ప్రభుత్వ విద్యా సంస్థల్లో మనమే టాప్
► జాతీయ స్థాయిలో రాష్ట్రానికి మెరుగైన స్థానాలు
► నాలుగో స్థానంలో హెచ్‌సీయూ
► ఐఐటీ హైదరాబాద్‌కు ఏడో స్థానం
► 28వ స్థానంలో వరంగల్ ఎన్‌ఐటీ
►తొలిసారిగా ర్యాంకులిచ్చిన కేంద్రం
► పలు టాప్ కాలేజీలకు దక్కని స్థానం
సాక్షి, హైదరాబాద్ : జాతీయ స్థాయిలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విద్యా సంస్థల ర్యాంకింగ్‌లో తెలంగాణలోని ప్రభుత్వ విద్యా సంస్థలు టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నాయి. రెండు టాప్-10లో నిలవగా మరో ఆరింటికి టాప్-100లో చోటు లభించింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్‌ఆర్‌డీ) మంత్రి స్మృతిఇరానీ సోమవారం విడుదల చేసిన ఈ ర్యాంకుల్లో యూనివర్సిటీల విభాగంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలవడం విశేషం. ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ హైదరాబాద్‌కు ఏడో స్థానం దక్కింది. వరంగల్‌లోని ఎన్‌ఐటీ 28వ స్థానంలో నిలిచింది.
చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ)కి 71వ స్థానం దక్కింది. ఇక మేనేజ్‌మెంట్ విద్యా సంస్థల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థకు 38, ఫార్మసీ విభాగంలో వరంగల్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి 16వ స్థానం దక్కాయి. వర్సిటీలు, ఇంజినీరింగ్ విభాగాల్లో టాప్-100 స్థానాలను, మేనేజ్‌మెంట్, ఫార్మా విద్యా సంస్థల్లో టాప్-50 విద్యాసంస్థల ర్యాంకులను హెచ్‌ఆర్‌డీ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని మరిన్ని టాప్ కాలేజీలకు ఈ ర్యాంకింగ్‌లో స్థానం లభిస్తుందని భావించినా ఉస్మానియా వర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం, కాకతీయ వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్‌లతో పాటు పలు టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకూ చోటు లభించలేదు.
ఇంజనీరింగ్‌కు 1,438 దరఖాస్తులు
నాలుగు కేటగిరీల్లో ర్యాంకింగులకు గత జనవరి 15వ తేదీ వరకు హెచ్‌ఆర్‌డీ శాఖ దరఖాస్తులు స్వీకరించింది. దేశవ్యాప్తంగా 1,438 ఇంజనీరింగ్, 609 మేనేజ్‌మెంట్, 454 ఫార్మసీ, 28 ఆర్కిటెక ్చర్, 803 డీమ్డ్, ప్రైవేటు వర్సిటీల కాలేజీలు, 233 వర్సిటీలు దరఖాస్తు చేసుకున్నాయి. బోధన, అభ్యసన వనరులు, ఫ్యాకల్టీ, పరిశోధనలు, గ్రాడ్యుయేట్ల స్థాయి, వారికి ఉపాధి అవకాశాలు తదితరాల ఆధారంగా సంస్థలకు స్కోర్ ఇచ్చి ర్యాంకులను కేంద్రం ఖరారు చేసింది.
టాప్ ర్యాంకులన్నీ ఐఐటీలవే
ఇంజనీరింగ్ విభాగంలో ఒకటి నుంచి 12వ ర్యాంకు దాకా ఐఐటీలే సాధించాయి. మేనేజ్‌మెంట్ విద్యా సంస్థల్లోనూ ప్రభుత్వ రంగంలోని ఐఐఎంలే తొలి పది ర్యాంకులనూ కైవసం చేసుకున్నాయి.
రాష్ట్ర విద్యా సంస్థలకు జాతీయ స్థాయిలో లభించిన ర్యాంకులు వర్సిటీల్లో
సంస్థ ర్యాంకు రాష్ట్రం
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 4 తెలంగాణ
ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్ 23 తెలంగాణ
ఉస్మానియా వర్సిటీ, హైదరాబాద్ 33 తెలంగాణ
ఇంజినీరింగ్ విభాగంలో..
ఐఐటీ-హైదరాబాద్ 7 తెలంగాణ
ఎన్‌ఐటీ-వరంగల్ 28 తెలంగాణ
సీబీఐటీ, హైదరాబాద్ 71 తెలంగాణ
మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల్లో
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ 38 తెలంగాణ
ఫార్మసీ విద్యా సంస్థల్లో
యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మా సెన్సైస్, వరంగల్ 16 తెలంగాణ
ఇంజనీరింగ్‌లో...
ఐఐటీ మద్రాస్ 1 తమిళనాడు
ఐఐటీ బాంబే 2 తమిళనాడు
ఐఐటీ ఖరగ్‌పూర్ 3 పశ్చిమబెంగాల్
ఐఐటీ ఢిల్లీ 4 ఢిల్లీ
ఐఐటీ కాన్పూర్ 5 ఉత్తరప్రదేశ్
ఐఐటీ రూర్కీ 6 ఉత్తరాఖండ్
ఐఐటీ హైదరాబాద్ 7 తెలంగాణ
ఐఐటీ గాంధీనగర్ 8 గుజరాత్
ఐఐటీ రూప్‌నగర్ 9 పంజాబ్
ఐఐటీ పట్నా 10 బీహార్
మేనే జ్‌మెంట్‌లో
ఐఐఎం బెంగళూరు 1 కర్ణాటక
ఐఐఎం అహ్మదాబాద్ 2 గుజరాత్
ఐఐఎం కోల్‌కతా 3 పశ్చిమ బెంగాల్
ఐఐఎం లక్నో 4 ఉత్తరప్రదేశ్
ఐఐఎం ఉదయ్‌పూర్ 5 రాజస్థాన్
ఐఐఎం కోజికోడ్ 6 కేరళ
ఐఐఎం ఢిల్లీ 7 ఢిల్లీ
ఐఐఎఫ్‌ఎం భోపాల్ 8 మధ్యప్రదేశ్
ఐఐటీ కాన్పూర్ 9 ఉత్తరప్రదేశ్
ఐఐఎం ఇండోర్ 10 మధ్యప్రదేశ్
ఫార్మసీలో
మణిపాల్ కాలేజ్ ఆఫ్ ఫార్యాస్యూటికల్ సెన్సైస్, మణిపాల్ 1 కర్ణాటక
యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్ 2 చండీగఢ్
జామియా హామ్‌డార్డ్, ఢిల్లీ 3 ఢిల్లీ
పూణా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ 4 మహారాష్ట్ర
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, నిర్మా యూనివర్సిటీ, అహ్మదాబాద్ 5 గుజరాత్
బాంబే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ముంబై 6 మహారాష్ట్ర
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాంచీ 7 జార్ఖండ్
అమృత స్కూల్ ఆఫ్ ఫార్మసీ, కొచ్చి 8 కేరళ
జేఎస్‌ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఉటకమండ్ 9 తమిళనాడు
జేఎస్‌ఎస్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ, మైసూర్ 10 కర్ణాటక
విభాగాలవారీగా జాతీయ స్థాయిలో టాప్ విద్యా సంస్థలు వర్సిటీల్లో
సంస్థ ర్యాంకు రాష్ట్రం
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్, బెంగళూరు 1 కర్నాటక
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ 2 మహారాష్ట్ర
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ 3 న్యూఢిల్లీ
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 4 తెలంగాణ
తేజ్ జూర్ యూనివర్సిటీ 5 అస్సాం
యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ 6 ఢిల్లీ
బెనారస్ హిందూ యూనివర్సిటీ 7 ఉత్తరప్రదేశ్
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ 8 కేరళ
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్-ఫిలానీ 9 రాజస్థాన్
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ 10 ఉత్తరప్రదేశ్