Paris Olympics 2024: బోణి కొట్టిన మరో తెలుగమ్మాయి | PARIS OLYMPICS 2024 TABLE TENNIS: SREEJA AKULA QUALIFIED INTO ROUND OF 32 | Sakshi
Sakshi News home page

Paris Olympics 2024: బోణి కొట్టిన మరో తెలుగమ్మాయి

Published Sun, Jul 28 2024 3:47 PM | Last Updated on Sun, Jul 28 2024 9:02 PM

PARIS OLYMPICS 2024 TABLE TENNIS: SREEJA AKULA QUALIFIED INTO ROUND OF 32

పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండో రోజు భారత్‌ వరుస విజయాలతో శుభారంభం చేసింది. తొలుత బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు విజయం సాధించగా.. ఆతర్వాత టేబుల్‌ టెన్నిస్‌లో ఆకుల శ్రీజ బోణి కొట్టింది. సింధు తొలి రౌండ్‌ మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన అబ్దుల్‌ రజాక్‌పై 21-9, 21-6 విజయం సాధించగా.. ఆకుల శ్రీజ.. రౌండ్‌ ఆఫ్‌ 64 మ్యాచ్‌లో స్వీడన్‌కు చెందిన క్రిస్టినా కల్బర్గ్‌పై 11-4, 11-9, 11-7, 11-8 తేడాతో నెగ్గి, రౌండ్‌ ఆఫ్‌ 32కు క్వాలఫై అయ్యింది. 

సింధు తొలి రౌండ్‌లో ప్రత్యర్దిపై 29 నిమిషాల్లో జయకేతనం ఎగురవేయగా.. శ్రీజ 30 నిమిషాల్లో ప్రత్యర్దిని చిత్తు చేసింది. సింధు, శ్రీజ తమతమ ప్రత్యర్దులపై వరుస సెట్లలో విజయం సాధించారు. సింధు, శ్రీజ ఇద్దరూ తెలుగమ్మాయిలే కావడం విశేషం. 

మరోవైపు పురుషుల రోయింగ్‌ సింగిల్స్‌ స్కల్స్‌ రెపిచేజ్‌ రౌండ్‌లో భారత్‌కు చెందిన బల్‌రాజ్‌ పన్వర్‌ విజయం సాధించాడు. ఈ విజయంతో బల్‌రాజ్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు.

మహిళల 10 మీటర్ల ఎయిర్‌  రైఫిల్‌ విభాగంలో రమిత జిందాల్‌ (631.5) ఫైనల్‌కు చేరింది. 

పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో అర్జున్‌ బబుతా (630.1) ఫైనల్‌కు చేరాడు. 

మహిళల టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మనికా బత్రా విజయం సాధించింది. గ్రేట్‌ బ్రిటన్‌కు చెందిన అన్నా హర్సేపై 11-8, 12-10, 11-9, 9-11, 11-5 తేడాతో గెలుపొందింది. 

పురుషుల టేబుల్‌ టెన్నిస్‌ తొలి రౌండ్‌లో భారత్‌కు చెందిన శరత్‌ కమల్‌ స్లొవేనియాకు చెందిన డేనీ కొజుల్‌ చేతిలో 2-4 తేడాతో (12-10 9-11 6-11 7-11 11-8 10-12) ఓటమిపాలయ్యాడు.

పురుషుల టెన్నిస్‌ సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భారత్‌కు చెందిన సుమిత్‌ నగాల్‌ ఫ్రాన్స్‌కు చెందిన కొరెంటిన్‌ మౌటెట్‌ చేతిలో 2-6, 6-2, 5-7 తేడాతో ఓటమిపాలయ్యాడు.

భారత మహిళల ఆర్చరీ టీమ్‌ (అంకిత భకత్‌, భజన్‌ కౌర్‌, దీపికా కుమార్‌) క్వార్టర్‌ ఫైనల్లో నెదర్లాండ్స్‌ చేతిలో 0-6 తేడాతో భారత్‌ ఓటమిపాలైంది. 

పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భారత్‌కు చెందిన హెచ్‌ ఎస్‌ ప్రణయ్‌.. జర్మనీకు చెందిన ఫేబియన్‌ రోథ్‌పై 21-18, 21-12 తేడాతో గెలుపొందాడు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement