
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు యూత్‌లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. ఫ్యాన్స్ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. హిట్లు ప్లాప్‌లకు అతీతంగా ఆయన ప్రయాణం కొనసాగుతోంది. తొలి సినిమా నుంచే ఆయన ప్రత్యేకమైన అభిమానుల సంపాదించుకున్నాడు. అప్పట్లో పవన్ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ ఓ సెన్సేషన్. తాజాగా అప్పటి పవన్ కల్యాణ్ స్టైల్ గురించి చర్చించుకుంటున్నారు ఆయన అభిమానులు. దానికి కారణం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఓల్డ్ ఫోటోనే.
అచ్చం అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండను పోలి ఉన్న పవన్ అన్ సీన్ పిక్ నిన్న సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.దాన్ని మళ్లీ రకరకాల ఎడిట్స్ లో కూడా షేర్ చేసుకుంటు పాత పవన్ ను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
ఇక సినిమా విషయాలకొస్తే.. అజ్ఞాతవాసి సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న పవన్.. ఇటీవల ‘వకీల్ సాబ్’తో రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 30 శాతం పూర్తయింది. దీంతో పాటు ‘అయ్యప్పనుమ్ కోషియం’రీమేక్ చిత్రంలో నటిస్తున్నాడు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానా కీలకపాత్రలో నటిస్తున్నాడు.
చదవండి:
నా హృదయం ఉప్పొంగిపోయింది: మహేశ్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment