
ధోనికి పాప పుట్టింది
న్యూఢిల్లీ: ప్రపంచ కప్‌కు ముందే మహేంద్ర సింగ్ ధోని ఇంట్లో ఆనందం వచ్చింది. శుక్రవారం భారత క్రికెట్ జట్టు కెప్టెన్ తండ్రయ్యాడు. అతని భార్య సాక్షిసింగ్ గుర్గావ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఆస్పత్రిలో సిజేరియన్ ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ‘పాప 3.7 కిలోలతో చాలా ఆరోగ్యంగా ఉంది.
వాస్తవానికి మార్చిలో డెలివరీ కావాల్సి ఉన్నా నెల రోజుల ముందే అయిపోయింది. ఈ వార్తతో ధోని చాలా సంతోషంగా ఉన్నాడు’ అని అతని కుటుంబ సన్నిహితులు వెల్లడించారు. 2010 జులైలో సాక్షిసింగ్‌తో ధోని పెళ్లి జరిగింది.