ఈ హీరోలిద్దరి వయసు గురించి చెప్పడం లేదని అర్థమయ్యే ఉంటుంది. మరి.. అక్షయ్ 76... సల్మాన్ 82 అంటే ఏంటి? అంటే.. అది వారి స్థానం. అమెరికన్ పత్రిక ‘ఫోర్బ్స్’ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న 100 మంది ప్రముఖుల జాబితాను విడుదల చేసింది. చిత్రపరిశ్రమ నుంచి గతేడాది ఆ లిస్ట్‌లో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ ఉన్నారు. ఈ ఏడాది అక్షయ్, సల్మాన్‌లకు మాత్రమే చోటు దక్కింది. ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారంటే అక్షయ్‌కుమార్. వంది మంది ప్రముఖుల జాబితాలో అక్షయ్‌కి 76వ స్థానం దక్కింది. సల్మాన్ స్థానం 82. నిజానికి అక్షయ్‌కన్నా సల్మాన్ సంపాదనే ఎక్కువ ఉంటుందని చాలామంది ఊహిస్తారు. అయితే పాపులార్టీలో సల్మాన్‌దే పై చేయి.
సంపాదనలో మాత్రం అక్షయ్ ముందున్నారు. సినిమాలు మాత్రమే కాదు పలు ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరించడం అక్షయ్‌కి ‘టాప్ 100’ లిస్ట్‌లో చోటు దక్కేలా చేసింది. ‘టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్‌కథ’, ‘ప్యాడ్‌మేన్’ వంటి సామాజిక స్పృహ ఉన్న చిత్రాలు చేస్తున్నారని జాబితాను విడుదల చేసిన అనంతరం ఫోర్బ్స్ బృందం అక్షయ్ కుమార్‌ని ప్రశంసించింది. ఆ సంగతలా ఉంచితే.. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ గతేడాది 65వ స్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది లిస్ట్‌లో ఆయన మిస్సింగ్. గతేడాది జూన్ 1 నుంచి ఈ ఏడాది జూన్ వరకు ప్రముఖుల సంపాదనను లెక్కలోకి తీసుకుని, ‘ఫోర్బ్స్’ పత్రిక ‘టాప్ 100’ జాబితాను విడుదల చేసింది.
అక్షయ్ 76... సల్మాన్ 82!
Published Wed, Jul 18 2018 1:09 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment