
న్యూఢిల్లీ: వచ్చే నెలలో మలేసియా పర్యటన కోసం ఎంపిక చేసిన భారత మహిళల హాకీ జట్టులో తెలుగు అమ్మాయి ఇతిమరపు రజని తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 18 మంది సభ్యులుగల భారత జట్టుకు రజని రెండో గోల్‌కీపర్‌గా వ్యవహరిస్తుంది. రెగ్యులర్ కెప్టెన్ రాణి రాంపాల్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో ప్రధాన గోల్‌కీపర్ సవిత పూనియా ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఏప్రిల్ 4 నుంచి ఎనిమిది రోజులపాటు సాగే ఈ పర్యటనలో భారత జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది.