Tops
-
వెడ్డింగ్ అయినా, ఈవినింగ్ పార్టీ అయినా.. ఆల్‌టైమ్ అట్రాక్షన్ షావల్ టాప్స్
ఇండో–వెస్ట్రన్ స్టైల్ ఎప్పుడూ ట్రెండ్‌లో ఉండేదే. బ్రైడల్ అయినా క్యాజువల్ అయినా ప్రత్యేక సందర్భం అయినా మీ డ్రెస్‌ని కేప్/షావల్/ జాకెట్‌గా పేరున్న ఒకే ఒక టాప్‌తో లుక్‌ని పూర్తిగా మార్చేయవచ్చు. మెడ నుంచి భుజాల మీదుగా చేతులను కప్పుతూ ఉంటుంది కాబట్టి దీనిని షావల్ టాప్ అంటుంటారు. ఈ టాప్ లుక్ మోడల్ని స్టైల్‌కి తగినట్టు మార్చుకోవచ్చు. ట్రెండ్‌లో ఉన్న ఈ మోడల్ జాకెట్స్ హుందాతనం, రిచ్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాయి. వివాహ వేడుకల్లో గ్రాండ్‌గా వెలిగిపోవాలంటే ఎంబ్రాయిడరీ చేసిన కేప్‌ని ఎంచుకోవచ్చు. గెట్ టు గెదర్ వంటి ఈవెనింగ్ పార్టీలకు లేస్తో డిజైన్ చేసిన టాప్‌తో స్టైల్ చేయచ్చు. శారీ గౌన్స్ మీదకు మాత్రమే అచ్చమైన పట్టు చీరలకు కూడా ఈ సింగిల్ పీస్తో స్పెషల్ అట్రాక్షన్‌ను తీసుకురావచ్చు. లెహంగా బ్లౌజ్ మీదకు దుపట్టా ప్లేస్ షాల్ జాకెట్ మరింత ప్రత్యేకతను తీసుకు వస్తుంది. థ్రెడ్ వర్క్, ప్రింటెడ్ షావల్ జాకెట్స్ ఇండో వెస్ట్రన్ డ్రెస్సులకు స్పెషల్ లుక్‌ని జత చేస్తాయి.సందర్భాన్ని బట్టి ఒక డ్రెస్‌ను గ్రాండ్‌గా ధరించవచ్చు అదే మోడల్ని సింపుల్‌గానూ అలంకరించవచ్చు. -
సెలెబ్రిటీలపై ఫిర్యాదుల వెల్లువ.. లిస్ట్‌లో ఎంఎస్ ధోనీ టాప్!
ముంబై: వాణిజ్య ప్రకటనల్లో నటించేటప్పుడు ఆయా ఉత్పత్తుల మంచీ, చెడుల గురించి మదింపు చేయడంలో చాలా మటుకు సెలబ్రిటీలు విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని అడ్వర్టైజింగ్ పరిశ్రమ స్వీయ నియంత్రణ సంస్థ ఏఎస్సీఐ తెలిపింది. ఇదీ చదవండి: ChatGPT false: క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేసిన ప్రొఫెసర్.. చాట్‌జీపీటీ చేసిన ఘనకార్యం ఇది! 2022 ఆర్థిక సంవత్సరంలో 55 ప్రకటనలకు సంబంధించి సెలబ్రిటీలపై ఫిర్యాదులు రాగా గత ఆర్థిక సంవత్సరం ఇది ఏకంగా 803 శాతం పెరిగి 503 యాడ్లకు చేరింది. వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం ప్రకారం సెలబ్రిటీలు తాము నటించే యాడ్ల గురించి ముందస్తుగా మదింపు చేయాలి. కానీ ఏఎస్సీఐ పరిశీలించిన 97 శాతం కేసుల్లో సెలబ్రిటీలు ఈ విషయంలో ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు. ఎంఎస్ ధోనీ టాప్ పది ఉల్లంఘనలతో క్రికెటర్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) సెలబ్రిటీల లిస్టులో అగ్రస్థానంలో ఉండగా, ఏడు ఉల్లంఘనలతో యాక్టర్ కమెడియన్ భువన్ బామ్ రెండో స్థానంలో ఉన్నారు. గేమింగ్, క్లాసికల్ విద్య, హెల్త్‌కేర్, వ్యక్తిగత సంరక్షణ విభాగాల్లో అత్యధికంగా నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి. గత ఆర్థిక సంవత్సరం వివిధ మీడియా ఫార్మాట్లలో ఏఎస్‌సీఐకి 8,951 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 7,928 కంప్లైంట్లను సమీక్షించింది. ఇదీ చదవండి: Mahila Samman Scheme: గుడ్‌న్యూస్.. మహిళా సమ్మాన్ డిపాజిట్‌పై కీలక ప్రకటన -
ఖర్చులో ఖర్చు.. ఎంత ఖర్చయినా సరే ఈ సారి మనమే గెలవాలి సార్!
ఖర్చులో ఖర్చు.. ఎంత ఖర్చయినా సరే ఈ సారి మనమే గెలవాలి సార్! -
‘టాప్స్’ డెవలప్మెంట్ గ్రూప్‌లో స్నేహిత్, శ్రీజ, ఇషా సింగ్
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో కొత్తగా 20 మందిని చేర్చారు. తాజా జాబితాతో కలిపి 2024 పారిస్ ఒలింపిక్స్ కోసం ప్రభుత్వ సహకారంతో సన్నద్ధమవుతున్న మొత్తం ఆటగాళ్ల సంఖ్య 148కి చేరింది. వర్ధమాన క్రీడాకారులను కూడా సహకారం అందించేందుకు ‘టాప్స్’ డెవలప్మెంట్ గ్రూప్ ను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి టేబుల్ టెన్నిస్‌లో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్, ఆకుల శ్రీజకు... షూటింగ్లో ఇషా సింగ్‌కు చోటు లభించింది. చదవండి: Ind Vs SA- Test Series: రోహిత్ శర్మ స్థానంలో ప్రియాంక్ పాంచల్.. 314 నాటౌట్.. 24 సెంచరీలు! -
‘టాప్స్’ నుంచి నీరజ్‌కు ఉద్వాసన
న్యూఢిల్లీ: ఇటీవల డోపింగ్ పరీక్షలో విఫలం అయిన భారత మహిళా బాక్సర్ నీరజ్ ఫొగాట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఒలింపిక్స్‌లో భారత్ పతకం సాధించడమే లక్ష్యంగా కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీం’ (టాప్స్) నుంచి ఆమె పేరును తొలగించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకుంటూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది. నీరజ్‌తో పాటు భారత షూటర్లు రవి కుమార్, ఓం ప్రకాశ్‌లు కూడా ‘టాప్స్’ నుంచి ఉద్వాసనకు గురయ్యారు. -
ఎయిర్టెల్ కాదు.. జియోనే టాప్
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంచలనం జియో ఇంటర్నెట్ డౌన్లోడ్ వేగంలో మరోసారి తనస్థానాన్ని నిలబెట్టుకుంది.భారత టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2019 సెప్టెంబర్‌లో సెకనుకు 21 మెగాబైట్ల సగటు డేటా డౌన్లోడ్ వేగాన్ని నమోదు చేసింది. భారతి ఎయిర్టెల్ నెట్వర్క్ సగటు డౌన్లోడ్ వేగం 8.3 ఎంబీపీఎస్‌ను నమోదు చేసింది. వొడాఫోన్ 6.9 ఎంబీపీఎస్, ఐడియా సెల్యులార్ 6.4 ఎంబీపీఎస్ డౌన్లోడ్ వేగాన్నినమోదు చేసింది. ఈ వివరాలను తాజాగా విడుదల చేసింది. వొడాఫోన్, ఐడియాలు విలీనమైనప్పటికీ నెట్‌వర్క్‌ల విషయంలో వేర్వేరుగానే ఉండటంతో వాటి వేగాలను కూడా ప్రత్యేకంగా వెల్లడిస్తోంది ట్రాయ్. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ 3జీ మాత్రమే కలిగి ఉంది. అప్లోడ్ విషయానికి వస్తే 5.4 ఎంబీపీఎస్‌తో ఐడియా, 5.2 ఎంబీపీఎస్‌తో వొడాఫోన్ కంపెనీలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. 4.2 ఎంబీపీఎస్‌తో జియో మూడో స్థానంలో ఉండగా, 3.1 ఎంబీపీఎస్‌తో ఎయిర్టెల్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇది ఇలా వుంటే ప్రైవేట్ మొబైల్ డేటా అనలిటిక్స్ సంస్థ 'ఓపెన్ సిగ్నల్' లెక్కలప్రకారం ఎయిర్టెల్ డౌన్ లోడ్ వేగంలో టాప్‌లో ఉంది. టెలికాం కంపెనీల ఇంటర్నెట్ వేగ గణన సర్వే వివరాలను నిన్న(అక్టోబర్ 22, మంగళవారం) వెల్లడించింది. 2019 జూన్-ఆగస్టు కాలానికి ఎయిర్టెల్ కంపెనీయే అత్యధిక స్పీడ్‌ను నమోదు చేసినట్టు తెలిపింది. అయితే ట్రాయ్ సర్వేలో మాత్రం జియోనే మళ్లీ మొదటి స్థానంలో రావడం గమనార్హం. మై స్పీడ్ అప్లికేషన్ ఆధారంగా ట్రాయ్ ఇంటర్నెట్ సరాసరి వేగాల్ని గణించే విషయం తెలిసిందే. -
టాప్ స్కర్ట్
చూస్తే రెగ్యులర్ టాప్‌కి భిన్నంధరిస్తే స్కర్ట్ టాప్ అయిన చందంపేరు ఫ్లెయిర్ పాంచో మరో పేరు ఫ్లెయిర్ కేప్.సమ్మర్‌కి సరైన స్టైలిష్ ఎంపికఈ స్కర్ట్ మోడల్ టాప్‌ని అటు జీన్స్ ఇటు స్కర్ట్ మీదకూ ధరించవచ్చు. సూపర్ స్టైలిష్ కితాబులు పొందవచ్చు. రెగ్యులర్ టాప్‌లతో బోర్ కొడితేగౌనులా ఉండే ఈ మోడల్ టాప్‌ని ఇప్పుడే ధరించవచ్చు. ►అందమైన ఎంబ్రాయిడరీ, ఫ్రంట్ అండ్ బ్యాక్ డార్జిలింగ్ లేస్‌లు, 3డి ఫ్లవర్స్, కుచ్చుల అంచులు.. కొత్త మోడల్లో ముస్తాబు అయిన ఈ నయా టాప్స్ అతివలను అమితంగా ఆకర్షిస్తున్నాయి. ►ఇవి నూటికి నూరు శాతం ఖాదీ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన టాప్స్. సమ్మర్‌కి కూల్ ఎఫెక్ట్‌ని ఇస్తాయి. ఈవెనింగ్ పార్టీకి కలర్‌ఫుల్ లుక్‌నిస్తాయి. -
టాప్ ప్లేస్ నిలబెట్టుకున్న జియో, ఐడియా
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంచలనం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో దూసుకుపోతోంది. 4జీ సర్వీస్ డౌన్లోడ్ స్పీడ్‌లో మరోసారి టాప్‌లో నిలిచింది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) నవంబర్ గణాంకాలను విడుదల చేసింది. అక్టోబర్‌తో పోలిస్తే4జీ వేగంకొంచెం తగ్గినప్పటికీ 20.3 సెకునుకు ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో టాప్ ఉంది. అక్టోబర్‌లో ఇది 22.3 గా ఉంది. యూజర్లకు 4జీ సర్వీసు అందించడంలో మిగతా నెట్‌వర్క్‌ల కంటే జియో ముందుంది. ట్రాయ్ అందించిన లెక్కల ప్రకారం నవంబరులో డౌన్లోడ్ స్పీడ్‌లో జియోదే పైచేయి. అప్లోడ్ స్పీడ్‌లో ఐడియా సెల్యులార్ టాప్‌లో నిలిచింది. మరోవైపు సమీప ప్రత్యర్థి భారతీ ఎయిర్టెల్ డౌన్లోడ్ స్పీడ్ ఈ నెలలో కొంచెం మెరుగుపడింది. ఎయిర్టెల్ డౌన్లోడ్ స్పీడ్ 9.7 ఎంబీపీఎస్ నమోదైంది. గత నెలలో ఇది 9.5గా ఉంది. వొడాఫోన్ డౌన్లోడ్ స్పీడ్ కూడా స్వల్పంగా మెరుగుపడింది. అక్టోబర్ 6.7 ఎంబీపీఎస్గాఉండగా.. ప్రస్తుత నెలలో 6.8స్థాయికి పెరిగింది. ఐడియా సెల్యులార్ 4జీ డౌన్లోడ్ స్పీడ్ 6.4 నుంచి 6.2 కి పడిపోయింది. అయితే అప్లోడ్ స్పీడ్‌లో (5.9ఎంబీపీఎస్) తన టాప్ స్థానాన్ని నిలబెట్టుకుంది ఐడియా. సెకండ్ ప్లేస్‌లో వోడాఫోన్ (4.9)నిలవగా, జియో (4.5) మూడవస్థానంతో సరి పెట్టుకుంది. అయితే ఇక్కడ కూడా ఎయిర్టెల్ స్వల్పంగా పుంజుకుంది. అయితే యూజర్ల విషయంలో డౌన్లోడ్ స్పీడే చాలా ముఖ్యం. వీడియోలు చూడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, యాప్స్ ఆపరేట్ చేయడంలో డౌన్లోడ్ స్పీడ్ ప్రభావం చూపిస్తుంది. ఎవరికైనా వీడియోలు, ఫోటోలు, ఇతర ఫైల్స్ షేర్ చేయాలనుకుంటే మాత్రం అప్లోడ్ స్పీడ్ చూస్తారు. మైస్పీడ్ అప్లికేషన్లో రియల్ టైమ్ ఆధారంగా సగటు స్పీడ్ తెలుసుకోవచ్చు. -
రైళ్లలో కాదేదీ చోరీకి అనర్హం!
న్యూఢిల్లీ: 1.95 లక్షల టవళ్లు, 81736 దుప్పట్లు, 55, 573 తలదిండు కవర్లు..ఇవేవో వరద బాధితులకు పంపిస్తున్న సామగ్రి కాదు. ఏడాది కాలంలో మన రైళ్లలో దొంగతనానికి గురైన వస్తువులు. ఇటీవల పశ్చిమ రైల్వే విడుదల చేసిన నివేదికలో విస్తుగొలిపుతున్న ఈ విషయాలు ఉన్నాయి. దొంగతనానికి కాదేదీ అనర్హం అన్నట్లు..ప్రయాణికులకు అందుబాటులో ఉంచిన వస్తువులు ఇంత భారీస్థాయిలో చోరీకి గురవడం రైల్వే శాఖ ఆదాయంపై కూడా ప్రభావం చూపింది. చివరకు 200 టాయిలెట్ మగ్గులు, వేయి ట్యాప్‌లు, 300కు పైగా ఫ్లష్ పైపులు, స్నానంచేసే షవర్లు కూడా దొంగతనానికి గురైన జాబితాలో ఉన్నాయి. వీటిలో సుమారు రూ. 3 కోట్ల విలువైన వస్తువులను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. -
‘టాప్స్’లో భారత మహిళల హాకీ జట్టు!
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో రజతం సాధించిన భారత మహిళల హాకీ జట్టును త్వరలో టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్)లో చేర్చనున్నారు. తదుపరి ‘టాప్స్’ సమావేశంలో జట్టులోని మొత్తం 18 మంది సభ్యులను ఈ పథకం కిందికి తేనున్నారు. ఇప్పటికే భారత పురుషుల జట్టు ‘టాప్స్’లో ఉంది. 48 మంది ప్రాబబుల్స్... ‘సాయ్’ ఆధ్వర్యంలో నేటి నుంచి బెంగళూరులో జరుగనున్న జాతీయ మహిళల శిబిరానికి హాకీ ఇండియా 48 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితా ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోల్‌కీపర్ ఇతిమరపు రజని, తెలంగాణకు చెందిన ఫార్వర్డ్ యెండల సౌందర్య చోటు దక్కించుకున్నారు. -
మరోసారి సత్తా చాటిన జియో
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంచలనం రిలయన్స్ జియో మరోసారి తన సత్తాను చాటుకుంది. 4జీ నెట్వర్క్ స్పీడ్‌లో మరోసారి టాప్‌లో నిలిచింది. వరుసగా 11వ సారి కూడా జోరును సాగించిన జియో నవంబర్‌లో నెలలో మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. తద్వారా ప్రధాన ప్రత్యర్థులు ఎయిర్టెల్, వొడాఫోన్లకు భారీ నిరాశను మిగిల్చింది. ఆరంభం నుంచి కస్టమర్లకు ఆఫర్లను అందించడంలో దూకుడును ప్రదర్శించిన టెలికాం సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులకు హైస్పీడ్ డేటాను అందివ్వడంలో మళ్లీ టాప్ లో నిలిచిందనీ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడించింది. ట్రాయ్ తన మై స్పీడ్ టెస్ట్ యాప్ ద్వారా సేకరించిన గణాంకాల ప్రకారం నవంబరు నెలలో దేశవ్యాప్తంగా ఉన్న టెలికాం సంస్థలు అందించిన డేటా స్పీడ్‌లో జియో మొదటి స్థానంలో నిలిచింది. ట్రాయ్ డేటా నవంబరు 2017 నాటికి 25.6 ఎంబీపీఎస్ వేగంతో 4జీ సర్వీసు ప్రొవైడర్ల జాబితాలో రిలయన్స్ జియో మొదటిస్థానంలో నిలిచింది. జియోకు సన్నిహిత ప్రత్యర్థి వోడాఫోన్ సెకనుకు 10 మెగాబిట్ ఎంబీపీఎస్, భారతీ ఎయిర్టెల్ 9.8 ఎంబీపీఎస్, ఐడియా సెల్యూలార్ 7 ఎంబీపీఎస్ వేగాన్ని అందించాయి. అప్లోడ్ వేగంలో ఐడియాను వెనక్కినెట్టి వోడాఫోన్ నవంబరులో 6.9 ఎంబీపీఎస్ వేగాన్ని నమోదు చేసింది. ఆ తరువాతి స్థానాల్లో ఐడియా(6.6 ఎంబీపీఎస్), జియో( 4.9 ఎంబీపీఎస్) నిలిచాయి. ఎయిర్టెల్ 4 ఎంబీపీఎస్ వేగాన్ని మాత్రమే నమోదు చేసింది. -
బీర్ అమ్మకాల్లో తెలంగాణ టాప్
-
ఫోర్బ్స్ సెలబ్రిటీ జాబితా -టాప్ హీరోలు
ముంబై: బాలీవుడ్ కండల వీరుడు తన సత్తా మరోసారి చూపించాడు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఒక వెనక్కి నెట్టిమరీ టాప్ ప్లేస్ కొట్టేశాడు. సినిమా, స్పోర్ట్స్ పర్సనాలిటీల ఫోర్బ్స్-2016 సెలబ్రిటీ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. అయితే క్రికెట్ సంచలనం, టీమిండియా కెప్టెన్ క్రికెటర్ విరాట్ కోహ్లి మూడోస్థానంలో నిలిచారు. ఈ ఏడాదికి సంబంధించి ఫోర్బ్స్ మ్యాగజీన్ టాప్- 100 భారతీయ ప్రముఖుల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. గతేడాది ప్రముఖుల జాబితాలో షారుఖ్ తొలిస్థానంలో నిలవగా.. సల్మాన్ రెండు, కోహ్లి ఏడో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది సల్మాన్, షారుఖ్ స్థానాలు మార్చుకోగా.. కోహ్లి ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకాడు. బాలీవుడ్ మరో టాప్ హీరో అక్షయ్ కుమార్ 11 ర్యాంక్ నుంచి 4వ ర్యాంకు కు ఎగబాకాడు. బాలీవుడ్ భామలు దీపికా పదుకోన్ ఆరో స్థానంలో, ప్రియాంక చోప్రా 8వ స్థానంలో నిలిచారు. దక్షిణాది నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ దక్షిణాదిలో టాప్ లో నూ టాప్-100లో30వ స్థానంలో నిలిచారు. ఆయన అల్లుడు మరో హీరో ధనుష్ (47), కమల్ (49), సూర్య (51), విజయ్ (61) స్థానాలను ఆక్రమించారు. మరోవైపు గతేడాది జాబితాలో తెలుగు దర్శకుడు రాజమౌళి 72వ స్థానం సాధించగా.. ఈ సారి టాప్-100లో చోటు కోల్పోయారు. ఈ ఏడాది టాప్ 100 జాబితాలో 14 మంది కొత్తవాళ్లుచోటు దక్కించుకోవడం విశేషం. వీరిలో ఒలంపిక్ మెడల్ విజేత పీవీ సింధు (62 ) చెఫ్ సంజీవ్ కుమార్ (73) ర్యాపర్ బాద్ షా, (81) తదితరులు ఫోర్బ్స్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇక టెన్నిస్ దిగ్గజం సానియా(29), సైనా నెహ్వాల్(31), పీవీ సింధు (62), సాక్షిమాలిక్ (80), మేరీ కోమ్ (88) ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. క్రీడా విభాగం పరంగా కూడా కోహ్లినే అగ్రస్థానంలో ఉండగా, ఇక ధోనీ (5), సచిన్ (7), రోహిత్ శర్మ(16), యువరాజ్ (17) తర్వాతి స్థానాల్లో నిలిచారు. కాగా ఈ ఏడాది ఖ్యాతి పరంగా తొలి స్థానంలో కోహ్లి నిలిచాడు. ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రిటీ లిస్ట్ రూ. 270 కోట్ల ఆదాయంతో నెంబర్ 1 ప్లేస్ సాధించిన సల్మాన్ ఖాన్ రూ.222 కోట్ల ఆదాయంతో నెంబర్ 2 స్థానంలో షారుక్ ఖాన్ రూ.134 కోట్ల ఎర్నింగ్స్‌తో నెంబర్ 3 ప్లేస్‌లో విరాట్ కోహ్లీ రూ.203.03 కోట్ల ఎర్నింగ్స్‌తో4 ప్లేస్‌లో అక్షయ్ కుమార్ 30వ స్థానంలో సూపర్ స్టార్ రజనీకాంత్, 2016లో రజనీ ఆదాయం రూ.35 కోట్లు ఫోర్బ్స్ సెలబ్రిటీ జాబితాలో 33వ స్థానం దక్కించుకున్న మహేష్ బాబు 2016లో మహేష్ బాబు ఆదాయం రూ.42 కోట్లు 43వ స్థానంలో అల్లు అర్జున్, ఆదాయం 27 కోట్లు 51వ స్థానంలో సూర్య, 53వ స్థానంలో కాజల్ అగర్వాల్ 55వ ర్యాంక్ సాధించిన జూనియర్ ఎన్టీఆర్, ఆదాయం రూ.36 కోట్లు 67వ ప్లేస్‌లో రామ్‌చరణ్, ఆదాయం రూ.26 కోట్లు 62వ ప్లేస్‌తో సెలబ్రిటీ లిస్ట్‌లో చోటు సంపాదించిన పీవీ సింధు, ఆదాయం రూ.3.42 కోట్లు -
వెండి ధగ ధగ
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల యధాతథంగా ఉంచాలనే నిర్ణయాన్ని ప్రకటించడంతో బులియన్ మార్కెట్ సానుకూలంగా స్పందించింది. విలువైన మెటల్స్ ధగధగ లాడుతున్నాయి. ముఖ్యంగా వెండి, బంగారు ధరల్లో వేగం పుంజుకుంది. నిన్నటి జోరు శుక్రవారం కూడా కొనసాగుతోంది. బంగారం 31వేల రూపాయల మార్క్ ను దాటగా వెండి కిలో 47వేల రూపాయలకు పైన స్థిరంగా ట్రేడ్ అవుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ. 375 లాభపడి రూ. 47375 దగ్గర ఉంది. హైదరాబాద్‌లో నిన్నటి బులియన్ మార్కెట్ లో వెండి కిలో రూ.48,300 ను తాకింది. ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలు, ముఖ్యంగా పారిశ్రామిక అవసరాలు, నాణేల తయారీకి వెండి కొనుగోళ్లు పెరగడంతో వెండి ధగధగలాడింది. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఒక్కరోజే కిలో వెండి ధర రూ.1,550 పెరిగి రూ.47,750కి చేరిందని పీటీఐ పేర్కొంది. మరోవైపు వడ్డీరేట్ల పెంపు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తామన్న ఫెడ్ ప్రకటన డాలర్ విలువను బలహీన పర్చింది. ఫలితంగా దేశీయ కరెన్సీ బలపడంతో పాటు, పసిడి, వెండిలపై ఇన్వెస్టర్ల పెట్టుబడులు మళ్లాయని బులియన్ మార్కెట్ వర్గాల అంచనా. -
అక్షరాలా రూ.2,107 కోట్లు ఖర్చు చేశారు..
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రజలే నాయకులను ఎన్నుకోవాలి. ఇది భారతదేశానికి ఉన్న ప్రత్యేకత. మరి ఆ ప్రత్యేకతను కొన్ని రాజకీయ పార్టీలు పరిహాసం చేస్తున్నాయా? అవును. ఎన్నికల ప్రచారంలో పరిమితిని మించి డబ్బు ఖర్చు చేయకూడదనే ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధలనలున్నా వాటన్నింటిని పరిహాసం చేస్తూ.. నియమాల్లోని లొసుగులను ఉపయోగించుకుంటూ సకల ఆర్భాటాలు, హాంగులతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాజకీయ పార్టీలేవో ఓ సారి చూద్దాం.. దేశంలో వివిధ రాజకీయ పార్టీలు 2004 నుంచి 2015 వరకు జరిగిన అన్ని రకాల ఎలక్షన్స్(లోక్ సభ, అసెంబ్లీ)కు సంబంధించి ఈసీకి అందించిన సమాచారాన్ని పరిశీలించిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్(ఏడీఆర్) కళ్లు చెదిరే వాస్తవాలను ముందుంచింది. 2004 నుంచి 2015 వరకు జరిగిన మొత్తం 71 ఎలక్షన్లలో మన రాజకీయ పార్టీలన్నీ కలిపి ప్రచారానికి చేసిన ఖర్చు రూ.2,107 కోట్ల రూపాయలు. కేవలం 2004,2009,2015లలో జరిగిన లోక్ సభ ఎన్నికల కు విరాళాలుగా చెక్కుల రూపంలో పార్టీలకు అందిన మొత్తం 1,300 కోట్లు. నగదు రూపంలో చేరిన మొత్తం 1,039 కోట్లు గా ఉంది. వీటిలో ప్రాంతీయ పార్టీలైన సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), అన్నాడీఎంకే, భారతీయ జనతా దళ్(బీజేడీ), ఎస్ఏడీ లు కేవలం లోక్ సభ ఎన్నికల ప్రచారానికి అందుకున్న మొత్తం రూ.267.14 కోట్లుగా లెక్కల్లో తేలింది. వీటిలో సమాజ్ వాదీ పార్టీ రూ.118 కోట్ల విరాళంతో ప్రథమ స్థానంలో నిలిచింది. కేవలం 2014 లోక్ సభ ఎన్నికల్లో మాత్రమే పాల్గొన్న ఆప్ కు రూ.51.83 కోట్లు విరాళంగా అందుకున్న పార్టీ రూ.37.66 కోట్లను ప్రచార ఆర్భాటాలకు వినియోగించినట్లు ఈసీకి అందజేసిన వివరాల్లో పేర్కొంది. లోక్ సభ ఎన్నికల్లో 83 శాతంగా ఉన్న చెక్ ల రూపంలో వచ్చిన విరాళాలు, అసెంబ్లీ ఎన్నికల్లో 65 శాతంగా ఉన్నాయి. ఈసీ గైడ్ లైన్స్ ప్రకారం ఒక రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచారానికి రూ. 20,000 కన్నా ఎక్కువ డబ్బును ఖర్చు చేయరాదని ఉంది. కానీ, రాజకీయ పార్టీలకు అందించే ఫార్మాట్ లో ప్రచార ఖర్చుకు సంబంధించి ఎటువంటి నియమం( 20,000 వేల కంటే తక్కువ లేదా 20,000 కంటే ఎక్కువ) లేదని ఏడీఆర్ వివరించింది. -
బిగ్గెస్ట్ కంపెనీగా గూగుల్
శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ టెక్ దిగ్గజాలు యాపిల్, గూగుల్ మధ్య హోరా హోరీ పోరులో గూగుల్ పై చాయి సాధించింది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత యాపిల్ సంస్థ ఆదాయం గురువారం నాటికి రెండేళ్ల కనిష్టస్థాయికి పడిపోయింది. కంపెనీ షేర్ల విలువ భారీగా నష్టపోవడం ఈ పరిణామానికి దారి తీసింది. రెండేళ్లలో తొలిసారి గురువారం ట్రేడింగ్‌లో యాపిల్ షేర్లు 90డాలర్లు పడిపోయాయి. దీంతో మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద కంపెనీగా గూగుల్ టాప్‌లోకి దూసుకు వచ్చేసింది. గురువారం ట్రేడింగ్‌లో యాపిల్ షేరు విలువ ఒక దశలో 89.47 డాలర్లకు పడిపోయింది. చివరకు 90.34 డాలర్ల వద్ద ముగిసింది. దీంతో యాపిల్ ప్రపంచ అతిపెద్ద కంపెనీ టైటిల్ కోల్పోవాల్సి వచ్చింది. గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ అధిక ఆదాయంతో ముందు వరుసలో చేరింది. గురువారం మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం యాపిల్‌కు 494.8 బిలియన్ల డాలర్లు ఉండగా.. గూగుల్‌కు 500 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి యాపిల్ హవా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో షేర్లు కూడా పడిపోతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు షేర్ల విలువ 14 శాతం తగ్గిందని మార్కెట్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. దిగ్గజ బహుళజాతి కంపెనీలు రెండూ గురువారం నష్టాలను చవిచూసినప్పటికీ అల్ఫాబెట్ చాలా తక్కువ అంటే 0.3 శాతం మాత్రమే నష్టపోయిగా, యాపిల్ 2.4 శాతం నష్టాలను మూటకట్టుకుంది. గత 20 సెషన్లుగా పడిపోతున్న యాపిల్ షేర్లు, గత ఎనిమిది రోజుల నష్టాలతో సంస్థను భారీగా నిరాశపర్చాయి. సుమారు 1998 తరువాత భారీగా నష్టపోయింది. ఏడు వందల బిలియన్ డాలర్లతో 2015 లో అతి పెద్ద కంపెనీగా అవతరించిన యాపిల్ , తాజాగా అయిదు వందల బిలియన్ డాలర్లకు దిగువకు పడిపోయింది. అయినా పెట్టుబడిదారుల మాత్రం యాపిల్ పై నమ్మకాన్ని ఉంచినట్టు కనిపిస్తోంది. ఇటీవలి త్రైమాసికంలో 10.52 బిలియన్ల డాలర్ల విస్తారమైన లాభాలను గడించింది. ఈ నేపథ్యంలో యాపిల్ విస్తారమైన మార్కెట్ ను సమీక్షించుకుని, సరికొత్తగా వినియోగదారులను ఆకట్టుకునేలా ప్రణాళికలు రూపొందించుకుని, లేటెస్ట్ ఉత్పత్తులు, టెక్నాలజీతో మార్కెట్లోకి రావాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.