ట్వీట్‌లోనూ అదే యాటిట్యూడ్‌ | Vijay Deverakonda Announces The Song of The Year From Dear Comrade | Sakshi
Sakshi News home page

ట్వీట్‌లోనూ అదే యాటిట్యూడ్‌

Published Sat, May 11 2019 11:32 AM | Last Updated on Sat, May 11 2019 11:32 AM

Vijay Deverakonda Announces The Song of The Year From Dear Comrade - Sakshi

అర్జున్‌ రెడ్డి సినిమాతో సంచలన విజయం సాధించిన యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ... తరువాత కూడా తనదైన యాటిట్యూడ్‌తో టాలీవుడ్‌లో స్టార్‌ గా ఎదుగుతున్నాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ తన మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్న విజయ్‌ తన సినిమాల ప్రమోషన్‌ విషయంలోనూ అంతా తానే అయి వ్యవహరిస్తున్నాడు.

త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న డియర్‌ కామ్రేడ్ సినిమాలోని సెకండ్‌ సింగిల్ ఆదివారం విడుదల కానుంది. అయితే విషయాన్ని తన ట్విటర్‌లో ప్రకటించిన విజయ్‌ ఏకంగా ఆ పాటను సాంగ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అనేశాడు. ఇప్పటికే రిలీజ్‌ అయిన తొలి పాటకు సూపర్బ్‌ రెస్పాన్స్‌ రావటంతో సెకండ్‌ సింగిల్‌ పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే పాట రిలీజ్‌ కాకముందే విజయ్‌ సాంగ్‌ ఆఫ్ ద ఇయర్‌ అని ప్రకటించటంపై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి.

భరత్‌ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్‌ కామ్రేడ్ జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్‌ విద్యార్థి నాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌. మైత్రీ మూవీ మేకర్స్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement