
అందం, అభినయం..ఈ రెండు కలిస్తే సౌందర్య. ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా ఉంటూ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న అతి తక్కువ మంది హీరోయిన్లలో సౌందర్య ఒకరు. దశాబ్దానికి పైగా హీరోలతో సమానంగా క్రేజీ సొంతం చేసుకున్న ఈ విలక్షణ నటి.. చిన్న వయసులోనే అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. 2004లో ఆమె ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురై పేలి పోయింది. ఈ ప్రమాదంలో సౌందర్య(32)తో పాటు ఆమె సోదరుడు కూడా మృతి చెందారు. ఈ ఘటన జరిగిన 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు సౌందర్య మరణంపై పుకార్లు వచ్చాయి. ఆమె మరణం వెనుక సీనియర్ హీరో మోహన్ బాబు ఉన్నారంటూ ఓ వ్యక్తి లేఖ రాయడంతో మరోసారి సౌందర్య పేరు నెట్టింట వైరల్‌గా మారింది. అసలు సౌందర్య ఎలా చనిపోయింది? ఆ రోజు ఏం జరిగింది?
→ 2004 ఏప్రిల్ 17 మధ్యాహ్నం గం.1:14 నిమిషాలకు బెంగళూరులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య కన్నుమూశారు. ఆమెతో పాటు అన్నయ్య అమర్ కూడా నేలరాలి పోయారు. అప్పటికామెకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రఘుతో పెళ్లయ్యి ఏడాది కూడా కాలేదు.
→ కరీంనగర్ జిల్లాలో బీజేపీకి సపోర్ట్‌గా ఎన్నికల సభలో పాల్గొనడానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్ 150 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులోకి వెళ్లలేకపోయింది. పైలట్ జాయ్ ఫిలిప్ హెలికాఫ్టర్‌ను కొద్దిగా ఎడమ వైపు తిప్పాడు. అంతే..ఇంజిన్ పనిచేయడం మానేసింది. ఆ వెంటనే హెలికాఫ్టర్‌లో మంటలు చెలరేగాయి. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇదంతా జరిగింది.
→ ఇక్కడ అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే.. ప్రమాదం జరిగిన సమయానికి సౌందర్య గర్భంతో ఉంది. మంటలు భారీగా చెలరేగడంతో సౌందర్యతో పాటు ఆమె అన్న అమర్నాథ్, రమేష్, జాయ్ ఫిలిప్ అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు. ఎవరి శరీర భాగాలు ఎవరివో కనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చిందట.
→ సౌందర్య మరణించి 20 ఏళ్లు దాటినా అభిమానులు ఇప్పటికీ ఆమెను మర్చిపోవడం లేదు. కాగా, ఆమె మరణంపై వస్తున్న పుకార్లపై భర్త రఘు స్పందించారు. మోహన్ బాబుతో తమకు ఎలాంటి గొడవల్లేవని, ఆస్తు వివాదాలు అంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.
(చదవండి: మోహన్ బాబుతో మాకు ఎలాంటి ఆస్తి గొడవల్లేవు: సౌందర్య భర్త)
Comments
Please login to add a commentAdd a comment