
సౌందర్య ‘సెంచరీ’
ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా తెలంగాణకు చెందిన యెండల సౌందర్య భారత్ తరఫున 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. నిజామాబాద్‌కు చెందిన సౌందర్య గత కొన్నేళ్లుగా భారత ఫార్వర్డ్ శ్రేణిలో కీలక సభ్యురాలిగా వ్యవహరిస్తోంది. ఈ ఘనతతో సౌందర్య ప్రస్తుత జట్టులో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రీతూ రాణి, పూనమ్ రాణి, వందన కటారియా, దీపికల సరసన నిలిచింది.
‘దేశానికి ప్రాతినిధ్యం వహించడమంటేనే గొప్ప గౌరవం. అలాంటిది 100 మ్యాచ్‌లు అడానంటే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. వరల్డ్ లీగ్‌లో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించడంతోపాటు రియో ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకోవడమే మా లక్ష్యం’ అని సౌందర్య వ్యాఖ్యానించింది.