hockey team
-
భారత హాకీ జట్టు విజయం అద్భుతం: వైఎస్జగన్
సాక్షి,తాడేపల్లి: ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత జట్టు గెలుపుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్జగన్ హర్షం వ్యక్తం చేశారు. ట్రోఫీ ఫైనల్లో చైనాపై 1-0 తేడాతో భారత జట్టు సాధించిన విజయం అద్భుతం అని వైఎస్ జగన్ కొనియాడారు.ఈమేరకు మంగళవారం(సెప్టెంబర్17)ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు. భారత హాకీ జట్టుసభ్యులకు అభినందనలు తెలిపారు.ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో చైనాపై 1-0 తేడాతో సాధించిన విజయం అద్భుతం.Well done, Congratulations!#AsianChampionsTrophy2024— YS Jagan Mohan Reddy (@ysjagan) September 17, 2024 -
కొరియాను కొట్టేసి...
ఆద్యంతం తమ ఆధిపత్యం కనబరిచిన భారత పురుషుల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు విజయం దూరంలో నిలిచింది. కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ మరోసారి జట్టును ముందుండి నడిపించగా... ఇతర ఆటగాళ్లు కూడా రాణించడంతో ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన టీమిండియా నాకౌట్ దశ సెమీఫైనల్ మ్యాచ్‌లోనూ అదే జోరు కనబరిచింది. తనదైన రోజున ఎంతటి మేటి జట్టునైనా ఓడించే సత్తాగల దక్షిణ కొరియాతో జరిగిన సెమీఫైనల్ పోరులో భారత్ ఏకపక్ష విజయాన్ని అందుకుంది. 13 ఏళ్ల చరిత్ర కలిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఆరోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. నేడు జరిగే టైటిల్ పోరులో చైనాతో భారత్ అమీతుమీ తేల్చుకుంటుంది. హులున్‌బుయిర్ (చైనా): డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్టు ఆడిన భారత పురుషుల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అంతిమ సమరానికి అర్హత సాధించింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 4–1 గోల్స్ తేడాతో దక్షిణ కొరియా జట్టును ఓడించింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ (19వ, 45వ నిమిషంలో) సాధించగా... ఉత్తమ్ సింగ్ (13వ నిమిషంలో), జర్మన్‌ప్రీత్ సింగ్ (32వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. కొరియా జట్టుకు యాంగ్ జిహున్ (33వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. ఆరంభం నుంచే... అటాకింగ్ ఆటకు ప్రసిద్ధి అయిన కొరియాతో మ్యాచ్‌లో భారత్ పక్కా వ్యూహంతో ఆడింది. ప్రత్యర్థి జట్టుకు ఎదురుదాడులు చేసే అవకాశం ఇవ్వకుండా హర్మన్‌ప్రీత్ బృందం ఆరంభం నుంచే సమన్వయంతో ముందుకు కదులుతూ కొరియా గోల్‌పోస్ట్ లక్ష్యంగా దాడులు చేసింది. దాంతో భారత ఫార్వర్డ్ ఆటగాళ్లను నిలువరించడంపైనే కొరియా ఆటగాళ్లు ఎక్కువ దృష్టి పెటాల్సి వచి్చంది. ఆట నాలుగో నిమిషంలోనే భారత్ ఖాతా తెరిచేది. అభిషేక్ కొట్టిన రివర్స్ షాట్‌ను కొరియా గోల్‌కీపర్ కిమ్ జేహన్ నిలువరించాడు. ఆ తర్వాత కూడా భారత్ తమ దాడులు కొనసాగించగా 13వ నిమిషంలో ఫలితం వచి్చంది. అరిజిత్ సింగ్ హుండల్ అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో అందుకున్న ఉత్తమ్ సింగ్ దానిని లక్ష్యానికి చేర్చాడు. ఆ తర్వాత కొరియా దూకుడు పెంచి నిమిషం వ్యవధిలో రెండు పెనాల్టీ కార్నర్లు సంపాదించింది. అయితే ఈ రెండింటిని భారత రక్షణపంక్తి ఆటగాళ్లు నిర్వీర్యం చేశారు. రెండో క్వార్టర్లో నాలుగు నిమిషాలు గడిచాక భారత్‌కు లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలచడంతో భారత ఆధిక్యం 2–0కు పెరిగింది. మూడో క్వార్టర్లో సుమిత్ అందించిన పాస్‌ను సర్కిల్ బయట అందుకున్న జర్మన్‌ప్రీత్ సింగ్ ‘డి’ ఏరియాలోనికి వచ్చి కొరియా గోల్కీపర్ను బోల్తా కొట్టించడంతో భారత్ ఖాతాలో మూడో గోల్ చేరింది. ఈ గోల్ తర్వాత కొరియాకు దక్కిన పెనాల్టీ కార్నర్‌ను యాంగ్ జిహున్ లక్ష్యానికి చేర్చాడు. కొరియా ఖాతా తెరిచినప్పటికీ భారత్ తమ దాడులను యధేచ్చగా కొనసాగించింది. 45వ నిమిషంలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్ గోల్‌గా మలిచాడు. దాంతో భారత ఆధిక్యం 4–1కు చేరుకుంది. మూడు గోల్స్ ఆధిక్యం పొందిన భారత్ ఆ తర్వాత నియంత్రణతో ఆడి కొరియాను కట్టడి చేసి విజయాన్ని ఖరారు చేసుకుంది. పాక్‌కు చైనా షాక్ అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో ఆతిథ్య చైనా జట్టు అద్భుతం చేసింది. రెండుసార్లు చాంపియన్ పాకిస్తాన్ జట్టును మట్టికరిపించి తొలిసారి ఈ టోరీ్నలోఫైనల్కు చేరుకుంది. నిరీ్ణత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించగా పాకిస్తాన్ ఆటగాళ్లు వరుసగా నాలుగు షాట్లలో విఫలమయ్యారు. చైనా రెండు షాట్లను వృథా చేసినా మిగతా రెండు షాట్లను గోల్‌గా మలిచి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. -
హాకీ లెజెండ్ శ్రీజేశ్కు ప్రధాని మోదీ లేఖ..
న్యూఢిల్లీ: భారత హాకీ దిగ్గజం, మాజీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. అతని కెరీర్ సాఫల్యతలో ఎదురైన ఆటుపోట్లు... పడిన కష్టం... చిందించిన చెమటను కీర్తిస్తూ ఆ లేఖలో ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. త్వరలో భారత జూనియర్ జట్టుకు కోచ్‌గా సరికొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్న శ్రీజేశ్కు శుభాకాంక్షలు కూడా తెలిపారు. గోల్‌కీపర్‌గా విజయవంతమైనట్లే... కోచ్‌గానూ జూనియర్లను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ‘ఆటలో నీ అంకితభావం, నిబద్ధత నాకు తెలుసు. ఇకపై కోచ్‌గానూ ఇదే పంథా కొనసాగిస్తావని ఆశిస్తున్నా. కోచ్ పాత్రలో జూనియర్ జట్టును ప్రభావంతంగా, స్ఫూర్తిదాయకంగా మలుస్తావని విశ్వసిస్తున్నాను.సుదీర్ఘకాలం పాటు భారత హాకీకి సేవలందించిన నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’నని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. కేవలం పతకాలు, ఘన విజయాలే కాదు... లెక్కలేనన్ని స్మృతులెన్నో అతని కెరీర్లో ఉన్నాయని ప్రధాని కొనియాడారు. అతనేంటో అతన్ని వరించిన అవార్డులు, పతకాలే తెలియజేస్తాయని ప్రశంసించారు. ప్రధాని లేఖ తన గుండెని తాకిందని శ్రీజేశ్ బదులిచ్చాడు. ‘హాకీనే నా జీవితం. అందుకే ఆట కోసమే ఇన్నాళ్లు శ్రమించాను. ఇకపై కూడా శ్రమిస్తాను. ప్రపంచ హాకీలో భారత్ బలీయమైన శక్తిగా అవతరించేందుకు నా వంతు కృషి చేస్తాను’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్యం గెలుపొందడంలో కృషి చేసిన శ్రీజేశ్ తన కెరీర్‌కు పతకంతో గుడ్‌బై చెప్పాడు. గోల్‌పోస్ట్ ముందు పెట్టని గోడలా నిలబడే శ్రీజేశ్ 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో రెండు ఆసియా క్రీడల స్వర్ణాలతో పాటు చాంపియన్స్ ట్రోఫీ రజత పతకాలు కూడా ఉన్నాయి. -
‘2028లో పసిడి సాధించాలి’
భువనేశ్వర్: వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాలు సాధించిన భారత హాకీ జట్టు 2028 లాస్ ఏంజెలెస్ విశ్వక్రీడల్లో పసిడి పతకం నెగ్గాలని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆకాంక్షించారు. పారిస్ క్రీడల్లో కాంస్యం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన హాకీ జట్టును బుధవారం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించగా.. గురువారం మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పలువురు ప్లేయర్లను సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సుదీర్ఘ విరామం తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు రావడం ఆనందంగా ఉంది. ఇదే ఆటతీరు కొనసాగిస్తూ లాస్ ఏంజెలెస్‌లో స్వర్ణం సాధించాలి’ అని ఆకాంక్షించారు. 2018 నుంచి భారత హాకీ జట్లకు ఒడిశా ప్రభుత్వం అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా... హాకీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేయడంలో నవీన్ పట్నాయక్ పాత్ర ఎంతో ఉందని ప్లేయర్లు కొనియాడారు.ఆటగాళ్ల అవసరాలను తీర్చుతూ అత్యుత్తమ సదుపాయాలు అందుబాటులోకి తేవడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని సుమిత్ పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో హాకీ ఇండియా అధ్యక్షుడు దిలిప్ టిర్కీ, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, అభిషేక్, సుమిత్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరూ చాంపియనే
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్ల బృందాన్ని గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం న్యూఢిల్లీలోని తన నివాసంలో అథ్లెట్ల బృందంతో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పారిస్ క్రీడల్లో రెండు పతకాలు సాధించి కొత్త చరిత్ర లిఖించిన షూటర్ మనూ భాకర్.. ఒలింపిక్స్‌లో వినియోగించిన పిస్టల్ ను ప్రధానికి చూపించింది. ఇక వరుసగా రెండో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టును ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్, కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌తో మోదీ ముచ్చటించారు. ఈ సందర్భంగా జట్టు ఆటగాళ్లంతా సంతకాలు చేసిన జెర్సీతో పాటు ఓ హాకీ స్టిక్‌ను ప్రధానికి అందించారు. పారిస్ క్రీడల్లో కాంస్య పతకం అందుకున్న రెజ్లర్ అమన్ సెహ్రావత్ కూడా భారత జెర్సీని ప్రధానికి బహుమతిగా ఇచ్చారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్‌తో కలిసి కాంస్య పతకం గెలిచిన సరబ్‌జ్యోత్ సింగ్, 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో కాంస్యం నెగ్గిన స్వప్నిల్ కుసాలేను కూడా ప్రధాని అభినందించారు. అనంతరం క్రీడాకారుల మధ్య కలియదిరిగిన ప్రధాని వారితో సంభాíÙంచారు. ఒలింపిక్స్‌లో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయా, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష పాల్గొన్నారు. ‘పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. విశ్వక్రీడల్లో వారి అనుభవాలు వినడం.. వారి విజయాలను ప్రశంసించడం తృప్తినిచ్చింది. పారిస్‌కు వెళ్లిన ప్రతీ భారత క్రీడాకారుడు చాంపియనే. ప్రభుత్వం క్రీడలకు మద్దతునిస్తుంది. మౌలిక సదుపాయాల కల్పనలో ఎల్లప్పుడూ ముందుంటుంది’ అని ప్రధాని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. పారిస్ క్రీడలు ముగిసిన వెంటనే చికిత్స కోసం జర్మనీకి వెళ్లడంతో అతడు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. త్రుటిలో పతకానికి దూరమైన షట్లర్ లక్ష్యసేన్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్తో పాటు ఇతర అథ్లెట్లతోనూ ప్రధాని సంభాషించారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు బరిలోకి దిగారు. ఓవరాల్‌గా ఈ క్రీడల్లో దేశానికి ఆరు (ఒక రజతం, 5 కాంస్యాలు) పతకాలు వచ్చాయి. అంతకుముందు ఎర్రకోట వద్ద జరిగిన 78వ స్వాతంత్య్ర వేడుకల్లో ఒలింపిక్ అథ్లెట్ల బృందం పాల్గొంది. ఈ సందర్భంగా ప్రధాని ‘పారిస్’ క్రీడల్లో పాల్గొన్న అథ్లెట్లకు ధైర్యం చెబుతూనే.. పారాలింపిక్స్‌కు వేళ్లనున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడం భారత్ కల అని.. 2036లో విశ్వక్రీడలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని ప్రధాని పునరుద్ఘాటించారు. ఫీల్డ్ గోల్స్‌తోనే అది సాధ్యం: శ్రీజేశ్ న్యూఢిల్లీ: విశ్వక్రీడల్లో నిలకడగా పతకాలు సాధించాలంటే.. ఫీల్డ్ గోల్స్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరముందని అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన భారత గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ అన్నాడు. ఒలింపిక్స్ వంటి మెగా టోర్నీల్లో సత్తా చాటాలంటే.. పెనాల్టీ కార్నర్లను వినియోగించుకోవడంతో పాటు.. ఫీల్డ్‌గోల్స్ ఎక్కువ చేయాలని శ్రీజేశ్ పేర్కొన్నాడు. పారిస్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత జట్టు మెగా టోరీ్నలో మొత్తం 15 గోల్స్ చేసింది. అందులో 9 పెనాల్టీ కార్నర్లు, మూడు పెనాల్టీ స్ట్రోక్స్ ఉన్నాయి. అంటే కేవలం మూడే ఫీల్డ్ గోల్స్ చేయగలిగింది. అదే సమయంలో స్వర్ణం గెలిచిన నెదర్లాండ్స్ 14 ఫీల్డ్ గోల్స్, రజతం నెగ్గిన జర్మనీ 15 ఫీల్డ్ గోల్స్ చేశాయి. కాంస్య పతక పోరులో భారత్ చేతిలో ఓడి నాలుగో స్థానంలో నిలిచిన స్పెయిన్ కూడా 10 ఫీల్డ్ గోల్స్‌తో ఆకట్టుకుంది. ‘పెనాల్టీ కార్నర్ల విషయంలో మన ప్లేయర్ల ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరముంది. వరుస విజయాలు సాధించాలంటే మనం ఎందులో మెరుగ్గా ఉన్నామో దానిపైనే కాకుండా.. ఇతర వాటిపై కూడా దృష్టి పెట్టాలి. ఫీల్డ్ గోల్స్‌లో సత్తా చాటితే హాకీలో పూర్వవైభవం సాధ్యమే’ అని శ్రీజేశ్ అన్నాడు. -
పారిస్ ఒలంపిక్స్ లో కొనసాగుతున్న భారత హాకీ జట్టు జైత్రయాత్ర
-
మళ్లీ ఓడిన భారత్
పెర్త్: ఆ్రస్టేలియా పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు ఖాతాలో వరుసగా నాలుగో పరాజయం చేరింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో టీమిండియా 1–3 గోల్స్ తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (12వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. ఆస్ట్రేలియా జట్టుకు జెరెమి హేవార్డ్ (19వ, 47వ ని.లో) రెండు గోల్స్, జేక్ వెల్చ్ (54వ ని.లో) ఒక గోల్ అందించారు. ఈ సిరీస్‌లో చివరిదైన ఐదో మ్యాచ్ నేడు జరుగుతుంది. -
అదరగొడుతున్న భారత మహిళల హాకీ జట్టు.. వరుసగా నాలుగో విజయం
ఆసియాక్రీడలు 2023లో భారత మహిళల హకీ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. హాంకాంగ్‌తో జరిగిన చివరి పూల్ మ్యాచ్‌లో భారత జట్టు 13-0తో విజయం సాధించింది. ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న టీమిండియా.. ఈ విజయంతో తమ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకుంది. భారత జట్టులో వందనా కటారియా, దీపికా, దీప్ గ్రేస్ ఎక్కా తలా మూడు గోల్స్‌తో అదరగొట్టారు. వీరి ముగ్గురితో పాటు సంగీతా కుమారి రెండు గోల్స్, నవనీత్ కౌర్ ఒక్క గోల్ సాధించారు. కాగా పూల్-ఎలో భారత మహిళ జట్టు 4 విజయాలు సాధించి 10 పాయింట్లతో అగ్ర స్ధానంలో నిలిచింది. కాగా ప్రతీ పూల్ నుంచి మొదటి రెండు స్ధానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. ఇక గురువారం జరగనున్న సెమీ ఫైనల్లో పూల్-బి రన్నరప్‌తో భారత్ తలపడనుంది. చదవండి: అతడిని భారత క్రికెటర్‌గా చాలా సంతోషంగా ఉంది: దినేష్ కార్తీక్ -
బంగ్లాదేశ్‌పై ఘన విజయం.. సెమీస్‌లో భారత హాకీ జట్టు
స్వర్ణ పతకం సాధించి... వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించడమే లక్ష్యంగా ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు తొలి అడ్డంకిని అధిగమించింది. లీగ్ దశలో ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అజేయంగా నిలిచిన భారత్ పూల్ ‘ఎ’లో 15 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకొని సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌తో సోమవారం జరిగిన చివరిదైన ఐదో లీగ్ మ్యాచ్‌లో భారత్ 12–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (2వ, 4వ, 32వ ని.లో), మన్దీప్ సింగ్ (18వ, 24వ, 46వ ని.లో) మూడు చొప్పున గోల్స్ సాధించి ‘హ్యాట్రిక్’లు నమోదు చేశారు. అభిషేక్ (41వ, 57వ ని.లో) రెండు గోల్స్ సాధించగా... నీలకంఠ శర్మ (47వ ని.లో), గుర్జంత్ సింగ్ (56వ ని.లో), అమిత్ రోహిదాస్ (28వ ని.లో), లలిత్ ఉపాధ్యాయ్ (23వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. పూల్ ‘ఎ’లోనే జపాన్ జట్టు 12 పాయింట్లతో రెండో సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జపాన్ 3–2తో పాకిస్తాన్‌ను ఓడించింది. ఈ ఓటమితో పాకిస్తాన్ పూల్ ‘ఎ’లో మూడో స్థానానికి పరిమితమై సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయింది. పూల్ ‘బి’ నుంచి దక్షిణ కొరియా, చైనా జట్లు టాప్–2లో నిలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. బుధవారం జరిగే సెమీఫైనల్స్‌లో చైనాతో భారత్; దక్షిణ కొరియాతో జపాన్ తలపడతాయి. భారత్, చైనీస్ తైపీ మ్యాచ్ ‘డ్రా’ ఆసియా క్రీడల్లో భారత మహిళల కబడ్డీ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే ఊహించని ఫలితం ఎదురైంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా చైనీస్ తైపీతో సోమవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌ను భారత్ 34–34తో ‘డ్రా’ చేసుకుంది. చివరి సెకన్లలో ఆఖరి రెయిడ్‌తో చైనీస్ తైపీ బోనస్ పాయింట్ సంపాదించి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. భారత్ ఒకదశలో 26–20తో ముందంజ వేసి ఆరు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ ఆధిక్యాన్ని భారత జట్టు వృథా చేసుకొని గెలవాల్సిన చోట ‘డ్రా’తో సరిపెట్టుకుంది. చదవండి: World cup 2023: 'పాక్, దక్షిణాఫ్రికా కాదు.. వరల్డ్‌కప్ సెమీఫైనల్‌కు చేరే జట్లు ఇవే' -
Neeru Yadav: హాకీ వాలీ సర్పంచ్
రాజస్తాన్‌లో ఆడపిల్ల పుడితే ఇంకా కొన్ని పల్లెల్లో బంధువులు వెళ్లి ‘శోక్ ప్రకటన్’ (శోక ప్రకటన) చేసే ఆనవాయితీ ఉంది. మొదట కొడుకు పుట్టేశాక రెండో సంతానంగా ఆడపిల్ల పుడితే బిడ్డ బాగోగులు నిర్లక్ష్యం చేసే ఆనవాయితీ ఉండటంతో ప్రభుత్వం ఏకంగా రెండో సంతానం కోసమే ‘మాతృత్వ పోషణ్ యోజన’ పేరుతో తల్లికి 6 వేల రూపాయలు ఇస్తోంది. అలాంటి చోట ఒక మహిళా సర్పంచ్ హల్చల్ చేస్తోంది. తను సర్పంచ్ కావడమే ఊరిలోని ఆడపిల్లలతో ఒక హాకీ టీమ్ ఏర్పాటు చేసి ‘హాకీ వాలీ సర్పంచ్’ అనే పేరు గడించింది. తాజాగా హాకీ బ్యాట్ పట్టుకుని తిరుగుతూ పెళ్లిళ్లలో చెత్త చెదారం వేసినా, ఆహారాన్ని వ్యర్థం చేసినా డొక్క చించుతానని కొత్త ఆర్డర్ పాస్ చేసింది. ప్రజల కోసం సొంత డబ్బు కూడా ఖర్చు పెడుతున్న నీరూ యాదవ్ పరిచయం. జిల్లా అధికారులతో ఎప్పుడు మీటింగ్ జరిగినా నీరూ యాదవ్ లేచి గట్టిగా మాట్లాడుతుంది. అక్కడున్న వాళ్లు ఆమెను ‘మహిళ అయినా’ ఎంత గట్టిగా మాట్లాడుతోందని ఆశ్చర్యంగా, మెచ్చుకోలుగా చూస్తారు. ‘నేను మహిళనే. కాని బాగా చదువుకున్నాను. మీరు గోల్మాల్ చేసిన బిల్లుల మీద సంతకం పెట్టమంటే పెట్టను. అవినీతి చేయను. నా పంచాయితీలో జరగనివ్వను’ అని తిరగబడుతుంది. అంతే కాదు అది వీడియో తీసి యూట్యూబ్‌లో పెడుతుంది కూడా. రాజస్థాన్‌లోని ‘ఝుంజును’ జిల్లాలోని ‘లంబి అహిర్’ అనే పంచాయితీ ఈ నీరూ యాదవ్ అనే సర్పంచ్ వల్ల అందరినీ ఆకర్షిస్తోంది. లంబి అహిర్ రాజస్థాన్‌లో ఉన్నా హర్యాణ సరిహద్దులో ఉంటుంది. ఆ ఊళ్లో యాదవులు ఎక్కువ. నీరూ యాదవ్ ఊళ్లోకెల్లా బాగా చదువుకోవడం వల్ల సర్పంచ్‌గా సులభంగా ఎంపికైంది. మరి... ఎం.ఎస్సీ, ఎం.ఇడి చేసి పిహెచ్.డి కూడా చేసిన నీరూ ఊరికి సేవ చేస్తానంటే ఎవరు వద్దంటారు? ► అమ్మాయిల ప్రగతే ముఖ్యం 2020లో సర్పంచ్ అయిన నాటి నుంచి నీరూ యాదవ్ ముఖ్యంగా అమ్మాయిల ప్రగతి గురించి దృష్టి పెట్టింది. తన పంచాయతీలోని స్త్రీల పట్ల ఉన్న కట్టుబాట్లను బాగ ఎరిగిన నీరూ వారు అన్ని విధాలుగా వికాసం చెందాలంటే విద్యతో పాటు ఇంటి నుంచి బయటకు కదలడం ముఖ్యమే అని ఊరికి చూపించదలుచుకుంది. అందుకే స్కూలు, కాలేజీ వయసున్న ఆడపిల్లల ఇంటింటికి వెళ్లి వారికి, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని ఒక మహిళా హాకీ జట్టుగా జమ చేసింది. సర్పంచ్‌గా తనకొచ్చే జీతంతో ఒక కోచ్‌ను ఏర్పాటు చేసింది. పంచాయతీ నిధులతో గ్రౌండ్‌ను శుభ్రం చేసి ఏర్పాటు చేసింది. ‘మీరు ఉత్తమ హాకీ టీమ్‌గా విజయాలు సాధించాలి’ అనంటే ఆ ఆడపిల్లలు ఉదయం, సాయంత్రం ప్రాక్టీసు చేస్తూ, ఆటను ఆస్వాదిస్తూ ఇవాళ జిల్లా స్థాయిని దాటి స్టేట్ లెవల్లో ఆడేదాకా ఎదిగారు. ఇది ఊరందరికీ నచ్చి నీరూ యాదవ్ అసలు పేరు మరిచి ‘హాకీ వాలీ సర్పంచ్’ అని పిలవడం మొదలెట్టారు. అయితే ఆటలు మాత్రమే కాదు బాలికల చదువుకు, టెక్నికల్ విద్యకు కూడా నీరూ ప్రోత్సాహం అందిస్తోంది. కొంతమంది యువతులను షార్ట్‌టెర్మ్ టెక్నికల్ కోర్సులకు పంపి వారికి ఉద్యోగాలు దొరికేలా చూస్తోంది. తన సొంత డబ్బుతో చదివిస్తోంది. ► పెళ్ళిళ్ల వృధాకు విరుగుడు ఊళ్లో పెళ్లిళ్లు, మీటింగులు, ఇతర ఫంక్షన్ల వల్ల భోజనాల సమయంలో పేరుకు పోతున్న చెత్తను గమనించిన నీరూ యాదవ్ తాజాగా ‘చెత్త రహిత వివాహాలు’ అనే ప్రచారాన్ని మొదలెట్టింది. పెళ్లిళ్ల సమయంలో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, బాటిళ్లు వాడి పారేయడం వల్ల పేరుకుపోతున్న చెత్తకు విరుగుడుగా స్టీలు పళ్లేలు, గ్లాసులు, బకెట్లు, వంట పాత్రలు కొని పంచాయితీ ఆఫీసులో పెట్టింది. ఊళ్లో ఏ ఫంక్షన్‌కైనా వీటిని ఉచితంగా ఇస్తారు. అయితే నీరూ యాదవ్ తయారు చేసిన మహిళా కార్యకర్తలు వచ్చి వడ్డిస్తారు. ఎంత తింటే అంత పెట్టడం వల్ల ఆహారం వృధా కాకుండా చూడాలనేది ఆలోచన. అంతేకాదు ఒకవేళ ఆహారం వృధా అయితే దానిని ఎరువుగా మార్చి రైతులకు ఇవ్వాలనే కార్యాచరణ కూడా నీరూ మొదలెట్టింది. ‘మన దేశంలో ఒక మనిషి సంవత్సరానికి సగటున 50 కిలోల ఆహారాన్ని వృధా చేస్తున్నాడు. ప్రపంచంలో చైనా తర్వాత ఆహారాన్ని వృధా చేస్తున్నది మనమే’ అంటుంది నీరూ. పిల్లల ఆట కోసం చేతిలో సరదగా హాకీ బ్యాట్ పట్టుకున్నా అది పట్టుకుని ఆమె చేస్తున్న సంస్కరణలు జనం వింటున్నారు. ► రైతుల కోసం నీరూ యాదవ్ పల్లెకు ఆయువుపటై్టన రైతును ఎలా నిర్లక్ష్యం చేస్తుంది. రైతులకు కావాలసిన ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందుల ఏర్పాటు కోసం పండించిన పంటకు సరైన మద్దతు ధర దొరకడం కోసం ఊరి రైతులతో ఎఫ్.పి.ఓ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) ఏర్పాటు చేసింది. దాంతో రైతులు సంతృప్తిగా ఉన్నారు. నీరూ యాదవ్‌ను మెచ్చుకుంటున్నారు. ‘హాకీ వాలీ సర్పంచ్’ నీరూ యాదవ్ రాబోయే రోజుల్లో సర్పంచ్ కంటే పై పదవికి వెళ్లకుండా ఉండదు. ఆమె చేయాలనుకున్న మంచి పనుల లిస్టులో ఇవి కొన్నే. అన్ని పనులు జరగాలంటే అలాంటి వాళ్లు ఇక్కడితో ఆగకపోవడమే కరెక్ట్. మన దేశంలో ఒక మనిషి సంవత్సరానికి సగటున 50 కిలోల ఆహారాన్ని వృధా చేస్తున్నాడు. ప్రపంచంలో చైనా తర్వాత ఆహారాన్ని వృధా చేస్తున్నది మనమే. -
తొమ్మిదేళ్ల తర్వాత...సెమీస్‌లో భారత్
పోష్‌స్ట్రూమ్: తమ అజేయ రికార్డును కొనసాగిస్తూ భారత మహిళల హాకీ జట్టు తొమ్మిదేళ్ల తర్వాత జూనియర్ ప్రపంచకప్‌లో మరోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 3–0తో దక్షిణ కొరియాపై ఘనవిజయం సాధించింది. లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచ్‌లు గెలుచుకుంటూ వచ్చిన భారత జట్టు క్వార్టర్స్‌లోనూ అదే జోరు కొనసాగించింది. ఆరంభం నుంచే దాడులకు పదునుపెట్టిన అమ్మాయిలు ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ముంతాజ్ ఖాన్ (11వ ని.లో), లాల్రిండికి (15వ ని.లో), సంగీత (41వ ని.లో) ఒక్కో గోల్ చేసి జట్టును గెలిపించారు. 33 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల జట్టు సెమీస్ చేరడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో జర్మనీ ఆతిథ్యమిచ్చిన 2013 ప్రపంచకప్ టోర్నీలో భారత్ సెమీస్ చేరింది. అప్పుడు సెమీస్‌లో ఓడిన భారత జట్టు కాంస్య పతకపోరులో ఇంగ్లండ్‌ను 3–2తో పెనాల్టీ షూటౌట్లో ఓడించి పతకం గెలుచుకుంది. 2016 ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టు అర్హత సాధించలేకపోయింది. ఆదివారం జరిగే సెమీఫైనల్లో మూడు సార్లు చాంపియన్ అయిన నెదర్లాండ్స్ జట్టుతో భారత్ తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ 5–0తో దక్షిణాఫ్రికాను ఓడించింది. -
భారత ‘కెప్టెన్’ రీ ఎంట్రీ.. అయితే సారథి మాత్రం..
FIH Pro League 2021-2022- న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ స్టార్ స్ట్రయికర్, గతంలో కెప్టెన్‌గా వ్యవహరించిన రాణి రాంపాల్ తిరిగి జట్టులోకి వచ్చింది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్‌లో ప్రపంచ నంబర్‌వన్ నెదర్లాండ్స్‌తో ఈనెల 8, 9 తేదీల్లో రెండు మ్యాచ్‌ల్లో తలపడే భారత జట్టును హాకీ ఇండియా మంగళవారం ప్రకటించింది. గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో రాణి రాంపాల్ కెప్టెన్సీలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ తర్వాత తొడ కండరాలు సహా ఇతరత్రా గాయాలతో ఆమె మళ్లీ మైదానంలోకే దిగలేదు. ఇప్పుడు ఫిట్నెస్ సంతరించుకోవడంతో జట్టుకు ఎంపికైంది. కానీ సీనియర్ గోల్‌కీపర్ సవితనే సారథిగా కొనసాగించనున్నారు. మహిళల హాకీ జట్టు: సవిత (కెప్టెన్), రజని, దీప్ గ్రేస్, గుర్జీత్, నిక్కీ, ఉదిత, రష్మిత, సుమన్ దేవి, నిషా, సుశీలా చాను, జ్యోతి, నవజ్యోత్ కౌర్, మోనిక, నమిత, సోనిక, నేహ, మహిమ, ఐశ్వర్య, నవ్‌నీత్ కౌర్, రజ్విందర్ కౌర్, రాణి రాంపాల్, మరియానా కుజుర్. అజేయంగా ముందుకు... పాట్చెఫ్స్ట్రూమ్: జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు లీగ్ దశను అజేయంగా ముగించింది. మలేసియాతో మంగళవారం జరిగిన పూల్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–0తో నెగ్గి ‘హ్యాట్రిక్’ విజయాలు నమోదు చేసింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్ తొమ్మిది పాయింట్లతో పూల్ ‘టాపర్’గా నిలిచింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియాతో భారత్ తలపడుతుంది. మలేసియాతో జరిగిన పోరులో భారత్ తరఫున ముంతాజ్ (10వ, 26వ, 59వ ని.లో) మూడు గోల్స్ సాధించగా... మరో గోల్‌ను సంగీత కుమారి (11వ ని.లో) చేసింది. చదవండి: IPL 2022: శభాష్ షహబాజ్... సూపర్ కార్తీక్! ఆర్సీబీ సంచలన విజయం -
రెండు స్వర్ణాలతో మెరిసిన ఆర్చర్ జ్యోతి; హాకీలో అవార్డులన్నీ మనకే!
Jyothi Surekha Vennam Won 2 Gold Medals: జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రపదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ రెండు స్వర్ణ పతకాలు సాధించింది. ఆమె కాంపౌండ్ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో, ఒలింపిక్ రౌండ్లో విజేతగా నిలిచింది. ర్యాంకింగ్ రౌండ్లో సురేఖ 704 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఒలింపిక్ రౌండ్ ఫైనల్లో సురేఖ 150–146తో ముస్కాన్ (మధ్యప్రదేశ్)పై గెలిచింది. హాకీలో అవార్డులన్నీ మనకే లుసానే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వార్షిక అవార్డుల్లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. ఓటింగ్ పద్ధతిలో భారత క్రీడాకారులే అన్ని అవార్డుల్ని సొంతం చేసుకున్నారు. చిత్రంగా ఆటగాళ్లే కాదు కోచ్ అవార్డులు కూడా మన జట్ల కోచ్‌లకే రావడం మరో విశేషం. భారత పురుషులు, మహిళల జట్లకు చెందిన ఆరుగురు క్రీడాకారులు, హెడ్ కోచ్‌లు ఎఫ్ఐహెచ్ అత్యుత్తమ పురస్కారాలు దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో హర్మన్‌ప్రీత్ సింగ్, మహిళల విభాగంలో గుర్జీత్ కౌర్ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులకు ఎంపికయ్యారు. పురుషుల విభాగంలో పీఆర్ శ్రీజేశ్... మహిళల విభాగంలో సవితా పూనియా ‘ఉత్తమ గోల్‌కీపర్’ ట్రోఫీలు గెలుచుకున్నారు. ‘బెస్ట్ రైజింగ్ స్టార్’లుగా పురుషుల విభాగంలో వివేక్ సాగర్... మహిళల విభాగంలో షర్మిలా దేవి విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో ఉత్తమ కోచ్‌గా రీడ్... మహిళల విభాగంలో ఉత్తమ కోచ్‌గా జోయెర్డ్ మరీన్ ఎంపికయ్యారు. ►79 దేశాలకు చెందిన హాకీ సమాఖ్యలు ఓటింగ్‌లో పాల్గొన్నాయి. సుమారు మూడు లక్షల మంది అభిమానులు కూడా ఈ ఓటింగ్‌లో పాలుపంచుకున్నట్లు ఎఫ్ఐహెచ్ తెలిపింది. ►ఆగస్టు 23న మొదలైన ఓటింగ్ ప్రక్రియ గత నెల 15న ముగిసింది. మొత్తం 100 శాతంలో హాకీ జట్ల కోచ్‌లు, కెపె్టన్లకు 50 శాతం ఓటింగ్ కోటా ఉండగా... 25 శాతం ఆటగాళ్లు, అభిమానులు వేసుకోవచ్చు. మిగతా 25 శాతం మీడియాకు కేటాయించారు. ►అయితే ఓటింగ్ విధానంపై టోక్యో ఒలింపిక్స్ చాంపియన్, ప్రపంచ చాంపియన్ బెల్జియం హాకీ జట్టు ఆక్షేపించింది. పారదర్శకంగాలేదని ఓటింగ్ పద్ధతిని తప్పుబట్టింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు 41 ఏళ్ల తర్వాత కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. చదవండి: Anshu Malik: తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా అన్షు కొత్త రికార్డు! -
జూనియర్ హాకీ ప్రపంచకప్.. ‘బిగ్ ఎనౌన్స్మెంట్’!
భువనేశ్వర్: భారత హాకీ జట్టు ప్రధాన స్పాన్సర్ గా ఉన్న ఒడిశా రాష్ట్రం మరో ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు వేదిక కానుంది. ఈ ఏడాది నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు జరిగే పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్ ఒడిశాలోని కళింగ స్టేడియంలో జరగనుంది. ఈ మేరకు ఆతిథ్య హక్కులను ఒడిశాకు కట్టబెడుతూ అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిర్ణయం తీసుకుంది. ఈ ఈవెంట్ కోసం ఉత్తరప్రదేశ్ కూడా రేసులో ఉన్నా... 2016 ప్రపంచకప్ అక్కడే జరగడంతో ఈసారి ఒడిశాకు అవకాశం దక్కింది. ఈ మెగా ఈవెంట్లో భారత్‌తో పాటు మరో 15 దేశాలు పాల్గొంటున్నాయి. చదవండి: IPL 2021: కోహ్లికి షాకివ్వనున్న ఆర్సీబీ యాజమాన్యం.. నిజమేనా?! 📢 𝗔𝗡𝗡𝗢𝗨𝗡𝗖𝗘𝗠𝗘𝗡𝗧 The hockey fever is going to be back in town! 🤩 The showpiece event 𝗙𝗜𝗛 𝗢𝗗𝗜𝗦𝗛𝗔 𝗛𝗢𝗖𝗞𝗘𝗬 𝗠𝗘𝗡'𝗦 𝗝𝗨𝗡𝗜𝗢𝗥 𝗪𝗢𝗥𝗟𝗗 𝗖𝗨𝗣 𝗕𝗛𝗨𝗕𝗔𝗡𝗘𝗦𝗪𝗔𝗥 2021 comes to #Odisha. 🗓️: 24 Nov to 05 Dec, 2021 pic.twitter.com/Zg0hFQylLJ — Odisha Sports (@sports_odisha) September 23, 2021 -
హాకీ ప్లేయర్ వివేక్ సాగర్‌కు నజరానా.. డీఎస్పీగా ఉద్యోగం
భోపాల్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ జట్టులో సభ్యుడైన మధ్యప్రదేశ్‌కు చెందిన వివేక్ సాగర్‌ను రాష్ట్ర ప్రభుత్వం పోలీసుశాఖలో డీఎస్పీగా నియమించింది. ఈ మేరకు మంగళవారం మధ్యప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కాగా అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోటి రూపాయల చెక్కును కూడా వివేక్ సాగర్‌కు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి నరోత్తం మిశ్రా మీడియాతో మాట్లడూతూ.. భారత హాకీ జట్టులో సభ్యడైన వివేక్ సాగర్‌ను డీఎస్పీగా నియమించాలని క్యాబినెట్ మంగళవారం నిర్ణయించిందని అన్నారు. 2025-26 నాటికి మధ్యప్రదేశ్‌లో మొత్తం అక్షరాస్యత లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ .110.84 కోట్ల నిధులను ఆమోదించిందని, దీని ద్వారా "నవ భారత సాక్షరతా అభియాన్" కింద కోటి మందికి పైగా విద్య అందిస్తామని మిశ్రా చెప్పారు. చదవండి: IPL 2021: విండీస్ విధ్వంసకర ఆటగాడిని దక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్ -
పాయింట్ల పట్టికలో అట్టడుగున.. పడి పడి పైకి ఎగసి
ఒలింపిక్స్‌లో నాలుగు దశాబ్దాల తర్వాత దక్కిన పతకం.. చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ టీం. మ్యాచ్ ఆరు సెకండ్ల వ్యవధిలో ముగుస్తుందనగా.. ప్రత్యర్థికి దక్కిన పెనాల్టీ కార్నర్. మ్యాచ్ ఫలితాన్నే మార్చేసే ఆ గోల్‌ను తీవ్ర ఒత్తిడిలోనూ చాకచక్యంగా అడ్డుకుని హీరో అయ్యాడు భారత పురుషుల హాకీ టీం గోల్ కీపర్ శ్రీజేష్. ‘అయినా గెలిచింది కాంస్యమే కదా.. ఆ మాత్రానికేనా ఇంతా?’ అని అనుకునేవాళ్లు బోలెడు మంది ఉండొచ్చు. కానీ, ఇవాళ్టి విజయం నిజంగానే సంబురాలకు అర్హమైందని భారత హాకీ చరిత్ర చెప్పకనే చెబుతోంది. హాకీ.. మన జాతీయ క్రీడ. ఈ పేరు వినగానే జైపాల్ సింగ్ ముండా, లాల్ షా బోఖారి, ధ్యాన్ చంద్, కిషన్‌లాల్, కేడీ సింగ్ లాంటి హాకీ దిగ్గజాల పేరు గుర్తుకు వచ్చేది ఒకప్పుడు. వీళ్ల సారథ్యంలో వరుస ఒలింపిక్స్‌లో ఆరు స్వర్ణాలు సాధించింది భారత హాకీ పురుషుల జట్టు. ఒక రజతం, మళ్లీ స్వర్ణం, ఆపై రెండు వరుస కాంస్యాలు.. ఒక ఒలింపిక్ గ్యాప్(కెనడా ఒలింపిక్స్‌లో 7 స్థానం) తర్వాత మరో స్వర్ణం.. ఇదీ వరుస ఒలింపిక్స్‌లో భారత హాకీ టీం సాధించిన ట్రాక్ రికార్డు. అలాంటిది ఆ తర్వాతి నుంచి ఒలింపిక్ పతాకం కాదు కదా.. పేలవమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఎక్కడో అట్టడుగునకు చేరుతూ వచ్చింది భారత పురుషుల హాకీ టీం. ఇక మహిళల జట్టు సంగతి సరేసరి. అయితేనేం కిందపడ్డా.. పోరాట పటిమను ప్రదర్శిస్తూ వచ్చారు. ఇన్నేళ్లలో మెరుగైన స్థితిని అందుకున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 40 ఏళ్ల తర్వాత జాతీయ క్రీడలో భారత్‌కు దక్కిన ఒలింపిక్ పతక విజయం అద్భుతమనే చెప్పాలి. క్లిక్ చేయండి:1980 తర్వాత తొలిసారి.. ఫొటో హైలెట్స్ కారణాలు.. క్రీడలకు కమర్షియల్ రంగులు అద్దుకుంటున్న టైం అది. ఆ టైంలో ఆటల్లో ‘రాజకీయాలు’ ఎక్కువయ్యాయి. హాకీలో టాలెంట్‌కు సరైన అందలం దక్కకపోగా.. రిఫరెన్స్‌లు, రికమండేషన్లతో సత్తువలేని ఆటగాళ్ల ఎంట్రీ జట్టును నిర్వీర్యం చేస్తూ వచ్చింది. దీనికి తోడు ఆటగాళ్ల మధ్య గొడవలు ఒక సమస్యగా మారితే.. ‘కోచ్’ ఓ ప్రధాన సమస్యగా మారింది. తరచూ కోచ్‌లు మారుతుండడం, భారత హాకీ ఫెడరేషన్లో నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతుండడం, స్పానర్షిప్-ఎండోర్స్మెంట్ వివాదాలు వెంటాడాయి. వెరసి.. ఈ ప్రతికూల ప్రభావాలన్నీ ఆటగాళ్లపై, ఆటపై పడ్డాయి. తెరపైకి అప్పుడప్పుడు కొందరు హాకీ ప్లేయర్ల పేర్లు వచ్చినా, విజయాలు పలకరించినా.. అవి కేవలం వార్తల్లో మాత్రమే వినిపిస్తుండేవి. వీటికితోడు క్రికెట్‌కు పెరిగిన ఆదరణతో హాకీ ఉత్త జాతీయ క్రీడగా మారిపోయింది. ప్రోత్సాహకాల్లో మిగిలిన ఆటలకు తగ్గిన ప్రాధాన్యం(హాకీ అందులో ఒకటి)తో ప్రభుత్వాలు చిన్నచూపు చూశాయి. ఇదే ధోరణిని జనాల్లోనూ పెరిగిపోయేలా చేశాయి. గత నలభై ఏళ్లలో లీగ్ టోర్నీలు, ఆసియన్ టోర్నీల్లో తప్పా.. ప్రపంచ కప్‌ల్లో(తొలి రెండింటిల్లో కాంస్యం, ఆపై 1975లో స్వర్ణం), మిగతా టోర్నమెంట్లలో ఎక్కడా భారత హాకీ టీం హవా నడవలేదు. ఇప్పుడు నాలుగు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా హాకీ దిగ్గజం గ్రాహం రెయిడ్ కోచింగ్‌లో రాటుదేలిన భారత హాకీ టీం.. ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగి టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌లో బ్రిటన్ను ఓడించడం సంచలన విజయమనే చెప్పాలి. అటుపై సెమీస్‌లో ఛాంపియన్ బెల్జియం చేతిలో ఓటమి, ఆపై కాంస్యపు పోరులో జర్మనీపై విజయాన్ని.. అద్భుతంగానే వర్ణించాలి. ఒకవేళ ఓడిపోయి ఉన్నా.. ఈ ఒలింపిక్స్‌లో మనవాళ్లు సత్తా చూపారనే భావించాల్సి వచ్చేది. మొత్తం 12.. 1980 మాస్క్ ఒలింపిక్స్‌లో గోల్డ్ తర్వాత(అప్పుడు నేరుగా ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది భారత్)..ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ పురుషుల టీం కనబరిచిన ప్రదర్శన కచ్చితంగా మెరుగైందనే చెప్పొచ్చు. 1984 నుంచి వరుస ఒలింపిక్స్‌లో ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, పన్నెండు స్థానాల్లో కొనసాగుతున్న వచ్చిన భారత పురుషుల హాకీ టీం .. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై కాకపోవడంతో తీవ్ర విమర్శలపాలైంది. ఈ తరుణంలో హాకీలో తిరిగి జవసత్వాలు నింపుతూ వస్తున్న యువ టీం.. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్ దాకా చేరుకోవడం, అటుపై కాంస్యం పోరులో నెగ్గడం విశేషం. ఇప్పటిదాకా జరిగిన ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు.. ఎనిమిది స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో(టోక్యో కాంస్యంతో కలిపి) పతకాలు సాధించించింది. ఈ మెరుగైన ప్రదర్శనను జట్టు మునుముందు ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం. -సాక్షి, వెబ్ డెస్క్ -
Tokyo Olympics: ఫినిషింగ్ మెరుగుపడితేనే...
బెంగళూరు: అందివచ్చిన అవకాశాలను గోల్స్‌గా మలచడంపై ఆటగాళ్లు దృష్టి సారించాలని భారత హాకీ జట్టు ఫార్వర్డ్ ప్లేయర్ లలిత్ ఉపాధ్యాయ్ అభిప్రాయపడ్డాడు. మైదానంలో ప్లేయర్లు చురుకుగా కదులుతూ ప్రత్యర్థి డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ గోల్ పోస్ట్‌ను సమీపించినా ఫినిషింగ్ మాత్రం అనుకున్న స్థాయిలో లేదని... అందులో భారత జట్టు మెరుగు పడాలని లలిత్ పేర్కొన్నాడు. ఇలా జరిగితేనే టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మెరుగైన ప్రదర్శనను కనబర్చగలదని లలిత్ అన్నాడు. ఈసారి జరిగే ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు. ఇటీవల ముగిసిన అర్జెంటీనా పర్యటనలో భారత్ నాలుగు ప్రాక్టీస్ మ్యాచ్‌లతో పాటు... రెండు ప్రొ లీగ్ హాకీ టోర్నీ మ్యాచ్‌లను ఆడింది. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో 12 గోల్స్ చేసిన భారత్... ప్రొ లీగ్ మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్ చేసింది. ప్రస్తుతం ఒలింపిక్స్ కోసం భారత హాకీ బృందం బెంగళూరులోని ‘సాయ్’లో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో పాల్గొంటోంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. భారత్ గ్రూప్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతోపాటు ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, స్పెయిన్ జట్లు ఉన్నాయి. -
మన్‌ప్రీత్ ‘పాజిటివ్’
న్యూఢిల్లీ: భారత హాకీలో కోవిడ్–19 కలకలం చెలరేగింది. భారత పురుషుల సీనియర్ హాకీ జట్టు సభ్యులు ఐదుగురు కరోనా బారిన పడ్డారు. కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తోపాటు డిఫెండర్ సురేందర్ కుమార్, జస్కరణ్ సింగ్, డ్రాగ్ ఫ్లికర్ వరుణ్ కుమార్, కిషన్ పాఠక్‌లకు వైరస్ సోకింది. నెల రోజుల విరామం తర్వాత... వీరందరూ తమ స్వస్థలాల నుంచి బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ శిక్షణ శిబిరానికి హాజరయ్యేందుకు వచ్చారు. వీరందరికీ కోవిడ్–19 పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ‘నేను స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. కరోనా నియంత్రణలో భాగంగా ‘సాయ్’ వర్గాలు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. త్వరలోనే కోలుకుంటానని ఆశిస్తున్నాను’ అని మన్‌ప్రీత్ సింగ్ తెలిపాడు. స్వస్థలాల నుంచి బెంగళూరుకు వచ్చే క్రమంలో వీరికి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. మన్‌ప్రీత్, సురేందర్‌లో కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే ఈ ఇద్దరితోపాటు మరో పది మంది ఆటగాళ్లు గురువారం ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకున్నారు. ఇతర ఆటగాళ్ల ఫలితాలు రావాల్సి ఉన్నాయి. -
ఎట్టకేలకు హాకీ క్రీడాకారులు ఇంటికి
న్యూఢిల్లీ: మూడు నెలలుగా ఇంటి మొహమే చూడని భారత మహిళల, పురుషుల హాకీ జట్లకు ఎట్టకేలకు ఊరట లభించింది. హాకీ ఇండియా (హెచ్ఐ) ఇరు జట్ల క్రీడాకారులకు నెల రోజుల పాటు ‘హోమ్ సిక్’ సెలవులు మంజూరు చేసింది. దీంతో శుక్రవారం వారంతా స్వస్థలాలకు పయనమయ్యారు. భారత పురుషుల, మహిళల హాకీ జట్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించాయి. దీంతో వీరికి బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది. అయితే కరోనా మహమ్మారి వల్ల మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ మొదలైంది. వైరస్ ఉధృతి కొనసాగడంతో టోక్యో ఈవెంట్ కూడా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అయినప్పటికీ లాక్డౌన్ వల్ల ఆటగాళ్లంతా బెంగళూరులోనే చిక్కుకుపోయారు. గతనెల చివరి వారం నుంచి సడలింపులు ఇవ్వడంతో ఇక ఇంటికి వెళ్లే వెసులుబాటు దక్కింది. దీంతో హెచ్ఐ ఇరు జట్ల చీఫ్ కోచ్‌లను సంప్రదించి నెలపాటు శిక్షణకు విరామం ఇస్తేనే మళ్లీ నూతనోత్సాహంతో బరిలోకి దిగుతారని భావించి సెలవులు మంజూరు చేసింది. -
సహనానికి, ఓర్పుకు హద్దుంటుంది: మాజీ కెప్టెన్
ఇంపాల్ : ఇండియన్ ఉమెన్ హాకీ టీం మాజీ కెప్టెన్ సురాజ్ లతా దేవీ తన భర్త శాంతా సింగ్‌పై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం భర్త తనను తీవ్రంగా వేధిస్తున్నాడని, మానసికంగా, శారీరకంగా హింసకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. బుధవారం ఇంపాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ పెళ్లైన నాటినుంచి అదనపు కట్నం కోసం నా భర్త నన్ను వేధిస్తున్నాడు. అనైతిక ప్రవర్తన కారణంగానే నాకు అర్జున అవార్డు వచ్చిందంటున్నాడు. నేనీ విషయాన్ని పబ్లిక్ చేయాలనుకోలేదు. అతడిలో మార్పువస్తుందనే ఇన్నిరోజులు ఎదురుచూశాను. ఏదేమైనప్పటి సహనానికి, ఓర్పుకు ఓ హద్దంటూ ఉంటుంద’ని పేర్కొన్నారు. కాగా, 2005లో శాంతా సింగ్ అనే రైల్వే ఉద్యోగిని పెళ్లాడిన ఆమె హాకీ ఆటకు దూరమయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గతంలో కూడా ఆమె పలుమార్లు భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2002లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సురాజ్ లతా దేవీ సారధ్యంలోని ఇండియన్ ఉమెన్ హాకీ టీం మూడు బంగారు పతకాలు సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో ఉమెన్ హాకీ టీం కనబరిచిన ప్రతిభ స్ఫూర్తిగా బాలీవుడ్లో ‘ చక్ దే ఇండియా’ అనే సినిమా తెరకెక్కింది. -
మన్‌ప్రీత్, శ్రీజేష్‌లకు విశ్రాంతి
న్యూఢిల్లీ: రెగ్యులర్ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, మాజీ కెప్టెన్, గోల్ కీపర్ శ్రీజేశ్‌లకు విశ్రాంతి కల్పిస్తూ... ఆగస్టు 17 నుంచి 21 వరకు జరిగే టోక్యో ఒలింపిక్స్ టెస్ట్ ఈవెంట్లో పాల్గొనే 18 మంది సభ్యులతో కూడిన భారత హాకీ జట్టును హాకీ ఇండియా గురువారం ప్రకటించింది. డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్‌కు తాత్కాలిక సారథ్య బాధ్యతలను అప్పగించింది. అతనికి డిప్యూటీగా మన్దీప్ సింగ్ వ్యవహరించనున్నారు. నవంబర్‌లో జరిగే ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చినట్టు జట్టు కోచ్ గ్రాహమ్ రీడ్ తెలిపారు. సీనియర్ల గైర్హాజరీలో ఆశిస్ టోప్నో, షంషేర్ సింగ్‌లు తొలి సారిగా జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. భారత జట్టు: హర్మన్ ప్రీత్ సింగ్ (కెప్టెన్), మన్దీప్ సింగ్ (వైస్ కెప్టెన్), క్రిషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కెర, గురీందర్ సింగ్, కొత్తాజిత్ సింగ్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, వివేక్ సాగర్, జస్కరణ్ సింగ్, గుర్సాహిబ్జిత్ సింగ్, నీలమ్ సంజీప్, జర్మన్‌ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్, ఆశిస్ టోప్నొ, ఎస్వీ సునీల్, గుర్జంత్ సింగ్, షంషేర్ సింగ్. -
ఓటమితో ముగించారు
పెర్త్: ప్రపంచ రెండో ర్యాంకర్ ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన రెండో మ్యాచ్‌లో భారత హాకీ జట్టు 2–5తో పరాజయం చవిచూసింది. ఈ పర్యటనను ఓటమితో ముగించింది. ఆస్ట్రేలియా తరఫున ట్రెంట్ మిటన్ (11వ, 24వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... ఫ్లిన్ ఒగిల్వి (3వ నిమిషంలో), బ్లేక్ గోవర్స్ (28వ నిమిషంలో), టిమ్ బ్రాండ్ (43వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. భారత్ తరఫున నీలకంఠ శర్మ (12వ నిమిషంలో), రూపిందర్ పాల్ సింగ్ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. -
మలేసియా హాకీ టూర్‌కు గోల్‌కీపర్ రజని
న్యూఢిల్లీ: వచ్చే నెలలో మలేసియా పర్యటన కోసం ఎంపిక చేసిన భారత మహిళల హాకీ జట్టులో తెలుగు అమ్మాయి ఇతిమరపు రజని తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 18 మంది సభ్యులుగల భారత జట్టుకు రజని రెండో గోల్‌కీపర్‌గా వ్యవహరిస్తుంది. రెగ్యులర్ కెప్టెన్ రాణి రాంపాల్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో ప్రధాన గోల్‌కీపర్ సవిత పూనియా ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఏప్రిల్ 4 నుంచి ఎనిమిది రోజులపాటు సాగే ఈ పర్యటనలో భారత జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. -
స్త్రీలోక సంచారం
దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన యు.పి.లోని ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఎ.ఎం.యు.) తొలిసారిగా బాలికల హాకీ టీమ్‌ని జాతీయ స్థాయి పోటీలకు పంపించబోతోంది! ఇందుకోసం క్యాంపస్ పరిధిలోని పది స్కూళ్ల నుంచి బాలికల్ని ఎంపిక చేసి వారితో హ్యాకీ టీమ్‌ని సిద్ధం చేస్తోంది. అంతా సవ్యంగా జరిగితే కనుక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఇంటర్–స్కూల్ కాంపిటిషన్‌కి ఎ.ఎం.యు. బాలికల తొట్టతొలి హాకీ జట్టు పోటీ పడుతుంది. సర్ సయ్యద్ హాల్ సమీపంలోని యూనివర్సిటీ క్రీడా మైదానంలో భారత అంతర్జాతీయ హాకీ జట్టు మాజీ క్రీడాకారుడు అనీస్ ఉర్ రెహ్మాన్ కోచింగ్‌లో ఈ జట్టు శిక్షణ పొందుతోంది. మైదానంలో వీళ్ల ప్రాక్టీస్‌ను చూసి సీనియర్ విద్యార్థినులు (డిగ్రీ) కూడా తరగతులు అయ్యాక సరదాగా హాకీ ఆడేందుకు హాస్టల్ వార్డెన్ నుంచి అనుమతి తీసుకోవడంతో క్యాంపస్ మునుపెన్నడూ లేని విధంగా బాలికలు, యువతుల హాకీ ఆటతో కళకళలాడుతోంది. ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ 1920లో ప్రారంభం అయింది. మహిళలకు లోక్‌సభలో, రాష్ట్రాల అసెంబ్లీలలో మూడింట ఒక వంతు స్థానాలలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించి భారతీయ జనతా పార్టీపై ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశంలోని అన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు, కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న సంకీర్ణ రాష్ట్రాలకు లేఖలు పంపారు. 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ అసెంబ్లీ సమావేశాలలోనే రిజర్వేషన్లను తీర్మానించి, ఆమోదం పొందాలని ఆయా రాష్ట్రాలను ఆయన కోరారు. ఇప్పటికే ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఈ విధమైన తీర్మానాలు చేశాయని ఆ లేఖలో ఆయన గుర్తు చేశారు. ‘‘193 దేశాలలోని పార్లమెంట్లలో ఉన్న మహిళల శాతంతో పోలిస్తే మన దేశం 148వ స్థానంలో ఉంది. అసెంబ్లీలలోనైతే ఈ స్థానం ఇంకా తక్కువ. స్థానిక సంస్థల్లో నయం. మహిళలు ఎక్కువమంది కనిపిస్తున్నారు. స్త్రీలకు సమాజపరంగా ఎదురయ్యే సవాళ్లకు కూడా వెరవకుండా గ్రామ సమస్యల్ని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. రాజకీయాల్లో స్త్రీలకు సముచిత స్థానం లేకుండా ఏప్రజాస్వామ్య దేశమూ పూర్తిగా అభివృద్ధి చెందలేదు’’ అని డిసెంబర్ 6న రాసిన ఆ లేఖలో రాహుల్ అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ లోక్‌సభలో పెండింగులో ఉంది. 2010లో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాక 15వ లోక్‌సభ రద్దయి 2014 ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత కొత్త లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చే జరగలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ చిన్న కూతుర్నని చెప్పుకున్న యువ డ్యాన్సర్ క్యాథరీనా తిఖోనోవా తొలిసారి రష్యా అధికార టీవీ చానల్లో ప్రత్యక్షమయ్యారు. గత గురువారం ఆ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన తండ్రి ఉక్కు సంకల్పం వెనుక ఉన్న మృదువైన కోణాల్ని ఆవిష్కరించారు. ‘‘పైకి కఠినంగా కనిపిస్తారు. కానీ ఆయన మనసు మెత్తనైనది’’ అని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. క్యాథరీనా ఇలా టీవీలో కనిపించడం, రష్యా అధ్యక్షుడి వ్యక్తిగత విషయాలను వెల్లడించడంతో గత ఇరవై ఏళ్లుగా మీడియాపై ఉన్న ఆంక్షలు కొద్దిగానైనా సడలినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పుతిన్ ఆంతరంగిక జీవితం గురించి ఆ దేశంలోనే చాలామందికి తెలియదు. ‘పుతిన్ తాతగారు అయ్యారు’ అన్న వార్త మాత్రం గత ఏడాది దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వార్త అయినా ఆయనకై ఆయనే ఏదో సందర్భంలో బహిర్గతం చెయ్యడం వల్లనే బయటికి వచ్చింది. పుతిన్‌కి ఎందరో భార్యలు, మరెందరో ప్రియురాళ్లు ఉన్నారని ఒక వదంతి. పుతిన్ గతంలో గూఢచారి. తన కుటుంబ జీవితాన్ని కూడా ఆయన నిగూఢంగా ఉంచదలిచారేమో! ఇక క్యాథరీనా ఆయన సొంత కూతురేనా అనే దానిపై ఆ దేశంలో సందేహాలు ఇంకా మిగిలే ఉన్నాయి. -
మహిళల జట్టుకూ రజతమే
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): బరిలోకి దిగిన తొలిసారే స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాలని ఆశించిన భారత హాకీ జట్లకు నిరాశ ఎదురైంది. యూత్ ఒలింపిక్స్‌లో భాగంగా మొదటిసారి నిర్వహించిన ఫైవ్–ఎ–సైడ్ హాకీ పోటీల్లో భారత పురుషుల జట్టు మాదిరిగానే భారత మహిళల జట్టు కూడా రజతంతో సంతృప్తి పడింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో భారత్ 1–3 గోల్స్ తేడాతో ఆతిథ్య అర్జెంటీనా చేతిలో పరాజయం పాలైంది. ముంతాజ్ ఖాన్ చేసిన గోల్‌తో భారత్ తొలి నిమిషంలోనే 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వెంటనే తేరుకున్న అర్జెంటీనా ఏడో నిమిషంలో గియానెల్లా గోల్‌తో స్కోరును 1–1తో సమం చేసింది. తొమ్మిదో నిమిషంలో సోఫియా రమాల్లో... 12వ నిమిషంలో బ్రిసా బ్రుగెస్సర్ ఒక్కో గోల్ చేయడంతో అర్జెంటీనా 3–1తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న అర్జెంటీనా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల విభాగం ఫైనల్లో టీమిండియా 2–4తో మలేసియా చేతిలో ఓడిపోయిన సంగతి విదితమే. మూడు రోజులు మిగిలి ఉన్న ఈ క్రీడల్లో భారత్ 3 స్వర్ణాలు, 7 రజతాలతో కలిపి మొత్తం 10 పతకాలతో పదో స్థానంలో ఉంది. ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు ఆకాశ్, హిమాని ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో ఆకాశ్ 6–5తో లీ బెంజిమిన్ (కెనడా)పై, హిమాని 7–1తో జిల్ వాల్టర్ (సమోవా)పై గెలుపొందారు.