మహేశ్‌బాబుతో సినిమా చేయడం కష్టం: కృష్ణవంశీ | Director Krishna Vamsi Says There is No Chance to Do Movie with Mahesh Babu | Sakshi
Sakshi News home page

Krishna Vamsi: మహేశ్‌తో సినిమా కష్టమే.. ఆ మూవీ సీక్వెలా.. అంత సీన్‌ లేదు!

Published Wed, Feb 28 2024 5:36 PM | Last Updated on Wed, Feb 28 2024 6:24 PM

Director Krishna Vamsi Says There is No Chance to Do Movie with Mahesh Babu - Sakshi

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు- డైరెక్టర్‌ కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రం మురారి. ఈ మూవీ 23 ఏళ్లవుతున్నా ఇప్పటికీ అందులోని పాటలు, కథ గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ తర్వాత ఆయన ఎన్నో సినిమాలు చేశాడు, నంది అవార్డులు అందుకున్నాడు. కానీ ఇంతవరకు మళ్లీ మహేశ్‌తో సినిమా చేయలేదు. దీంతో ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా అభిమానులు మహేశ్‌తో మరో కుటుంబ కథా చిత్రం చేయండి అని అడిగారు.

రాఖీలాంటి సినిమా..
దీనికి కృష్ణవంశీ స్పందిస్తూ.. మహేశ్‌ ఇంటర్నేషనల్‌ స్టార్‌ కాబోతున్నాడండీ.. కాబట్టి తనతో సినిమా చేయడం కష్టం అని రిప్లై ఇచ్చాడు. జూనియర్‌ ఎన్టీఆర్‌తో రాఖీ లాంటి సినిమా మళ్లీ ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చా? అన్న ప్రశ్నకు ఎన్టీఆర్‌ ఇంటర్నేషనల్‌ స్టార్‌.. కానీ రాఖీలాంటి సినిమా మరొకటి ప్లాన్‌ చేస్తున్నాను.

నిన్నే పెళ్లాడతా సీక్వెల్‌?
ఈసారి ఒక అమ్మాయితో.. కాన్సెప్ట్‌, సమస్య అంతా వేరుగా ఉంటుంది. అన్నీ కుదిరితే త్వరలోనే ఆ సినిమా తీస్తాను అని రిప్లై ఇచ్చాడు. నాగచైతన్యతో నిన్నే పెళ్లాడతా సీక్వెల్‌ తీస్తే చూడాలనుందన్న అభిమాని కోరికకు  సీక్వెల్‌ తన వల్ల కాదని చెప్పాడు. నాకంత సీన్‌ లేదని చేతులు జోడించి రిప్లై ఇచ్చాడు.

చదవండి: గిల్లితే గిల్లించుకోవాలి.. ఆ రౌడీ బ్యూటీ గుర్తుందా? ఇప్పుడెలా ఉందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement