'అసలేం గుర్తుకురాదు..' పాటలో సౌందర్యను అలా చూపించింది ఆయన కాదట! | Krishna Vamsi Clarifies Asalem Gurthukuradhu Song In Anthapuram | Sakshi
Sakshi News home page

Krishna Vamsi: ఇన్నాళ్లకు వీడిన మిస్టరీ.. సౌందర్యను అలా చూపించింది కృష్ణవంశీ కాదట!

Published Sun, Jul 21 2024 12:25 PM | Last Updated on Sun, Jul 21 2024 1:05 PM

Krishna Vamsi Clarifies Asalem Gurthukuradhu Song In Anthapuram

అంత:పురం.. 1998లో వచ్చిన సినిమా. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సౌందర్య హీరోయిన్‌. ఇళయరాజా సంగీతం అందించిన 'అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా..' ఎవర్‌ గ్రీన్‌ సాంగ్‌. సింగర్‌ చిత్ర ఆలపించిన ఈ పాటలో సౌందర్య చీర రంగులు మారుతూ ఉంటుంది. రెడ్‌, పర్పుల్‌, పింక్‌, ఎల్లో, గ్రీన్‌.. ఇలా వెంటవెంటనే చీర అనేక రంగుల్లో కనిపిస్తుంది.

'ఈ చీర రంగులు మార్చే కాన్సెప్ట్‌ భలే ఉంది. చాలా కొత్తగానూ ఉంది. అప్పట్లో ఈ ఐడియా ఎలా వచ్చింది సార్‌?' అని ఓ నెటిజన్‌.. కృష్ణవంశీని అడిగాడు. ఇందుకు దర్శకుడు స్పందిస్తూ.. అది తమ క్రియేటివిటీ కాదని చెప్పాడు. మూవీ రిలీజ్‌ తర్వాత జెమిని టీవీ ఎడిటర్‌ దాన్ని ఇలా మలిచాడని క్లారిటీ ఇచ్చాడు.

ఈ సంగతి తెలుసుకున్న జనాలు సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. ఇన్నాళ్లూ సినిమాలోనే ఎడిట్‌ చేశారనుకున్నాం.. ఇంత పెద్ద ట్విస్ట్‌ ఇచ్చావేంటయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. సౌందర్యను ఇంధ్రదనస్సులా అన్ని రంగు చీరల్లో చూపించాలన్న అతడి ఐడియాను మెచ్చుకోవాల్సిందేనంటున్నారు. ఈ క్రమంలో అసలేం గుర్తుకు రాదు సినిమా ఒరిజినల్‌ సాంగ్‌తో పాటు చీర రంగులు మార్చే వీడియో నెట్టింట వైరలవుతోంది.

 

 

 

 

చదవండి: ‘మురారి’ ఫ్లాప్‌ మూవీ.. కృష్ణవంశీ అదిరిపోయే కౌంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement