భువనేశ్వర్: భారత హాకీ జట్టుకు ఇప్పటికే ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఒడిషా ప్రభుత్వం ఆటగాళ్లను ఉత్సాహపరిచే మరో ప్రకటన చేసింది. స్వదేశంలో జరిగే ప్రపంచ కప్‌ను భారత్ గెలుచుకుంటే ఒక్కో ఆటగాడికి రూ. 1 కోటి చొప్పున కానుకగా అందజేస్తామని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఈ నెల 13నుంచి 29 వరకు ఒడిషాలోని రెండు నగరాల్లో హాకీ ప్రపంచకప్ జరుగుతుంది.
గురువారం రూర్కెలాలో జరిగిన కార్యక్రమంలో భారత్‌లోనే అతి పెద్దదైన బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియాన్ని పట్నాయక్ ప్రారంభించారు. దీంతో పాటు భువనేశ్వర్ (కళింగ స్టేడియం) కూడా వరల్డ్ కప్ మ్యాచ్‌లకు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ‘ఒడిషా రే’ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించిన అనంతరం భారత ఆటగాళ్లతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. తమ రాష్ట్రానికి హాకీతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న పట్నాయక్...ఆటగాళ్లకు ‘బెస్ట్ విషెస్’ చెప్పారు. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment