హీరోయిన్ సౌందర్య.. తెలుగు సినీ పరిశ్రమలో ఈమె పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కొందరు మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి సౌందర్య కూడా ఒకరు. మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సౌందర్య తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ గుర్తిండిపోతుంది.
చక్కటి చీరకట్టులో, నిండైన రూపంతో పదహారణాల తెలుగింటి అమ్మాయిలా నటించి ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. గ్లామర్ షో చేయకుండానే చీరకట్టులోనే కనిపించి అగ్రకథానాయిగా చక్రం తిప్పిన సౌందర్య అనుకోని ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.ఆమె మరణించి 19 ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ ఆమె రూపం అభిమానుల గుండెల్లో చిరస్మరణీయంగానే ఉంది.
నిజానికి సౌందర్యను డాక్టార్‌ను చేయాలని ఆమె తండ్రి కలలు కన్నాడట. కానీ కూతురి జాతకంలో సినీ నటి అవుతుందని ఉందట. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే ఇండస్ట్రీ నుంచి పిలుపు రావడంతో డాక్టర్ కావాల్సిన సౌందర్య నటిగా అరంగేట్రం చేసింది. ఇక సౌందర్య తండ్రి సజాత్యనారాయణకు జాతకలపై మంచి పట్టు ఉండేదట.
తఓ సందర్భంలో ఓ డైరెక్టర్ చిట్టిబాబుతో మాట్లాడుతున్న ఆయన.. సౌందర్య గురించి మాట్లాడుతూ.. నా కూతురి జాతకం ప్రకారం.. ఆమె దక్షణాదిలో టాప్ హీరోలందరితో పనిచేసిన అగ్రనటిగా సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుంటుంది. కానీ 2004లో ఆమె సినీ కెరీర్ ముగుస్తుంది అని చెప్పాడట. అయితే ఆ మాటలు విని బహుశా పెళ్లి చేసుకొని కాస్త గ్యాప్ తీసుకుంటుందేమో అనుకున్నాం..కానీ ఇలా జీవితమే ముగుస్తుందని ఊహించలేదు అంటూ చిట్టిబాబు అప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment