నిజామాబాద్ స్పోర్ట్స్: నేను పదమూడు సంవత్సరాలుగా హాకీ ఆడుతూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాను. గత ప్రభుత్వాలు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే క్రీడలకు, క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందుతుంది్ఱూఎఖఖీా అని అంతర్జాతీయ క్రీడా కారిణి యెండల సౌందర్య అన్నారు.
బుధవారం నిజామాబాద్‌లోని కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు రూ.25లక్షల నగదు, 250 గజాల ఇంటిస్థలం, ఇంటి నిర్మాణానికి రూ.15లక్షలు ప్రకటించడంపై ఆమె సంతోషాన్ని ప్రకటించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ తనను కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లినట్లు సౌందర్య తెలిపారు. మాకు సీఎం 15 నిముషాల సమయం కేటాయించారు.
నేను సాధించిన పతకాలు, మెడల్స్, చూపించగానే చాలా సంతోషంగా సీఎం ఫీలయ్యారు. ఇంతగా సాధించినావు గదా గత ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించలేదా అని బాధపడ్డారు. వెంటనే నాకు ప్రభుత్వం నుంచి గౌరవం దక్కేలా చేశారు. ముఖ్యమంత్రికి, ఎంపీ కవిత, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌కు, మాజీ పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ డి శ్రీనివాస్‌లకు, తనకు గుర్తింపు ఇచ్చిన ప్రింట్, ఎల క్ట్రానిక్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సౌందర్య పేర్కొన్నారు.
తనలాంటి క్రీడాకారులకు, ప్రతిభ ఉన్న వారు చాలా మంది ఉన్నప్పటికీ ప్రోత్సాహం కరువైందన్నారు. క్రీడాకారుల్లో ప్రతిభ వెలికితీయడానికి కోచ్‌లు అత్యవసరం అని అన్నారు. తద్వారా తెలంగాణ రాష్ట్రం పేరును ప్రపంచ దేశాల్లో క్రీడల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి వీలుంటుందన్నారు. తనకు సమైక్య రాష్ట్రంలో ఎలాంటి గుర్తింపు రాలేదని, కేవలం తెలంగాణ వచ్చిన తర్వాతే ప్రభుత్వం ప్రత్యేక గౌరవం అందించిందని సౌందర్య పునరుద్ఘాటించారు. క్రీడాకారులు కూడా ఎదైనా ఆటలో ప్రావీణ్యం సాధించడానికి కఠోర శిక్షణ తీసుకోవాలన్నారు. ప్రస్తుతం తాను భారత హాకీజట్టుకు వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాని సౌందర్య తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోనే గుర్తింపు
Published Thu, Sep 25 2014 2:36 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement