
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ. తరువాత కూడా గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలతో అదే జోరు కంటిన్యూ చేస్తున్న విజయ్ తాజాగా ఫోర్బ్స్ జాబితాలోనూ చోటు సంపాదించుకున్నాడు. 2018లో అత్యధిక ఆదాయాన్ని పొందిన సెలబ్రిటీల లిస్ట్‌ను రిలీజ్ చేసింది ఫోర్బ్స్.
ఈ లిస్ట్‌లో 14 కోట్ల ఆదాయంతో 72 వ స్థానంలో నిలిచాడు విజయ్ దేవరకొండ. ఇంత తక్కువ కాలంలో ఫోర్బ్స్‌జాబితాలో స్థానం సంపాదించడం కూడా ఓ రికార్డ్‌గానే చెపుతున్నారు ఫ్యాన్స్. ఈ లిస్ట్ సౌత్ నుంచి అగ్రస్థానంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నిలవగా పవన్ కల్యాణ్, విజయ్, ఎన్టీఆర్, విక్రమ్, మహేష్ బాబు, సూర్య, విజయ్ సేతుపలి లాంటి తారలు ఉన్నారు.
ఈ లిస్ట్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతారకు కూడా చోటు దక్కటం విశేషం. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 253.25 కోట్ల ఆదాయంతో తొలిస్థానంలో నిలవగా విరాట్ కోహ్లీ 228.09 కోట్లతో తరువాతి స్థానంలో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment