ఆసియాక్రీడలు 2023లో భారత మహిళల హకీ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. హాంకాంగ్‌తో జరిగిన చివరి పూల్ మ్యాచ్‌లో భారత జట్టు 13-0తో విజయం సాధించింది. ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న టీమిండియా.. ఈ విజయంతో తమ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకుంది. భారత జట్టులో వందనా కటారియా, దీపికా, దీప్ గ్రేస్ ఎక్కా తలా మూడు గోల్స్‌తో అదరగొట్టారు.
వీరి ముగ్గురితో పాటు సంగీతా కుమారి రెండు గోల్స్, నవనీత్ కౌర్ ఒక్క గోల్ సాధించారు. కాగా పూల్-ఎలో భారత మహిళ జట్టు 4 విజయాలు సాధించి 10 పాయింట్లతో అగ్ర స్ధానంలో నిలిచింది. కాగా ప్రతీ పూల్ నుంచి మొదటి రెండు స్ధానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. ఇక గురువారం జరగనున్న సెమీ ఫైనల్‌లో పూల్-బి రన్నరప్‌తో భారత్ తలపడనుంది.
చదవండి: అతడిని భారత క్రికెటర్‌గా చాలా సంతోషంగా ఉంది: దినేష్ కార్తీక్
Comments
Please login to add a commentAdd a comment