
భారత మహిళల హాకీ జట్టు
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో రజతం సాధించిన భారత మహిళల హాకీ జట్టును త్వరలో టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్)లో చేర్చనున్నారు. తదుపరి ‘టాప్స్’ సమావేశంలో జట్టులోని మొత్తం 18 మంది సభ్యులను ఈ పథకం కిందికి తేనున్నారు. ఇప్పటికే భారత పురుషుల జట్టు ‘టాప్స్’లో ఉంది.
48 మంది ప్రాబబుల్స్...
‘సాయ్’ ఆధ్వర్యంలో నేటి నుంచి బెంగళూరులో జరుగనున్న జాతీయ మహిళల శిబిరానికి హాకీ ఇండియా 48 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితా ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోల్‌కీపర్ ఇతిమరపు రజని, తెలంగాణకు చెందిన ఫార్వర్డ్ యెండల సౌందర్య చోటు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment