
‘ఇటలీ’ సిరీస్‌కు సౌందర్య
నిజామాబాద్ స్పోర్ట్స్ : జిల్లాకేంద్రానికి చెందిన హాకీ జాతీయ జట్టు క్రీడాకారిణి యెండల సౌందర్య మరో అంతర్జాతీయ టోర్నీకి ఎంపికకావడంపై జిల్లాకు చెందిన క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. ఆమె ఇటలీలో జరగనున్న హాకీ టెస్ట్ సిరీస్‌లో పాల్గొనే భారత మహిళల జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈనెల 29న ఇటలీ బయలు దేరి వెళతారు.
డిసెంబర్ 4 నుంచి 11వరకు జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో పాల్గొంటారు. గాయాల కారణంగా ఇటీవల జరిగిన ఆసియా క్రీడలకు దూరమైన సౌందర్య.. త్వరగా కోలుకొని తిరిగి జట్టులోకి రావడంపై జిల్లా హాకీ సంఘం ప్రతినిధులు సుబ్బారావు, ముకీబ్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.