
మస్కట్: పురుషుల హాకీ ‘ఫైవ్–ఎ–సైడ్’ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు పతకం రేసులో నిలువలేకపోయింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 4–7 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది.
భారత్ తరఫున రహీల్ మొహమ్మద్ (1వ, 7వ, 25వ ని.లో) మూడు గోల్స్ చేయగా... మందీప్ మోర్ (11వ ని.లో) ఒక గోల్ సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన భారత జట్టు 5 నుంచి 8 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌ల్లో భాగంగా కెన్యాతో జరిగిన పోరులో 9–4తో ఘనవిజయం సాధించింది.