మార్చి 7 నుంచి టోర్నీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ఆధ్వర్యంలో జరిగే వరల్డ్ లీగ్ రౌండ్-2లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులుగల టీమిండియాకు మిడ్‌ఫీల్డర్ రీతూ రాణి నేతృత్వం వహిస్తుంది. దీపిక వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. ఈ బృందంలో తెలంగాణకు చెందిన యెండల సౌందర్య, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోల్‌కీపర్ రజని ఎతిమరుపు స్థానాన్ని దక్కించుకున్నారు.
మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో మార్చి 7 నుంచి 15 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. మొత్తం ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, పోలండ్, ఘనా, థాయ్‌లాండ్... గ్రూప్ ‘బి’లో మలేసియా, రష్యా, కజకిస్థాన్, సింగపూర్ జట్లు ఉన్నాయి.
వరల్డ్ హాకీ లీగ్‌కు సౌందర్య, రజని
Published Sun, Mar 1 2015 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM
Advertisement
Advertisement