న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నెదర్లాండ్స్‌లో జరిగే ప్రపంచకప్ టోర్నీకి భారత పురుషుల హాకీ జట్టు అర్హత సాధించింది. ఈమేరకు ప్రపంచ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అధికారికంగా ప్రకటన చేసింది. మే 31 నుంచి జూన్ 15 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది.
ఆసియా చాంపియన్స్‌ట్రోఫీలో రెండో ఓటమి
న్యూఢిల్లీ: ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. జూనియర్ ఆటగాళ్లతో ఆడుతున్న జట్టుకు ఈ ట్రోఫీలో రెండో పరాజయం ఎదురైంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్ చేతిలో భారత్ 1-2 తేడాతో ఓడింది. భారత్ తరఫున గుర్జిందర్ సింగ్ 12వ నిమిషంలో గోల్ చేశాడు. శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లోనూ భారత జట్టు 0-2 తేడాతో చైనా చేతిలో ఓడింది. వచ్చే నెలలో జరిగే జూనియర్ ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టులోని 18 మంది ఆటగాళ్లలో 15 మంది జూనియర్స్‌ను ఎంపిక చేశారు.
మహిళల హాకీ జట్టు విజయం
పూనమ్ రాణి రెండు గోల్స్‌తో రాణించడంతో ఆసియా మహిళల చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు శుభారంభం చేసింది. తమకన్నా మెరుగైన ర్యాంకింగ్‌లో ఉన్న చైనాను 4-2తో కంగుతినిపించింది. భారత్ తరఫున రాణి (8వ ని, 59వ .), అమన్‌దీప్ కౌర్ (13వ ని.), వందన (61వ ని.) గోల్స్ చేశారు.
ప్రపంచకప్‌కు భారత హాకీ జట్టు అర్హత
Published Mon, Nov 4 2013 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM
Advertisement