స్వర్ణ పతకం సాధించి... వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించడమే లక్ష్యంగా ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు తొలి అడ్డంకిని అధిగమించింది. లీగ్ దశలో ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అజేయంగా నిలిచిన భారత్ పూల్ ‘ఎ’లో 15 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకొని సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌తో సోమవారం జరిగిన చివరిదైన ఐదో లీగ్ మ్యాచ్‌లో భారత్ 12–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది.
భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (2వ, 4వ, 32వ ని.లో), మన్‌దీప్ సింగ్ (18వ, 24వ, 46వ ని.లో) మూడు చొప్పున గోల్స్ సాధించి ‘హ్యాట్రిక్’లు నమోదు చేశారు. అభిషేక్ (41వ, 57వ ని.లో) రెండు గోల్స్ సాధించగా... నీలకంఠ శర్మ (47వ ని.లో), గుర్జంత్ సింగ్ (56వ ని.లో), అమిత్ రోహిదాస్ (28వ ని.లో), లలిత్ ఉపాధ్యాయ్ (23వ ని.లో) ఒక్కో గోల్ చేశారు.
పూల్ ‘ఎ’లోనే జపాన్ జట్టు 12 పాయింట్లతో రెండో సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జపాన్ 3–2తో పాకిస్తాన్‌ను ఓడించింది. ఈ ఓటమితో పాకిస్తాన్ పూల్ ‘ఎ’లో మూడో స్థానానికి పరిమితమై సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయింది. పూల్ ‘బి’ నుంచి దక్షిణ కొరియా, చైనా జట్లు టాప్–2లో నిలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. బుధవారం జరిగే సెమీఫైనల్స్‌లో చైనాతో భారత్; దక్షిణ కొరియాతో జపాన్ తలపడతాయి.
భారత్, చైనీస్ తైపీ మ్యాచ్ ‘డ్రా’
ఆసియా క్రీడల్లో భారత మహిళల కబడ్డీ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే ఊహించని ఫలితం ఎదురైంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా చైనీస్ తైపీతో సోమవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌ను భారత్ 34–34తో ‘డ్రా’ చేసుకుంది. చివరి సెకన్లలో ఆఖరి రెయిడ్‌తో చైనీస్ తైపీ బోనస్ పాయింట్ సంపాదించి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. భారత్ ఒకదశలో 26–20తో ముందంజ వేసి ఆరు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ ఆధిక్యాన్ని భారత జట్టు వృథా చేసుకొని గెలవాల్సిన చోట ‘డ్రా’తో సరిపెట్టుకుంది.
చదవండి: World cup 2023: 'పాక్, దక్షిణాఫ్రికా కాదు.. వరల్డ్‌కప్ సెమీఫైనల్‌కు చేరే జట్లు ఇవే'
Comments
Please login to add a commentAdd a comment