తృతీయ బహుమతులు సాధించాయి. -
జాతీయ స్థాయి చెస్ పోటీలకు శాలిగౌరారం విద్యార్థిని
శాలిగౌరారం : మండల కేంద్రానికి చెందిన షేక్ నస్రీన్ అనే విద్యార్థిని అండర్ –19 విభాగంలో జాతీయస్థాయి చెస్ పోటీలకు ఎంపికైంది. స్థానికంగా చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న షేక్ సయ్యద్ – జుబేదాల కూతురు నస్రీన్ ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తోంది. నస్రీన్ ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి మూడో స్థానంలో నిలిచింది. దీంతో నస్రీన్‌ను అధికారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. నస్రీన్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి 40 మంది క్రీడాకారులు పాల్గొనగా అందులో జాతీయ స్థాయికి ఎంపికైన నలుగిరిలో నస్రీన్ ఒకరు. నేటి నుంచి 18వ తేదీ వరకు ఏపీలోని రాజమండ్రిలో అఖిల భారత చెస్ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగి జాతీయ స్థాయి చెస్ పోటీల్లో నస్రీన్ పాల్గొననుంది. జాతీయ స్థాయి చెస్ పోటీలకు ఎంపికైన నస్రీన్‌ను చెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులతో పాటు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు అభినందించారు. తమ్ముడూ చెస్ క్రీడాకారుడే... నస్రీన్ తమ్ముడు షేక్ షరీఫ్‌పాషా కూడా చెస్ క్రీడాకారుడే కావడం గమనార్హం. షరీఫ్‌పాష గత నెల 17 నుంచి 19 వరకు రంగారెడ్డి జిల్లా నాగారంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పథకాన్ని సాధించాడు. దీంతో ఇతడు కూడా అండర్ – 19 విభాగంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. -
కొనసాగుతున్న జాతీయ స్థాయి క్రీడలు
భువనగిరి టౌన్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరుగుతున్న అండర్ –19 జాతీయ స్థాయి క్రీడలు గురువారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య, బాల్‌బ్యాడ్మింటన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌లు క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాకౌట్, సెమీఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. కాగా బాలుర విభాగం సెమీ ఫైనల్లో తమిళనాడుతో 35–33, 27–35, 35–20 పాయింట్లతో విజయం సాధించిన ఏపీ, కేరళపై 35–20, 35–31తో విజయం సాధించిన కర్నాటక జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. అలాగే బాలికల విభాగంలో ఏపీపై 35–17, 35–20 పాయింట్లతో విజయం సాధించిన తమిళనాడు, కర్నాటకపై 31–35, 35–25, 28–35 పాయింట్ల తేడాతో విజయం సాధించిన కేరళ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. కాగా ఫైనల్ పోటీలను శుక్రవారం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
కొనసాగుతున్న జాతీయ స్థాయి క్రీడలు
భువనగిరి టౌన్: భువనగిరి పట్టణంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్–19 జాతీయ స్థాయి క్రీడా పోటీలను మంగళవారం ఆర్డీఓ ఎంవీ. భూపాల్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు కల్పించిన సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఎస్సీఓ మాక్బుల్ అహ్మద్, జిల్లా క్రీడల ఆర్గనైజింగ్ కార్యదర్శి గువ్వ దయాకర్‌రెడ్డి, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జి. సోమనర్సయ్యలు ఉన్నారు. రెండవ రోజు బాల్‌బాడ్మింటన్ బాలుర విభాగంలో 13 జట్లు, బాలికల విభాగంలో 12 జట్లు పోటీ పడ్డాయి. అదే విధంగా షూటింగ్ బాల్ బాలుర విభాగంలో 6 జట్లు తలపడ్డాయి. షూటింగ్ బాల్ ఫైనల్ విజేతలు వీరే జాతీయ స్థాయి షూటింగ్ బాల్ ఫైనల్ బాలికల విభాగంలో మహారాష్ట్ర ప్రథమ స్థానం సాధించగా, ఢిల్లీ రెండోస్థానం, తెలంగాణ తృతీయ స్థానాలు సాధించాయి. అదే విధంగా బాలుర విభాగంలో మహారాష్ట్ర మెుదటి స్థానం, పంజాబ్ ద్వితీయ స్థానంలో నిలిచాయి. బాల్‌బ్యాడ్మింటన్ విజేతలు బాలుర విభాగంలో... ఒడిశా, సీబీఎస్ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 35–19, 35–19తో ఒడిశా జట్టు విజయం సాధించింది. అదే విధంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 35–23, 35–22తో కర్నాటక, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 35–14, 35–21 తేడాతో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 35–15, 35–19 తేడాతో గుజరాత్, మధ్యప్రదేశ్‌తో 35–22, 32–35, 35–21 తేడాతో విద్యాభారతి, సీబీఎస్ఈతో 35–12, 35–12 తో తమిళనాడు, పాండిచ్ఛేరితో 35–30, 35–33తో తెలంగాణ జట్లు విజయం సాధించాయి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 35–19, 35–19తో ఏపీ, ఉత్తరప్రదేశ్‌తో 35–12, 35–19తో ఛత్తీస్‌గఢ్, పాండిచ్ఛేరితో 35–25, 35–23తో కేరళ, ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో 35–25, 35–31 తేడాతో ఛండీగఢ్‌లు విజయం సాధించాయి. బాలికల విభాగంలో.... తెలంగాణ, పంజాబ్ జట్లు మధ్యన జరిగిన మ్యాచ్‌లో 35–21,35–25తో తెలంగాణ జట్టు విజయం సాధించింది. అదే విధంగా ఒడిశాతో 35–24, 35–25తో మహారాష్ట్ర, గుజరాత్‌తో 35–20, 35–28తో ఛత్తీస్‌గఢ్, సీబీఎస్ఈతో 35–8, 35–14తో కర్నాటక, ఢిల్లీతో 35–18, 35–25తో కేరళ జట్లు విజయం సాధించాయి. అలాగే మధ్యప్రదేశ్‌తో 35–20, 35–22తో ఏపీ, ఛత్తీస్‌గఢ్‌తో 35–19, 35–18తో కేరళ, పంజాబ్‌తో 35–15స 35–13తో కర్నాటక, ఉత్తరప్రదేశ్‌తో 35–16, 35–12తో ఒడిశా, విద్యాభారతితో 35–14, 35–11తో చంఢీగడ్, గుజరాత్‌తో 35–33, 21–35, 35–23తో ఢిల్లీ జట్లు విజయం సాధించాయి. -
భువనగిరిలో జాతీయ స్థాయి క్రీడాపోటీలు ప్రారంభం
భువనగిరి టౌన్ : క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సూచించారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో అండర్ – 19 ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్‌లో క్రీడాకారులు అతితక్కువగా ఉన్నారన్నారు. ఒలంపిక్స్‌లో పతకాలు సాధించిన సాక్షి మాలిక్, పీవీ సింధులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీసుకువచ్చేందుకు నిర్వహిస్తున్న పోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు టోర్నమెంట్‌కు సంబంధించిన ఎస్జీఎఫ్ జాతీయ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించి, క్రీడాజ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా 18 రాష్ట్రాల నుంచి వచ్చిన 44 జట్లు మార్చ్ఫాస్ట్ నిర్వహించాయి. అనంతరం షూటింగ్‌బాల్ బాలికల విభాగంలో తెలంగాణ, తమిళనాడు జట్ల మధ్య పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఇంటర్‌బోర్డు కమిషనర్ ఏ.అశోక్, ఎస్జీఎఫ్ నల్లగొండ జిల్లా కన్వీనర్ ఎం.ప్రకాష్‌బాబు, నేషనల్ టోర్నమెంట్ పర్యవేక్షకులు దినేష్‌సింగ్, మున్సిపల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య, ఆర్డీఓ ఎం. వెంకట్‌భూపాల్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, తహసీల్దార్ కె.వెంకట్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మందడి ఉపేందర్‌రెడ్డి, డిప్యూటీ ఈఓ పి.మదన్మోహన్, ఇన్స్పెక్టర్ ఎం.శంకర్‌గౌడ్, జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ఉమామహేశ్వర్, నాయకులు గోలి ప్రణీత, జడల అమరేందర్‌గౌడ్, నాగారం అంజయ్య, మారగోని రాముగౌడ్, కొలుపుల అమరేందర్, జి.దయాకర్‌రెడ్డి, సోమనర్సయ్య పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు జాతీయస్థాయి క్రీడాపోటీల సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మిర్యాలగూడలోని ప్రకాష్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు, భువనగిరి పట్టణంలోని విజ్ఞాన్, శ్రీవాణి పాఠశాల విద్యార్ధులు లె లంగాణ చరిత్రకు సంబంధించిన పాటలతో డ్యాన్సులు చేశారు. -
భువనగిరిలో జాతీయ స్థాయి క్రీడాపోటీలు
భువనగిరి టౌన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించనున్న జాతీయ స్థాయి క్రీడా పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భువనగిరి ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న క్రీడా మైదానాన్ని ఆదివారం ఆర్డీఓ పరిశీలించి మాట్లాడారు. క్రీడల నిర్వహణకు ఎలాంటి లోటుపాట్లు జరుగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. క్రీడాకారులకు కల్పించనున్న వసతి, భోజనం ఏర్పాట్ల గురించి అధికారులు అడిగితెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, లైటింగ్ సిస్టం ఏర్పాట్లపై మున్సిపాలిటీ అధికారుల ద్వారా ఆరా తీశారు. అనంతరం క్రీడల్లో పాల్గొనే 18 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పరియం చేసుకుని ఉత్తమ ప్రతిభ కనబర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య, తహసీల్దార్ కె.వెంకట్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మందడి ఉపేందర్‌రెడ్డి, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి గువ్వా దయాకర్‌రెడ్డి, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సోమ నర్సింహారెడ్డి, మున్సిపల్ డీఈ ఇ.ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
పవర్‌లిఫ్టింగ్‌లో జిల్లాకు పతకాలు
మంగళగిరి: జార్ఖండ్ రాష్ట్రం జంషెడ్‌పూర్‌లో ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన జాతీయస్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీలలో జిల్లా యువకులు కాంస్యపతాకాలు సాధించినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోషియేషన్ కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరావు తెలిపారు. స్థానిక జిమ్‌సెంటర్‌లో ఆదివారం యువకులను ఘనంగా సన్మానించారు. మంగళగిరికి చెందిన షేక్ మహ్మద్‌గౌస్ 105 కేజీల విభాగంలో, సత్తెనపల్లికి చెందిన పసుపులేటి సురేష్ 160 కేజీల విభాగంలో కాంస్య పతకాలు సాధించగా సత్తెనపల్లికి చెందిన గడ్డం రమేష్ 105 కేజీల విభాగంలో, మంగళగిరికి చెందిన జొన్నాదుల ఈశ్వరకుమార్ 120 కేజీల విభాగంలో ఐదవస్థానం సాధించారు. వారిని అసోషియేషన్ అధ్యక్షుడు మహ్మద్‌రఫీ, సభ్యులు ఎండీ ఖమురుద్దీన్, కె.విజయభాస్కర్,ఎస్కె.సంధాని, ఎన్.శేషగిరిరావు తదితరులు అభినందించారు. -
బీవీఆర్ఐటీలో కెంకాన్
నేటి నుంచి జాతీయ సదస్సు రెండు రోజల పాటు కొనసాగింపు 12 అంశాలపై ప్రజెంటేషన్ వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు, ప్రొఫెసర్లు రాక నర్సాపూర్:స్థానిక బీవీఆర్ఐటీ కళాశాలలో శనివారం నుంచి రెండు రోజుల పాటు జాతీయ స్థాయి సదస్సు జరగనుంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా దేశంలోని ఎంపిక చేసిన కళాశాలల్లో జాతీయ స్థాయి సదస్సులు జరుగుతాయి. ఈసారి బీవీఆర్ఐటీకి సదస్సు నిర్వహించే అవకాశం లభించింది. 12వ వార్షిక సెషన్ ఆఫ్, స్టూడెంట్స్ కెమికల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ సదస్సుకు కెంకాన్-2016 పేరు పెట్టారు. ఈ సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యిమంది విద్యార్థులు, ప్రోఫెసర్లు హాజరు కానున్నారు. బీవీఆర్ఐటీ కాలేజీలో గతంలో పలు రాష్ట్ర జాతీయ స్థాయి సదస్సులు జరిగాయి. మరోసారి ఈ కాలేజీ వేదిక కానుంది. సదస్సులతో ఎంతో మేలు సదస్సులో పాల్గొనే విద్యార్థులు, ప్రొఫెసర్లు, కాలేజీ ప్రిన్సిపాల్‌తో సాక్షి మాట్లాడగా సదస్సులతో విద్యార్థులకు మేలు చేకూరుతుందని అన్నారు. సదస్సులో 12 అంశాలపై చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన ఆయా కాలేజీలకు చెందిన విద్యార్థులు తమ పేపర్ ప్రజెంటేషన్స్, పోస్టర్ పేపర్స్ అందచేశారు. వాటిని పరీశీలించి నిబంధనల మేరకు ఎంపిక చేసినట్లు తెలిసింది. ---------------------- అభిప్రాయాలు--------- ఆనందంగా ఉంది జాతీయ స్థాయి సదస్సును తమ కాలేజీలో చేపట్టడం ఆనందంగా ఉంది. తాను బోధించే బ్రాంచికి చెందిన సదస్సు చేపట్టడం సంతోషం. కాగా సదస్సులతో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు వస్తాయి. సదస్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. - డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ బీవీఆర్ఐటీ మార్పులు తెలుసుకోవచ్చు సబ్జెక్టులలో రోజు రోజుకు మార్పులు వస్తున్నందున సదస్సులతో ఆయా సబ్జెక్టులలో ఎలాంటి మార్పులు వస్తున్నాయె విద్యార్థులకు తెలుస్తుంది. విద్యార్థుల ప్రతిభకు సదస్సులు వేదికలుగా వినియోగించుకోవచ్చు. జాతీయ సదస్సుకు తాను ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండడం ఆనందంగా ఉంది. - డాక్టర్ రాధిక, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆలోచనలకు కార్యరూపం సదస్సులో విద్యార్థులు తమ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వొచ్చు. ఇతర ప్రాంతాల విద్యార్థులు రావడంతో విభిన్న మనస్థత్వం, ఆలోచనలతో ఉంటారు. వారితో కలిసి సాంకేతికపరమైన అంశాలు తెలుసుకోవడంతో పాటు నాలెడ్జ్ పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది. - రమేష్, అసిస్టెంటు ప్రొఫెసర్, కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచి సదస్సుకు ఎంపిక కావడం సంతోషం నా పోస్టర్ ప్రజెంటేషన్.. సదస్సుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. వాటర్ ప్యూరిఫికేషన్ అంశంపై పోస్టర్ ప్రజెంటేషన్ ఇచ్చాను. సదస్సులతో విద్యార్థులకు మేలు జరుగుతుంది. ప్రతిభను చాటేందుకు ఇదొక వేదికగా భావిస్తున్నాను. - దుసానె, విద్యార్థి, పూణె యూనివర్సిటీ అనుభవం పెరుగుతుంది సదస్సుకు తన ప్రజెంటేషన్ ఎంపిక కావడం సంతోషంగా ఉంది. సదస్సులతో విద్యార్థులలో అనుభవం పెరుగుతుంది. నైపుణ్యం పెంచుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం. అనేక మంది పాల్గొనడంతో నాలెడ్జి పెంచుకునే అవకాశం ఉంటుంది. - క్షేమ, బీఫార్మసీ, వైపర్ కాలేజీ నర్సాపూర్ కెమికల్ ఇంజనీరింగ్‌లో కొత్తదనం సదస్సులలో పాల్గొనడంతో కెమికల్ ఇంజనీరింగ్‌లో కొత్తదనం తెలుసుకునే అవకాశం లభిస్తుంది. సదస్సులతో అనేక లాభాలున్నాయి. ఇతర రాష్ట్రాల విద్యార్థులతో కలిసి పాల్గొనడంతో వారి అనుభవాలు పాలు పంచుకునే అవకాశం ఉంటుంది. - అంకిత్ మిశ్రా, ఎస్ఆర్ఐసిటీ అంకులేశ్వర్, గుజరాత్ నమ్మకం పెరుగుతుందిః రాజేశ్వరీ, ఫార్మస్యూటికల్ ఇంజనీరీంగు బ్రాంచి, బీవీఆర్ఐటీ నర్సాపూర్ఃసదస్సులలో పాల్గొనడంతో విద్యార్థులలలోఉన్న నైపుణ్యతపై నమ్మకం పెరుగుతుంది. స్టేజీ ఫియర్ పోతుంది. విద్యార్థులు తమను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. తాను మొదటిసారి పాల్గొంటున్నాను. తనకు అవకాశం రావడం ఆనందంగా ఉంది. నైపుణ్యాన్ని నిరూపించె అవకాశంతో పాటు పెంచుకునే అవకాశం రావడడంతో సద్వినియోగం చేసుకుంటాను. సదస్సులతో కాన్ఫిడెన్స్ పెరుగుతుందిః శివకార్తిక్,బీవీఆర్ఐటీ నర్సాపూర్‌ః సదస్సులతో విద్యార్థులలో కాన్ఫిడెన్సు పెరుగతుంది. ఇతర రాష్రా్టల వాతావరణం తెలుస్తుంది. సదస్సులలో పాల్గొనడంతో అవగాహన కలుగుతుంది. నాలెడ్జ్ పుంచుకునేందుకు దాహద పడుతాయి. సదస్సులు నిర్వహంచడం అభినందనీయం. జాతీయ స్తాయి సదస్సు చేపట్టడం ఆనంందగా ఉంది. -
వచ్చే నెల 8 నుంచి జాతీయ చెస్ పోటీలు
రాజమహేంద్రవరం సిటీ : వచ్చే నెల 8 నుంచి 16వ తేదీ వరకూ 46వ జాతీయ జూనియర్ అండర్–19 చదరంగం ఛాంపియన్షిప్–2016, 31వ జాతీయ జూనియర్ అండర్–19 బాలికల చదరంగం ఛాంపియన్షిప్–2016 నిర్వహించనున్నట్టు రాష్ట్ర చదరంగం సంఘం అధ్యక్షుడు వైడీ రామారావు తెలిపారు. స్థానిక ఎసెంట్ ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సహకారంతో రాష్ట్ర, జిల్లా చదరంగం సంఘాల ప్రోత్సాహంతో ఎసెంట్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యాన స్థానిక షెల్టాన్ హోటల్లో ఈ పోటీలు జరుగుతాయన్నారు. దీనికి 29 రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు రానున్నారన్నారు. ప్రతి రాష్ట్రం నుంచీ ఎనిమిదిమంది క్రీడాకారులు తప్పనిసరిగా హాజరుకానున్నారన్నారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న ఈ పోటీలను సుమారు రూ.30 లక్షలతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఎసెంట్ స్పోర్ట్స్ ఫౌండేషన్ నిర్వాహకురాలు డాక్టర్ జి.శ్రీదేవి తెలిపారు. క్రీడాకారులు తొమ్మిది రోజులపాటు 11 రౌండ్లుగా ఈ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. టోర్నమెంట్ బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ కూడా పాల్గోన్నారు. -
జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక
సత్తెనపల్లి: జాతీయ స్థాయిలో సెప్టెంబర్ 7, 8 తేదీల్లో జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జరిగే వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో సబ్‌జైలు ఎదుట గల ఎస్ఆర్ఎన్ జిమ్‌కు చెందిన పసుపులేటి సురేష్, జి.రమేష్ ఎంపికైనట్లు ఎస్ఆర్ఎన్ జిమ్ నిర్వాహకుడు రాజు శుక్రవారం తెలిపారు. సురేష్, రమేష్‌లను సీనియర్లు పార్థ సారథి, ఆనంద్, తిరుపతి నాయుడులు అభినందించారు. -
జాతీయ చెస్ పోటీలకు జిల్లా విద్యార్థులు
గుంటూరు స్పోర్ట్స్: జిల్లా చెస్ క్రీడాకారులు బొమ్మిని మౌనిక అక్షయ, హరి సూర్య భరద్వాజ్ జాతీయ స్థాయి చెస్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు విజయనగరంలో జరిగిన అండర్–19 రాష్ట్ర స్థాయి చెస్ పోటీలలో వీరు ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అక్టోబర్ 8 నుంచి 16 వరకు రాజమండ్రిలో జరిగే అండర్–19 జాతీయ చెస్ పోటీల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా వీరిని సోమవారం చంద్రమౌళినగర్లోని అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ కార్యదర్శి చల్లా రవీంద్ర రాజు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శిక్షకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం
జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ : తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులకు అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లోనూ మినీ స్టేడియంలు నిర్మించి, ప్రత్యేక నిపుణుల ద్వారా శిక్షణలు ఇస్తున్నామన్నారు. శుక్రవారం బాన్సువాడలోని కమ్యూనిటీ సెంటర్ వద్ద రూ. 2.65 కోట్లతో నిర్మించనున్న మినీ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు శిక్షణ పొందేందుకు స్టేడియంలు ఉపకరిస్తాయన్నారు. బాన్సువాడలో దశాబ్దాలుగా మినీ స్టేడియం నిర్మించాలనే డిమాండ్ ఉందని, నిధులు మంజూరైనా, సరైన స్థలం లభించక ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం లభించిన స్థలం పట్టణ నడిబొడ్డులో ఉందని, దీనిని అందరూ చక్కగా వినియోగించుకోవాలన్నారు. ఈ స్టేడియంలో టెన్నిస్, షటిల్ కోసం ఇండోర్ స్టేడియం, ఔట్‌డోర్ టెన్నిస్ కోర్టు, బాస్కెట్‌బాల్ కోర్టు, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో కీడ్రలు ఆడేవిధంగా నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే స్టేడియం చుట్టూ వాకింగ్ కోసం ర్యాంప్ ఏర్పాటు చేయడంతో పాటు 14 మడిగెలను నిర్మించి షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎస్సీల కోసం బాన్సువాడలో రెసిడెన్షియల్ స్కూల్ కోసం రూ. 4.20 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. బాన్సువాడలో రూ. 1.75 కోట్లతో పోస్ట్ మెట్రిక్ బాలికల హాస్టల్, గిరిజనుల కోసమే యూత్ ట్రైనింగ్ సెంటర్ మంజూరైందని, దీని కోసం రూ. 4.60 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్డీఏ అశోక్‌కుమార్, సర్పంచ్ వాణివిఠల్, జెడ్పీటీసీ సభ్యుడు జంగం విజయగంగాధర్, జెడ్పీ కో–ఆప్షన్ సభ్యుడు అలీముద్దీన్ బాబా, ఏఎంసీ చైర్మన్ నార్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయికి "అనంత" నృత్యం
అనంతపురం కల్చరల్ : జాతీయస్థాయి నృత్య పోటీల్లో అనంత కళాకారిణులు మెరిశారు. హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లా నగరంలో దరోహర్–2016 పేరిట యూనివర్సల్ సాంస్కృతిక్, సో«ద్నాట్య నృత్య అకాడమీ వారు నిర్వహించిన జాతీయస్థాయి పోటీలలో అనంతపురానికి చెందిన నృత్యకళా నిలయం సంధ్యామూర్తి శిష్యబృందం ప్రత్యూష కూచిపూడిలో ప్రథమ స్థానంలో, దివ్యశ్రీ రెండవ స్థానంలో నిలిచారు. డ్యూయెట్ విభాగంలో మహాలక్ష్మి, ప్రత్యూషలు మొదటి స్థానాన్ని, కూచిపూడి జూనియర్ విభాగంలో మిహిర మూడవస్థానాన్ని, ప్రణవి కన్సొలేషన్ స్థానంలో నిలిచారు. నిర్వాహకులు డా.రాఖీ రాజ్పుట్, అనూజ్ రాజ్పుట్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలందుకున్నారు. సంధ్యామూర్తిని ‘ ది బెస్ట్ కొరియోగ్రాఫర్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్’ పురస్కారంతో సత్కరించారు. బుధవారం సాయంత్రం అనంతపురంలోని కమలానగర్లో గల నృత్యకళానిలయంలో జరిగిన అభినందన సమావేశంలో సంధ్యామూర్తి జాతీయస్థాయి పోటీల విశేషాలు వెల్లడించారు. -
తపాలాశాఖ స్టాంపు డిజైన్ పోటీలు
తెనాలి : తపాలశాఖ అక్టోబరు 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా జాతీయ స్థాయిలో స్టాంపు డిజైను పోటీలను నిర్వహిస్తున్నట్టు తెనాలి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.హరికృష్ణప్రసాద్ సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలియజేశారు. ‘స్వచ్ఛభారత్’ అనే అంశంపై నిర్వహించే ఈ పోటీల్లో ఎవరైనా పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి కలిగినవారు తమ ఎంట్రీలను ‘అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (ఫిలా టెలి), రూమ్ నం.108 (బి), ఢాక్ భవన్, పార్లమెంట్ స్ట్రీట్, న్యూఢిల్లీ –110001 చిరునామాకు, స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ నెల 22వ తేదీకి చేరేలా పంపాలని కోరారు. -
కాపు ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లండి
వైఎస్ జగన్‌కు కాపు సంఘం నేతల విజ్ఞప్తి సాక్షి, విజయవాడ: ‘కాపు ఉద్యమాన్ని మీకున్న విస్తృత రాజకీయ పరిచయాలతో జాతీయ స్థాయికి తీసుకెళ్లి మా సమస్యల్ని పరిష్కరించండి..’ అని కాపు జాయింట్ యాక్షన్ కమిటీ, కాపు సంఘం నేతలు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. మంగళవారం విజయవాడలో వైఎస్సార్సీపీ విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాపు సంఘం నేతలు పెద్ద సంఖ్యలో వచ్చి వైఎస్ జగన్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. కొద్దిసేపు సమస్యలపై చర్చించారు. కాపు జాతి కోసం ముద్రగడ చేస్తున్న దీక్షకు మద్దతు ప్రకటించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరు రోజులుగా ముద్రగడ కుటుంబం ఆమరణదీక్ష చేస్తున్న క్రమంలో ఉద్యమం ఉద్ధృతమైందని, దీనికి రాష్ట్ర స్థాయిలో ఇతర పార్టీలతో పాటు వైఎస్సార్సీపీ క్యాడర్‌ను సమాయత్తం చేసి మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం వైఎస్ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన వైఎస్ జగన్ మాట్లాడుతూ కాపులకు ఇప్పటికే మద్దతు తెలిపి సహకరించానని చెప్పారు. కాపునాడు నేత గోళ్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇప్పటికే కాపు ఉద్యమం తీవ్రమైందని, కాపుల కోసం జగన్ ఒకరోజు దీక్ష చేసి సంఘీభావం ప్రకటించాలని కోరారు. -
రాష్ట్రాల ఫలితాలు నేర్పుతున్న... ‘జాతీయ’ పాఠాలు
* దేశవ్యాప్తంగా బలోపేతమవుతున్న బీజేపీ * తొలిసారిగా ఈశాన్యాన కమలవికాసం * అంతకంతకూ దిగజారుతున్న కాంగ్రెస్ * బెంగాల్లో అడుగంటుతున్న లెఫ్ట్ ప్రాభవం సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలో చోటుచేసుకుంటున్న పలు రాజకీయ పరిణామాలకు అద్దం పట్టాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న దేశవ్యాప్తంగా బీజేపీ నానాటికీ బలోపేతమవుతోందన్న సంకేతాలిచ్చాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పరిస్థితి మరింతగా దిగజారుతున్న తీరుకు, వామపక్షాలు తమ కోటయిన పశ్చిమ బెంగాల్లోనే పూర్తిగా ప్రాభవం కోల్పోతున్న వైనానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రాంతీయ పార్టీల హవాను కూడా మరోసారి కళ్లకు కట్టాయి. జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకే తమిళనాట అధికారాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మూడు దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టింది. బెంగాల్లో దీదీ సారథ్యంలోని తృణమూల్ తిరుగులేని విజయంతో అధికారాన్ని నిలుపుకుంది. మరోవైపు అసోంలో విజయఢంకా మోగించడం ద్వారా ఈశాన్య భారతంలో బీజేపీ తొలిసారిగా పాగా వేసింది. కేరళలోనూ బోణీ చేయగలిగింది. బెంగాల్లో కొన్ని సీట్లు దక్కించుకుంది. అసోం, కేరళల్లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్, పుదుచ్చేరిలో నామమాత్ర విజయంతో సరిపెట్టుకుంది. బెంగాల్లో దాదాపుగా మట్టికరిచిన సీపీఎంకు కేరళలో ఓదార్పు విజయం దక్కింది. కాంగ్రెస్ ముక్త్ భారత్ దిశగా గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ సంధించిన ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదాన్ని నిజం చేసేలా ఆ పార్టీ పనితీరు సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఢి ల్లీల్లో చతికిలపడ్డ కాంగ్రెస్, తర్వాత సార్వత్రిక ఎన్నికల్లోనూ ఘోర పరాజయాన్నే మూటగట్టుకుంది. కనీసం లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది! కర్నాటక, కొన్ని చిన్న రాష్ట్రాల్లో అధికారానికి పరిమితమైంది. అసలే తన ఉనికి నామమాత్రమైన తమిళనాట డీఎంకేతో పొత్తు కాంగ్రెస్‌కు లాభించలేదు. అసోంలో 15 ఏళ్ల తరుణ్ గొగొయ్ పాలనపై ఏర్పడ్డ ప్రభుత్వ వ్యతిరేక ఓటును అంచనా వేయడంలో, ఆయనకు ప్రత్యామ్యాయ నాయకత్వాన్ని బలోపేతం చేయడంలో పార్టీ విఫలమైంది. కేరళలోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటులో కొట్టుకుపోయింది. బెంగాల్లో వామపక్షాలతో నెయ్యం, కేరళలో కయ్యం మలయాళీలకు రుచించలేదు. ఈ నేపథ్యంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లతో పాటు తాను అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్, మణిపూర్లలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షే కానున్నాయి. ఏఐసీసీని అధినేత్రి సోనియా గాంధీ త్వరలో పునర్ వ్యవస్థీకరిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బెంగాల్లో వామపక్షాలది మూడో స్థానమే పశ్చిమ బెంగాల్లో సిద్దాతాలను పక్కకు పెట్టి మరీ బద్ధ శత్రువు కాంగ్రెస్‌తో చేతులు కలిపినా సీపీఎంకు చివరికి మిగిలిందేమీ లేదు! కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకోగా సీపీఎం మరీ 26 సీట్లకే పరిమితమై అప్రతిష్ట మూటగట్టుకుంది. లెఫ్ట్ హయాంలో తమపై జరిగిన దాడులను కాంగ్రెస్ కార్యకర్తలు మర్చిపోలేదని, అందుకే కాంగ్రెస్ వోట్లు సీపీఎంకు బదిలీ కాలేదని ఫలితాలు రుజువు చేస్తున్నాయి. ఈశాన్య భారతానికీ బీజేపీ విస్తరణ ఈశాన్యభారతంలో తొలిసారిగా అసోంలో బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. అయితే ఇదేమీ అకస్మాత్తుగా లభించిన విజయం కాదు. పాతికేళ్లుగా రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఇలా ఫలించాయి. ఆర్ఎస్ఎస్ ప్రముఖ నాయకుడు రాం మాధవ్ ఈ ఎన్నికలను పర్యవేక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటునే నమ్ముకోకుండా ఏజీపీ, బోడో పీపుల్స్ ఫ్రంట్‌తో బీజేపీ పొత్తులో కీలకపాత్ర పోషించారు. బెంగాల్లోనూ బీజేపీ ఓట్ల శాతం 4 నుంచి 10.2కు పెరిగింది! పైగా కేరళలోనూ తొలిసారిగా ఒక సీటును బీజేపీ దక్కించుకుంది! విజయ గర్వాన్ని తలకెక్కించుకోకుండా, మోదీ ప్రభుత్వం పదేపదే చెబుతున్న ‘కోపరేటివ్ ఫెడరలిజం’ స్ఫూర్తిని సరిగా అమలు చేస్తేనే బీజేపీకి మెరుగైన భవిష్యత్తు ఉంటుందనేందుకు ఈ ఫలితాలు సంకేతంగా నిలిచాయి. ఇక యూపీలో ఉప ఎన్నికల్లో రెండు స్థానాలనూ ఎస్పీ గెలుచుకోవడం గమనార్హం. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ కేవలం 2,500 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌పై కనాకష్టంగా నెగ్గింది! దీన్ని ఒకరకంగా బీజేపీకి హెచ్చరిక సంకేతంగానే చూడాలన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కీలకమైన ఉత్తరప్రదేశ్. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఆ పార్టీ ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరం. -
తెలంగాణ సోనాకు జాతీయస్థాయి గుర్తింపు
ఘట్కేసర్ టౌన్: తెలంగాణలో సాగవుతున్న సోనా వరి విత్తనానికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించిందని రాష్ట్ర విత్తన ధ్రువీకరణ అప్పిలేట్ సభ్యుడు రేసు లక్ష్మారెడ్డి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 12న ఢిల్లీలో జాతీయ విత్తన ఉన్నతస్థాయి సమావేశం జరిగిందని, అందులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన 13 కొత్త వరి విత్తనాల గుణగణాలను పరిశీలించారన్నారు. వాటిల్లో తెలంగాణ సోనా విత్తనం ఉత్తమమైనదని గుర్తిం చారన్నారు. ఈ రకం విత్తనాలు చీడపీడలను తట్టుకోవడమే కాకుండా నాణ్యత, అధిక దిగుబడిలో మెరుగైన ఫలితాలు సాధిస్తాయన్నారు. -
నగరంలో మజ్లిస్ అధినేత పాదయాత్ర
సిటీ బ్యూరో: జాతీయ స్థాయి రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాదయాత్రలు చేపట్టారు. ఒక వైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగేందుకు అక్కడ విసృ్తతంగా పర్యటిస్తున్న ఆయన మంగళవారం హైదరాబాద్ పాతబస్తీలో పాదయాత్ర నిర్వహించారు. బహద్దుర్ పురా, జవార్నగర్, నర్సారెడ్డి కాలనీ, తాడ్బాన్, రామానర్సాపుర తదితర ప్రాంతాల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల, ఐటీఐలను తనిఖీలు నిర్వహించారు. ఆయన వెంట జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు గఫ్ఫార్, ముబీన్,సలీం తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యా సంస్థల్లో మనమే టాప్
► జాతీయ స్థాయిలో రాష్ట్రానికి మెరుగైన స్థానాలు ► నాలుగో స్థానంలో హెచ్‌సీయూ ► ఐఐటీ హైదరాబాద్‌కు ఏడో స్థానం ► 28వ స్థానంలో వరంగల్ ఎన్ఐటీ ►తొలిసారిగా ర్యాంకులిచ్చిన కేంద్రం ► పలు టాప్ కాలేజీలకు దక్కని స్థానం సాక్షి, హైదరాబాద్ : జాతీయ స్థాయిలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విద్యా సంస్థల ర్యాంకింగ్‌లో తెలంగాణలోని ప్రభుత్వ విద్యా సంస్థలు టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నాయి. రెండు టాప్-10లో నిలవగా మరో ఆరింటికి టాప్-100లో చోటు లభించింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్ఆర్డీ) మంత్రి స్మృతిఇరానీ సోమవారం విడుదల చేసిన ఈ ర్యాంకుల్లో యూనివర్సిటీల విభాగంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలవడం విశేషం. ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ హైదరాబాద్‌కు ఏడో స్థానం దక్కింది. వరంగల్‌లోని ఎన్ఐటీ 28వ స్థానంలో నిలిచింది. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ)కి 71వ స్థానం దక్కింది. ఇక మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సంస్థకు 38, ఫార్మసీ విభాగంలో వరంగల్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి 16వ స్థానం దక్కాయి. వర్సిటీలు, ఇంజినీరింగ్ విభాగాల్లో టాప్-100 స్థానాలను, మేనేజ్మెంట్, ఫార్మా విద్యా సంస్థల్లో టాప్-50 విద్యాసంస్థల ర్యాంకులను హెచ్ఆర్డీ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని మరిన్ని టాప్ కాలేజీలకు ఈ ర్యాంకింగ్‌లో స్థానం లభిస్తుందని భావించినా ఉస్మానియా వర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం, కాకతీయ వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్‌లతో పాటు పలు టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకూ చోటు లభించలేదు. ఇంజనీరింగ్‌కు 1,438 దరఖాస్తులు నాలుగు కేటగిరీల్లో ర్యాంకింగులకు గత జనవరి 15వ తేదీ వరకు హెచ్ఆర్డీ శాఖ దరఖాస్తులు స్వీకరించింది. దేశవ్యాప్తంగా 1,438 ఇంజనీరింగ్, 609 మేనేజ్మెంట్, 454 ఫార్మసీ, 28 ఆర్కిటెక ్చర్, 803 డీమ్డ్, ప్రైవేటు వర్సిటీల కాలేజీలు, 233 వర్సిటీలు దరఖాస్తు చేసుకున్నాయి. బోధన, అభ్యసన వనరులు, ఫ్యాకల్టీ, పరిశోధనలు, గ్రాడ్యుయేట్ల స్థాయి, వారికి ఉపాధి అవకాశాలు తదితరాల ఆధారంగా సంస్థలకు స్కోర్ ఇచ్చి ర్యాంకులను కేంద్రం ఖరారు చేసింది. టాప్ ర్యాంకులన్నీ ఐఐటీలవే ఇంజనీరింగ్ విభాగంలో ఒకటి నుంచి 12వ ర్యాంకు దాకా ఐఐటీలే సాధించాయి. మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లోనూ ప్రభుత్వ రంగంలోని ఐఐఎంలే తొలి పది ర్యాంకులనూ కైవసం చేసుకున్నాయి. రాష్ట్ర విద్యా సంస్థలకు జాతీయ స్థాయిలో లభించిన ర్యాంకులు వర్సిటీల్లో సంస్థ ర్యాంకు రాష్ట్రం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 4 తెలంగాణ ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్ 23 తెలంగాణ ఉస్మానియా వర్సిటీ, హైదరాబాద్ 33 తెలంగాణ ఇంజినీరింగ్ విభాగంలో.. ఐఐటీ-హైదరాబాద్ 7 తెలంగాణ ఎన్ఐటీ-వరంగల్ 28 తెలంగాణ సీబీఐటీ, హైదరాబాద్ 71 తెలంగాణ మేనేజ్మెంట్ విద్యాసంస్థల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ 38 తెలంగాణ ఫార్మసీ విద్యా సంస్థల్లో యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మా సెన్సైస్, వరంగల్ 16 తెలంగాణ ఇంజనీరింగ్‌లో... ఐఐటీ మద్రాస్ 1 తమిళనాడు ఐఐటీ బాంబే 2 తమిళనాడు ఐఐటీ ఖరగ్‌పూర్ 3 పశ్చిమబెంగాల్ ఐఐటీ ఢిల్లీ 4 ఢిల్లీ ఐఐటీ కాన్పూర్ 5 ఉత్తరప్రదేశ్ ఐఐటీ రూర్కీ 6 ఉత్తరాఖండ్ ఐఐటీ హైదరాబాద్ 7 తెలంగాణ ఐఐటీ గాంధీనగర్ 8 గుజరాత్ ఐఐటీ రూప్‌నగర్ 9 పంజాబ్ ఐఐటీ పట్నా 10 బీహార్ మేనే జ్‌మెంట్‌లో ఐఐఎం బెంగళూరు 1 కర్ణాటక ఐఐఎం అహ్మదాబాద్ 2 గుజరాత్ ఐఐఎం కోల్‌కతా 3 పశ్చిమ బెంగాల్ ఐఐఎం లక్నో 4 ఉత్తరప్రదేశ్ ఐఐఎం ఉదయ్‌పూర్ 5 రాజస్థాన్ ఐఐఎం కోజికోడ్ 6 కేరళ ఐఐఎం ఢిల్లీ 7 ఢిల్లీ ఐఐఎఫ్ఎం భోపాల్ 8 మధ్యప్రదేశ్ ఐఐటీ కాన్పూర్ 9 ఉత్తరప్రదేశ్ ఐఐఎం ఇండోర్ 10 మధ్యప్రదేశ్ ఫార్మసీలో మణిపాల్ కాలేజ్ ఆఫ్ ఫార్యాస్యూటికల్ సెన్సైస్, మణిపాల్ 1 కర్ణాటక యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్ 2 చండీగఢ్ జామియా హామ్డార్డ్, ఢిల్లీ 3 ఢిల్లీ పూణా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ 4 మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, నిర్మా యూనివర్సిటీ, అహ్మదాబాద్ 5 గుజరాత్ బాంబే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ముంబై 6 మహారాష్ట్ర బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాంచీ 7 జార్ఖండ్ అమృత స్కూల్ ఆఫ్ ఫార్మసీ, కొచ్చి 8 కేరళ జేఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఉటకమండ్ 9 తమిళనాడు జేఎస్ఎస్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ, మైసూర్ 10 కర్ణాటక విభాగాలవారీగా జాతీయ స్థాయిలో టాప్ విద్యా సంస్థలు వర్సిటీల్లో సంస్థ ర్యాంకు రాష్ట్రం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్, బెంగళూరు 1 కర్నాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ 2 మహారాష్ట్ర జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ 3 న్యూఢిల్లీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 4 తెలంగాణ తేజ్ జూర్ యూనివర్సిటీ 5 అస్సాం యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ 6 ఢిల్లీ బెనారస్ హిందూ యూనివర్సిటీ 7 ఉత్తరప్రదేశ్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ 8 కేరళ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్-ఫిలానీ 9 రాజస్థాన్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ 10 ఉత్తరప్రదేశ్ -
సీఐఐ దక్షిణ ప్రాంత చైర్మన్ గా రమేష్ దాట్ల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సీఐఐ దక్షిణ ప్రాంత చైర్మన్‌గా 2016-17 సంవత్సరానికిగాను ఎలికో లిమిటెడ్ సీఎండీ రమేష్ దాట్ల ఎన్నికయ్యారు. 2015-16 కాలానికి సీఐఐ దక్షిణ ప్రాంత డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. సీఐఐ చేపడుతున్న కార్యక్రమాల్లో జాతీయ స్థాయిలో ఆయనది కీలక పాత్ర. ఎంట్రప్రెన్యూర్షిప్, టెక్నాలజీ, ఐపీఆర్, ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ విభాగాల్లో జాతీయ స్థాయిలో ముఖ్య భూమిక పోషించారు. సీఐఐ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ జాతీయ కమిటీకి, అలాగే ఎంఎస్ఎంఈ జాతీయ కమిటీకి చైర్మన్‌గానూ పనిచేశారు. 2004-05 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ చైర్మన్‌గా వ్యవహరించారు. యూఎస్ఏలోని విచితా స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పుచ్చుకున్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఎలక్ట్రానిక్ డిజైన్ టెక్నాలజీలో పీజీ పూర్తి చేశారు. ఇక సీఐఐ దక్షిణ ప్రాంత డిప్యూటీ చైర్మన్‌గా టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ నియమితులయ్యారు. సీఐఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా 2012 నుంచి ఆయన కొనసాగుతున్నారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు. -
తాండూరు సిస్టర్స్
♦ నృత్యంలో నలుగురు అక్కాచెల్లెళ్ల ప్రతిభ ♦ జాతీయ స్థాయిలో గుర్తింపు ♦ జాతీయస్థాయిలో మెరిసిన అక్కాచెల్లెళ్లు ♦ ప్రముఖుల ఎదుట ప్రదర్శనలు ♦ కురిసిన ప్రశంసల జల్లులు ఏ ఇంట్లోనైనా ఒకరో .. ఇద్దరో కళాకారులు ఉంటారు.. కానీ ఆకుటుంబంలో మాత్రం ఏకంగా నలుగురు అక్కాచెల్లెల్లు ఉన్నారు. సంప్రదాయ నృత్యంలో ఒకరికి మించి ఒకరు అనతికాలంలోనే పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. కన్నవారికి.. పుట్టిన ఊరికి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చారు. జాతీయస్థాయిలో తమ అద్భుత ప్రదర్శనలతో ఔరా అనిపించారు. దేశప్రధాని, రాష్ట్రపతి మొదలు ఎంతోమంది ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తాండూరు సిస్టర్స్‌గా ముద్రపడిపోయారు. వారి కళా ప్రస్థానమే ఈ ఆదివారం ప్రత్యేకం. - తాండూరు ఆ నలుగురు అక్కా చెల్లెళ్లు.. అటూఇటుగా అచ్చుగుద్దినట్టే ఉంటారు.. వాళ్ల ప్రతిభ కూడా ఒక్క రంగంలోనే.. అదే నృత్యం. అందం, అభినయంతో దేశవిదేశాల్లో ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలందుకున్నారు. ఇక దేశీయంగా 20 రాష్ట్రాల్లో ప్రదర్శనలిచ్చారు. అనేక జాతీయస్థాయి వేదికలపై నర్తించి తామేంటో చాటిచెప్పారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రధాని మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వంటి వారిని సైతం మెప్పించారు. వారే తాండూరుకు చెందిన రాములు, నర్మద దంపతుల కూతుళ్లు వాణి, భాగ్యలక్ష్మి, సుస్మిత, సౌమ్య. వీరిని స్థానికంగా అందరూ ‘తాండూరు సిస్టర్స్’ అంటారు. వారి విజయ ప్రస్థానమే.. ఈ వారం సండే స్పెషల్.. - తాండూరు తాండూరు పట్టణంలోని గుమస్తానగర్‌లో నివసిస్తున్న రాములు, నర్మద దంపతులకు నలుగురు కూతుళ్లు. వాణి బీఎస్సీ పూర్తి చేయగా, భాగ్యలక్ష్మి బీఏ, సుస్మిత బీకాం (తృతీయ), సౌమ్య (పాలిటెక్నిక్) చదువుతున్నా రు. 2009లో మొదలైన వీరి నృత్యప్రస్థానం ఏడేళ్లలో దేశ వ్యాప్తంగా నృత్యప్రదర్శ నలు ఇచ్చే స్థాయికి ఎదిగింది. మా థూరి,థింసా, గిరిజన సంప్రదాయ నృ త్యాల్లో వీరు దిట్ట. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోపాటు వివిధ రాష్ట్రాల ప్రముఖుల సమక్షంలో నృత్యప్రదర్శనలు ఇచ్చి వారి నుంచి ప్రశంసలు అందుకున్నారు. నృత్యంపై ఆసక్తి ఇలా.. వాణి, భాగ్యలక్ష్మి స్థానిక శిశుమందిర్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. పాఠశాలలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఇలా నృత్యంపై విద్యార్థి దశలోనే ఆసక్తిని పెంచుకున్నారు. ఈ సమయంలో తాండూరుకు చెందిన ఫైన్స్‌ఆర్ట్స్ కల్చరల్ అకాడమీ అధ్యక్షుడు,డాన్స్ మాస్టర్ అశోక్ వీరి ప్రతిభను గుర్తిం చిప్రోత్సహించారు. అక్కడి నుంచి వివిధ వేదికలపై నృత్యప్రదర్శనలు ఇస్తూ వచ్చారు. అక్కాచెల్లెలు హైదరాబాద్‌కు చెందిన మరో డాన్స్ మాస్టర్ హరికిషన్ దృష్టిలో పడ్డారు. సంప్రదాయ నృత్య రీతుల్లో ఆయన మెళకువలను నేర్పించారు. 2010లో రవీంద్రభారతిలో శ్రీకృష్ణతులాభారం నాటకంలో వాణికి అవకాశం దక్కింది. చక్కని అభినయంతో అందరి అభినందనలు అందుకుంది. తన నృత్యప్రదర్శనతో భాగ్యలక్ష్మి కూడా మెరిసింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక, ఫుడ్‌మేళా తదితర కార్యక్రమాల్లో అక్కాచెల్లెలు నృత్యప్రదర్శనలు ఇస్తూ వస్తున్నారు. అక్కలను చూసి చెల్లెల్లు.. వాణి, భాగ్యలక్ష్మిలతో స్ఫూర్తి పొందిన చెల్లెలు సుస్మిత, సౌమ్య కూడా సంప్రదాయ నృత్యం నేర్చుకున్నారు. అక్కల బాటలోనే పయనిస్తూ ప్రతిభను చాటుతున్నారు. తాండూరులో నృత్యఅకాడమీ.. వాణి, భాగ్యలక్ష్మి ప్రస్తుతం తాండూరులో నటరాజ్ నృత్య అకాడమీని కొనసాగిస్తున్నారు. ఇందులో కూచిపూడితోపాటు క్లాసికల్, వెస్టర్న్ డాన్స్‌లపై చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. ఇదీ పరంపర.. అమృత్‌సర్‌లో 2009లో నేషనల్ యూత్ ఫెస్టివల్, 2010లో చంఢీగడ్‌లో వరల్డ్ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవం, ఇదే సంవత్సరంలో రవీంద్రభారతిలో ప్రపంచ నృత్య దినోత్సవం, ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవం, 2012లో తాండూరులో కేంద్ర సాంస్కృతిక శాఖ జాతీయ యువజనోత్సవాలు, 2013లో కేరళలో ఓనమ్ ఫెస్టివల్, 2015లో ఢిల్లీలో గణతంత్ర వేడుకల్లో తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. తమిళనాడు, జార్ఖండ్, కర్ణాటక, రాజస్థాన్ తదితర 20 రాష్ట్రాల్లో లంబాడీ, మాథూరి, థింసా నృత్యరీతుల్లో ప్రతిభ చాటారు. తాజాగా ఈ ఏడాది జనవరి 8 నుంచి 15వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించిన సూరజ్‌కుండ్ మేళాలో నలుగురికీ అవకాశం వచ్చింది. జైసల్మేర్‌లో సైనికుల కోసం నృ త్యప్రదర్శన ఇచ్చా రు. మాజీ రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్‌తోపాటు ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీతోపాటు అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామాల సమక్షంలో గత ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ శకటంపై బోనాల ప్రదర్శనలో వాణి పాల్గొంది. 2012లో ఔరంగాబాద్‌లో నృత్యప్రదర్శన అనంతరం తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వాణి, భాగ్యలక్ష్మి తండ్రి రాములుతోపాటు డాన్స్ మాస్టర్ హరికిషన్ తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో మాస్టర్ హరికిషన్ మృతి చెందారు. అప్పట్లో తండ్రికి సపర్యలు చేస్తూనే నృత్యప్రదర్శనలు ఇచ్చానని వాణి వివరించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ముందుకు సాగుతున్నామని, ఎప్పటికైనా విదేశాల్లో నృత్యప్రదర్శన ఇవ్వాలన్నదే తమ లక్ష్యమంటున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. -
విశాఖలో ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ బిజినెస్ సమిట్
28, 29 తేదీల్లో నిర్వహణ సాక్షి, విశాఖపట్నం: జాతీయ స్థాయిలో సముద్ర వ్యాపారులను ఒకే వేదికపైకి తీసుకువస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో విశాఖలో రెండు రోజుల పాటు ఈస్ట్‌కోస్ట్ మారిటైం బిజినెస్ సమిట్ నిర్వహించనున్నట్లు మారిటైమ్ గేట్‌వే ఎడిటర్ ఇన్ చీఫ్, పబ్లిషర్ ఆర్.రాంప్రసాద్ బుధవారం విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 350 మంది ప్రతినిధులు ఈ సమిట్‌లో పాల్గొంటారని ఆయన తెలిపారు. విశాఖ పోర్టు ట్రస్ట్, విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రధాన ప్రాయోజిత కంపెనీలుగా వ్యవహరిస్తామని సమావేశంలో పాల్గొన్న పోర్టు డిప్యూటీ చైర్మన్ పిఎల్ హరనాథ్, వీసీటీ వైస్ చైర్మన్ అనిల్ నారాయణ్ తెలిపారు. తూర్పు తీరం(ఈస్ట్‌కోస్ట్)లో మారిటైమ్ బిజినెస్‌ను అభివృద్ధి చేయడంపై ఈ సమిట్‌లో చర్చిస్తామన్నారు. విశాఖలో ఈ తరహా సమావేశం ఇది మూడవది. -
జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం
-
సివిల్స్‌లో మెరిశారు..
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ -2014 ఫలితాల్లో జిల్లా యువకులు మెరిశారు. జాతీయస్థారుులో ఉన్నత ర్యాంకులు సాధించి జిల్లావాసులను మురిపించారు. వరంగల్ గిర్మాజీపేటకు చెందిన 24 ఏళ్ల క్రాంతి తొలి ప్రయత్నంలోనే 50వ ర్యాంకుతో.. హన్మకొండలోని బాలసముద్రానికి చెందిన 26 ఏళ్ల పింగిళి సతీష్‌రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా రెండో ప్రయత్నంలో 97వ ర్యాంకుతో అత్యుత్తమ ప్రతిభ చాటారు. - 50వ ర్యాంకు సాధించిన క్రాంతి - 97వర్యాంకు పొందిన పింగిళి సతీష్‌రెడ్డి - యువ అధికారుల స్ఫూర్తితో లక్ష్య సాధన - హోం స్టేట్‌గా తెలంగాణను ఎంచుకుంటామని వెల్లడి ముంబైలో బహుళజాతి కంపెనీలో సీఏగా పని చేస్తున్నప్పుడు చాలెంజింగ్‌గా ఉండే సివిల్స్ రాయాలని అనిపించింది. అఖిల భారత సర్వీస్ అధికారులకు ఉండే విభిన్నమైన విధులు నాలో స్ఫూర్తిని కలిగించాయి. ఏడాదిపాటు లాంగ్‌లీవ్ పెట్టి సివిల్స్‌కు ప్రిపేరయ్యాను. హోంస్టేట్గా తెలంగాణను ఎంచుకుంటాను. కొత్త రాష్ర్టంలో సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించేందుక కృషి చేస్తా. సాక్షి, హన్మకొండ : తొలి ప్రయత్నంలోనే సివిల్స్ జనరల్ కేటగిరీలో జాతీయ స్థాయిలో క్రాంతి 50వ ర్యాంకు సాధించి జిల్లా కీర్తిని నలుమూలల చాటాడు. క్రాంతి తల్లిదండ్రులు పాటి సురేందర్, జ్యోతి కాగా.. బాబారుు కొండల్రావు వరంగల్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్లో డీఈగా పనిచేస్తున్నారు. క్రాంతికుమర్ తండ్రి జవహర్ నవోదయ విద్యాలయ సంస్థలో లెక్చరర్, ప్రిన్సిపాల్‌గా పలు హోదాల్లో పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్‌లోని బుర్హన్‌పూర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. క్రాంతికుమర్ ఐదో తరగతి వరకు మదనపల్లి, చిత్తూరు జిల్లా, ఐదు నుంచి పది వరకు పెదవేగి, ఏలూరు పశ్చిమగోదావరి జిల్లాల్లో చదివారు. అనంతరం షోలాపూర్, మహారాష్ట్రలో నవోదయ విద్యాలయాల్లో చదివారు. ఆపై ఇరవై ఒక్క ఏళ్లకే పూణేలో చార్టెడ్ అకౌంటెంట్ కోర్సును పూర్తి చేసి ముంబైలో ఓ బహుళజాతి కంపెనీలో ఏడాదికి తొమ్మిది లక్షల రూపాయల వేతనంతో సీఏగా పని చేశారు. ఈ వృత్తిలో ఉండగానే దీర్ఘకాలిక సెలవు పెట్టి ఢిల్లీకి వెళ్లి సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో జనరల్ కేటగిరీలో జాతీయ స్థాయిలో 50వ ర్యాంకు సాధించారు. మెయిన్స్‌లో ఆప్షనల్‌గా కామర్స్ సబ్జెక్టును ఎంచుకున్నారు. మధ్యప్రదేశ్ బురహన్పురంలో ఉన్న క్రాంతి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. అఖిల భారత సర్వీస్ అధికారులకు ఉండే విభిన్నమైన విధులు నాలో స్ఫూర్తిని కలిగించాయని, దీంతో ఏడాదిపాటు లాంగ్‌లీవ్ పెట్టి సివిల్స్‌కు ప్రిపేరయ్యానని చెప్పారు. హోంస్టేట్గా తెలంగాణను ఎంచుకుంటానన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో అనేక సవాళ్లు ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా పరిష్కరించేందుకు, తెలంగాణ అభివృద్ధికి దోహదపడేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా సివిల్స్‌లో 97 వ ర్యాంక్ సాధించిన సతీశ్‌రెడ్డి తల్లిదండ్రులు సీతారాంరెడ్డి, విజయలక్ష్మి. వీరు హన్మకొండలోని బాలసముద్రంలో నివాసం ఉంటున్నారు. తొలి ప్రయత్నంలో మెయిన్స్‌లో విఫలమైన సతీశ్‌రెడ్డి, ద్వితీయ ప్రయత్నంలో విజయం సాధించాడు. మెయిన్స్‌లో ఆయన సోషియాలజీని ఆప్షన్‌గా ఎన్నుకున్నారు. -
డచ్ ఓపెన్‌కు శ్రీకృష్ణప్రియ
హైదరాబాద్: జాతీయ స్థాయిలో విశేషంగా రాణిస్తున్న కె.శ్రీకృష్ణప్రియ (తెలంగాణ)... జర్మన్, డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ లకు ఎంపిక చేసిన భారత అండర్-19 జట్టులో చోటు దక్కించుకుంది. ఈ టోర్నీ ఈనెల 25 నుంచి జరగనుంది. పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న శ్రీకృష్ణప్రియ అండర్-19 స్థాయిలో మూడో ర్యాంక్‌లో, మహిళ విభాగంలో 15వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. -
జిల్లాకు కేంద్ర బృందం
భువనగిరి : ఉపాధి హామీ పథకంలో జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన జిల్లాకు కేంద్ర బృందం వారం రోజుల్లో రానుంది. ఉపాధి హామీ పథకంలో ఉత్తమ ఫలితాలను సాధించి జాతీయస్థాయిలో ఎంపికైన 11 జిల్లాల్లో మన జిల్లా ఉంది. ఇటీవల కలెక్టర్ చిరంజీవులు ఢిల్లీ వెళ్లి జిల్లాలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరును పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 2013- 14 ఆర్థిక సంవత్సరానికి పనులు జరిగిన తీరు, రికార్డుల నిర్వహణ, కూలి చెల్లింపు, పనుల ద్వా రా జరిగిన అభివృద్ధి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో మెరుగైన ఫలితాలను సాధించినట్లు అధికారులు నివేదికలు ఉండడంతో వాటిని అధ్యయనం చేయడానికి కేంద్రబృందం వచ్చే వారంలో రాబోతుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారుల బృందం ఎంపిక చేసిన మండలాల్లో పర్యటించనుంది. ప్రధానంగా పండ్లతోటల పెంపకం, పందిరి కూరగాయల సాగు, భూమి అభివృద్ధి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, డంపింగ్ యా ర్డు, టేకు మొక్కల పెంపకం తదితర పనులు జరిగిన తీరును పరిశీలించనున్నారు. ఇందుకోసం జిల్లా అధికారులు కొన్ని గ్రామాలను ఎంపిక చేశారు. భువ నగిరి మండలం రెడ్డినాయక్ తండాలో హార్టికల్చర్, బొమ్మలరామారం మం డలం జలాల్పూర్లో పందిరి కూరగాయల సాగు, భూమి అభివృద్ధి, ఆలేరు మండలం బహుద్దూర్పేటలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, డంపింగ్ యార్డులో జరిగిన పనులను పరిశీలించే అవకాశం ఉంది. ఇవేకాకుండా జిల్లాలోని మరికొన్ని మండలాల్లో కేంద్ర బృందం పర్యటించే అవకాశం ఉంది. బహుద్దూర్పేటలో వందశాతం మరుగుదొడ్లు ఉపాధి హామీకింద ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. దీంతో ఇప్పటికే పలువురు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి ఆర్థిక స్థోమత లేకపోవడంతో అర్ధంతరంగా నిలిపివేశారు. గ్రామ సర్పంచ్ జంపాల దశరథ గ్రామస్తులను ఒప్పించి ఉపాధి హామీ పథకంలో మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో మరుగుదొడ్డికి రూ.5 వేల చొప్పున రుణం తీసుకున్న గ్రామస్తులు మిగ తా డబ్బులు నిర్మాణం పూర్తయిన తర్వాత బిల్లు రాగానే డబ్బులు ఇస్తామన్న ఒప్పందంతో వాటిని పూర్తి చేసుకున్నారు. దీంతోపాటు గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. చెత్త సేకరణకు రిక్షాలను కొనుగోలు చేసి వాటి ద్వారా రోజూ ఇళ్ల నుంచి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ రెండు అంశాల ఆధారంగా ఈ గ్రామానికి కేంద్ర అధికారుల బృందం రానుంది. పరిశీలనకు వచ్చే ఆవకాశం ఉంది : శ్యామల ఏపీడీ, భువనగిరి ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులను పరిశీలించడానికి కేంద్ర అధికారు ల బృందం వచ్చే సోమ లేదా మంగళవారాల్లో రానున్నదని సమాచారం. కేంద్ర అధికారులు ఇక్కడ ఉపాధి హామీలో చేపట్టిన పనులను చూడడానికి వస్తున్నారని సమాచారం ఉంది. ఆదర్శంగా ఉండాలనే : జంపాల దశరథ, సర్పంచ్, బహుద్దూర్ పేట మా గ్రామం అభివృద్ధితోపాటు, ఆదర్శంగా ఉండాలనే వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంటింటి చెత్త సేకరణ, డంపింగ్ యార్డు పనులను ఉపాధిహామీలో చేపట్టాం. ప్రధాన మంత్రి మోదీ చెప్పిన ‘స్వచ్ఛభారత్’ మా ఊర్లో రోజూ జరుగుతోంది. -
ఆటలే ఆరోప్రాణం
సాక్షి, రాజమండ్రి : క్రీడా రంగంలో ఆయనొక నిత్య విద్యార్థి. తాను నేర్చుకుంటూనే ఉన్నారు. ఇతరులకు నేర్పే మార్గాలను నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నారు. ఆయన వయసు ప్రస్తుతం 58 సంవత్సరాలు. క్రీడలే సర్వస్వంగా జీవిస్తున్న ఆయన నేటి యువతరానికి ఓ స్ఫూర్తి ప్రదాత. ఆయన పేరు సుంకర నాగేంద్ర కిషోర్. తండ్రి సుంకర భాస్కరరావు ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. తండ్రి ఆదర్శంగా చిన్నతనం నుంచి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకున్న నాగేంద్ర కిషోర్ టేబుల్ టెన్నిస్ క్రీడలో రాణించారు. ఆ క్రీడలో వివిధ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాల పంటలు పండించిన సుంకర క్రీడల కోటాలో భారత ఆహార సంస్థలో ఉద్యోగం సంపాదించారు. ఆ సంస్థ టీటీ జట్టు సభ్యునిగా పలు టోర్నీల్లో పాల్గొన్నారు. గత ఏప్రిల్‌లో ఉద్యోగం నుంచి రిటైరైనా క్రీడారంగంలో కృషి నుంచి విరమించలేదు. తండ్రి పేరుతో దానవాయిపేటలో సుంకర భాస్కరరావు క్రీడా పరిశోధనా కేంద్రాన్ని, ఇంటి వద్దే తల్లి రాఘవమ్మ పేరుతో టీటీ శిక్షణ, అభివృద్ధి కేంద్రాన్ని స్థాపించి దాని ద్వారా విద్యార్థులు, యువతలో క్రీడా సామర్థ్యానికి సానబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. క్రీడలు చదువులకు అడ్డంకి కాదని, శారీరక, మానసిక, జీవన వికాసాలకు దోహదపడతాయని నిరూపించే దిశగా ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచీ క్రీడాసక్తి రాజమండ్రిలో 58 సంవత్సరాల క్రితం జన్మించిన కిషోర్ గాంధీపురం మున్సిపల్ పాఠశాల, నివేదిత కిషోర్ పాఠశాలల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్లో చదివిన అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. ఆర్ట్స్ కళాశాలలో బీఎస్సీ చదివారు. ఇంటర్ వరకూ వాలీబాల్, ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్ క్రీడల్లో అన్ని స్థాయిల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. పదో తరగతి నుంచే టీటీపై మరింత మక్కువ చూపుతూ డిగ్రీ తర్వాత ఆ క్రీడ పైనే దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్ర, అంతర్ యూనివర్సిటీ స్థాయి టోర్నమెంట్లలో పాల్గొని పలు పతకాలు సాధించారు. భారత ఆహార సంస్థలో ఉద్యోగం సంపాదించాక ఆ సంస్థ సౌత్‌జోన్ టీం తరఫున 30 ఏళ్లు వివిధ టోర్నమెంట్లలో పాల్గొన్నారు. బీఎస్సీ విద్యార్హతకు తోడు ఇప్పటికే ఎంబీఏ కూడా పూర్తి చేసిన కిషోర్ కో ఆపరేటివ్, రూరల్ స్టడీస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంటు, పబ్లిక్ రిలేషన్స్ వంటి విభాగాల్లో డిప్లమోలు చేశారు. ప్రస్తుతం ‘సొసైటీ ఓరియంటెడ్ పార్టిసిపేటివ్ రీసెర్చి’ పేరుతో క్రీడలను సామాజిక అవ సరం గా అన్వయించేందుకు ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ డి.లలితారాణి పర్యవేక్షణలో పరిశోధన చేస్తూనే ఎంఏ సైకాలజీ చదువుతున్నారు. ఘనత వహించిన క్రీడా కుటుంబం కిషోర్ తండ్రి భాస్కరరావు, ఆయన ఐదుగురు సోదరులు జాతీయస్థాయిలో రాణించిన ఫుట్‌బాల్ ఆటగాళ్లు. భాస్కరరావు ‘ఆంధ్ర రాష్ట్ర క్రీడా పితామహుడు’గా బిరుదు పొందారు. 1978లో ఇండియా- స్వీడన్ల మధ్య అంతర్జాతీయ మహిళా ఫుట్‌బాల్ మ్యాచ్‌ను నిర్వహించి రాజమండ్రికి ఖ్యాతి తెచ్చారు. వివిధ దేశాల ఫుట్‌బాల్ టీంలను ఈ అన్నదమ్ములు మట్టి కరిపించి దేశానికి పతకాలు పండించారు. యువకుల్లో క్రీడా స్ఫూర్తి పెంపు, మానవ క్రీడా వనరుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు కిషోర్ తెలిపారు. ఇందుకోసం ఏడేళ్ల లోపు విద్యార్థుల్లో క్రీడా సామర్థాన్ని సూచించే స్పోర్ట్స్ ఇన్వెన్షన్ కార్డులు, క్రీడలకు అవసరమైన శారీరక సంసిద్ధత యువత, విద్యార్థుల్లో ఏ మేరకు ఉన్నదీ ధృవీకరిస్తూ స్పోర్ట్స్ అసెస్మెంటు కార్డులు, వారి ఆరోగ్య ప్రమాణాలను సూచి స్తూ హెల్త్ కాన్షస్ కార్డులు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఇందుకు ప్రత్యేక పరీక్షలు, తర్ఫీదు నిర్వహిస్తున్నామన్నారు. ప్రముఖ వైద్యుడు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, ప్ర శాంతి నర్సింగ్ హోం నిర్వాహకులు డాక్టర్ సీవీ ఎస్ శాస్త్రిల సహకారంతో క్రీడాపరమైన కార్యక్రమాలు చేపడుతున్నానని చెప్పారు. -
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కిషన్‌రెడ్డి!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డికి పార్టీ జాతీయ స్థాయిలో కీలక పదవి వరించనుంది. కిషన్‌రెడ్డిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడానికి పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. బీజేపీ జాతీయ కార్యవర్గంలో 5 ప్రధాన కార్యదర్శులు, 5 ఉపాధ్యక్ష పదవులకు ఖాళీలు ఏర్పడ్డాయి. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ప్రధాన కార్యదర్శులు జేపీ నడ్డా, రాజీవ్‌ప్రతాప్ రూడీ, రాంశంకర్ ఖతేరియాలతో పాటు ఉపాధ్యక్షులు బండారు దత్తాత్రేయ, ముక్తార్‌అబ్బాస్ నక్వీలను కేబినెట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. వీరితో ఏర్పాటైన ఖాళీలతో పాటు అంతకు ముందు నుంచే ఖాళీగా ఉన్న ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల భర్తీకి అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి జి.కిషన్‌రెడ్డి, హర్యానా నుంచి డాక్టర్ అనిల్ జైన్, మధ్యప్రదేశ్ నుంచి కైలాస్ విజయ్‌వర్గీయలతో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి ఒక్కొక్కరిని ప్రధాన కార్యదర్శులుగా నియమించడానికి పేర్లు ఖరారైనట్టు విశ్వసనీయ సమాచారం. కాగా తెలంగాణ నుంచి పి.మురళీధర్‌రావు, ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్‌మాధవ్‌లు జాతీయ ప్రధాన కార్యదర్శులుగా పని చేస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. -
జాతీయస్థాయిలో కాకతీయ ఉత్సవాలు
డిసెంబర్లో 19, 20, 21 తేదీల్లో నిర్వహణ ఏర్పాట్లపై వచ్చే వారం సమావేశం సాక్షి ప్రతినిధి, వరంగల్: చెరువులు, ఆలయాలు, పట్టణాలు... విధానాలుగా పరిపాలన సాగించిన కాకతీయుల కీర్తిని స్మరించుకునేందుకు కాకతీయ ఉత్సవాలను జాతీయస్థాయిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కాకతీయ ఉత్సవాలు గతేడాది రాష్ట్ర స్థాయిలో జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్లో జాతీయ స్థాయిలో కాకతీయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. వరంగల్ జిల్లాలోని వేయిస్థంభాల గుడి, రామప్ప ఆలయం, ఖిలావరంగల్, గణపురం కోటగుళ్లు వేదికలుగా డిసెంబర్ 19, 20, 21వ తేదీల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. తెలంగాణలోని మిగిలిన తొమ్మిది జిల్లా కేంద్రాల్లో ఒక్కో రోజు ఈ ఉత్సవాలను నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా న్విరహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో అంతర్జాతీయ స్థాయి కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. కాకతీయుల సాంకేతిక పరిజ్ఞానంపై వర్క్‌షాప్‌లు, సెమినార్లు నిర్వహిస్తారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో శిథిలమైన ప్రతిష్టాత్మక వేయి స్తంభాలగుడి కల్యాణ మంటపాన్ని ఉత్సవాల సందర్భంగా పునఃప్రారంభోత్సవం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాకతీయ ఉత్సవాల నిర్వహణకు రూ. 80 లక్షలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై వచ్చే వారం హైదరాబాద్‌లో ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది.కాకతీయ పాలకురాలు రుద్రమాదేవి పట్టాభిషిక్తురాలై 800 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2013 డిసెంబర్ నుంచి 2014 డిసెంబర్ వరకు నిర్వహించిన కాకతీయ ఉత్సవాలను నిర్వహించింది. ఇవి తూతుమంత్రంగానే జరిగాయి. ఉత్సవాల ప్రారంభోత్సవం, ముగింపు కార్యక్రమాలు మాత్రమే కాస్త చెప్పుకునే విధంగా నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణపై కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. సమైక్య రాష్ట్రంలో నిధుల కొరత కారణంగా కాకతీయ ఉత్సవాలు వెలవెలబోయాయని, ప్రత్యేక రాష్ట్రంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని అప్పట్లో కేసీఆర్ పలుమార్లు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు కచ్చితంగా ఏడాది తర్వాత ముఖ్యమంత్రి హోదాలో 2014 డిసెంబర్లో కాకతీయ ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.