
టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌కు నాంధి పలికిన సినిమా అర్జున్ రెడ్డి. బోల్డ్ కంటెంట్‌తో సంచలన విజయం సాదించిన ఈ సినిమాతో విజయ్ దేవరకొండ సెన్సేషనల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను ప్రస్తుతం తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నటుడిగా మీ గోల్స్ ఏంటీ అన్న ప్రశ్నకు సమాధానంగా ‘నేను కొన్నేళ్ల తరువాత అర్జున్ రెడ్డి సినిమా చూస్తే సిగ్గుపడాలి. కొన్ని సంవత్సరాల తరువాత కూడా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అర్జున్ రెడ్డే అంటే నటుడిగా నేను ఏ మాత్రం ఇంప్రూవ్ కాలేదని అర్ధం. నటుడిగా నేను ఇంకా ఎంతో సాధించాలి’ అన్నాడు.
టాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషలన్నింటి మీద దృష్టి పెట్టిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు భరత్ కమ్మ దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment