
న్యూఢిల్లీ: 1.95 లక్షల టవళ్లు, 81736 దుప్పట్లు, 55, 573 తలదిండు కవర్లు..ఇవేవో వరద బాధితులకు పంపిస్తున్న సామగ్రి కాదు. ఏడాది కాలంలో మన రైళ్లలో దొంగతనానికి గురైన వస్తువులు. ఇటీవల పశ్చిమ రైల్వే విడుదల చేసిన నివేదికలో విస్తుగొలిపుతున్న ఈ విషయాలు ఉన్నాయి. దొంగతనానికి కాదేదీ అనర్హం అన్నట్లు..ప్రయాణికులకు అందుబాటులో ఉంచిన వస్తువులు ఇంత భారీస్థాయిలో చోరీకి గురవడం రైల్వే శాఖ ఆదాయంపై కూడా ప్రభావం చూపింది. చివరకు 200 టాయిలెట్ మగ్గులు, వేయి ట్యాప్‌లు, 300కు పైగా ఫ్లష్ పైపులు, స్నానంచేసే షవర్లు కూడా దొంగతనానికి గురైన జాబితాలో ఉన్నాయి. వీటిలో సుమారు రూ. 3 కోట్ల విలువైన వస్తువులను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment