ఈ బుడ్డోడు ఇప్పుడు సెన్సేషనల్‌ స్టార్‌..! | Vijay Devarkonda Childhood Video Trending In Social Media | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 22 2019 10:06 AM | Last Updated on Tue, Jan 22 2019 10:07 AM

Vijay Devarkonda Childhood Video Trending In Social Media - Sakshi

ఈ ఫోటోలో ఉన్న కుర్రాడిని గుర్తు పట్టారా..? ఎక్కడో చూసినట్టుగా ఉంది కదు. అవును ఆ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో సెన్సేషనల్‌ స్టార్‌. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీ ఆలోచననే మార్చేసిన హీరో. తన యాటిట్యూడ్‌తో అమ్మాయిల మనసు గెలుచుకున్న రౌడీ. ఆ హీరో ఎవరో కాదు యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ. అర్జున్‌ రెడ్డి సినిమాతో సెన్సేషనల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ చిన్ననాటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

1999లో ఓ టీవీ సీరియల్‌లో షావుకారు జానకితో కలిసి విజయ్‌ నటించిన వీడియోను ఓ అభిమాని విజయ్‌ దేవరకొండను ట్యాగ్ చేస్తూ తన సోషల్ మీడియ పేజ్‌లో పోస్ట్ చేశాడు. వెంటనే స్పందించిన విజయ్‌ దేవరకొండ వీడియోను పోస్ట్ చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement