సర్దార్‌ సింగ్‌ పై వేటు | Sardar Singh dropped from Indian squad for Hockey World League | Sakshi
Sakshi News home page

సర్దార్‌ సింగ్‌ పై వేటు

Published Sat, Nov 18 2017 12:16 AM | Last Updated on Sat, Nov 18 2017 12:16 AM

Sardar Singh dropped from Indian squad for Hockey World League  - Sakshi

న్యూఢిల్లీ: సీజన్‌ ముగింపు టోర్నీ హాకీ వరల్డ్‌ లీగ్‌ (హెచ్‌డబ్ల్యూఎల్‌) ఫైనల్స్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. మాజీ కెప్టెన్, వెటరన్‌ ప్లేయర్, ఈ ఏడాది ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’ అవార్డీ సర్దార్‌ సింగ్‌పై హాకీ ఇండియా (హెచ్‌ఐ) వేటు వేసింది. డిసెంబర్‌ 1 నుంచి 10 వరకు భువనేశ్వర్‌లో జరిగే ఈ టోర్నీలో పాల్గొనే 18 మంది సభ్యులు గల భారత జట్టుకు మన్‌ప్రీత్‌ సింగ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

గత నెలలో ఆసియా కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడైన 31 ఏళ్ల సర్దార్‌ను తప్పించడం ఆశ్చర్యకర పరిణామమే. 2006 నుంచి భారత జట్టు సభ్యుడిగా ఉన్న ఈ హరియాణా ప్లేయర్‌ ఇప్పటివరకు 191 మ్యాచ్‌ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement