soundarya died
-
సౌందర్య చనిపోతుందని ఆమె తండ్రికి ముందే తెలుసా?
హీరోయిన్ సౌందర్య.. తెలుగు సినీ పరిశ్రమలో ఈమె పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కొందరు మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి సౌందర్య కూడా ఒకరు. మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సౌందర్య తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ గుర్తిండిపోతుంది. చక్కటి చీరకట్టులో, నిండైన రూపంతో పదహారణాల తెలుగింటి అమ్మాయిలా నటించి ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. గ్లామర్ షో చేయకుండానే చీరకట్టులోనే కనిపించి అగ్రకథానాయిగా చక్రం తిప్పిన సౌందర్య అనుకోని ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.ఆమె మరణించి 19 ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ ఆమె రూపం అభిమానుల గుండెల్లో చిరస్మరణీయంగానే ఉంది. నిజానికి సౌందర్యను డాక్టార్ను చేయాలని ఆమె తండ్రి కలలు కన్నాడట. కానీ కూతురి జాతకంలో సినీ నటి అవుతుందని ఉందట. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే ఇండస్ట్రీ నుంచి పిలుపు రావడంతో డాక్టర్ కావాల్సిన సౌందర్య నటిగా అరంగేట్రం చేసింది. ఇక సౌందర్య తండ్రి సజాత్యనారాయణకు జాతకలపై మంచి పట్టు ఉండేదట. తఓ సందర్భంలో ఓ డైరెక్టర్ చిట్టిబాబుతో మాట్లాడుతున్న ఆయన.. సౌందర్య గురించి మాట్లాడుతూ.. నా కూతురి జాతకం ప్రకారం.. ఆమె దక్షణాదిలో టాప్ హీరోలందరితో పనిచేసిన అగ్రనటిగా సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుంటుంది. కానీ 2004లో ఆమె సినీ కెరీర్ ముగుస్తుంది అని చెప్పాడట. అయితే ఆ మాటలు విని బహుశా పెళ్లి చేసుకొని కాస్త గ్యాప్ తీసుకుంటుందేమో అనుకున్నాం..కానీ ఇలా జీవితమే ముగుస్తుందని ఊహించలేదు అంటూ చిట్టిబాబు అప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు. -
మనకు 'సౌందర్య' దూరమై పదేళ్లు
కరీంనగర్ పర్యటనకు వస్తూ ప్రమాదానికి గురైన వైనం దశాబ్దకాలం.. స్మృతిపథం.. సినీనటి సౌందర్య కరీంనగర్ జిల్లాలో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి 2004 ఏప్రిల్ 17న బెంగళూర్ నుంచి హెలికాప్టర్లో వస్తుండగా ప్రమాదానికి గురై దుర్మరణం చెందిన సంఘటన ఇప్పటికీ స్మృతిపథంలో మెదులుతూనే ఉంది. ఎన్నికలు అనగానే ప్రచార ఆర్భాటం, సినీగ్లామర్ తోడవడం సహజం. కానీ 2004 ఎన్నికల్లో అప్పటి బీజేపీ అభ్యర్థి చెన్నమనేని విద్యాసాగర్‌రావు పక్షాన ప్రచారం చేసేందుకు సౌందర్య బెంగళూర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయల్దేరిన కొద్దిసేపటికే ఆ హెలికాప్టర్ ప్రమాదానికి గురై కుప్పకూలింది. ఆ మంటల్లో ప్రేక్షకుల అభిమాన నటి సజీవ దహనమైంది. ఏప్రిల్ 17న ఉదయమే బెంగళూర్ నుంచి బయల్దేరిన సౌందర్య మధ్యాహ్నం 3గంటలకు ముస్తాబాద్ రోడ్‌షోలో పాల్గొనాల్సి ఉంది. అనంతరం 4.30గంటలకు ఎల్లారెడ్డిపేట రోడ్‌షోలో ప్రచారం చేయాలి. సాయంత్రం 5.30గంటలకు సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి. రాత్రి 7గంటలకు కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ బహిరంగ సభలో సౌందర్య ప్రసంగించాల్సి ఉంది. కానీ, విధి వక్రీకరించి ఆమెను బలితీసుకుంది. ప్రచార సభలు కాస్తా.. సంతాప సభలుగా మారిపోయాయి. ఎన్నికల ప్రచారానికి కరీంనగర్ బయల్దేరిన సౌందర్య నేలరాలడం ఇప్పటికీ జిల్లా ప్రజలు గుర్తుచేసుకుంటారు.