పారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ (టీటీ) వ్యక్తిగత విభాగంలో భారత్ నుంచి ఆకుల శ్రీజ మాత్రమే బరిలో నిలిచింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 25వ ర్యాంకర్ ఆకుల శ్రీజ 9–11, 12–10, 11–4, 11–5, 10–12, 12–10తో జెంగ్ జియాన్ (సింగపూర్)పై విజయం సాధించింది. 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీజకు గట్టిపోటీ ఎదురైంది. అయితే కీలక దశల్లో శ్రీజ పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది.
ఈ గెలుపుతో మనిక బత్రా తర్వాత ఒలింపిక్స్ క్రీడల టీటీ పోటీల్లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన రెండో భారతీయ క్రీడాకారిణిగా తెలంగాణ అమ్మాయి శ్రీజ గుర్తింపు పొందింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ సన్ యింగ్‌షా (చైనా)తో శ్రీజ తలపడుతుంది. మరోవైపు భారత రెండో ర్యాంకర్ మనిక బత్రా పోరాటం విశ్వ క్రీడల్లో ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ మనిక 6–11, 9–11, 14–12, 8–11, 7–11తో ప్రపంచ 13వ ర్యాంకర్ మియు హిరానో (జపాన్) చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment