Soundarya Not Fulfilled Her Last Wish - Sakshi
Sakshi News home page

Soundarya: చివరి కోరిక తీరకుండానే చనిపోయిన సౌందర్య

Published Fri, Jun 30 2023 10:57 AM | Last Updated on Fri, Jun 30 2023 11:51 AM

Soundarya Last Wish not Fulfilled - Sakshi

హీరోయిన్‌ సౌందర్య.. అప్పటికీ, ఇప్పటికీ ఆమెను అభిమానించేవారి సంఖ్య దండిగానే ఉంది. తనే కనక ఈ రోజు ఉండి ఉంటే ఎన్నో పాత్రలు ప్రాణం పోసుకునేవి, మరెన్నో రికార్డులు తన పేరిట నెలకొల్పేది అని ఫ్యాన్స్‌ ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే జీవించేసే సౌందర్య నటనకు, ఆమె అందానికి దాసోహం కానివారు లేరంటే అతిశయోక్తి కాదు.

ఇప్పటి హీరోయిన్స్‌లా మితిమీరిన గ్లామర్‌ షో చేయకుండా హద్దుల్లోనే అందాలు ఆరబోస్తూ సాంప్రదాయ దుస్తుల్లోనే ఎక్కువగా కనిపిస్తూ పక్కింటి అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. ఎంతో కెరీర్‌ ఉన్న ఆమె 31 ఏళ్ల వయసులో జరిగిన అనుకోని ప్రమాదంలో శాశ్వతంగా కన్నుమూసింది. ఆమె మరణించిన 19 ఏళ్ల తర్వాత తాజాగా ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. సౌందర్య చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఓ కోరిక కోరిందట.

ఎయిర్‌పోర్టుకు వెళ్లేముందు తన వదినను కాటన్‌ చీర, కుంకుమ తీసుకురమ్మని అడిగిందట.! అప్పుడు తన దగ్గర కాటన్‌ చీర లేకపోవడంతో ఒకటి కొని తీసుకురమ్మని కోరిందట. అప్పటికే ఆమె బీజేపీలో చేరడంతో ఆ చీర కట్టుకుని ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించుకుంది సౌందర్య. తనకు కుంకుమ ధరించడం అలవాటు, కాబట్టి దాన్ని కూడా తెమ్మని చెప్పింది. కానీ ఇంతలోనే సమయం కావస్తోందని విమానం ఎక్కేయడం, అది కూలిపోవడంతో సౌందర్య అక్కడికక్కడే మరణించడం తెలిసిందే! తాజాగా ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది సౌందర్య వదిన. ఇకపోతే 2004 ఏప్రిల్‌ 17న సౌందర్య తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది.

చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మేమ్‌ ఫేమస్‌ సినిమా

కెమెరాల ముందు 30 సెకన్ల పాటు లిప్‌లాక్‌.. బుర్ర పని చేస్తుందా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement