ప్రేమలో పడిపోయా : విజయ్‌ దేవరకొండ | Vijay Devarakonda Fell in Love With Two Kids | Sakshi

ప్రేమలో పడిపోయా : విజయ్‌ దేవరకొండ

Feb 9 2019 11:45 AM | Updated on Feb 9 2019 11:45 AM

Vijay Devarakonda Fell in Love With Two Kids - Sakshi

అర్జున్‌ రెడ్డి సినిమాతో సెన్సేషనల్‌ స్టార్‌గా ఎదిగిన విజయ్‌ దేవరకొండ రోజు రోజుకి తన ఫ్యాన్‌ బేస్‌ని పెంచుకుంటూ పోతున్నాడు. కేవలం ఒక సెక్షన్‌కే పరిమితమై పోకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాడు. యూత్‌లోనే కాదు చిన్నారుల్లోనే విజయ్‌కి మంచి ఫాలోయింగ్‌. తాజాగా ఫిలడెల్ఫియాలో ఉంటున్న ఇద్దరు తెలుగు చిన్నారులు విజయ్‌ దేవరకొండకు గురంచి మాట్లాడుతున్న వీడియోపై ఈ యంగ్ హీరో స్పందించాడు.

డియర్‌ కామ్రేడ్ షూటింగ్‌ లో గాయపడిన విజయ్‌ ఫోటోను చూస్తూ ‘విజయ్‌ దేవరకొండ డాక్టర్‌ దగ్గరికి వెళ్లు’అంటూ ఇద్దరు చిన్నారు ముద్దు ముద్దుగా మాట్లాడిన వీడియోను వారి కుటుంబ సభ్యులు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై స్పందించిన విజయ్‌ ‘ప్రేమలో పడ్డా.. నాకు డాక్టర్‌ అవసరం లేదు. మిమ్మల్ని కలవాలనుంది. కలుస్తారా?’ అంటూ రిప్లై ఇచ్చాడు. వెంటనే స్పందించిన చిన్నారుల తండ్రి ‘మా పిల్లలు నిన్ను కలిసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఈ శనివారం మేం హైదరాబాద్ వస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement