కృష్ణ వంశీ తెరకెక్కించిన అద్భుతమైన సినిమాల్లో ‘మురారి’ ఒకటి. మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం 2001లో విడుదలై క్లాసిక్ హిట్‌గా నిలిచింది. మణిశర్మ అందించిన సంగీతం, పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర వహించింది. కృష్ణవంశీ మేకింగ్‌పై విమర్శకులు సైతం ప్రసంశలు కురిపించారు.మహేశ్ నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ తీసుకున్నాడని ఘట్టమనేని అభిమానులు అభినందించారు.
మహేశ్ కూడా తను బాగా ఇష్టపడే సినిమాల్లో మురారి ఒకటని ఎప్పుడూ చెబుతుంటాడు. ఆయన అభిమానులు కూడా తమ హీరో నుంచి మురారి లాంటి మరో క్లాసిక్ మూవీ రావాలని కోరుకుంటున్నారు. ఇక మహేశ్ బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 9న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. మురారీ సాంగ్స్‌ని, ఆ సినిమా విశేషాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ హల్‌చల్ చేస్తున్నారు.
కృష్ణవంశీ సైతం సోషల్ మీడియా వేదికగా మురారి చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేస్తూ అభిమానులు అలరిస్తున్నాడు. అయితే ఈ రీరిలీజ్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ నెటిజన్ ‘మురారి’ ప్లాప్ సినిమా అని రాసుకొచ్చాడు. దానికి కృష్ణవంశీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ‘హలో అండీ నేను మురారి నిర్మాత ఎన్.రామలింగేశ్వరరావు గారి నుంచి రూ. 55 లక్షలకు ఐదేళ్ల పాటు తూర్పుగోదావరి జిల్లా హక్కులను కొన్నాను. ఫస్ట్ రన్‌లో రూ. 1.30 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఒకవేళ వసూళ్లే ప్రామాణికం అయితే.. అది ఫ్లాప్ చిత్రమా లేదా సూపర్ హిట్టా?’ మీరే నిర్ణయించుకోండి’ అని రిప్లై ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment