హాకీ ప్లేయర్‌ వివేక్ సాగర్‌కు నజరానా.. డీఎస్పీగా ఉద్యోగం | MP Cabinet Nod To Appoint Olympic Hockey Player Vivek Sagar As DSP | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్ నిర్ణయం: డీఎస్పీగా హాకీ ప్లేయర్‌ వివేక్‌ సాగర్‌

Published Wed, Sep 1 2021 2:11 PM | Last Updated on Wed, Sep 1 2021 2:45 PM

MP Cabinet Nod To Appoint Olympic Hockey Player Vivek Sagar As DSP - Sakshi

భోపాల్‌: టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు  కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ జట్టులో సభ్యుడైన మధ్యప్రదేశ్‌కు చెందిన వివేక్ సాగర్‌ను రాష్ట్ర ప్రభుత్వం పోలీసుశాఖలో డీఎస్‌పీగా నియమించింది. ఈ మేరకు మంగళవారం మధ్యప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కాగా అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోటి రూపాయల చెక్కును కూడా వివేక్‌ సాగర్‌కు అందించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి నరోత్తం మిశ్రా మీడియాతో మాట్లడూతూ.. భారత హాకీ జట్టులో సభ్యడైన వివేక్ సాగర్‌ను డీఎస్‌పీగా నియమించాలని  క్యాబినెట్ మంగళవారం నిర్ణయించిందని అన్నారు. 2025-26 నాటికి మధ్యప్రదేశ్‌లో మొత్తం అక్షరాస్యత లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ .110.84 కోట్ల నిధులను ఆమోదించిందని, దీని ద్వారా "నవ భారత సాక్షరతా అభియాన్" కింద కోటి మందికి పైగా విద్య అందిస్తామని మిశ్రా చెప్పారు.

చదవండి: IPL 2021: విండీస్‌ విధ్వంసకర ఆటగాడిని దక్కించుకున్న రాజస్తాన్‌ రాయల్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement