ప్రపంచ లీగ్ కోసం సెప్టెంబర్ 5 నుంచి కసరత్తు | Camp for Men's Hockey World League Final begins on September 5 | Sakshi
Sakshi News home page

ప్రపంచ లీగ్ కోసం సెప్టెంబర్ 5 నుంచి కసరత్తు

Published Mon, Aug 31 2015 5:08 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM

Camp for Men's Hockey World League Final begins on September 5

ప్రపంచ లీగ్లో పాల్గొననున్న ఇండియన్ పురుషుల హాకీ జట్టు సెప్టెంబర్ 5 నుంచి కసరత్తు ప్రారంభించనుంది. ఇక్కడి మేజర్ ధ్యాన్చంద్ ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంలో సెప్టెంబర్ 29 వరకూ  ప్రత్యేక క్యాంప్ నిర్వహిస్తున్నట్లు హాకీ ఫెడరేషన్ ప్రకటించింది. ఈ క్యాంప్ కోసం 26 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. నవంబర్ 27 నుంచి ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జరగనున్న ప్రపంచ హాకీ లీగ్ లో ఫైనల్స్లోకి చేరడమే లక్ష్యంగా ఈ క్యాంప్ ఉంటుందని నిర్వహకులు తెలిపారు.

సర్దార్ సింగ్ నేతృత్వంలోని భారత్ జట్టు ఇటీవల యూరప్ టూర్లో ఫ్రాన్స్, స్పెయిన్పై అద్భుత ప్రదర్శనతో ఆత్మవిశ్వాసం కూడగట్టుకుందని భారత హాకీ కోచ్ తెలిపాడు. ఈ టూర్ లో ఆటగాళ్లు యూరోపియన్ శైలిపై అనుభవం గడించారన్నారు. రియో ఒలింపిక్స్ ముందు భారత ఆటగాళ్ల బలాబలాలు తేల్చుకునేందుకు ఈ టోర్నీ ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రపంచ హాకీ లీగ్లో ప్రతి ఒక్కరూ తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement