World League
-
ప్రపంచ లీగ్ కోసం సెప్టెంబర్ 5 నుంచి కసరత్తు
ప్రపంచ లీగ్‌లో పాల్గొననున్న ఇండియన్ పురుషుల హాకీ జట్టు సెప్టెంబర్ 5 నుంచి కసరత్తు ప్రారంభించనుంది. ఇక్కడి మేజర్ ధ్యాన్‌చంద్ ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంలో సెప్టెంబర్ 29 వరకూ ప్రత్యేక క్యాంప్ నిర్వహిస్తున్నట్లు హాకీ ఫెడరేషన్ ప్రకటించింది. ఈ క్యాంప్ కోసం 26 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. నవంబర్ 27 నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరగనున్న ప్రపంచ హాకీ లీగ్ లో ఫైనల్స్‌లోకి చేరడమే లక్ష్యంగా ఈ క్యాంప్ ఉంటుందని నిర్వహకులు తెలిపారు. సర్దార్ సింగ్ నేతృత్వంలోని భారత్ జట్టు ఇటీవల యూరప్ టూర్లో ఫ్రాన్స్, స్పెయిన్‌పై అద్భుత ప్రదర్శనతో ఆత్మవిశ్వాసం కూడగట్టుకుందని భారత హాకీ కోచ్ తెలిపాడు. ఈ టూర్ లో ఆటగాళ్లు యూరోపియన్ శైలిపై అనుభవం గడించారన్నారు. రియో ఒలింపిక్స్ ముందు భారత ఆటగాళ్ల బలాబలాలు తేల్చుకునేందుకు ఈ టోర్నీ ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రపంచ హాకీ లీగ్‌లో ప్రతి ఒక్కరూ తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. -
వరల్డ్ హాకీ లీగ్‌కు సౌందర్య, రజని
మార్చి 7 నుంచి టోర్నీ న్యూఢిల్లీ: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఆధ్వర్యంలో జరిగే వరల్డ్ లీగ్ రౌండ్-2లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులుగల టీమిండియాకు మిడ్‌ఫీల్డర్ రీతూ రాణి నేతృత్వం వహిస్తుంది. దీపిక వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. ఈ బృందంలో తెలంగాణకు చెందిన యెండల సౌందర్య, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోల్‌కీపర్ రజని ఎతిమరుపు స్థానాన్ని దక్కించుకున్నారు. మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో మార్చి 7 నుంచి 15 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. మొత్తం ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, పోలండ్, ఘనా, థాయ్‌లాండ్... గ్రూప్ ‘బి’లో మలేసియా, రష్యా, కజకిస్థాన్, సింగపూర్ జట్లు ఉన్నాయి. -
రూ.20కే హాకీ వరల్డ్ లీగ్ టిక్కెట్
మీరంతా హాకీ ఫ్యాన్స్ అయితే వెంటనే ఢిల్లీలోని ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంకు పరుగులు తీయండి. ఎందుకంటే మార్చి 7 నుంచి 15 వరకు నిర్వహించనున్న ఎఫ్ఐఎచ్ వరల్డ్ లీగ్ 2 (మహిళలు)కు అతి తక్కువ ధరకే హాకీ ఇండియా టిక్కెట్లు విక్రయిస్తోంది. ఎనిమిది టీములు ఇక్కడ పోటీలో పాల్గొంటున్నాయి. గురువారం ఈ టిక్కెట్ల కొనుగోలు కోసం హాకీ ఇండియా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టిక్కెట్జీనిడాట్ ఇన్ అనే సైట్‌ను ప్రారంభించింది. ఇంతకీ ఈ టిక్కెట్ ధర ఎంత అనుకుంటున్నారు.. కేవలం రూ.20. వీఐపీ స్టాండ్‌లో రూ.100 ఉండనుంది. ఇక జేబులో రూ.20 ఎవరైనా హాకీ చూడొచ్చన్న మాట.