
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో కొత్తగా 20 మందిని చేర్చారు. తాజా జాబితాతో కలిపి 2024 పారిస్ ఒలింపిక్స్ కోసం ప్రభుత్వ సహకారంతో సన్నద్ధమవుతున్న మొత్తం ఆటగాళ్ల సంఖ్య 148కి చేరింది. వర్ధమాన క్రీడాకారులను కూడా సహకారం అందించేందుకు ‘టాప్స్’ డెవలప్‌మెంట్ గ్రూప్ ను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి టేబుల్ టెన్నిస్‌లో ఎస్‌ఎఫ్‌ఆర్ స్నేహిత్, ఆకుల శ్రీజకు... షూటింగ్‌లో ఇషా సింగ్‌కు చోటు లభించింది.
చదవండి: Ind Vs SA- Test Series: రోహిత్ శర్మ స్థానంలో ప్రియాంక్ పాంచల్.. 314 నాటౌట్.. 24 సెంచరీలు!