హాకీ ప్రపంచకప్‌లో అద్భుతాలు సృష్టిస్తాం
ఓల్ట్‌మన్స్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు ఏ టోర్నీలో ఏ మేరకు రాణించగలదన్న విషయంపై ఇప్పటిదాకా హాకీ ఇండియా (హెచ్‌ఐ)కే ఎప్పుడూ అంచనాల్లేవు. కానీ, జట్టు హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్ రోలాంట్ ఓల్ట్‌మన్స్ మాత్రం ఈసారి ప్రపంచకప్‌లో అద్భుతాలు సృష్టిస్తామని చెబుతున్నాడు.
ఈ నెల 31 నుంచి నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో ప్రపంచకప్ జరగనుండగా, భారత జట్టు తొలి ఎనిమిది స్థానాల్లో నిలిస్తే చాలని కోచ్ టెర్రీ వాల్ష్ ఆశిస్తున్నాడు. అయితే ఓల్ట్‌మన్స్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచే, అనూహ్యమైన ఫలితాలు సాధిస్తామంటున్నాడు. గతంలోలా మ్యాచ్ చివరి దశలో చేతులెత్తేయకుండా గోల్స్ సాధించగలిగితే అది పెద్ద కష్టమేమీ కాదని చెబుతున్నాడు. ‘కుర్రాళ్లు వారి ఆటతీరును మెరుగుపరచుకోవడంపై, ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రమిస్తున్నారు. అయితే దాన్ని మ్యాచ్‌లో అమల్లో పెడితే తప్పక మంచి ఫలితాలొస్తాయి’ అని ఓల్ట్‌మన్స్ అన్నాడు. అయితే జట్టు కచ్చితంగా సెమీఫైనల్ దాకా చేరుతుందని చెప్పడానికి ఎటువంటి ప్రాతిపదిక లేదని, ఆరంభంలో ఓడితే దాని ప్రభావం ఇతర మ్యాచ్‌లపై పడుతుందని తెలిపాడు. 7, 8 స్థానాల్లో నిలవాలన్నా కనీసం రెండు బలమైన జట్లపై గెలవాల్సి ఉంటుందన్నాడు. 2010 ప్రపంచకప్‌లో 20 జట్లు పాల్గొన్న పోటీల్లో భారత్ 12వ స్థానంలో నిలిచింది.