న్యూఢిల్లీ: ఈ నెల 20 నుంచి 28 వరకు న్యూఢిల్లీ వేదికగా జరగనున్న షూటింగ్ ప్రపంచకప్‌లో పాల్గొనడానికి పాకిస్థాన్ క్రీడాకారులకు అనుమతి లభించింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఉన్న కఠిన పరిస్థితుల్లోనూ సానుకూల దృక్పథంతో వ్యవహరించిన భారత్.. దాయాది దేశ షూటర్లకు వీసాలు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు వరల్డ్‌కప్‌లో పాక్ ఆటగాళ్లు కూడా పాల్గొంటారని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఆర్‌ఏఐ) సెక్రటరీ రాజీవ్ భాటియా సోమవారం అధికారికంగా వెల్లడించారు. పాక్ షూటర్ల వీసాలకు హోంమంత్రిత్వశాఖ ఆమోదం తెలిపిందని, హైకమీషన్‌తో పాటు పాక్‌కూ ఈ విషయాన్ని తెలిపినట్లు ఆయన చెప్పారు. ఇద్దరు పాకిస్థానీ రైఫిల్ షూటర్లతో పాటు ఒక కోచ్ టోర్నీలో పాల్గొనేందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు భాటియా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment