Paris Olympics 2024: చరిత్ర సృష్టించిన మనిక బత్రా | Paris Olympics 2024 Women's Singles Table Tennis: Manika Batra Qualified To Round Of 16 | Sakshi
Sakshi News home page

Paris Olympics 2024: చరిత్ర సృష్టించిన మనిక బత్రా

Jul 30 2024 8:33 AM | Updated on Jul 30 2024 11:36 AM

Paris Olympics 2024 Women's Singles Table Tennis: Manika Batra Qualified To Round Of 16

పారిస్‌ ఒలింపిక్స్‌లో మూడో రోజు ఆఖర్లో భారత్‌కు ఊరట కలిగించే విజయం దక్కింది. మహిళల టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌ ఈవెంట్‌లో మనిక బత్రా విజయం సాధించింది. రౌండ్‌ ఆఫ్‌ 32లో ఫ్రాన్స్‌కు చెందిన ప్రితిక పవడేపై మనిక 11-9, 11-6, 11-9, 11-7 తేడాతో గెలుపొంది, రౌండ్‌ ఆఫ్‌ 16కు చేరింది. ఒలింపిక్స్‌ టేబుల్‌ టెన్నిస్‌లో రౌండ్‌ ఆఫ్‌ 16కు క్వాలిఫై అయిన తొలి భారత పాడ్లర్‌గా మనిక చరిత్ర సృష్టించింది. రౌండ్‌ ఆఫ్‌ 16లో మనిక హాంగ్‌కాంగ్‌ చైనాకు చెందిన ఝూ చెంగ్ఝూ లేదా జపాన్‌కు చెందిన మియు హిరానోతో తలపడతుంది.

కాగా, ఒలింపిక్స్‌లో మూడో రోజు భారత్‌కు ఆశించినంత ఫలితాలు రాలేదు. షూటింగ్‌, టెన్నిస్‌, ఆర్చరీలో వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో లక్ష్య సేన్‌, డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ తదుపరి రౌండ్లకు అర్హత సాధించగా.. హాకీలో భారత్‌ డ్రాతో గట్టెక్కింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో అర్జున్‌ బబుతా తృటిలో పతకం చేజార్చుకోగా.. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో మనూ భాకర్‌-సరబ్‌జోత్‌ కాంస్య పతక రేసులో నిలిచింది. మనూ-సరబ్‌జోత్‌ కాంస్య పతకం మ్యాచ్‌ ఇవాళ (జులై 30) మధ్యాహ్నం ఒంటి గంటకు జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement