భారత్ లో ఆడేందుకు పాక్కు క్లియరెన్స్! | Pakistan Team Cleared For Junior Hockey World Cup in India | Sakshi
Sakshi News home page

భారత్ లో ఆడేందుకు పాక్కు క్లియరెన్స్!

Nov 19 2016 2:55 PM | Updated on Sep 4 2017 8:33 PM

భారత్ లో ఆడేందుకు పాక్కు క్లియరెన్స్!

భారత్ లో ఆడేందుకు పాక్కు క్లియరెన్స్!

:వచ్చే నెల్లో భారత్ లో జరుగనున్న జూనియర్ హాకీ వరల్డ్ కప్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ జట్టుకు క్లియరెన్స్ లభించింది.

కరాచీ:వచ్చే నెల్లో భారత్ లో జరుగనున్న జూనియర్ హాకీ వరల్డ్ కప్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ జట్టుకు క్లియరెన్స్ లభించింది. ఈ మేరకు  పాక్ ప్రభుత్వం నుంచి అంగీకారం లభించినట్లు ఆ దేశ హాకీ సమాఖ్య స్పష్టం చేసింది.


'భారత్ లో మా జూనియర్ హాకీ జట్టు పర్యటనపై గత కొంతకాలంగా ఆసక్తిగా ఉన్నాం. ఈ మేరకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం ప్రభుత్వానికి విన్నవించాం. అందుకు అంగీకారం లభించింది. త్వరలో మేము భారత్ లో ఆడబోయే వరల్డ్ కప్ మా హాకీకి భవిష్యత్తుగా భావిస్తున్నాం. భారత్ లో టోర్నీకి సంబంధించి మా విదేశాంగ శాఖ నుంచి అనుమతి వచ్చింది'అని పాక్ హాకీ సమాఖ్య వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ లక్నోలో హాకీ వరల్డ్ కప్ జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement