గచ్చిబౌలి: ఆ అక్కాచెల్లెళ్లు హాకీలో రాణిస్తున్నారు. ఇప్పటికే పలు జాతీయస్థాయి మ్యాచ్‌ల్లో ప్రతిభ కనబరిచారు. తెలంగాణ హాకీ జట్టుకు వీరిద్దరూ కెప్టెన్లుగా వ్యవహరించారు. వీరిలో ఒకరు పదహారుసార్లు, మరొకరు తొమ్మిదిసార్లు గోల్డ్ మెడల్స్ సాధించారు. వీరే అంజయ్యనగర్‌కు చెందిన గీత సాగర్, శ్రీదేవి సాగర్. గీత ప్రస్తుతం మెహిదీపట్నం సెయింట్ ఆన్స్‌లో బీకాం కంప్యూటర్స్ ఫైనలియర్, శ్రీదేవి చందానగర్‌లోని ప్రగతి డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ రెండో సంవత్సరం చదువుతున్నారు. వీద్దరిరూ పాఠశాల స్థాయి నుంచే హాకీ క్రీడలో ప్రతిభ కనబరుస్తున్నారు. ఒకరు సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో.. మరొకరు భారత హాకీ జట్టులో స్థానం సంపాదించాలనే గోల్‌తో ముందుకెళ్తున్నారు.
గీత..
⇒ గచ్చిబౌలి కేవీ హాకీ జట్టు కెప్టెన్‌గా..
⇒ 2008లో ఇంటర్–19 నేషనల్స్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు కెప్టెన్‌గా..
⇒ 2017 ఏప్రిల్‌లో హరియాణాలో సీనియర్ నేషనల్స్‌లో తెలంగాణ హాకీ జట్టు కెప్టెన్‌గా..
సివిల్స్ సాధనే ధ్యేయం: గీత
చదువులో మంచి మార్కులు సాధిస్తున్నా. డిగ్రీ పూర్తికాగానే సివిల్స్ రాస్తా. నా భర్త రాజు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. హాకీలో ఇప్పటి వరకు 16 గోల్డ్ మెడల్స్ సాధించా.
శ్రీదేవి..
⇒ కేవీ నేషనల్స్‌లో ఐదు గోల్డ్ మెడల్స్
⇒ పైకా 2012లో ఆంధ్రప్రదేశ్ జట్టు కెప్టెన్‌గా..
⇒ జేఎఫ్‌హెచ్‌ఏ గరŠల్స్ హాకీ టోర్నమెంట్‌లో ఔట్ స్టాండింగ్ మిడ్ ఫీల్డర్‌గా అవార్డు.
జాతీయ జట్టులో స్థానమే లక్ష్యం: శ్రీదేవి
భారత మహిళల హాకీ జట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యం. హాకీలో తొమ్మిదిసార్లు గోల్డ్ మెడల్స్ సాధించా. అప్పుడప్పుడూ పెయింటింగ్స్ కూడా వేస్తుంటా.
Comments
Please login to add a commentAdd a comment