
ఫోర్బ్స్ సెలబ్రిటీ జాబితా -టాప్ హీరోలు
బాలీవుడ్ కండల వీరుడు తన సత్తా మరోసారి చూపించాడు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఒక వెనక్కి నెట్టిమరీ టాప్ ప్లేస్ కొట్టేశాడు.
ముంబై: బాలీవుడ్ కండల వీరుడు తన సత్తా మరోసారి చూపించాడు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఒక వెనక్కి నెట్టిమరీ టాప్ ప్లేస్ కొట్టేశాడు. సినిమా, స్పోర్ట్స్ పర్సనాలిటీల ఫోర్బ్స్-2016 సెలబ్రిటీ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. అయితే క్రికెట్ సంచలనం, టీమిండియా కెప్టెన్ క్రికెటర్ విరాట్ కోహ్లి మూడోస్థానంలో నిలిచారు. ఈ ఏడాదికి సంబంధించి ఫోర్బ్స్ మ్యాగజీన్ టాప్- 100 భారతీయ ప్రముఖుల జాబితాను శుక్రవారం విడుదల చేసింది.
గతేడాది ప్రముఖుల జాబితాలో షారుఖ్ తొలిస్థానంలో నిలవగా.. సల్మాన్ రెండు, కోహ్లి ఏడో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది సల్మాన్, షారుఖ్ స్థానాలు మార్చుకోగా.. కోహ్లి ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకాడు. బాలీవుడ్ మరో టాప్ హీరో అక్షయ్ కుమార్ 11 ర్యాంక్ నుంచి 4వ ర్యాంకు కు ఎగబాకాడు. బాలీవుడ్ భామలు దీపికా పదుకోన్ ఆరో స్థానంలో, ప్రియాంక చోప్రా 8వ స్థానంలో నిలిచారు.
దక్షిణాది నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ దక్షిణాదిలో టాప్ లో నూ టాప్-100లో30వ స్థానంలో నిలిచారు. ఆయన అల్లుడు మరో హీరో ధనుష్ (47), కమల్ (49), సూర్య (51), విజయ్ (61) స్థానాలను ఆక్రమించారు. మరోవైపు గతేడాది జాబితాలో తెలుగు దర్శకుడు రాజమౌళి 72వ స్థానం సాధించగా.. ఈ సారి టాప్-100లో చోటు కోల్పోయారు.
ఈ ఏడాది టాప్ 100 జాబితాలో 14 మంది కొత్తవాళ్లుచోటు దక్కించుకోవడం విశేషం. వీరిలో ఒలంపిక్ మెడల్ విజేత పీవీ సింధు (62 ) చెఫ్ సంజీవ్ కుమార్ (73) ర్యాపర్ బాద్ షా, (81) తదితరులు ఫోర్బ్స్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇక టెన్నిస్ దిగ్గజం సానియా(29), సైనా నెహ్వాల్(31), పీవీ సింధు (62), సాక్షిమాలిక్ (80), మేరీ కోమ్ (88) ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. క్రీడా విభాగం పరంగా కూడా కోహ్లినే అగ్రస్థానంలో ఉండగా, ఇక ధోనీ (5), సచిన్ (7), రోహిత్ శర్మ(16), యువరాజ్ (17) తర్వాతి స్థానాల్లో నిలిచారు. కాగా ఈ ఏడాది ఖ్యాతి పరంగా తొలి స్థానంలో కోహ్లి నిలిచాడు.
ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రిటీ లిస్ట్
రూ. 270 కోట్ల ఆదాయంతో నెంబర్ 1 ప్లేస్ సాధించిన సల్మాన్ ఖాన్
రూ.222 కోట్ల ఆదాయంతో నెంబర్ 2 స్థానంలో షారుక్ ఖాన్
రూ.134 కోట్ల ఎర్నింగ్స్‌తో నెంబర్ 3 ప్లేస్‌లో విరాట్ కోహ్లీ
రూ.203.03 కోట్ల ఎర్నింగ్స్‌తో4 ప్లేస్‌లో అక్షయ్ కుమార్
30వ స్థానంలో సూపర్ స్టార్ రజనీకాంత్, 2016లో రజనీ ఆదాయం రూ.35 కోట్లు
ఫోర్బ్స్ సెలబ్రిటీ జాబితాలో 33వ స్థానం దక్కించుకున్న మహేష్ బాబు
2016లో మహేష్ బాబు ఆదాయం రూ.42 కోట్లు
43వ స్థానంలో అల్లు అర్జున్, ఆదాయం 27 కోట్లు
51వ స్థానంలో సూర్య, 53వ స్థానంలో కాజల్ అగర్వాల్
55వ ర్యాంక్ సాధించిన జూనియర్ ఎన్టీఆర్, ఆదాయం రూ.36 కోట్లు
67వ ప్లేస్‌లో రామ్‌చరణ్, ఆదాయం రూ.26 కోట్లు
62వ ప్లేస్‌తో సెలబ్రిటీ లిస్ట్‌లో చోటు సంపాదించిన పీవీ సింధు, ఆదాయం రూ.3.42 కోట్లు