అవార్డును వేలం వేసిన విజయ్‌ దేవరకొండ.. దక్కించుకున్నది ఎవరంటే? | Why Vijay Devarakonda Auctioned His Filmfare Award? | Sakshi
Sakshi News home page

అవార్డును వేలం వేసిన విజయ్‌ దేవరకొండ.. దక్కించుకున్నది ఎవరంటే?

Published Tue, Apr 2 2024 9:14 AM | Last Updated on Tue, Apr 2 2024 10:26 AM

Why Vijay Devarakonda Auctioned His Filmfare Award? - Sakshi

టాలీవుడ్‌ రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ క్రేజ్‌ యూత్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. 2017లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన అర్జున్ రెడ్డితో విజయ్‌ జీవితం మారిపోయింది. అందులో ఆయన నటనకు గుర్తింపుగా  ఫిల్మ్‌ఫేర్‌లో ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. అయితే ఆ వార్డును 2018లో వేలం వేశాడు. తాజాగా ఈ విషయం మరోసారి వైరల్‌ అవుతుంది. ఏప్రిల్‌ 5న ఆయన నటించిన ఫ్యామిలీస్టార్‌ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్‌ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రస్థావన మరోసారి తెరపైకి వచ్చింది.

ఫ్యామిలీస్టార్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ పాల్గొన్నాడు. అర్జున్‌ రెడ్డి సినిమాకు గాను ఉత్తమ నటుడిగా వచ్చిన ఫిలింఫేర్ అవార్డును భారీ మొత్తానికి వేలం వేసినట్లు విజయ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తనకు ఎలాంటి అవార్డులంటే ఇష్టం లేదని చెప్పిన విజయ్.. ఇప్పటి వరకు తనకు వచ్చిన అవార్డ్స్‌లలో కొన్ని ఆఫీసులో ఉంటే, మరికొన్ని  ఇంట్లో ఉన్నాయని చెప్పాడు. 

2018లో ఏం జరిగిందంటే.. అర్జున్‌ రెడ్డి సినిమాకు గాను ఫిలింఫేర్ నుంచి ఉత్తమ నటుడిగా విజయ్‌కు అవార్డు దక్కింది. దానిని  2019లో ఆయన వేలం వేశారు. మొదట రూ. 5లక్షలు వస్తే చాలు అనుకుని ఆన్‌లైన్‌లో వేలం ప్రక్రియ ప్రారంభించారు. ఆ సమయంలో దివి ల్యాబ్స్ కుటుంబానికి చెందిన శ్యామలాదేవి రూ. 25 లక్షలకు దక్కించుకున్నారు. అందుకోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ ఫిలింఫేర్‌ అవార్డును ఆమెకు అందించారు విజయ్‌. అనంతరం ఆమె ఇచ్చిన రూ. 25 లక్షల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి (CMRF) అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement